🕌🕌🕌 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕌🕌🕌
🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు 🛐🛐
🤚🏻✋🏻 అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను 🤚🏻✋🏻
~~~~~
🕋🕋🕋 ఇస్లాం చరిత్ర - 175 🕋🕋🕋
■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 90*
*హిజ్రత్ కు ఉపక్రమించిన ప్రథమ బృందాలు*
*రెండవ సంఘటన : -*
"హజ్రత్ సుహైబ్ (రజి)" హిజ్రత్ చేసి వెళ్ళిపోదామనుకుంటే, ఖురైష్ ప్రజలు ఆయన (రజి)తో ఇలా అన్నారు. ↓
*ఖురైషీయులు : -* సుహైబ్! నీవు మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక బికారివి మాత్రమే. ఇక్కడికి వచ్చిన తరువాతే నీవు ధనవంతుడు అయిపోయావు. ఇక నీవు నీ ప్రాణాలు, నీ ధనం రెండు తీసుకొని వెళ్ళాలనుకుంటే మాత్రం అది జరిగే పనికాదు.
*సుహైబ్ (రజి) : -* సరే! నేను నా సొమ్మునంతా వదిలేసి వెళ్ళాలనుకుంటే నన్ను వదిలేస్తారా?
*ఖురైషీయులు : -* అవును, వదిలేస్తాం!
*సుహైబ్ (రజి) : -* సరే! నా సొమ్ము డబ్బు అంతా మీదే.
ఈ మాటలు పలికి "హజ్రత్ సుహైబ్ (రజి)" అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ఈ విషయం దైవప్రవక్త (సల్లం)కు తెలిసింది. దానికి దైవప్రవక్త (సల్లం), హజ్రత్ సుహైబ్ (రజి)ను మెచ్చుకుంటూ, *"సుహైబ్ (రజి) పెద్ద లాభాన్నే ఆర్జించాడు, సుహైబ్ (రజి) పెద్ద లాభాన్నే మూటకట్టుకున్నాడు."* అని సెలవిచ్చారు.
*మూడవ సంఘటన : -*
"హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజి)", "అయ్యాష్ బిన్ అబీ రబీయా", "హష్షామ్ బిన్ ఆస్ బిన్ వాయిల్" ఈ ముగ్గురు కలిసి, ఫలానా చోట కూడుదామని, అటు నుండే మదీనాకు హిజ్రత్ చేసి వెళ్ళిపోదామని అనుకున్నారు. "హజ్రత్ ఉమర్ (రజి)" మరియు "హజ్రత్ అయ్యాష్ (రజి)" అనుకున్న తీరుగా అక్కడికి వచ్చి చేరగలిగారు. కాని "హష్షామ్" మాత్రం పట్టుబడిపోయారు.
ఆ ఇద్దరు కలిసి మదీనాకు చేరి "ఖుబా" అనే ప్రదేశంలో విడిది చేశారు. "అబూ జహల్", అతని సోదరుడు "హారీస్" ఇద్దరు కలిసి "అయ్యాష్ (రజి)" వద్దకు వచ్చారు. ఈ ముగ్గురిని కన్నతల్లి ఒక్కరే.
ఈ ఇద్దరు "అయ్యాష్ (రజి)"తో...., *"నీ తల్లి, నిన్ను చూడనంత మట్టుకు తల దువ్వనని, ఎండలో నుండి నీడలోనికి పోనని శపథం చేసింది."* అని అన్నారు.
ఈ మాటలు విన్న వెంటనే "అయ్యాష్ (రజి)"కు తన తల్లిపై జాలి కలిగింది. "హజ్రత్ ఉమర్ (రజి)" ఈ వాలకం చూసి "అయ్యాష్ (రజి)"తో...., *"దైవసాక్షి! చూడు అయ్యాష్ (రజి)! వీళ్ళు నిన్ను మోసగించి వెనక్కు తీసుకునిపోవడానికే వచ్చారు. నీ ధర్మాన్ని నీకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్త! దైవసాక్షి! నీ తల్లి తలలో పేలుపడి ఆమెను బాధిస్తూ ఉంటే తల దువ్వుకోక ఏం చేస్తుంది? మక్కా ఎండ ఏ కాస్త తగిలినా ఆమె నీడలోనికి వెళ్లిపోవడం ఖాయం."* అని ఆయన్ను పోకుండా నిలువరించడానికి ప్రయత్నించారు.
