172

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 172            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 87* 


                   *ద్వితీయ బైతె అఖబా* 

దైవదౌత్య శకం 13వ సంవత్సరం హజ్ కాలమది (జూన్, క్రీ.శ. 622వ సంవత్సరం) యస్రిబ్ (మదీనా)కు చెందిన డెబ్భై మందికి పైచిలుకు ముస్లిములు "హజ్" ఆరాధనలో పాల్గొనడానికి మక్కాకు విచ్చేశారు. వీరంతా వారి జాతికి చెందిన హాజీలతో కలసి మక్కాకు వచ్చినవారే. ఇంకా వారు యస్రిబ్ లోనో లేదా మార్గమధ్యంలోనో ఉన్నప్పుడే పరస్పరం ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటూ, *"ముహమ్మద్ (సల్లం)ను, మక్కా కొండల్లో నిస్సహాయంగా తిరగడానికీ, బాధలు భరించడానికీ, భయంతో తల్లడిల్లిపోవడానికిగాను వదలిపెట్టి ఎలా ఉంచగలం?"* అని అనుకోజొచ్చారు.

ఈ ముస్లిములు మక్కాకు చేరిన తరువాత రహస్యంగా ముహమ్మద్ (సల్లం)తో చర్చలు ప్రారంభించారు. చివరకు, తష్రీక్ కాలం -12 జిల్'హజ్జ రోజున - మినా ప్రాంతంలో జమ్రయె ఊలా, అంటే "జమ్రయె అఖబా" దగ్గర ఉన్న కొండ లోయలో రహస్యంగా కలుద్దామని నిర్ణయించుకున్నారు.

రండి! ఇప్పుడు మనం ఈ చారిత్రాత్మక సమావేశ వివరాలను అన్సార్ నాయకుడు "హజ్రత్ కఅబ్ బిన్ మాలిక్ (రజి)" నోటే విందాము. ఈ సమావేశం "ఇస్లాం" మరియు విగ్రహారాధన పోరాటాన్ని ఓ కొత్త మలుపు మలిపింది.

 *హజ్రత్ కఅబ్ బిన్ మాలిక్ (ర) కథనం : - ↓* 

మేము "హజ్" చేయడానికి బయలుదేరాం. దైవప్రవక్త (సల్లం) తష్రీక్ రోజుల్లోని మధ్యరోజు (12వ జిల్'హజ్జ) "అఖబా"లో కలుద్దాం అని నిర్ణయించుకున్నాం. ఎట్టకేలకు ఆ రాత్రి రానేవచ్చింది. మాతో, మా జాతికే చెందిన ఓ గౌరవనీయుడైన సర్దారు "అబ్దుల్లా బిన్ హిరామ్" కూడా ఉన్నారు. (అప్పటికి ఆయన "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించలేదు.) 

మా జట్టులో ఇంకా ఇతర బహుదైవారాధకులు కూడా ఉన్నారు కాని మేము ఈ వ్యవహారాన్ని వారికి తెలియకుండానే ఉంచాం - అయితే మేము ఒక అబ్దుల్లా బిన్ హిరామ్ నే ఒప్పిస్తూ, *"ఓ అబూ జాబిర్! మీరు మా దృష్టిలో ఓ గౌరవనీయులైన సర్దారు. రేపు నరకపు ఇంధనంగా మారకుండా మిమ్మల్ని ప్రస్తుత పరిస్థితి నుండి బయటకు తీయాలని అనుకుంటున్నాం."* అని నచ్చజెప్పాము. ఆ తరువాత "ఇస్లాం" సందేశాన్ని వివరిస్తూ, "ఈ రోజు మేము "అఖబా"లో దైవప్రవక్త (సల్లం)ను కలవడానికి నిర్ణయించుకున్నాము." అని చెప్పగా ఆయన "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించి ముస్లిముగా మారిపోయారు. మా వెంట "అఖబా"కు వచ్చి మాకు సహాయకులుగా నిలబడ్డారు.

