🕌🕌🕌 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕌🕌🕌
🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు 🛐🛐
🤚🏻✋🏻 అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను 🤚🏻✋🏻
~~~~~
🕋🕋🕋 ఇస్లాం చరిత్ర - 176 🕋🕋🕋
■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 91*
*ముహమ్మద్ (సల్లం)ను హతమార్చేందుకు పథకాలు రచిస్తున్న బహుదైవారాధకులు*
నబవీశకం 14వ సంవత్సరం "సఫర్" నెలలో ఓ రోజు ఖురైషీయులు "దారున్నద్వా"లో సమావేశమయి సమాలోచనలు ప్రారంభించారు.
*"ముహమ్మద్ (సల్లం) విషయంలో ఏం చెయ్యాలి? అతడ్ని ఎలా లొంగదీసుకోవాలి? అతని ఉద్యమాన్ని అరికట్టే మార్గం ఏమిటి?"* అన్నాడు ఒకడు.
*"ఇప్పటిదాకా ముహమ్మద్ (సల్లం) మన మధ్య ఒంటరిగా ఉన్నా మనం ఏమీ చేయలేక పోయాం. ఇప్పుడు అవస్, ఖజ్రజ్ తెగలు అతనికి తోడయ్యాయి. ఇప్పుడేం చెయ్యాలి? మన నుంచి చేజారి పోకుండా ఆపడం ఎలా? ముహమ్మద్ (సల్లం) మనల్ని జయిస్తాడా? అతని మతం ఇప్పటికే మదీనాలో చాలా వరకు వ్యాపించింది. అది మిగతా తెగలకు కూడా వ్యాపించవచ్చు. ఆ విధంగా ముహమ్మద్ (సల్లం) మనల్ని తుదముట్టిస్తాడా? మన సుందర నగరాన్ని, మన విగ్రహాల్ని నాశనం చేస్తాడా? వీటి కోసం మనం సంవత్సరాల తరబడి పోరాడుతున్నా ఫలితం దక్కదా?"*
ఇలాంటి ఆలోచనలతో ఎన్నో సమావేశాలు జరిపారు ఖురైషీయులు. కాని తరుణోపాయం కనుచూపుమేరలో కూడా కనిపించలేదు. ఒక్క విషయం కూడా సరిగా తీర్మానించుకోలేకపోయారు. ఫలితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. అయితే "ఇస్లాం"ను విశ్వసించిన వారిపై యథాప్రకారం హింసాకాండ మాత్రం సాగిస్తూనే ఉన్నారు.
ఈ హింసాదౌర్జన్యాల వల్ల మక్కాలో ముస్లింల జీవితాలు దుర్భరమైపోయాయి. దైవప్రవక్త (సల్లం) రోజురోజుకు విషమిస్తున్న పరిస్థితి గమనించి, ఈ హింసాకాండ నుంచి బయటపడి ప్రశాంతంగా ధార్మిక జీవితం గడిపేందుకు వారికి మదీనా వలస పోయేందుకు అనుమతినిచ్చారు. ఈ అనుమతితో ముస్లింలు పథకం ప్రకారం ఒక్కొక్కరుగా, జట్లుజట్లుగా మక్కా నుండి బయటపడి రహస్యంగా మదీనా దారిపట్టారు. కాని కొంత మంది ముస్లిములు ఖురైషీయులకు పట్టుబడి పోయారు. ఆ దుర్మార్గులు వారిని నిర్భంధించి మరింత హింసించడం ప్రారభించారు.
మదీనా వలసపోయి తరువాత ముస్లిములకు ధర్మ ప్రచారం చేయడానికి మంచి అవకాశం లభించింది. జనం, "ఇస్లాం"లోని మంచిని గణించి దాని వైపు వేగంగా ఆకర్షించబడుతున్నారు. సర్వత్రా "ఇస్లాం" శంఖారావం ప్రతిధ్వనిస్తోంది. ముస్లిములు ఒక మహోన్నత శక్తిగా రూపొందుతున్నారు. ఇదంతా గమనించిన ఖురైషీయులు విలవిల్లాడిపోయారు. వారి గుండెల్లో బెదురు పుట్టింది. నలువైపుల నుంచి కష్టాలకారు మేఘాలు ముంచుకొస్తున్నాయని, తమకు ముస్లిములకు మధ్య భయంకర యుద్ధం సంభవించే సూచనలు కనిపిస్తున్నాయని భావించి హడలి పోయారు.
