174

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 174            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 89*

            *హిజ్రత్ కు ఉపక్రమించిన ప్రథమ బృందాలు* 

రెండవ "బైతె అఖబా" సంపూర్ణమైంది. "ఇస్లాం", దైవతిరస్కారం మరియు అజ్ఞానంతో నిండిన అనంత ఎడారిలో తనకంటూ ఓ స్థలాన్ని పొందడంలో కృతకృత్యమైంది - ప్రచారం ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు "ఇస్లాం" సాధించిన విషయాల్లో ఇది ప్రధానమైన విజయం - మహాప్రవక్త (సల్లం) ముస్లిములకు, ఇక తమ క్రొత్త కేంద్రం వైపునకు "హిజ్రత్" చేసి వెళ్ళడానికి అనుమతి నొసగారు.

"హిజ్రత్" చేయడం అంటే, కేవలం తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లబోతుందని తలచి తమ ప్రయోజనాలను, ధనాన్ని, ఇండ్లు వాకిళ్ళను వదిలేసి మరో చోటికి తరలిపోవడం అన్నమాట. ప్రయాణ ఆరంభం నుండి గమ్యం చేరే వరకు ఎక్కడైనా వారు హతమార్చబడగలరనే భయంతో బయలుదేరవలసి ఉంటుంది. అదీకాక ఈ ప్రయాణం కూడా పూర్తి నమ్మకంగా చేస్తున్న ప్రయాణం కాదు. మునుముందు మరిన్ని కష్టాలు, కడగండ్లు పొంచి ఉన్నాయో వారికి తెలియదు. ముస్లిములందరికి ఈ విషయం బాగా తెలుసు. అయినా వారు "హిజ్రత్" ప్రారంభించారు.

అటు బహుదైవారాధకులు కూడా వారి ప్రయాణంలో అడ్డంకులు పెట్టనారంభించారు. ఇలా ముస్లిములేగనక తమ స్వస్థలాన్ని వదలి వెళ్ళిపోతే వారికి కూడా ప్రమాదాలు ఏర్పడతాయని వారి బాధ. మచ్చుకు ఈ "హిజ్రత్"కు సంబంధించిన కొన్ని (మూడు) సంఘటనలను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాము.

 *మొదటి సంఘటన : -* 

 *అబూ సల్మా (రజి) వలస : -* 

"హజ్రత్ అబూ సల్మా (రజి)" తన భార్య "ఉమ్మె సల్మా (రజి)"ను, ఒక పిల్లవాడ్ని తీసుకుని మక్కా నుండి బయలుదేరారు. పట్నం నుండి రెండు మూడు మైళ్ళు పోయారో లేదో "ఉమ్మె సల్మా (రజి)" తరపు బంధువులు వచ్చి వాళ్ళను అటకాయించారు. వారి చేతుల్లో కత్తులు, ఈటెలు కూడా ఉన్నాయి.

ఒంటె మీద భర్త వెనుక కూర్చున్న "హజ్రత్ ఉమ్మె సల్మా (రజి)" వాళ్ళను చూడగానే నిలువునా కంపించిపోయారు. ఆమె ఒడిలో కూర్చున్న చంటి పిల్లవాడు ఏడుపు లంకించున్నాడు. "అబూ సల్మా (రజి)"కు పట్టరాని కోపం వచ్చింది కాని ఏం చేయగలరు?

 *"ఏమిటీ దౌర్జన్యం! నేను నా ఇల్లు, ఆస్తిపాస్తులన్నీ అక్కడే వదలిపెట్టి వచ్చాను కదా! నేనిప్పుడు నా భార్యను, పిల్లవాడ్ని మాత్రమే తీసుకెళ్తున్నాను. ఇక నా దగ్గర ఏముందని వచ్చారు మీరు?"* అన్నారు ఆయన కోపాన్ని బలవంతంగా దిగమింగుతూ.