(రాత్రి చాలా పొద్దు పోయింది. మక్కా పట్టణమంతా చీకటి అలుముకున్నది. యాత్రికుల కోలాహాలం సద్దుమణిగింది. ఖురైషీయులు అదమరచి గాఢ నిద్రలో ఒరిగిపోయారు. బయటనుంచి వచ్చిన యాత్రికులు కూడా నిద్రపోయారు.) మేము అనుకున్న విధంగా ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా మా గుడారాల్లో అందరితోపాటు నిద్రించాము. మూడు ఝాముల్లో ఒక ఝాము రాత్రి గడచిపోగానే మా గుడారాల నుండి (ఎవరి కంటాపడకుండా) రహస్యంగా బయలుదేరి దైవప్రవక్త (సల్లం)ను కలువవలసిన చోటికి నక్కుతూ చేరుకోగలిగాము. మేమందరం అప్పుడు డెబ్భై అయిదుగురం. డెబ్భై ముగ్గురు పురుషులు, ఇద్దరు స్త్రీలు. వారి పేర్లు "ఉమ్మె అమ్మారా నసీబా బిన్తె కఅబ్". ఆమె "బనూ మాజిన్ బిన్ నజ్జార్" తెగకు చెందిన వారు. మరొక మహిళ "ఉమ్మె మనీఆ అస్మా బిన్తె అమ్రూ." ఈమె "బనూ సలీం"కు చెందిన మహిళ.

మేమంతా కొండలోయలో కలసి దైవప్రవక్త (సల్లం) కోసం ఎదురుచూడనారంభించాము. ఆయన (సల్లం) అక్కడికి చేరారు. ఆయన (సల్లం) వెంట ఆయన గారి పినతండ్రి "హజ్రత్ అబ్బాస్ (రజి) బిన్ అబ్దుల్ ముత్తలిబ్" కూడా ఉన్నారు. అప్పటి వరకు "హజ్రత్ అబ్బాస్ (రజి)" ఇస్లాం ధర్మాన్ని స్వీకరించక, తన తాతముత్తాతల ధర్మంపైన్నే నిలకడగా ఉన్నారు. కాని, తన సోదర కుమారుని వెంట రక్షణగా వచ్చినవారు. "హజ్రత్ అబ్బాస్ (రజి)"కు, దైవప్రవక్త (సల్లం) పట్ల అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆయన (సల్లం)ని అనుక్షణం కంటికిరెప్పలా కాపాడుతూ వస్తున్నారు. అంచేత అత్యవసర సమయంలో దైవప్రవక్త (సల్లం) వెంట ఉండి, మదీనా ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ఎందుకైనా మంచిదని భావించారు. అందరికంటే ఆయనే (హజ్రత్ అబ్బాస్ - రజి) ముందు చర్చను ప్రారంభించారు.

 *వ్యవహార సౌక్షమమాన్ని వివరించి చెప్పిన హజ్రత్ అబ్బాస్ (రజి) : -* 

సమావేశం పూర్తి అయింది. ధార్మిక, సైనిక ప్రమాణాల విషయంలో చర్చ ఆరంభం అయింది. ఆ విషయంలో మొట్టమొదట నోరు విప్పిన వారు దైవప్రవక్త (సల్లం) గారికి పినతండ్రి అయిన "హజ్రత్ అబ్బాస్ (రజి)"గారే. ఈ ప్రమాణం వలన వారు నెత్తిన పడబోతున్న బాధ్యత మార్ధవం, సున్నితత్వం ఎలాంటిదో వారికి తెలియజేయాలన్నదే ఆయన ఉద్దేశ్యం. "హజ్రత్ అబ్బాస్ (రజి)" వారిని సంబోధిస్తూ....; ↓