కాని "అయ్యాష్ (రజి)"కు "హజ్రత్ ఉమర్ (రజి)" గారి హితోక్తులు చెవికెక్కలేదు. ఆయన తన తల్లి చేసిన శపథాన్ని మానిపించాలనే ఉద్దేశ్యంతో, వారి వెంట వెళ్ళిపోవడానికే సిద్ధపడ్డారు.
*"అయితే, నీవు నీ మాటనే నెగ్గించుకోదలిస్తే, ఇదిగో నా పెంటి ఒంటె. ఇది ఎంతో మేలైనది, వేగంగా నడిచేదీను. దీని వీపును అంటిపెట్టుకుని ఉండు. ఏ మాత్రం అనుమానం కలిగినా పారిపోయి వచ్చేయి."* అంటూ తన ఒంటెను "అయ్యాష్ (రజి)"కు ఇచ్చారు "హజ్రత్ ఉమర్ (రజి)".
"అయ్యాష్ (రజి)" ఒంటె పైకెక్కి వారిద్దరి వెంట బయలుదేరారు. దారిలో "అబూ జహల్"...., *"చూడు సోదరా! నా ఒంటె మొండిదైపోయింది, నన్ను నీ ఒంటేపై ఎక్కించుకోవా?"* అని అడిగాడు. *"సరే"* అంటూ అయ్యాష్ (రజి) తన ఒంటెను కూర్చోబెట్టారు. తరువాత ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా వారి ఒంటెల్ని కూర్చోబెట్టి క్రిందికి దిగారు. ఆ ఇద్దరు ఒక్కసారే "అయ్యాష్ (రజి)"పై విరుచుకుపడి ఆయన్ను త్రాళ్ళతో బంధించేశారు. ఆ స్థితిలోనే ఆయన్ను మక్కాకు తెచ్చి, *"ఓ మక్కా వాసులారా! మేము ఇతని యెడల ప్రవర్తించినట్లే మీరు కూడా తక్కిన ముస్లిముల యెడల ప్రవర్తించండి."* అంటూ ప్రకటించారు.
(హష్షామ్ మరియు అయ్యాష్ లు దైవతిరస్కారుల చెరలో అలాగే పడి ఉండవలసి వచ్చింది. దైవప్రవక్త (సల్లం), హిజ్రత్ చేసి మదీనాకు వెళ్ళిన తర్వాత ఆయన (సల్లం) ఓ రోజు తన అనుచరులతో...., *"నా కోసం హష్షామ్ మరియు అయ్యాష్ లను ఎవరు విడిపించుకుని వస్తారు?"* అని అడిగారు. "వలీద్ బిన్ వలీద్" ముందుకొచ్చి...., *"నేను వారిని విడిపించుకొని రాగలను దైవప్రవక్తా!"* అని అన్నారు.
ఆ తర్వాత "వలీద్", మక్కాకు రహస్యంగా వెళ్లి ఓ స్త్రీ వారిద్దరికి భోజనం తీసుకుని వెళుతుండగా చూసి ఆమెకు తెలియకుండా అక్కడికి చేరుకున్నారు. "హష్షామ్ మరియు అయ్యాష్"లు కప్పులేని ఓ ఇంట బంధించబడి ఉన్నారప్పుడు. చీకటి పడగానే "వలీద్" గోడ దూకి వారిద్దరి వద్దకు వెళ్లారు. వారి కాళ్ళల్లో వేసిన బేడీలు కోసి గోడదూకి మదీనాకు పారిపోయి వచ్చారు. ఇబ్నె హష్షామ్ - 1/474, 476.