 *"నువ్వు వెళ్ళదలచుకుంటే ఎక్కడికైనా వెళ్ళి ఊరేగు. కాని మా అమ్మాయిని మాత్రం తీసికెళ్ళడానికి వీల్లేదు."* అన్నారు "ఉమ్మె సల్మా (రజి)" బంధువులు.

 *"ఈమె నా భార్య మీరు స్వయంగా ఈమెను నాకిచ్చి పెళ్ళి చేశారు. ఇప్పుడు ఈమెను నా నుండి దూరం చేయడానికి మీకెలాంటి అధికారం లేదు."* అన్నారు "అబూ సల్మా (రజి).

 *"ముందు నువ్వు ఒంటె మీద నుండి దిగుతావా లేదా?"* అంటూ వారు కత్తులు ఝళిపించారు.

"హజ్రత్ అబూ సల్మా (రజి)" గత్యంతరం లేక ఒంటె మీద నుంచి క్రిందికి దిగారు. వెంటనే "ఉమ్మె సల్మా (రజి)" బంధువులు "ఉమ్మె సల్మా (రజి)"ను, ఆమె పసిబిడ్డను బలవంతంగా తీసుకుని అక్కడ నుంచి బయలుదేరారు. "ఉమ్మె సల్మా (రజి)" మాటిమాటికి వెనక్కి తిరిగి భర్త వైపు చూస్తూ కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఆమె ఒడిలోని పిల్లవాడు కూడా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.

పాపం "అబూ సల్మా (రజి)" నిస్సహాయంగా నిలబడి భార్యాపిల్లల వైపు చూస్తున్నారు. ఆయన కళ్ళు కూడా అశ్రుపూరితాలయ్యాయి. ఆయన భార్యాపిల్లలు కనుమరుగైపోయేదాకా చూశారు. ఆ తరువాత కాళ్ళీడ్చుకుంటూ ఒంటరిగా మదీనా దారిపట్టారు.

"ఉమ్మె సల్మా (రజి)" బంధువులు "ఉమ్మె సల్మా (రజి)"ను సంతోషంగా ఆమె భర్త వెంట మదీనా పంపడానికి బదులు, "ఇస్లాం" పట్ల ఉన్న ద్వేషంతో గుండెల్లో రగులుతున్న కసి తీర్చుకోవడానికి ఈ విధంగా ఆమెను భర్త నుండి విడదీసి లాక్కెల్తున్నారు.

"ఉమ్మె సల్మా (రజి)" బంధువుల వైఖరి "అబూ సల్మా (రజి)" బంధువులకు సహించరానిదై ఉండాలి. వారు "ఉమ్మె సల్మా (రజి)" బంధువుల దుశ్చర్యను గర్హించాలి. కాని వారిగుండెల్లో కూడా "ఇస్లాం" వ్యతిరేక జ్వాలలు రగులుతున్నాయి. సమాచారం అందిన వెంటనే వారు బయలుదేరి పట్నం వెలుపలే దారిలో "ఉమ్మె సల్మా (రజి)" బంధువుల్ని కలుసుకున్నారు.

 *"ఆగండి. మీరు మీ అమ్మాయిని మావాడి నుండి వేరుచేసి తీసుకెళ్తున్నారు బాగానే ఉంది. కాని ఈ పిల్లవాడు మావాడు, మా వంశాంకురం. మీరితడ్ని తీసుకెళ్ళడానికి ఎంత మాత్రం వీల్లేదు. మా పిల్లవాడ్ని మాకిచ్చేయండి."* అంటూ "అబూ సల్మా (రజి)" బంధువులు "ఉమ్మె సల్మా (రజి)" ఒడిలోని పసిబిడ్డను బలవంతంగా లాగి తీసుకున్నారు.

