🕌🕌🕌 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕌🕌🕌
🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు 🛐🛐
🤚🏻✋🏻 అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను 🤚🏻✋🏻
~~~~~
🕋🕋🕋 ఇస్లాం చరిత్ర - 191 🕋🕋🕋
■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 106*
*ఇస్లాం మార్గంలో పరస్పరం సహాయ సహకారాలు అందించుకునే ప్రమాణం : -*
మునుపటి భాగములో జరిగిన సౌభ్రాతృత్వం లాగే మహాప్రవక్త (సల్లం), ముస్లిములందరి చేత మరో ప్రమాణం కూడా చేయించారు. ఈ ప్రమాణం ద్వారా ఇప్పటి వరకు వారిలో వ్రేళ్ళూనుకుని ఉన్న అజ్ఞాన కాలపు రక్తపాతం అంతమైపోయింది. తెగల నడుమగల సంఘర్షణ పునాదులు పూర్తిగా పెకలించబడ్డాయి. ఇక అజ్ఞాన కాలంనాటి ఆచార సంప్రదాయాలకు ఏమాత్రం చోటు లేకుండా పోయింది. దిగువన ఆ ప్రమాణంలోని ముఖ్యాంశాలను టూకీగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం.
*ఆ ప్రమాణ పత్రంలో ఇలా రాయబడి ఉంది....; ↓*
"ఖురైష్ కు చెందిన ముస్లిములు, యస్రిబ్ ముస్లిములు కలసి దైవప్రవక్త (సల్లం)ను విధేయించడానికి, ఆయన (సల్లం)తో కలసి జిహాద్ చేయడానికిగాను వారికి, అల్లాహ్ ప్రవక్త (సల్లం)కు నడుమ జరిగిన ప్రమాణమేమనగా...., ↓
*❁* వీరందరూ తక్కిన వారికి భిన్నమైన ఓ ప్రత్యేక సమాజం.
*❁* హిజ్రత్ చేసివచ్చిన ఖురైష్ లు తమ గత పరిస్థితికి అనుగుణంగా "దైత్ (రక్తపరిహారం)" చెల్లిస్తారు. మోమిన్ ల (విశ్వాసుల) నడుమ ప్రసిద్ధమైన రీతిలో, న్యాయబద్ధంగా తమ ఖైదీల పరిహారం చెల్లిస్తారు. అలాగే అన్సార్ కు చెందిన తెగలన్నీ తమ గత స్తోమతనుబట్టి పరస్పరం "దీత్" చెల్లిస్తారు. వారిలోని ప్రతి వర్గం ప్రసిద్ధమైన రీతిలో, విశ్వాసుల నడుమ న్యాయబద్ధంగా తమ ఖైదీలను ఫిదియా ఇచ్చి విడిపించుకుంటారు.
*❁* విశ్వాసులు తమ సమాజంలో, ఏ దీనుణ్ణయినా, ఫిదియా లేదా దీత్ విషయంలో ప్రసిద్ధమైన రీతిలో సహాయాన్ని అందించకుండా ఉండడానికి వీల్లేదు.
*❁* సదాచార సంపన్నులైన ముస్లిములంతా కలసి, వారిపై దౌర్జన్యం చేసే వానికి లేదా ముస్లిం సమాజంలో జులుము, దుర్మార్గాలను, కల్లోలాలను రేకెత్తించేవానికి వ్యతిరేకంగా పోరాడాలి.
*❁* ఈ విషయంలో ఆ దుర్మార్గానికి పాల్పడిన వాడు, వారి కుమారుడైనా సరే అందరూ అతనికి వ్యతిరేకంగా చర్య తీసుకోవలసి ఉంటుంది.
*❁* ఓ విశ్వాసి మరో విశ్వాసిని కాఫిర్ కు (దైవ తిరస్కారికి) బదులుగా సంహరించడానికి వీల్లేదు.
*❁* ఓ విశ్వాసికి వ్యతిరేకంగా ఏ కాఫిర్ కైనా సహాయం చేయడానికి వీల్లేదు.
*❁* అల్లాహ్ తో చేసిన ప్రమాణం అందరికీ వర్తిస్తుంది. ఓ మామూలు మనిషి ఇచ్చిన మాటకు ముస్లిములందరూ కట్టుబడి ఉంటారు.
