188

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 188            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 103*

మునుపటి భాగము వరకు పవిత్ర జీవిత చరిత్రకు సంబంధించిన ఓ దశ మరియు ఇస్లామీయ సందేశ ప్రచారానికి సంబంధించిన ఓ శకం (అంటే మక్కా జీవితకాల శకం) పూర్తి అయింది.

              *మదీనాలో గడిపిన పవిత్ర జీవితం* 

 *మదీనా జీవితం : -* 

మదీనా శకాన్ని కూడా మూడు దశలుగా విభజించవచ్చు.

 *1. మొదటి దశ : -* ఈ దశలో ఉపద్రవాలు, ప్రతిబంధకాలు సృష్టించబడ్డాయి. అంతర్గతంగా ఎన్నో అవరోధాలు నిలబెట్టబడ్డాయి. బయట నుండి శత్రువులు మదీనాను తుడిచిపెట్టడానికి దాడులు చేశారు. ఈ దశ హుదైబియా ఒప్పందం హిజ్రీ శకం ఆరు, జీఖాదా మాసంతో అంతమైపోయింది.

 *2. రెండో దశ : -* ఈ దశలో బహుదైవారాధకులు, విగ్రహారాధకుల నాయకులతో సంధి కుదిరింది. ఇది మక్కా విజయం రమజాన్ నెల హిజ్రీ శకం ఎనిమిదితో అంతమైంది. ఈ దశలోనే ప్రపంచ దేశాల రాజులకు దైవసందేశాన్ని అందించడం జరిగింది.

 *3. మూడవ దశ : -* ఈ దశలో ప్రజలు గుంపులు గుంపులుగా దైవధర్మం అయిన ఇస్లాం ఛత్రఛాయలోనికి వచ్చి చేరారు. ఈ దశలోనే మదీనాలో జాతులు, తెగలకు సంబంధించిన ప్రతినిధి బృందాల రాక ప్రారంభమైంది. ఈ దశ మహాప్రవక్త (సల్లం) గారి జీవితపు తుది ఘడియ వరకు. అంటే, పదకొండు రబీఉల్ అవ్వల్, హిజ్రీ శకం పదకొండు వరకు వచ్చి ఆగుతుంది.

              *హిజ్రత్ నాటి మదీనా పరిస్థితులు : - 1* 

"హిజ్రత్" అంటే కేవలం ఉపద్రవాలకు, అపహాస్యాలకు బలికాకుండా మరో చోట రక్షణ పొందటం అనేది ఒక్కటే కాదు, ఓ ప్రశాంత ప్రదేశంలో స్థిరపడి ఓ నవసమాజ నిర్మాణంలో సహకారం అందించడం అనే భావన కూడా ఇందులో ఇమిడి ఉంది. అందుకనే ప్రతి స్థితిమంతుడైన ముస్లిం, తన క్రొత్త ఆశ్రయ నిర్మాణంలో పాల్గొనవలసి ఉంటుందనే ఆదేశం ఉంది. అది అతనిపై గల విధి. ఇందుకోసం అతడు దాని పటిష్టతకు, రక్షణకు మరియు దాని ప్రతిష్ఠకు కృషి చేయవలసి ఉంటుంది.

ఈ నవసమాజ నిర్మాణ కార్యక్రమాన్ని చేబట్టిన వ్యక్తి "హజ్రత్ ముహమ్మద్ (సల్లం)" ఒక్కరే అన్నది నిర్వివాదాంశం. దానికి నాయకత్వం కూడా ఆయనే (సల్లం) వహించాలి. అందుకని ఎలాంటి అభిప్రాయ భేదం లేకుండా వ్యవహారాలన్నీ ఆయనే (సల్లం) నిర్వహిస్తూ ఉండేవారు.

మదీనాలో ప్రవక్త శ్రీ (సల్లం)కి మూడు రకాల వర్గాలతో సంబంధాలు ఏర్పరచుకోవలసివచ్చింది. ఈ మూడు రకాల వర్గాల పోకడలు భిన్నమైన పోకడలు. ప్రతి వర్గానికి కొన్ని ప్రత్యేక సమస్యలున్నాయి. ఈ సమస్యలు ఇతరులకంటే భిన్నమైనవి. ఈ మూడు వర్గాలు ఇవి...., ↓

 *❥❥ మొదటి వర్గం : -* ప్రవక్త శ్రీ (సల్లం)ని అనుసరించే అనుచరగణాలకు చెందిన ప్రత్యేక వర్గం.

