🕌🕌🕌 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕌🕌🕌
🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు 🛐🛐
🤚🏻✋🏻 అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను 🤚🏻✋🏻
~~~~~
🕋🕋🕋 ఇస్లాం చరిత్ర - 199 🕋🕋🕋
■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 114*
అలా వీరు, విజయోత్సాహంతో మదీనా వెళ్ళి దైవప్రవక్త (సల్లం)కు ఈ శుభవార్త తెలియజేశారు. కాని, దైవప్రవక్త (సల్లం) వారిని చూడగానే ఆగ్రహోదగ్రులయి...., *"ఏమిటీ! మీరు పవిత్రమాసంలో రక్తపాతం జరిపారా? నేనందుకోసం మిమ్మల్ని పంపలేదే!"* అన్నారు.
(వేరొక ఉల్లేఖనంలో...., → "దైవప్రవక్త (సల్లం), వారి ఈ ప్రవర్తనను నిరసిస్తూ, *"నేను మిమ్మల్ని హరాం (నిషిద్ధ) నెలలో యుద్ధం చేసే ఆదేశం ఇవ్వలేదు, ఖైదీలు మరియు ధనపంపకం గురించి కూడా ఎలాంటి సూచనలు ఇవ్వలేదు."* అని అన్నారు.")
అంతే, ఇది విని అబ్దుల్లా (రజి) మరియు ఆయన సైనిక సహచరుల గుండెలు ఝల్లుమన్నాయి.
*"అయ్యో! ఎంత పని జరిగింది!! దైవప్రవక్త (సల్లం) అయిష్టాన్ని కొని తెచ్చుకున్నామే!!! ఇప్పుడేం చేయాలి?"* అని జరిగిన పొరపాటు తెలుసుకొని వారు తీవ్రంగా చింతించారు.
అంతలో మరికొందరు ముస్లిములు కూడా అక్కడకు చేరుకున్నారు. విషయం తెలుసుకొని అందరూ వారిపై మండిపడ్డారు.
*"ఈ ఖైదీలను ఎవరూ ముట్టుకోకండి. ఈ సామగ్రిని కూడా ఎవరూ తాకవద్దు."* అన్నారు దైవప్రవక్త (సల్లం).
ఈ దుర్ఘటన, ఇస్లాం వ్యతిరేక శక్తుల దుష్ప్రచారానికి మంచి ఊతమిచ్చింది.
*"ముస్లిములు, అల్లాహ్ నిషిద్ధం చేసిన మాసాలను ధర్మసమ్మతం చేసుకున్నారు."* అని ప్రచారం చేసే అవకాశం లభించింది. ఈ విషయంలో పెద్ద రాద్ధాంతాన్ని లేవనెత్తారు.
*"ముస్లిములు పవిత్ర మాసంలో యుద్ధం చేశారట! హవ్వ. ఎంత సిగ్గుచేటు!"*
*"ఘోరమైన రక్తపాతం జరిపి అనేకమంది ఖైదీలను కూడా పట్టుకున్నారట!!"*
ఈ వార్త దావానలంలా మదీనా లోపల, వెలుపలా అంతటా వ్యాపించిపోయింది. ముస్లిములకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి శత్రువులకు సువర్ణావకాశం దొరికింది. గోరంతలు కొడంతలు చేస్తూ దేశమంతా టాం టాం చేశారు.
మక్కా ఖురైషీయులయితే పనిగట్టుకొని మరీ ముస్లిములకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు.
ముస్లిములు వారి మాటలు ఖండిస్తూ, *"అలా జరగలేదు. ఇది పచ్చి దుష్ప్రచారం. నిజానికి ఈ సంఘటన షాబాన్ నెల (ప్రారంభం)లో జరిగింది."* అన్నారు.
యూదులయితే అదేదో మహాపాతం జరిగినట్లు తలచి, *"ఇక ముస్లిములపై దైవశిక్ష విరుచుకుపడక తప్పదు."* అని చెప్పుకుంటూ తెగ సంబరపడసాగారు.