 *వేరొక ఉల్లేఖనం ప్రకారం : - ↓* 

మొట్టమొదటి ముహాజిర్ (హిజ్రత్ చేసిన వ్యక్తి) "హజ్రత్ అబూ సల్మా (రజి)". ఆయన "బైతె అఖబయె కుబ్రా (రెండవ ప్రమాణం)కు ఒక సంవత్సరం ముందే మక్కాను వదిలి వెళ్ళిపోయిన వ్యక్తి. ఆయన వెంట, ఆయన భార్యాపిల్లలూ ఉన్నారు. బయలుదేరే ముందు ఆయన అత్తగారి వైపువారు, *"ఇదిగో నీ ప్రాణం మాత్రమే నీది. దాన్ని గురించి మేమేమీ మాట్లాడం. కాని మా ఇంటి ఆడపడచును నీ వెంట పంపడానికి ఎలా సిద్ధపడతాం. ఆమెను ఊరు ఊరు, నగరం నగరం తిప్పుకుంటూ తిరుగుతావా?"* అంటూ భార్యను ఆయన వెంట పోకుండా ఆపేసుకున్నారు. 
ఇది చూసిన "అబూ సల్మా (రజి)" ఇంటి వారికి కూడా కోపం వచ్చింది. *"ఓహో! మీరు మీ కుమార్తెను మా అబ్బాయి నుండి లాక్కొంటే మేము చూస్తూ ఊరుకునేరకం కాదు. మేము కూడా ఆమె కుమారుణ్ణి ఆమె నుండి లాక్కోగలం"* అంటూ ఉభయ కుటుంబాల వారు ఆ పిల్లవాణ్ణి తమ వైపునకు లాక్కోవడం వల్ల పాపం పసివాని చేయి కాస్తా ఊడివచ్చేసింది. "అబూ సల్మా (రజి)" కుటుంబీకులు అతన్ని తమ వెంట తీసుకువెళ్ళిపోయారు.

చెప్పొచ్చిందేమిటంటే, "అబూ సల్మా (రజి)" ఒక్కరే మదీనా వైపునకు బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ తరువాత "ఉమ్మె సల్మా (రజి), అంటే "అబూ సల్మా (రజి)" భార్య పరిస్థితి వర్ణనాతీతం. ఆమె అటు భర్త వియోగం ఇటు కన్నకొడుకు తనకు దూరం అయిపోవడం వలన, ఆ సంఘటన జరిగిన "అబ్తఖ్" అనే ప్రదేశానికి వెళ్ళి ప్రొద్దుక్రుంకే వరకు ఏడుస్తూ కూర్చోనేవారు. అలా ఒక సంవత్సరం గడచిపోయింది. చివరికి ఆమె కుటుంబానికే చెందిన వ్యక్తి ఎవరికో జాలి కలిగింది. *"పాపం ఈ అభాగ్యురాలిని ఎందుకు పోనివ్వరూ? అనవసరంగా మీరు ఆమెకు కొడుకు దక్కకుండా చేశారు."* అని చెప్పి ఒప్పించాడు ఆమె తల్లితండ్రుల్ని.

ఆ తరువాత ఆమెను భర్త వద్దకు మదీనాకు వెళ్ళిపొమ్మని చెప్పారు. "ఉమ్మె సల్మా (రజి)" తన కుమారుణ్ణి అత్తగారింటి నుండి తీసుకుని మదీనా దారి పట్టారు. *అల్లాహు అక్బర్! దాదాపు అయిదు వందల కిలోమీటర్ల ప్రయాణం. తోడు ఎవ్వరూ లేరు.* "తన్ఈమ్" అనే ప్రదేశానికి చేరిన తరువాత అక్కడ ఆమెకు "ఉస్మాన్ బిన్ అబీతల్హా" కనబడ్డాడు. వృత్తాంతం విన్న "ఉస్మాన్" ఆమెను మదీనాకు చేరుద్దామని వెంట బెట్టుకుని బయలుదేరాడు. "ఖుబా" గ్రామం కనబడగానే, *"నీ భర్త ఈ బస్తీలోనే ఉన్నాడు. వెళ్ళు, అల్లాహ్ నీకు శుభం కలిగిస్తాడు."* అని చెప్పి మక్కాకు తిరిగి వచ్చాడు.

 *మిగిలిన 2,3 సంఘటనలను In Shaa Allah రేపటి భాగములో....;*

No comments:

Post a Comment