*అబ్బాస్ (రజి) : -* ఓ ఖజ్రజ్ ప్రజలారా! - అన్సార్ కు చెందిన రెండు తెగలు అవస్, ఖజ్రజ్ లను అరబ్బులు ఖజ్రజ్ గానే పిలుస్తారు - మా నడుమ ముహమ్మద్ (సల్లం) హోదా ఎలాంటిదో మీరందరికి తెలిసినదే. ధార్మిక విషయంలో మా అభిప్రాయాన్ని బలపరిచే వారంతా ఆయన (సల్లం)ను రక్షిస్తూ వస్తున్నాం. మేము ఎల్లప్పుడూ శత్రువుల్ని ఎదిరించి పోరాడుతూ వారి బారి నుండి ఈయన (సల్లం)ని కాపాడుతున్నాము . ఆయన (సల్లం) తన జాతిలో, తన నగరంలో మా శక్తి, మా గౌరవం మరియు మా బలం అండలో సురక్షితంగా ఉన్నవారు. కాని, ఇప్పుడు ఆయన (సల్లం) మీ దగ్గరకు రావాలని, మీతో కలసిపోవాలని కోరుకుంటున్నారు. మీరు ఆయన (సల్లం)ను ఎటు వైపునకు అయితే పిలుస్తున్నారో ఆ మాటను నిలబెట్టుకోగాలరా? ఆయన (సల్లం)ను ఆయన శత్రువుల నుండి కాపాడగలరా? అలాగయితే మంచిదే. మీరు తీసుకోబోయే బాధ్యత ఏమిటో బాగా గుర్తుంచుకోండి. కాని, మీరు ఆయన (సల్లం)ను మీ వెంట తీసుకువెళ్ళిన తరువాత, ఆయన (సల్లం)ను ఏకాకిగా చేసి వదలివేయదలచుకుంటే మాత్రం ఇప్పుడే ఆయన (సల్లం)ని వదలిపెట్టండి. ఎందుకంటే మా జాతి, మా నగరంలో ఆయన (సల్లం)కు గౌరవం, రక్షణ లభించే ఉన్నాయి సుమా!

 *హజ్రత్ కఅబ్ (రజి) : -* మేము మీ మాటను ఆలకించాము. ఓ మహాప్రవక్తా! ఇక తమరు ఏదైనా సెలవియ్యండి, మీ కోసం, మీ ప్రభువు కోసం, ఏ తీసుకుంటారో తీసుకోండి.

యస్రిబ్ (మదీనా)వారు ఇచ్చిన ఈ సమాధానం ద్వారా, ఈ బృహత్తరమైన బాధ్యతను నెత్తిన వేసుకోవడం, ప్రమాదాన్ని కొనితెచ్చుకునే విషయంలో వారి దృఢనిర్ణయం, శౌర్యం, విశ్వాసం, ఉత్సాహం మరియు చిత్తశుద్ధి ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) వారితో మాట్లాడుతూ మొదట "దివ్య ఖుర్ఆన్" పారాయణం చేశారు. దైవం వైపునకు వారిని ఆహ్వానిస్తూ, "ఇస్లాం" ధర్మం వైపునకు వారిని ప్రోత్సహించారు. ఆ తరువాత ప్రమాణ స్వీకారం జరిగిపోయింది.

 *ప్రమాణం (బైత్)లోని అంశాలు : -* 

బైత్ జరిగిన ఈ సంఘటనను "ఇమామె అహ్మద్", "జాబిర్ (రజి)" గారి ఉల్లేఖనం ప్రకారం వివరంగా పొందుపరిచారు.

 *"హజ్రత్ జాబిర్ (రజి)" గారి ఉల్లేఖనం: ↓* 

మేము, *"ఓ దైవప్రవక్తా! మేము ఏ అంశాలపై మీ చేతి మీద ప్రమాణం చేయాల్సి ఉంది?"* అని అడిగాము.

ఆయన (సల్లం) ఇలా సెలవిచ్చారు...., ↓

 *1. ఉత్సాహ, నిరుత్సాహ సందర్భాలన్నింటిలోను నా మాటను వింటారని, దాన్ని ఆచరిస్తారని.* 

 *2. కలిమి, లేమి రెండు పరిస్థితుల్లోనూ మీ ధనాన్ని వెచ్చించగలరని.* 

 *3. మంచిని భోదిస్తారని, చెడు నుండి వారిస్తారని.* 

 *4. "అల్లాహ్" మార్గంలో ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటారని. "అల్లాహ్" విషయంలో ఎవరైనా మిమ్మల్ని తూలనాడితే దాన్ని పట్టించుకోరని.* 