జరిగిన సంఘటన పట్ల దైవప్రవక్త (సల్లం) ఎంతో విచారం వెలిబుచ్చారు. ఆ మాటకు వస్తే, ఏ ముస్లిం ముఖంలోనూ సంతోషం లేదు. అందరూ విచారంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
అంతలో దైవప్రవక్త (సల్లం) ముఖారవిందం వికసించింది. ఆయన (సల్లం) పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది. అది చూసి అనుచరుల ముఖాలు కూడా కలువ పువ్వుల్లా విప్పారాయి. ఆ సమయంలో "అల్లాహ్" వాణి ఇలా ఉంది....; ↓
*"నిషిద్ధ మాసాలలో యుద్ధం చెయ్యటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికి చెప్పు : ఈ మాసాలలో యుద్ధం చేయటం మహాపరాధం. అయితే అల్లాహ్ మార్గంలో అవరోధాలు కల్పించటం, అల్లాహ్ ను తిరస్కరించటం, మస్జిదె హరామ్ ను సందర్శించే జనులను అడ్డుకోవటం, అక్కడ నివసించేవారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం అల్లాహ్ దృష్టిలో అంతకన్నా ఘోరమైన అపరాధం. ఈ ఉపద్రవం (ఫిత్నా) హత్య కన్నా పెద్దది. వారు మీతో యుద్ధం చేస్తూనే ఉంటారు. చివరికి వారికి వీలు కలిగితే మిమ్మల్ని మీ ధర్మం నుంచి మరలించనయినా మరలించేస్తారు. మరి మీలో గనక ఎవరయినా తమ ధర్మం నుంచి తిరిగిపోయి, అవిశ్వాస స్థితిలో మరణిస్తే వారి ఇహపర లోకాల్లోని కర్మలు సర్వనాశనమైపోతాయి. అలాంటి వారే నరకవాసులు. వారందులో కలకాలం పడి ఉంటారు." (ఖుర్ఆన్ 2:217).*
ఇస్లాం వ్యతిరేకులు ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, *"ముష్రిక్కులు ఏ వైఖరినైతే అవలంబిస్తున్నారో, అది ముస్లిములు చేసిన ఈ అపచారం కంటే ఎంతో పెద్ద నేరం."* అని, పై ఆయత్ లలో తెలియజేయడం జరిగింది.
అప్పుడే అవతరించిన ఈ సూక్తిని దైవప్రవక్త (సల్లం) తన సహచరులకు వినిపించారు. దాంతో వారి హృదయాలు కుదుటపడ్డాయి. అసలు ఖురైషీయులే దౌర్జన్యకాండ జరిపారు. అలాంటి దౌర్జన్యకాండ ముందు పవిత్రమాసంలో రక్తపాతం జరపడం పాపం ఎలా అవుతుంది?
హంతకులుగా ప్రచారం చేయబడుతున్న ముస్లిముల సదాచరణ విషయమై బహుదైవారాధకులు చేస్తున్న రాద్ధాంతానికి అసలు తావే లేదని పై "ఖుర్ఆన్" వాక్యం తేటతెల్లం చేసింది. ఎందుకంటే, ఖురైషులు ఇస్లాంకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న వైఖరిలో మరియు వారిపై జరిపే దౌర్జన్యకాండలో ఈ విలువలను ఎప్పుడో తుంగలో త్రొక్కడం జరిగింది. హిజ్రత్ చేసి మదీనాకు వెళ్ళిన ముస్లిముల ఆస్తిపాస్తులను జప్తు చేసుకోవడం, ప్రవక్త (సల్లం)ను హతమార్చే ప్రయత్నం చేయడం లాంటి వికృతచేష్టలు మక్కాకు బయట జరిగినవా? ప్రస్తుతం ఈ 'పరిశుద్ధ' అనే ఊహ వారిలో ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చినట్లు? ముష్రిక్కులు, ఏ దుష్ప్రచార తుఫానును లేవనెత్తుతున్నారో అది వారికి సిగ్గుచేటైన విషయం.
ఇక ఆ తర్వాత, దైవప్రవక్త (సల్లం) సమరసొత్తును యోధులకు పంచారు. ఖైదీల విషయంలో మాత్రం ఖురైషీయులతో సంప్రదించారు. వారు ఖైదీల మార్పిడికి అంగీకరించారు. తక్షణమే ఖురైషీలు, తమ ఆధీనంలో ఉన్న ఇద్దరు ఖైదీలను విడిచిపెట్టారు. ముస్లిములు తాము పట్టితెచ్చిన ఆ ఇద్దరు ఖైదీలకు బంధవిముక్తి కలిగించారు.
చనిపోయిన వ్యక్తి తాలూకు రక్తపరిహారాన్ని వారి సంరక్షకులకు అందజేశారు.
ముస్లిములు విడిచిపెట్టిన ఇద్దరు ఖైదీలలో ఒకతను ముస్లిముగా మారి మదీనాలోనే ఉండిపోయాడు. రెండవ ఖైదీ మక్కా వెళ్ళిపోయాడు.
