181

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 181            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 96* 

               *మదీనాకు హిజ్రత్ : - 5* 

 *మూడవ సంఘటన : -* 

ఈ ప్రయాణంలోనే మహాప్రవక్త (సల్లం), "ఉమ్మె మఅబద్ ఖుజాయియా" గుడారం ఉన్న చోట నుండి వెళ్ళడం జరిగింది. ఈమె ఆరోగ్యవంతురాలైన మహిళ. మోకాళ్ళు పట్టుకొని తన గుడారం వెలుపల కూర్చుని ఉండడం ఆమెకు అలవాటు. వచ్చిపోయే వారికి తన దగ్గర ఉన్న భోజన సామగ్రి నుండే తినిపించేవారు, దాహం తీర్చేవారు. ఈమె, బాటసారులకు ఆతిథ్యమివ్వడంలో పేరుగాంచిన మహిళ. ఆ సంవత్సరం కరవచ్చినప్పటికీ, ఏ కొంచెం ఉన్నా దాన్ని బాటసారులకు పెట్టి తాను పస్తుండేది. మహాప్రవక్త (సల్లం), ఆమె వద్దకు వెళ్ళి ఇలా అన్నారు....;

 *ముహమ్మద్ (సల్లం) : -* ఉమ్మె మఅబద్! తినడానికి ఏదైనా ఉందా?

 *ఉమ్మె మఅబద్ : -* దైవసాక్షి! నా దగ్గర ఏదైనా ఉంటే తప్పకుండా మీ అతిథి సత్కారాలు చేసేదాన్ని. ప్రస్తుతం ఇంట ఏదీ లేదు. మేకలు కూడా దగ్గరలో మేయడం లేదు. (అని తన నిస్సహాయతను ప్రకటించారు)

మహాప్రవక్త (సల్లం) దృష్టి ఓ మూలన కట్టి ఉన్న మేకపై పడింది.

 *ముహమ్మద్ (సల్లం) : -* ఉమ్మె మఅబద్, ఈ మేక ఏమిటి ఇక్కడుంది?

 *ఉమ్మె మఅబద్ : -* బలహీనత వల్ల అది మందతో పోలేకపోయింది.

 *ముహమ్మద్ (సల్లం) : -* పాలు ఏమైనా ఇస్తుందా ఇది?

 *ఉమ్మె మఅబద్ : -* పాలా? అది చాలా బలహీనంగా ఉంది. పాలెలాగుంటాయి?

 *ముహమ్మద్ (సల్లం) : -* మీరు అనుమతిస్తే పాలు పితుకుతాను!

 *ఉమ్మె మఅబద్ : -* నా తల్లిదండ్రులు తమకు అర్పితం! మీకే ఈ మేకలో పాలు కనపడుతున్నట్లయితే తప్పకుండా పితుక్కోండి.

ఆ తరువాత మహాప్రవక్త (సల్లం), ఆ మేక పొదుగును తన చేతితో నిమిరారు. మేక వెంటనే తన కాళ్ళను పాలు పితుక్కోమన్నట్లుగా ప్రక్కలకు చాచింది. పొదుగు పాలతో నిండిపోయింది.

దైవప్రవక్త (సల్లం), ఉమ్మె మఅబద్ దగ్గర ఉన్న ఓ పెద్ద పాత్ర తీసుకున్నారు. తరువాత, అల్లాహ్ నామం పలికి పాలు పితకడం మొదలుపెట్టారు.

పాలు ధారాపాతంగా వస్తున్నాయి. కాస్సేపటికే పాత్ర నిండిపోయింది. ఈ పాత్రలోని పాలు ఓ సమూహానికే సరిపోయేటంత పెద్ద పాత్ర అది. నురగలు పైకి వచ్చిందాకా ఆ పాత్రలో పాలు పితికారు. 

ఉమ్మె మఅబద్ సంభ్రమాశ్చర్యాలతో చూడసాగింది. ఆమె ఆశ్చర్యం నుంచి తెరుకోక ముందే దైవప్రవక్త (సల్లం) అందరికంటే ముందు ఆమె దగ్గరికే పాలు తెచ్చి త్రాగమన్నారు.

ఉమ్మె మఅబద్ కడుపారా పాలు త్రాగారు. దైవప్రవక్త (సల్లం), తమ వెంటనున్న వారందరికీ త్రాపించారు. వారు కడుపు నిండా పాలు త్రాగారు. 

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) కూడా పాలు త్రాగుతూ, *"ప్రజలకు త్రాగించేవాడు చివర్లో త్రాగుతాడు."* అన్నారు.

ఆ తరువాత చూస్తే, తిరిగి అంతే నిండుగా పాలున్నాయి ఆ పాత్రలో. వాటిని ఉమ్మె మఅబద్ దగ్గరే ఉంచేసి ముందుకు కదలిపోయారు దైవప్రవక్త (సల్లం).