 *5. మీ దగ్గరకు నేను వచ్చినప్పుడు నాకు సహాయపడతారని, మీ ప్రాణాలను, మీ భార్యా పిల్లల ప్రాణాలను కాపాడినట్లే నన్ను కూడా రక్షిస్తారని, (ఇలా చేస్తే) మీ కోసం స్వర్గం ఉంది.* 

"ఇబ్నె ఇస్'హాక్" తెలిపిన "హజ్రత్ కఅబ్ (రజి)" గారి ఉల్లేఖనంలో కేవలం చిట్టచివరి అయిదవ (5) అంశం గురించే ఉంది. అందులో చెప్పబడిన వివరాల ప్రకారం....,

 *"దైవప్రవక్త (సల్లం) "ఖుర్ఆన్" పారాయణం చేసి "ఇస్లాం" వైపునకు ఆహ్వానించారు. "ఇస్లాం" ధర్మం వైపునకు ప్రోత్సహిస్తూ, "మీరు మీ భార్యాపిల్లల్ని దేన్నుండి రక్షిస్తారో, నన్ను కూడా రక్షించవలసి ఉంటుంది"* అన్నదే.

దానికి, "హజ్రత్ బరాఅ (రజి) బిన్ మారూర్", దైవప్రవక్త (సల్లం) చేయి పట్టుకొని, *"ఎవరైతే తమరిని సత్యప్రవక్తగా చేసి పంపాడో ఆ దైవం సాక్షి! మేము తప్పకుండా మా భార్యాపిల్లల్ని దేన్నుండైతే మేము కాపాడుతున్నామో దాన్నుండి మిమ్మల్ని కూడా కాపాడుతాం - కాబట్టి ఓ దైవప్రవక్తా! మీరు మాచే ప్రమాణం తీసుకుండి. దైవసాక్షి! మేము యుద్ధాల్లో పుట్టిపెరిగినవాళ్ళం. ఆయుధాలు మా ఆట వస్తువులు. మా తాత తండ్రులు నుండి వస్తున్న సంప్రదాయమే అది"* అన్నారు.

 *"హజ్రత్ కఅబ్ (రజి)" కథనం ప్రకారం...., ↓* 

"హజ్రత్ బరాఅ (రజి)" ఈ మాటలు అనగానే, "అబుల్ హైసమ్ బిన్ తైహాన్" ఆయన మాటలకు అడ్డుపడుతూ, *"ఓ అల్లాహ్ ప్రవక్తా! మాకూ, మాకు చెందిన కొందరి - అంటే యూదుల - నడుమ ఒప్పందాల పగ్గాలు కొన్ని ఉన్నాయి. మేము ఆ పగ్గాలను తెగవేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అల్లాహ్ మీకు విజయం చేకూరిస్తే మమ్మల్ని వదిలేసి మీ జాతి వైపునకు మరలిపోరుకదా?"* అని అడిగారు.

ఇది విన్న మహాప్రవక్త (సల్లం) చిరునవ్వు నవ్వుతూ, *"(లేదు) మీ రక్తం నా రక్తం. మీరు నాశనం అవడం నేను నాశనమైనట్లే. నేను మీలోవాణ్ణి. మీరు నా వారు. మీరు ఎవరితో యుద్ధం చేస్తే, నేనూ వారితో యుద్ధం చేస్తాను. మీరు ఎవరితో సంధి చేసుకుంటే, నేనూ వారితో సంధి కుదుర్చుకుంటాను."* అని సమాధానమిచ్చారు.