ఈ సంఘటనకు కారకులైన అబ్దుల్లా (రజి) మరియు ఆయన సహచరులు, సమస్య పరిష్కారమైనందుకు ఎంతో ఆనందించారు. ఆ ఆనందంతో దైవమార్గంలో పోరాటం జరపడానికి అనుమతించమని అడిగారు. దైవప్రవక్త (సల్లం) వారి ఉత్సాహాన్ని గౌరవిస్తూ ఈ దైవసూక్తిని వినిపించారు....; ↓
*"అయితే విశ్వసించినవారు, హిజ్రత్ చేసిన (వలసపోయిన) వారు, దైవమార్గంలో పోరాడేవారు మాత్రమే దైవకారుణ్యానికి అభ్యర్థులు. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు." (ఖుర్ఆన్ 2:218).*
*↑ ↑ ↑ ↑ ↑ ↑ ↑ ↑ ↑ ↑*
ఇవీ, "బద్ర్" యుద్ధానికి పూర్వం జరిగిన "సరియ్యా"లు, "గజ్వా"లు. వీటిలో ఏ ఒక్క పోరాటంలోనూ వినాశనంగాని, హత్యలుగాని, దోపిడీలుగాని జరగలేదు. "కర్జ్ బిన్ జాబిర్ పహరీ" నాయకత్వంలో ముష్రిక్కులే దీనికి పాల్పడ్డారు. _(మదీనా శివార్లలోని తమ పశువులను మేపుకుంటున్న పశువుల కాపర్ల పై దాడి చేసి, నిరాయుధులైన పశువుల కాపర్లను నిర్దాక్షిణ్యంగా చితకబాది అనేక ఒంటెల్ని దోచుకెళ్ళారు. ఒక కాపరిని హత్య కూడా చేయడం జరిగింది.)_ కాబట్టి, దోపిడీకి ఆరంభం ముష్రిక్కుల వైపు నుండే జరిగింది. ఇంతకు పూర్వం వారు అనేక దౌర్జన్యాలకు పాల్పడి ఉన్న విషయం కూడా మనకు తెలుసు.
_(ఈ సరాయా మరియు గజ్వాల వివరాలను ఈ దిగువ గ్రంథాల నుండి సేకరించడం జరిగింది. జాదుల్ ముఆద్ - 2/83; ఇబ్నె హష్షామ్ - 1/591-605; రహ్మతుల్ లిల్ ఆలమీన్ - 1/115, 116; 2/215,216,468-470._
_ఈ ఆధారాల్లో సరాయా మరియు గజ్వాల క్రమం మరియు అందు పాల్గొన్న వారి సంఖ్య గురించి అభిప్రాయబేధం ఉంది. మేము "అల్లామా ఇబ్నె ఖైమ్" మరియు "అల్లామా మన్సూర్ పూరి" పరిశోధనలను సరియైనవిగా తలిచాము.)_
ఇటు, సరియ్యా అబ్దుల్లా బిన్ హజష్ సంఘటన జరిగిన తరువాత మక్కా బహుదైవారాధకుల భయం వికృతరూపంలో ముందుకొచ్చి నిలుచుంది. వారికి ఇది ప్రమాదంగా పరిణమించింది. వారు ఏ చిక్కుల్లోనైతే పడతామని తలిచారో, ఇప్పుడు నిజంగానే ఆ చిక్కుల్లో వచ్చిపడ్డారు. మదీనా నాయకత్వం ఎంతో వివేచనతో కూడిన నాయకత్వం అని ఇప్పుడు వారికి తెలిసిపోయింది. వారి ప్రతి కదలికపై, ప్రతి వర్తక బిడారం పై దృష్టిని కేంద్రీకరించి ఉన్న యధార్థం బట్టబయలైంది.
ముస్లిములు అనుకుంటే మూడు వందల మైళ్ళ (దాదాపు అయిదు వందల పైచిలుకు కిలోమీటర్లు) దూరం వరకు ప్రయాణించి వచ్చి వారి ప్రాంతాల్లో చొరబడి తలపడగలరు, చంపగలరు, ఖైదీలుగా పట్టుకొని పోగలరు, వారి సొత్తును దోచుకొని క్షేమంగా తిరిగి వెళ్ళిపోగలరు అనే భయం పట్టుకుంది.
ఇక సిరియాలో వ్యాపారం చేయడం శాశ్వతంగా ప్రమాదంతో కూడుకున్న విషయమని ముష్రిక్కులు గ్రహించారు. అయినప్పటికీ, ఇంకనూ వారు తమ తలబిరుసుతనాన్ని వదల్లేదు. "జుహైనా" మరియు "బనూ జమ్రా" తెగలతో జరిగిన సంధికి దిగిరావడానికి బదులు, వారు తమ పౌరుషం, రౌద్రం మరియు వైషమ్యాల్లో మరికొంత ముందుకే అడుగు వేశారు. వారి సర్దారులు, మేధావులు, ముస్లిముల ఇండ్లలో దూరి వారిని తుదముట్టిస్తామన్న బెదిరింపును అమలు చేయడానికే నిర్ణయించుకున్నారు. ఈ ఉద్వేగమే వారిని *"బద్ర్"* యుద్ధ మైదానానికి చేర్చింది.
ఇక ముస్లిముల విషయానికి వస్తే, హజ్రత్ అబ్దుల్లా బిన్ హజష్ (రజి) గారి సరియ్యా తరువాత అల్లాహ్, షాబాన్ నెల హిజ్రీ శకం - 2 లో యుద్ధం "ఫర్జ్ (విధిగా)" చేశాడు. ఈ సందర్భంగా అనేక "ఖుర్ఆన్" ఆయత్ లు అవతరించనారంభించాయి. ఆ "ఖుర్ఆన్" వాక్యాలు ఇవి....; ↓
*In Sha Allah రేపటి భాగములో....; →*
No comments:
Post a Comment