*దారున్నద్వాలో ఖురైషుల సమావేశం*
దైవప్రవక్త (సల్లం) గారి అనుచరగణం (సహాబా - రజి) హిజ్రత్ చేసి వెళ్ళిపోవడం, భార్యాపిల్లలను, ఆస్తిపాస్తులను సైతం విడచిపెట్టి, అవస్ మరియు ఖజ్రజ్ తెగలు ఉంటున్న ప్రాంతానికి చేరడం, మక్కాలోని బహుదైవారాధకుల్లో సంచలనాన్ని రేకెత్తించింది. ప్రతివాడూ ఈ విషయం గురించే ఆలోచిస్తున్నాడు. ఇప్పటివరకు కలగనంత బాధ వారికి కలిగింది. ఇక వారి ముందు ఓ గొప్ప ప్రమాదం ముంచుకు రాబోతుందని వారి ఈ బహుదైవారాధన, దాని వల్ల వారికి కలిగే ఆర్థిక ప్రయోజనాలు, వారి సంఘటితత్వానికి పెద్ద సవాలుగా మారిపోయిందని తలపోయనారంభించారు.
దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం)కు మహోన్నతమైన నాయకత్వపు శక్తిసామర్థ్యాలు ఉన్న యదార్థం మక్కా బహుదైవారాధకులకు బాగా తెలుసు. అదే కాదు, ఆయన (సల్లం) అనుచరగణానికి, ధైర్యస్థయిర్యాలు మరియు దైవప్రవక్త (సల్లం) కోసమని తమ ప్రాణాలనైనా అర్పించే భావన ఎంత తీవ్రమైందో అన్న విషయం కూడా వారికి తెలిసినదే.
ఆపై, అవస్ మరియు ఖజ్రజ్ తెగల్లోని తెగువ, యుద్ధ కౌశల్యం, ఈ ఉభయ తెగలకు చెందిన మేధావుల్లో ఏర్పడిన సామరస్య ధోరణి, అనేక సంవత్సరాలుగా ఆ తెగల్లో రాజుకుంటున్న విద్వేష వైషమ్యాల అగ్నిజ్వాలలు చల్లారిపోతున్న తీరు, మక్కా బహుధైవారాధకుల గుండెల్ని గడగడలాడించ నారంభించాయి.
యమన్ దేశం నుండి సిరియాకు, ఎర్ర సముద్రతీరం గుండా వెళ్ళేవారి వర్తక రహదారి ప్రక్కనే గల మదీనా నగరం, సైనికపరంగా ఎలాంటి కీలకమైన ప్రదేశంలో ఉందో వారికి బాగా తెలుసు. ఇదే కాకుండా, సిరియా దేశంతో మక్కావాసులు ప్రతి ఏటా చేసే వ్యాపారం రెండున్నర లక్షల బంగారు దీనారులకు సమానం. "తాయెఫ్" వారు చేసే వ్యాపారం దానికి అదనం. ఈ వ్యాపారం అంతా ఆ మార్గం ప్రశాంత వాతావరణం పైన్నే ఆధారపడి ఉంది. మక్కావాసులు ఆ మార్గం ఎలాంటి అడ్డంకులకు ఆలవాలం కాకుండా ఉండాలనే కోరుకునేవారు.
ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే, యస్రిబ్ (మదీనా)లో ఇస్లామీయ సందేశ ప్రచారం వ్రేళ్ళూనుకోవడం, మక్కావాసులకు యస్రిబ్ ప్రజలకు వ్యతిరేకంగా కాలుదువ్వడం వలన వచ్చిపడే ప్రమాదాలు ఎలా ఉండగలవో అర్థం చేసుకోవచ్చు. మక్కాలోని బహుదైవారాధకులకు ఇది బాగా తెలుసు. ఇది వారి మనుగడకే ఓ సవాలు. అందుకని వారు ఈ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి సరైన సమాధానాన్ని వెదుకనారంభించారు. ఈ ప్రమాదానికి అసలు కారకులు, ఇస్లాం సందేశ ప్రచార ధ్వజవాహకులైన ముహమ్మద్ (సల్లం) ఒక్కరే అన్న విషయం కూడా వారికి తెలుసు.