 *❥❥ రెండవ వర్గం : -* మదీనాకు చెందిన పురాతన తెగలకు సంబంధించిన బహుదైవారాధకుల వర్గం. ఇది రెండో వర్గం. ఇది ఇంకా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు.

 *❥❥ మూడవ వర్గం : -* యూదుల వర్గం.

 _↑ ఈ మూడు వర్గాల గురించి మరింత క్లుప్తంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ↓_ 

 *❥❥ మొదటి వర్గం : -* 

           దైవప్రవక్త (సల్లం)కు ఏ పరిస్థితులైతే ఇక్కడ ఎదురయ్యాయో, ఆ పరిస్థితులు మక్కా పరిస్థితుల కంటే పూర్తిగా భిన్నమైనవి.

మక్కాలో వారంతా ఒకే కలిమా (సద్వచనం)పై అమలుచేసినవారు. వారి ధ్యేయం కూడా ఒక్కటి గానే ఉండేది. కాని, వీరు అక్కడ వివిధ వంశాల్లో, కుటుంబాల్లో విస్తరించి, మక్కా వాసుల ఆగడాలకు బలి అవుతూ నిస్సహాయ జీవితాన్ని గడిపినవారు. వీరి దగ్గర ఎలాంటి అధికారమూ లేదు. అధికారాలన్నీ ధర్మ విరోధుల చేతుల్లోనే ఉండేవి. ప్రపంచ మానవ సమాజం ఏయే ఘట్టాల ద్వారా ఉనికిలోనికి వస్తుందో ఆ ఘట్టాలుగాని, శక్తి సామర్థ్యాలు గాని అప్పటి ముస్లిం సమాజానికి లేకుండాపోయాయి. ఇస్లామీయ సమాజ నిర్మాణాన్ని చేబట్టే అవకాశమే వారికి లభించలేదు. మక్కాలో అవతరించిన "దివ్య ఖుర్ఆన్" మక్కీ సూరాల్లో కేవలం ఇస్లామీయ మౌలిక సిద్ధాంతాలనే వివరంగా చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా అవలంబించగల ఆదేశాలే అవతరించాయి అక్కడ.

అదేకాకుండా, సదాచారులై ఉండాలంటూ, నైతికత విలువలను కాపాడుకోవాలంటూ ప్రోత్సహించడం, తుచ్ఛమైన, నీచమైన పనుల జోలికి పోకుండా ఉండాలనే ఆదేశాలు మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ ఆయత్ లలో.

దీనికి భిన్నంగా మదీనా ముస్లిముల నాయకత్వ పగ్గాలు ప్రారంభరోజు నుండే ముస్లిముల చేతిలోనికి వచ్చాయి. వాటిపై ఇతరుల పెత్తనం ఏమాత్రం లేదు. కాబట్టి ముస్లిములకు సభ్యతా సంస్కారాలు, ఆర్థిక ఉపాధి సదుపాయాలు, రాజకీయం మరియు అధికారం, యుద్ధం మరియు సంధిలాంటి సమస్యలను ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది. కాని, హలాల్ మరియు హరాం (ధర్మసమ్మతమైన మరియు నిషిద్ధమైన వస్తువులు), ఆరాధనలు, నైతికల్లాంటి సమస్యలను తరచి చూడవలసిన అవసరం ఏర్పడింది.

ముస్లిములు జీవితంలోని అన్ని ఘట్టాల్లో, ప్రపంచ మానవాళిలో చెలామణి అవుతున్న అప్పటి అజ్ఞాన సమాజానికి భిన్నమైన ఓ ప్రత్యేక నవసమాజ నిర్మాణం చేపట్టవలసిన ఆవశ్యకత ఏర్పడింది. గత పదేళ్ళ వరకు ఏ కష్టాలను, దౌర్జన్యాలను సహిస్తూ వచ్చారో ఆ నవసమాజాన్ని స్థాపించి, దానిపై నడిచి, ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచే తరుణం కూడా ఆసన్నమైంది.