*❁* ఏ యూదులైతే మనకు విధేయత చూపుతున్నారో, వారికి సహాయం అందించడం జరుగుతుంది. వారిని కూడా ఇతర ముస్లిముల్లాంటి వారుగానే భావించడం జరుగుతుంది. వారిపై ఎలాంటి జులుముగానీ, వారికి వ్యతిరేకంగా మరెవ్వరికి సహాయం చేయడంగానీ జరగదు.
*❁* ముస్లిముల సంధి ఒప్పందం అందరికీ వర్తిస్తుంది. ఏ ముస్లిమైనా మరొక ముస్లిమును కాదని దైవమార్గంలో జిహాద్ చేసే విషయంలో సంధి కుదుర్చుకోడానికి వీల్లేదు. సరికదా, అందరు కలిసే సమానత్వం మరియు న్యాయసూత్రాల ప్రాతిపదికపైన్నే ఒప్పందం చేసుకోవలసి ఉంటుంది.
*❁* దైవమార్గంలో చిందించిన రక్తం విషయంలో ముస్లిములంతా సమాన భాగస్వాములుగానే ఉంటారు.
*❁* ఏ ముస్లిమైనా, బహుదైవారాధకుడైన ఖురైష్ ధనప్రాణాలను రక్షించే ప్రయత్నం చేయడంగాని, అతన్ని రక్షించడానికి మరో ముస్లింకు అడ్డుగా నిలవడానికిగాని వీల్లేదు.
*❁* ఎవరైనా ఓ ముస్లిమును హత్య చేసినప్పుడు, దానికి సరైన ఆధారం లభిస్తే అతని నుండి ఖిసాస్ తీసుకోవడం జరుగుతుంది. హతుని సంరక్షకుడు దాన్ని మాఫి చేస్తే తప్ప.
*❁* అలా చేసిన వానికి వ్యతిరేకంగా ముస్లిములంతా నిలబడవలసి ఉంటుంది. అతన్ని వ్యతిరేకించడం తప్ప మరే విషయమూ వారికి ధర్మసమ్మతం కాజాలదు.
*❁* ఏ విశ్వాసికైనా, ఉపద్రవాన్ని లేవనెత్తేవానికి (బిద్అతీకి) సహాయపడటం అనేది ధర్మసమ్మతం కాజాలదు. ఎవరైనా అలాంటి వ్యక్తికి సహాయ పడడంగానీ, అతన్ని తన రక్షణలోకి తీసుకోవడంగానీ జరిగితే ప్రళయం రోజు అతనిపై అల్లాహ్ ఆగ్రహశాపాలు విరుచుకుపడతాయి. అతని "ఫర్జ్"లు, "నఫిల్" ఆరాధనలేవీ స్వీకరించబడవు.
*❁* మీ నడుమ ఏదైనా అభిప్రాయభేదాలు పొడసూపితే వాటిని అల్లాహ్ మరియు ముహమ్మద్ (సల్లం) వైపునకు మళ్ళించి వారి తీర్పును శిరసావహించవలసి ఉంటుంది."
*సమాజంపై పడిన ఆధ్యాత్మిక ప్రభావం : -*
ఈ దూరదృష్టి, వివేచనల పైన్నే దైవప్రవక్త (సల్లం) ఓ నవసమాజ నిర్మాణ పునాదులు వేయడం జరిగింది. అయితే, దైవప్రవక్త (సల్లం) గారి సహచర్యంలో ఈ మహామహులు పొందిన తర్ఫీదు, శిక్షణలు ఈ సమాజపు బాహ్య కోణాలకు ప్రతిబింబాలుగా నిలిచాయి. వారి ఆత్మప్రక్షాళన కోసం, వారి శిక్షణ కోసం, వారి నైతికతా విలువలను పెంపొందించడం కోసం మహాప్రవక్త (సల్లం) ఎల్లవేళలా సంసిద్ధులై ఉంటూ ఉండేవారు. వారికి ప్రేమా సౌభ్రాతృత్వం, ఐకమత్యం, గౌరవం మరియు ఆరాధనా విధేయతల సూత్రాలను నేర్పేవారు. (అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి ↓)
ఓ సహాబీ (రజి) (అనుచరుడు), *"ఏ ఇస్లాం ఉత్తమమైనది? (అంటే ఇస్లాంలో, నడవడికలో ఏది మిన్న అయినది?)"* అని అడిగినప్పుడు ఆయన (సల్లం), *"నీవు అన్నదానం చెయ్యి, ఎరిగినవారికి, ఎరుగనివారికి కూడా సలాం చేస్తూ ఉండు"* అని ఉద్బోధించారు.