 *ప్రమాదాలతో కూడిన బైత్ ను తిరిగి మననం చేసుకోవడం : -*

బైత్ షరతుల గురించిన చర్చ పూర్తి అయింది. బైత్ కోసం సిద్ధం అవుతున్న తరుణంలో గత సంవత్సరం, ఆ క్రిందటి సంవత్సరం కూడా "హజ్" చేయడానికి వచ్చి ముస్లిములైన ఇద్దరు ప్రముఖులు, ఆ బైత్ వల్ల వారిపై పడబోయే బాధ్యతల్ని దాని సున్నితత్వాన్ని తెలుసుకునేందుకు, దాని వల్ల వచ్చే ప్రమాదాలను ఎదుర్కోవడానికి వారి జాతి త్యాగాలకు ఎంత వరకు సిద్ధంగా ఉన్నారో తెలుసుకునే ఉద్దేశ్యంతో లేచి నిలబడ్డారు. అంటే, "ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే బైత్ చేయండి" అని హెచ్చరించి వారి నిశ్చితాభిప్రాయాన్ని తెలుసుకునే ఉద్దేశ్యంతో అన్నమాట.

 *"ఇబ్నె ఇస్'హాక్" కథనం ఇలా ఉంది...., ↓* 

ప్రజలు బైత్ కోసం ఓ చోట చేరినప్పుడు "హజ్రత్ అబ్బాస్ (రజి) బిన్ ఉబాదా బిన్ నజ్లా" కల్పించుకుని ఇలా అడిగారు.

 *హజ్రత్ అబ్బాస్ (రజి) బిన్ ఉబాదా : -* మీకు తెలుసా! ఈయన (దైవప్రవక్త - సల్లం) మిమ్మల్ని ఏ మాటపై ప్రమాణం చేయిస్తున్నారో?

 *"ఔను, మాకు బాగా తెలుసు"* అన్నారు వారు.

 *హజ్రత్ అబ్బాస్ (రజి) బిన్ ఉబాదా : -* అయితే మీరు ఆయన (సల్లం) ఎదుట ప్రమాణం చేసేది, దుర్మార్గులతో యుద్ధం చేస్తామన్న విషయంపై. ఈ యుద్ధంలో మీ ఆస్తిపాస్తులు సర్వనాశనమయిపోతాయి, మీకు ప్రియమైన వారు మరణిస్తారు. ఇలా జరిగిన తర్వాత, మీరు ఆయన (సల్లం)ను వదిలేద్దామని అనుకుంటే మాత్రం ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ తర్వాత గనుక మీరు అలా ప్రవర్తించారో, ఇహపరలోకాలు రెంటిలోనూ చెడిపోగలరు జాగ్రత్త! దీనికి భిన్నంగా ఆ యుద్ధంలో మీ ఆస్తిపాస్తులు నాశనమైనా, మీ వారు హతులైన సరే ఈరోజు చేస్తున్న ప్రమాణాన్నే నిలబెట్టుకుంటాం అనే దృఢసంకల్పంతో ఉంటే మాత్రం ఆయన (సల్లం)ను మీ వెంట తీసుకొని వెళ్ళండి. దైవసాక్షి! ఇది ఇహపరలోకాల సాఫల్యమే అవుతుంది.

 *"మేము మా ఆస్తిపాస్తుల వినాశనాన్ని, మా గౌరవనీయుల మరణాన్ని సయితం లెక్కజేయం. ఓ ప్రవక్తా! మా ఈ ప్రమాణానికి మేము కట్టుబడి ఉంటే దానికి బదులుగా మాకు లభించేది ఏది?"* అని అడిగారు ఏకకంఠంతో.

 *"మీకు దీనికి ప్రతిగా స్వర్గం లభిస్తుంది."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

 *"అయితే చేయి చాచండి."* అనగా మహాప్రవక్త (సల్లం) తన చేతిని ముందుకు చాచారు. వారంతా ఆ చేతిపై చేయివేసి ప్రమాణం చేశారు.

ఒక్కక్కరే వచ్చి దైవప్రవక్త (సల్లం) చేతిలో చేయి వేసి ప్రమాణం చేశారు.

 *ఈ విధంగా మహోన్నత దైవకార్యానికి అంకురార్పణ జరిగింది. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) పరమానందభరితులై "అల్లాహ్" కి కృతజ్ఞతలు అర్పించారు.* 

 *ఆ తరువాత జరిగినది In Shaa Allah రేపటి భాగములో....;*

No comments:

Post a Comment