హజ్రత్ ఉమర్ (రజి) ఇరవై మంది సహాబాలతో కలసి హిజ్రత్ చేసినట్లు సహీ బుఖారి ఉల్లేఖనంలో ఉంది. సహీ బుఖారి - 1/558.)
*↑ ↑ ↑ ↑ ↑ ↑ ↑ ↑*
హిజ్రత్ చేయడానికి సమాయత్తమవుతున్న ముస్లిముల గురించి తెలియగానే, మక్కా ముష్రిక్ లు వారి ఎడల ప్రవర్తించే తీరుకు సంబంధించిన మూడు ఉదాహరణలు ఇవి. అయినప్పటికి ముస్లిములు ఒకరి తరువాత ఒకరు హిజ్రత్ చేయడం ఆపలేదు. "బైతె అఖబయె కుబ్రా (రెండవ ప్రమాణం)" జరిగిన రెండు నెలల కొన్ని రోజుల తరువాత మక్కాలో దైవప్రవక్త (సల్లం), "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" మరియు "హజ్రత్ అలీ (రజి)" తప్ప మరెవ్వరూ మిగిలి ఉండలేదు.
కాని ముష్రిక్ లు బలవంతంగా ఆపి ఉంచిన ముస్లిములు మాత్రమే అక్కడ ఉండిపోవలసి వచ్చింది. "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" మరియు "హజ్రత్ అలీ (రజి)"లు మాత్రం మహాప్రవక్త (సల్లం) గారి ఆదేశం మేరకే అక్కడ ఉండిపోవడం జరిగింది. మహాప్రవక్త (సల్లం) కూడా తన ప్రయాణం కోసం సిద్ధమై దైవాదేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" ఇదివరకే సంసిద్ధులై కూర్చున్నారు.
*"సహీ బుఖారీ"లో "హజ్రత్ ఆయిషా (రజి)" గారి ఉల్లేఖనం ప్రకారం....; ↓*
మహాప్రవక్త (సల్లం) ముస్లిములనుద్దేశించి...., *"మీరు హిజ్రత్ చేసి వెళ్లవలసిన ప్రదేశం నాకు చూపించబడింది. ఇది లావా పర్వతాల నడుమన ఉన్న ప్రదేశం. అది ఒయాసిస్సులతో నిండివున్న ప్రాంతం."* అని అన్నారు. ఆ తరువాతే ముస్లిములు మదీనా వైపునకు హిజ్రత్ చేసి వెళ్ళనారంభించారు. అబీసీనియాకు వలస వెళ్ళిన వారు కూడా మదీనాకే తిరిగి వచ్చేశారు. "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" కూడా ప్రయాణ సన్నాహంతో సిద్ధంగా ఉన్నప్పటికీ, దైవప్రవక్త (సల్లం) ఆయన్ను తనకు కూడా హిజ్రత్ చేసే అనుమతి లభించే వరకు వేచి ఉండమని చెప్పడం జరిగింది. దానికి అబూ బక్ర్ (రజి), *"దైవప్రవక్తా! అలా జరుగుతుందనే ఆశ మీకుందా?"* అని అడిగితే, *"అవును"* అని సమాధానమిచ్చారాయన (సల్లం).
ఆ తరువాత "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" దైవప్రవక్త (సల్లం) వెంట హిజ్రత్ చేసి వెళ్ళడానికి ఆగిపోయారు. ఆయన దగ్గర రెండు ఒంటెలు కూడా ఉన్నాయి. నాల్గు నెలల వరకు వాటికి తుమ్మ ఆకుల్ని మేపి బలిష్టమైనవిగా చేశారాయన.
ఈ విధంగా దైవప్రవక్త (సల్లం) గారి అనుచరగణం వలస వెళ్తుంటే, బహుదైవారాధకులు భరించలేకపోయారు. దీనంతటికీ కారణమైన ముహమ్మద్ (సల్లం)ని హతమార్చాలని పథకాలు రచించసాగారు.
*↑ ఇందులోని వివరణను In Shaa Allah రేపటి భాగములో....; →*
No comments:
Post a Comment