దీని కోసం బహుదైవారాధకులు, "బైతె అఖబయె కుబ్రా (రెండవ ప్రమాణం)" జరిగిన రెండున్నర నెలల తరువాత "సఫర్" నెల 26వ తేదీ (దైవదౌత్య శకం 14, క్రీ.శ. సెప్టెంబర్ 12, 622) గురువారం నాటి ఉదయమే మక్కా పార్లమెంటు అయిన "దారున్నద్వా"లో చరిత్రలోనే ప్రమాదకరమైన సమావేశాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సమావేశానికి సమస్త ఖురైష్ తెగలకు చెందిన నాయకులు హాజరయ్యారు. సమావేశ చర్చనీయాంశం ఏమిటంటే, ఇస్లామీయ ధ్వజవాహకులైన "హజ్రత్ ముహమ్మద్ (సల్లం)"ను హతమార్చి ఆ సందేశ ప్రచార జ్యోతిని ఒక్కసారే ఆర్పివేసే అంతిమ నిర్ణయాన్ని గైకొనడం.
*ఈ ప్రమాదకరమైన సమావేశంలో హాజరైన ఆ తెగ సర్దారుల పేర్లు ఇవి....; ↓*
1. అబూ జహల్ బిన్ హష్షామ్ - బనీ మక్జూమ్ తెగ
2. జుబైర్ బిన్ ముత్'యిమ్, తైమా బిన్ అద్దీ హారీస్ బిన్ ఆమిర్ - బనీ నౌఫిల్ బిన్ అబ్దె మునాఫ్ తెగ
3. షైబా బిన్ రబీయా, ఉత్బా బిన్ రబీయా, అబూ సుఫ్'యాన్ బిన్ హరబ్ - బనీ అబ్దుష్షమ్స్ బిన్ అబ్దె మునాఫ్ తెగ
4. నజ్ర్ బిన్ హారిస్ - బనీ అబుద్దార్ తెగ
5. అబుల్ బక్తరీ బిన్ హష్షామ్, జమ్ఆ బిన్ అస్'వద్, హకీమ్ బిన్ హిజామ్ - బనీ అసద్ బిన్ అబ్దుల్ ఉజ్జా తెగ
6. నబియా బిన్ హుజ్జాజ్, మంబా బిన్ హుజ్జాజ్ - బనీ సహెమ్ తెగ
7. ఉమయ్యా బిన్ ఖల్ఫ్ - బనీ జమ్'హా తెగ
అనుకున్న సమయానికి ఈ ప్రతినిధులు దారున్నద్వా చేరుకోగా, ఇబ్లీస్ (షైతాన్) ఓ సాధువు వేషంలో పై నుండి అంగవస్త్రం కప్పుకొని దారికి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. వాళ్ళంతా ఈ సాధుపుంగలెవరూ అని అనుకుంటూ ఉండగా, ఇబ్లీస్...., *"నేను 'నజద్'కు చెందిన ఓ షేఖ్ ను, మీ కార్యక్రమం గురించి విని ఇక్కడకు వచ్చాను. మీరు ఏమి మాట్లాడుకుంటారో విందామనుకుంటున్నాను. మీకు మంచి సలహాలను కూడా ఇవ్వగలను."* అని అన్నారు. దానికి ఖురైషీయులు *"సరే"* అంటూ వారంతా అతణ్ణి లోనికి అనుమతించారు. ఇలా ఇబ్లీస్ ఆ సమావేశం లోకి వచ్చి కూర్చున్నాడు.
*పార్లమెంటు చర్చ - దైవప్రవక్త (సల్లం)ను హతమార్చే తీర్మాణం : -*
అందరూ కూర్చున్న తరువాత ప్రతిపాదనలు, సలహాలు ఒక్కొక్కటిగా ముందుకు రానారంభించాయి. మొదట "అబుల్ అస్వద్" ఓ ప్రతిపాదనను ప్రతిపాదిస్తూ...., *"ఈ వ్యక్తిని మనలో నుంచి వెళ్ళగొడదాం. మన నగరం నుంచి బహిష్కరిద్దాం. ఆ తరువాత అతనికీ, మనకూ ఎలాంటి సంబంధం ఉండదు. అతను ఎక్కడికి వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు. మనం మటుకు ఈ పీడను విరగడ చేసినవారమవుతాము. మనమంతా మునుపటిలా ఒక్కటై ఉండవచ్చు."* అన్నాడు.
కాని నజదీ షేఖ్ గా నటిస్తున్న "ఇబ్లీస్" కల్పించుకుని...., *"లేదు, ఈ సలహా సరైన సలహా కాదు. ఇతని మాటలు ఎంత గొప్పవో, ఇతని పలుకులు ఎంత మధురమైనవో, అతను ఎలా ప్రజల హృదయాలను ఆకట్టుకుంటున్నాడో మీకు తెలియనిదా? దైవసాక్షి! మీరే గనక అలా చేస్తే అతను అరేబియాకు చెందిన ఏ తెగలోనికైనా వెళ్ళి, ఆ తెగవారిని తనకు విధేయులుగా చేసుకొని, ఆ తరువాత మీపై దాడి చేయడనే నమ్మకం ఏమిటి? మిమ్మల్ని మీ నగరంలోనే త్రొక్కేసి తనకు ఇష్టమైన తరహాలో ప్రవర్తించడనే భరోసా ఏమిటి? ఇదికాక మరేదైనా సలహాను గురించి ఆలోచించండి."* అన్నాడు.