ఈ నవసమాజ నిర్మాణం ఒక్క రోజులోనో లేదా ఒక నెలలోనో సాధ్యం అయ్యే పని కాదు. దీనికోసం ఓ సుదీర్ఘ సమయం కావాలి. దాని కోసం, ఈ కాలంలో క్రమక్రమంగా, దశలవారీగా ఆదేశాలు రావలసి ఉంది. అలాగే, చట్టనిర్మాణం, దానికోసం శిక్షణ ఆ తరువాత దాన్ని ప్రవేశపెట్టడంతో ఆ పని పూర్తి కావలసి ఉంది. ఆదేశాలు, చట్టాల విషయానికొస్తే వాటిని సమకూర్చే వ్యవహారం మాత్రం సృష్టికర్త అయిన అల్లాహ్ దే.

ముస్లిములను ఆ ఆదేశాల వైపునకు, చట్టాల వైపునకు నడిపించే బాధ్యత మహాప్రవక్త (సల్లం) గారి పవిత్ర భుజస్కంధాలపై ఉంది. ఈ విషయం గురించి దైవగ్రంథం ఇలా సెలవిస్తోంది....; ↓

 *ఆయనే నిరక్షరాస్యులైన జనులలో - స్వయంగా వారిలోనుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. అతడు వారికి దేవుని వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు, వారిని పరిశుద్ధపరుస్తున్నాడు. వారికి గ్రంథాన్నీ, వివేకాన్ని బోధిస్తున్నాడు. అంతకు ముందు వారు స్పష్టమైన మార్గవిహీనతకు లోనై ఉండేవారు. (ఖుర్ఆన్ 62:2).* 

ఇటు సహాబా (రజి) (మహాప్రవక్త (సల్లం) గారి అనుచరగణం) పరిస్థితి, దైవప్రవక్త (సల్లం) నోట ఏ ఆదేశం వస్తుందా అని నిరీక్షిస్తూ ఉండే పరిస్థితి. ఈ పరిస్థితిని గూర్చి కూడా దైవగ్రంథం ఇలా వివరిస్తోంది....; ↓

 *నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే - అల్లాహ్ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్ ఆయతులు వారి ముందు పఠించబడినపుడు, అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధిచేస్తాయి. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు. (ఖుర్ఆన్ 8:2).* 

ఈ వివరాలన్నిటినీ క్రోడీకరించడం మన విషయానికి సంబంధించిన విషయం కాదు కాబట్టి అవసరం వచ్చినప్పుడే చర్చించుకుందాం.

మొత్తానికి, ముస్లిముల వర్గంలో రెండు రకాల వ్యక్తులున్నారు.

 *✺ ఒక రకం ముస్లిములు : - ↓* 

స్వయంగా తమ పొలాల్లో, తమ ఇండ్లలో, తమ సిరి సంపదల్లో సంతోషంగా కాలం గడిపే ముస్లిములు. అంటే, ఇతరులు కష్టపడి ఉపాధిని సంపాదించేటట్లు, వారు కష్టపడాల్సిన అవసరం లేని స్థితిమంతులు. ఈ వర్గం అన్సార్ కు చెందిన వర్గం. వారి నడుమ తాతముత్తాతల నుండి ధృడమైన శతృత్వం, విద్వేషం ఉంటూ వచ్చేవి. వారికి తోడు రెండో వర్గం ముహాజిర్ల వర్గం.

 *✺ రెండో రకం ముస్లిములు : - ↓* 

వీరికి ఈ రాయితీలుగాని, డబ్బుగాని లేదు. వీరు కొల్లగొట్టబడి ఉత్తచేతులతో మదీనా చేరినవారు. వీరికి తలదాచుకోడానికి ఇల్లుగాని, పొట్టపోసుకోడానికి ఉపాధిగాని లేదు. వీరి ఉపాధికి ఏ ఒక్కరూ పని కూడా ఇవ్వని పరిస్థితి. అంతేకాదు, ఈ ముహాజిర్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నారు వీరు. దీనికి కారణం, దైవప్రవక్త (సల్లం)ను విశ్వసించిన వారంతా హిజ్రత్ చేసి మదీనాకు వచ్చేయాలనే ప్రకటన వెలువడడం. మదీనాలో కావలసినంత ధనంగాని, ఆదాయ వనరులుగాని అంతగా లేని విషయం తెలిసిందే. కాబట్టి మదీనా ఆర్థిక సంతులనం చేరిపోయింది.

ఈ గడ్డు పరిస్థితిలోనే, ఇస్లాం విరోధ శక్తులు కూడా మదీనాతో ఆర్థిక తెగతెంపులు చేసి బాయికాట్ ను ప్రకటించాయి. దానివల్ల మదీనాకు దిగుమతులు ఆగిపోయాయి. పరిస్థితులు మరింత క్షీణించిపోయాయి.