*"హజ్రత్ అబ్దుల్లా బిన్ సలాం (రజి)" గారి ఒక ఉల్లేఖనం ఇలా ఉంది....; ↓*
మహాప్రవక్త (సల్లం) మదీనాకు అరుదెంచినప్పుడు నేను ఆయన (సల్లం) సన్నిధికి హాజరయ్యాను. ఆయన (సల్లం) ముఖారవిందాన్ని చూడగానే, *"ఇది ఓ అసత్యవాది ముఖం కాజాలదు"* అనే నిర్ణయానికి వచ్చాను. ఆ తరువాత నేను ఆయన (సల్లం) నోట విన్న ప్రప్రథమ సూక్తి ఏదంటే...., *"ప్రజలారా! సలామును వ్యాపింపజేయండి. భోజనాలు పెడుతూ ఉండండి. బంధువుల పట్ల సద్వర్తనతో మెలగండి. రాత్రి ప్రజలు నిద్రిస్తున్నప్పుడు నమాజు చేయండి. అప్పుడు మీరు స్వర్గంలో ప్రశాంతంగా ప్రవేశించగలరు."*
మచ్చుకు అలాంటి బోధనలే కొన్నిటిని ఇక్కడ పొందుపరుస్తున్నాం.
*"ఎవరి దురాగతాల నుండి, ఆగడాల నుండి అతని పొరుగువాడు సంరక్షింపబడతాడో ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశింపజాలడు."*
*"ఎవరి నోటి ద్వారా, చేతి ద్వారా ముస్లిములకు రక్షణ లభిస్తుందో అతనే ముస్లిం."*
*"విశ్వాసులంతా ఒకే శరీరంలాంటివారు. కంటిలో బాధగా ఉంటే శరీరం మొత్తానికి బాధ కలుగుతుంది. తలలో బాధగా ఉంటే శరీరాన్నంతటికి బాధ కలుగుతుంది."*
*"తనకు నచ్చిన వస్తువునే తన సోదరుని కోసం ఎంచుకోనంత వరకు ఏ వ్యక్తి అయినా ముస్లిముగా ఉండలేడు."*
*"ఓ విశ్వాసి మరో విశ్వాసి విషయంలో ఓ కట్టడంలాంటివాడు. ఈ కట్టడంలోని ప్రతి భాగం మరో భాగానికి బలం చేకూరుస్తుంది."*
*"ఒకరికి మరొకరికి ఎడల పరస్పరం వైషమ్యం ఉండకూడదు. పరస్పరం ఈర్ష్య పడకండి. ఒకరిని చూసి మరొకరు ముఖం త్రిప్పుకోకండి. అల్లాహ్ కు దాసులై పరస్పరం సోదరులుగా మెలగండి. ఏ ముస్లిమైనా మూడు రోజుల కంటే ఎక్కువగా తన సోదరునితో మాట్లాడకుండా ఉండటానికి వీలు లేదు."*
*"ఓ ముస్లిం మరో ముస్లింకు సోదరుడు. అతడు, అతనిపై జులుము చేయడంగానీ, అతన్ని అతని శత్రువుకు అప్పజెప్పడంగానీ జరగకూడదు. ఏ వ్యక్తి అయితే తన సోదరుని అవసరం తీర్చడానికి తాపత్రయపడతాడో అల్లాహ్ అతని అవసరాన్ని తీరుస్తాడు. మరే ముస్లిమైతే మరో ముస్లిం యొక్క దుఃఖాన్ని పారద్రోలగలడో, అల్లాహ్ ప్రళయదినం నాడు కలిగే దుఃఖాల్లో ఏదో ఒక దుఃఖాన్ని దూరం చేయగలడు. ఏ ముస్లిమైతే మరో ముస్లిం యొక్క లోపాలను దాస్తాడో, అల్లాహ్ ప్రళయదినాన అతని లోపాలను దాస్తాడు."*