"అబుల్ బక్తరీ" లేచి...., *"ఇతణ్ణి ఇనుప సంకెళ్ళతో కట్టి బంధించి బయట నుంచి తలుపులు మూసేద్దాం. ఆ తరువాత అతని మరణం కోసం నిరీక్షిద్దాం. ఇంతకు పూర్వం, కవులైన "జుహైర్" మరియు "నాబిగా"ను మనం అలా చేయలేదా?"* అని సలహా ఇచ్చాడు.
తిరిగి ఆ నజదీ షేఖ్ గా నటిస్తున్న "ఇబ్లీస్" కల్పించుకుని...., *"లేదు! దైవసాక్షి! ఇది కూడా సరియైన సలహా కాదు. మీరే గనక అలా చేశారో, ఆ వార్త అతని అనూయాయులకు తప్పక చేరుతుంది. మీపై దాడి చేసి, వారు అతడి (సల్లం)ని విడిపించుకువెళ్ళినా వెళ్ళగలరు. ఆ తరువాత తన సంఖ్యను పెంచి మీపై ప్రాబల్యాన్ని కూడా సంపాదించుకోగలడు. కాబట్టి ఈ సలహా కూడా సరైన సలహా కాదు. మరి దేన్నయినా ఆలోచించండి."* అని పలికాడు.
ఈ రెండు ప్రతిపాదనలు పార్లమెంటులో వీగిపోయినందున మరో తీవ్రమైన ప్రతిపాదన ప్రవేశపెట్టబడింది. దీన్ని ఆ పార్లమెంటు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రతిపాదనను ప్రవేశపెట్టినవాడు పెద్ద నేరస్తుడైన "అబూ జహలే".
అతను తన ప్రతిపాదనను ప్రవేశపెడుతూ...., *"అతని విషయంలో నా సలహా ఒక్కటే, ఇది ఇప్పటిదాకా ఎవరికీ తట్టలేదు."* అన్నాడు.
*"అదేమిటీ అబుల్ హకమ్!"* అడిగారు ఏకకంఠంతో.
*"నా సలహా ప్రకారం, మనం మన తెగల్లో నుంచి, వంశంలో గొప్పవాడైన ఒక్కోక్క యువకుణ్ణి ఎన్నుకుందాం. ప్రతి ఒకడి చేతికి పదునైన కరవాలాన్నిద్దాం. వారందరూ కలసి అతని వద్దకు వెళ్ళి మూకుమ్మడిగా, ఒకే వ్యక్తి ప్రహారం చేసినట్లుగా అతనిపై వ్రేటువేయాలి. ఇలా మనకు అతడి నుండి శాంతి లభించగలదు. మన యువకులు అన్ని తెగలకు చెందినవారైనందున హత్యానేరం అందరి మీదా ఉంటుంది. ఫలితంగా ఆ హత్యకు సంబంధించిన రక్తపరిహారం కూడా అన్ని తెగలపై పడుతుంది. "బనూ అబ్దె మునాఫ్" మన తెగలన్నిటితో పోరాడలేరు. కాబట్టి రక్తపరిహారం వరకే ఆగిపోతారు. అలా మనం ముహమ్మద్ (సల్లం) హత్యకు రక్తపరిహారం చెల్లిద్దాం. ఏమంటారు?"* అని అడిగాడు.
నజదీ షేఖ్...., *"అవును. ఈ యువకుడు ఇచ్చిందే సరైన సలహా. మరేదైనా ప్రతిపాదన ఉంటే అది ఇదే సుమా. తక్కిన ప్రతిపాదనలకు విలువే లేదు."* అన్నాడు.
ఆ తరువాత మక్కా పార్లమెంటు ఈ ఘోర తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీన్ని వెంటనే అమలుపరచాలి అనే కృతనిశ్చయంతో సభ్యులంతా ఇంటిదారి పట్టారు.
*మహాప్రవక్త (సల్లం)ను శాశ్వతంగా హతమార్చేందుకు వెళ్ళిన ఖురైషీయులు....;*
*↑ In Shaa Allah రేపటి భాగములో....; →*
No comments:
Post a Comment