 *❥❥ రెండో వర్గం : -* 

         అంటే మదీనాకు చెందిన బహుదైవారాధక ప్రజలు. వీరికి ముస్లిములపై ఎలాంటి పెత్తనం లేదు. కొందరు బహుదైవారాధకులు, తమ తాతతండ్రులు నుండి వచ్చే ధర్మాన్ని విడనాడడానికి సంధిగ్ధంలో పడిపోయి, ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారు. అయితే వారి మనస్సుల్లో మాత్రం ముస్లిముల ఎడల ఎలాంటి శతృత్వం గాని, విద్వేషం గాని లేవు. ఇలాంటి కొందరు, కొంతకాలం గడచినా తరువాత ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ముస్లిములైపోయారు. ఆ తరువాత వారు ఇస్లాం కోసం తమ ప్రాణాలనైనా పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారు.

దీనికి భిన్నంగా కొందరు బహుదైవారాధకులైతే, దైవప్రవక్త (సల్లం) మరియు ముస్లిముల ఎడల తమ మనస్సుల్లో విద్వేషాన్ని ఉంచుకొని, దాన్ని బయటపడకుండా జాగ్రత్త పడేవారు. పైగా, పరిస్థితులకు ప్రభావితులై దైవప్రవక్త (సల్లం) ముందు దొంగ ప్రేమను, బూటకపు నాటకం ఆడడానికి కూడా వెనుకాడేవారుకారు.

వీరిలో "అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సలూల్" ప్రముఖుడు . ఇదివరకు జరిగిన "బుఆస్" యుద్ధంలో అతణ్ణి నాయకునిగా చేసుకుందాం అని "అవస్" మరియు "ఖజ్రజ్" తెగలు నిర్ణయం తీసుకుని ఉన్నాయి. అయితే అంతకు ముందు ఈ రెండు తెగలు ఎవరిని ఏకగ్రీవంగా నాయకునిగా ఎన్నుకున్న సందర్భాలు లేవు. అయితే "బుఆస్" యుద్ధం తరువాత అతని తలపై కిరీటాన్ని అలంకరించి అతణ్ణి తమ రాజుగా చేసుకోడానికి ఈ రెండు తెగలు ప్రకటించి ఉన్నాయి కూడా. అంటే ఇతను మదీనాకు రాజు అయ్యే లోపలే హఠాత్తుగా దైవప్రవక్త (సల్లం) మదీనాకు అరుదెంచడం జరిగింది. అతని వైపు ప్రజల ధ్యాసే లేకుండా పోయింది. మదీనా వాసులంతా మహాప్రవక్త (సల్లం) వైపునే మ్రోగ్గి అతణ్ణి ఉపేక్షించడం జరిగింది. కాబట్టి అతను, దైవప్రవక్త (సల్లం) తన రాచరికాన్నే లాక్కున్నాడని అనుకొని, తన మనస్సులో దైవప్రవక్త (సల్లం) మీద కక్ష కట్టాడు. బద్ర్ యుద్ధం జరిగాక పరిస్థితులు అతనికి అనుకూలంగా లేకపోవడం వలన షిర్క్ (బహుదైవారాధన) పై స్థిరంగా ఉంటే తనకు ప్రాపంచక ప్రయోజనం ఏదీ లభించదనే ఉద్దేశ్యంతో ప్రజలను నమ్మించడానికి ఇస్లాం స్వీకారం చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటికి అతను దైవ తిరస్కారియే.

కాబట్టి, మహాప్రవక్త (సల్లం) మరియు ముస్లిములకు కీడు చేసే అవకాశం ఏమాత్రం లభించినా వదలిపెట్టేవాడు కాదు. అతనికి రాచరికం లభిస్తే, గొప్ప గొప్ప పదవులను దండుకుందాం అని ఎదురుచూసిన ధనవంతులు కూడా అతని ఈ వైఖరికి వంత పాడేవారు, అతనికి సహాయపడేవారు ఈ విషయంలో. ఇదేకాదు ఒక్కొక్కప్పుడు యువకులు, అమాయకులైన ముస్లిములను సైతం చాకచక్యంగా లోబరుచుకునేవారు.

 *❥❥ మూడో వర్గం : -*  →

 *మూడో వర్గమైన యూదుల వర్గం గురించి In Sha Allah రేపటి భాగములో....;*

No comments:

Post a Comment