దైవప్రవక్త (సల్లం) వెళ్ళిన కొంత సేపటికే ఆమె భర్త "అబూ మఅబద్", నడవడానికే శక్తిలేని తన బలహీనమైన మేకల్ని తోలుకుని ఇంటికి చేరారు. ఆయన, పాలను చూసి ఆశ్చర్యం వెలిబుచ్చుతూ ఇలా అడిగారు....,

 *అబూ మఅబద్ : -* ఉమ్మె మఅబద్! ఈ పాలు నీ వద్దకు ఎలా వచ్చాయి. నా మేకలు చాలా దూరం వరకు వెళ్ళి మేసోచ్చాయే? ఇంట పాలిచ్చే మేక ఒక్కటి కూడా లేదే?

 *"మనింటికి ఓ శుభప్రదుడైన వ్యక్తి వచ్చారు. ఆయన ఇలా ఇలా అని చెప్పారు. ఆయన (సల్లం) పరిస్థితి ఇలాగుంది."* అని విషయం అంతా పూసగ్రుచ్చినట్లు చెప్పారామె.

 *అబూ మఅబద్ : -* అయితే, ఖురైషులు వెతుకుతున్న మనిషే ఆయనే (సల్లం) అన్నమాట. ఆయన (సల్లం) గురించి ఇంకాస్త విపులంగా చెప్పు.

ఉమ్మె మఅబద్ ఆయన (సల్లం) ముఖకవళికల్ని, రూపురేఖల్ని, ఆయన (సల్లం) గుణగణాలను, వినేవాడు ఆయన్ను ఎదురుగా చూస్తున్నట్లే వర్ణించారు. ఈ గుణగణాలను విన్నంతనే అబూ మఅబద్ ఇలా అన్నారు....,

 *అబూ మఅబద్ : -* దైవసాక్షి! ఎవరి గురించి అయితే ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారో ఆ ఖురైష్ కు చెందిన వ్యక్తే ఈయన (సల్లం). ఆయన (సల్లం) గారి అనుచరుణ్ణి కావాలని అనుకుంటున్నాను. మార్గం ఏదైనా కనబడితే తప్పకుండా ఆయన (సల్లం)కు అనుచరుణ్ణయిపోతాను.

ఇటు మక్కాలో, అందరూ వినేటట్లు ఓ వాణి వినవచ్చింది. చెప్పేవాడు ఎవడూ కనబడడం లేదు. ఆ వాణి ఇది: ↓

 *"అల్లాహ్, ఉమ్మె మఅబద్ గుడారంలో వెలిసిన ఆ ఇద్దరి మిత్రులకు శుభం కలిగించుగాక! వారిద్దరు శుభంగా అక్కడికి వెళ్ళారు. క్షేమంగానే అక్కడి నుండి బయలుదేరారు. ముహమ్మద్ (సల్లం)కు మిత్రుడైనవాడు సాఫల్యం పొందినట్లే. అయ్యో ఖుస్సై! అల్లాహ్ అతని నుండి సాటిలేని మేటి ఘనకార్యాలను, నాయకత్వాలను లాక్కున్నాడు! "బనూ కఅబ్"కు చెందిన ఆ మహిళ ఇల్లు, విశ్వాసుల సంరక్షణకు విడిది శుభప్రదమైనదైపోవుగాక. మీరు వెళ్ళి ఆ మహిళతో ఆమె మేక గురించి జరిగిన వృత్తాంతం అడగండి. మీరే గనక ఆ విషయం ఆ మేకను అడిగినా అది సాక్ష్యం ఇస్తుంది."* 

 *"హజ్రత్ అస్మా (రజి)" ఇలా అంటారు....; ↓* 

"దైవప్రవక్త (సల్లం) ఎటు వెళ్ళారో తెలుపడానికి ఓ జిన్ను దిగువ మక్కా నుండి ఈ వచనాలు చెప్పుకుంటూ వచ్చాడు. ప్రజలు అతని వెంటే వస్తున్నారు. అతని మాటలు వింటున్నారు కాని అతణ్ణి మటుకు చూడలేకపోయారు. చివరికి అతను ఎగువ మక్కా నుండి వెళ్ళిపోయాడు. మేము అతని మాటలు విన్నంతనే మహాప్రవక్త (సల్లం) ఎటు వైపునకు వెళ్ళారో తెలిసిపోయింది. అంటే,  మహాప్రవక్త (సల్లం) మదీనా వైపే వెళ్ళారని నిర్ధారణ అయింది.

దారిలో "సురాకా బిన్ మాలిక్" అనేవాడు దైవప్రవక్త (సల్లం)ని మరియు అబూ బక్ర్ (రజి)లను వెంటాడాడు. In Sha Allah రేపటి భాగములో....;

No comments:

Post a Comment