*"భూవాసులపైన కరుణించండి. మిమ్మల్ని ఆకాశవాసి కరుణిస్తాడు."*
*"తన పొరుగువాడు పస్తు ఉండగా, తానూ కడుపార భుజించువాడు విశ్వాసి కాజాలడు."*
*"ముస్లిమును తిట్టడం, దుర్భాషలాడడం "ఫిస్క్ (మహాపాపం)", అతనితో తలపడడం, దెబ్బలాడడం "కుఫ్ర్ (అవిశ్వాసం)"."*
ఇలాగే ఆయన (సల్లం), *"మార్గంలో పడి ఉన్న ప్రజలను కష్టపెట్టే వస్తువును తొలగించడాన్ని దానంగా, విశ్వాసంలోని ఓ భాగంగాను ఎంచేవారు."*
అదే విధంగా మహాప్రవక్త (సల్లం), దానధర్మాలను చేయడానికి ప్రోత్సహించేవారు. దానికోసం లభించే పుణ్యఫలాలను ఏకరువు పెట్టడం వలన ప్రజల హృదయాలు ఆయన (సల్లం) వైపునకు మొగ్గుజూపేవి. ఈ విషయంలో ఆయన (సల్లం) ప్రవచనం ఇలా ఉంది...., *"నీరు అగ్నిని చల్లార్చినట్లు, దానం పాపాలను భస్మం చేస్తుంది."*
*"ఏ ముస్లిమైతే నగ్న ముస్లిములకు వస్త్రాలు తొడుగుతాడో, అల్లాహ్ అతనికి స్వర్గంలో ఆకుపచ్చ రంగుగల వస్త్రాలను తొడుగుతాడు. మరే ముస్లిమైతే ఆకలితో బాధపడే ముస్లింకు అన్నం పెడతాడో, అల్లాహ్ అతనికి స్వర్గ ఫలాలను తినిపిస్తాడు. ఇంకా ఏ ముస్లిమైతే దాహార్తి అయిన ఒక ముస్లిం దాహాన్ని తీరుస్తాడో, అల్లాహ్ అతనికి స్వర్గంలో సీలు వేయబడిన పరిశుద్ధ మధువును త్రాగిస్తాడు."*
*"నరకాగ్ని నుండి తప్పుకోండి. ఓ ఖర్జూరపు ముక్కను దానం చేసి అయినా సరే. అది కూడా లేకపోతే ఓ పరిశుద్ధమైన మాట పలికి అయినా సరే."*
దీనికి తోడూ దైవప్రవక్త (సల్లం), యాచన చేయకుండా జాగ్రత్తపడండని బోధించారు. సహనానికీ, పొదుపుకూ లభించే పుణ్యఫలం గురించి వివరించే వారు. ఇతరుల ముందు చేయిజాపి యాచించడాన్ని అతని ముఖంపై పడే గాట్లుగా అభివర్ణించేవారు. అయితే నిజంగానే వివశుడైపోయి యాచించే వ్యక్తి, ఆ కోవకు చెందడని చెప్పేవారు.
ఆరాధనలకు లభించే పుణ్యఫలాలు, దైవం దృష్టిలో వాటికి ఉన్న విలువ, లభించే ప్రతిఫలం గురించి కూడా విడమర్చి చెప్పేవారు, ఆకాశం నుండి అవతరించే దైవవాణితో ముస్లిములు ధృడమైన సంబంధం ఏర్పర్చుకునేటట్లు చేసేవారు. ఆయన (సల్లం), ఆ దైవవాణిని చదివి వినిపించేవారు. ముస్లిములు కూడా దాన్ని దైవప్రవక్త (సల్లం) ఎదుట చదివి వినిపించేవారు. దీని ద్వారా వారిలో ఆలోచన, అవగాహనే కాకుండా సత్యధర్మ ప్రచార బాధ్యతలు మరియు దైవదౌత్య బాధ్యతలు ఏవో బాగా నాటుకుపోయేవి.
అలాగే దైవప్రవక్త (సల్లం) ముస్లిముల ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించి, వారి దైవదత్తమైన సామర్థ్యాలను బయటకు తీసి వారిలో ఓ ఉన్నత అధికార పాటవాన్ని ఏర్పర్చగలిగారు. చివరికి వీరు మానవ చరిత్రలోనే దైవప్రవక్తల తరువాత ఉన్నత స్థానాన్ని ఆక్రమించగలిగారు. *"హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రజి)" ఇలా చెబుతూ ఉండేవారు....; ↓*
*"ఏ వ్యక్తి అయినా ఓ మార్గాన్ని అవలంబించవలసివస్తే, వారు గతించిన వీరి మార్గాన్నే అనుసరించాలి. ఎందుకంటే, సజీవంగా ఉన్న వారి వల్ల తప్పులుదొరలే భయం ఉంది గనుక.*
*వీరంతా దైవప్రవక్త (సల్లం)కు తోడుగా ఉన్నవారు. ఆయన అనుచరగణం. ఈ సమాజంలో అత్యుత్తములైన వ్యక్తులు, అందరికంటే మిన్న అయిన సదాచార సంపన్నులు. అందరికంటే ఉత్తమ విజ్ఞాన ధనులు. కలుపుగోలు తనంగల మనుషులు. అల్లాహ్, వారిని తన ధర్మస్థాపనం కోసం, దైవప్రవక్త (సల్లం) సహచర్యం కోసం ఎంచుకున్నాడు. అందుకని వారి ఔన్నత్యాన్ని గుర్తించండి. వారి అడుగుజాడల్లో నడవండి. సాధ్యమైనంత వరకు వారి నైతిక విలువలను, వారి సచ్చరితాన్ని అవలంబించండి. ఎందుకంటే వారు రుజుమార్గంపై నడిచి మార్గదర్శకులయ్యారు గనుక."*
అదేకాదు, మన ప్రవక్తశ్రీ (సల్లం), మహా నాయకుడు (సల్లం) స్వయంగా ఈ ఆధ్యాత్మిక చింతనలు, అందరికీ అగుపడే సుగుణాలు, దైవదత్త సామర్థ్యాలు, గుణగణాలు, నైతిక విలువలు, సదాచార సంపన్నతలు కలిగి ఉన్నవారు. ఆయన ఈ మూర్తిమత్వం కారణంగా హృదయాలు ఇట్టే ఆయన (సల్లం) వైపునకు అనుకోకుండానే మొగ్గిపోయేవి. ఆయన (సల్లం) కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికే సిద్ధపడేవారు ముస్లిములు.
కాబట్టి, ఆయన (సల్లం) నోట ఏదైనా ఆదేశం వెలువడగానే సహాబా (రజి) ఆ ఆదేశ పాలన కోసం పరుగుదీసేవారు. మార్గదర్శకానికి, ప్రబోధించడానికి ఏవైనా పలుకులు పలికితే వారు దాన్ని స్వీకరించడానికి, ఆచరించడానికి ఒకరికంటే ఒకరు ముందుకు వచ్చేవారు.
ఇలాంటి ప్రయత్నాల ఫలితంగానే మహాప్రవక్త (సల్లం) మదీనాలో, చరిత్రలోనే అత్యుత్తమమైన, గౌరవప్రదమైన ఓ సమాజాన్ని నెలకొల్పడంలో కృతకృత్యులయ్యారు. ఓ సుదీర్ఘ కాలం వరకు కాలచక్రం క్రింద నలగిపోయి, దారి కానరాకుండా అంధకార సాగరంలో మునిగిపోయిన మానవాళికి ఈ సమాజం కారణంగా తమ సమస్యలను పరిష్కరించుకునే ఓ అమూల్య అవకాశం లభించింది. ఈ సమాజం ఏర్పడిన తరువాత మానవతకు సాంత్వన చేకూరినట్లయింది.
ఈ సమాజానికి చెందిన ఈ సహాబా (రజి) మహోన్నత బోధనల ద్వారా సంపూర్ణ శక్తిగా రూపొంది, తమ ధైర్యస్థయిర్యాలతో ప్రపంచాన్నే ఎదుర్కొని చరిత్ర గమనాన్నే పూర్తిగా మార్చివేయడం జరిగింది.
*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*
No comments:
Post a Comment