170

🌿             ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪             🌿

🍂   🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌  🍂
🍃   🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*    🕌 🍃

✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦

🌾🔅     🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 170* 🕋🛐      🔅🌾

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 85* 🇸🇦🇸🇦🇸🇦

───────────┄┅━═══✦═══━┅┄───────────

             *ఇస్రా మరియ మేరాజ్ : - 6* 

(మేరాజ్ యాత్రలో) దైవప్రవక్త (సల్లం) తన దైవాన్ని చూశారా లేదా? అనే విషయంలో "ఇబ్నెఖైమ్", భిన్నాభిప్రాయాలున్నట్లు రాశారు. "ఇమామె తైమియా" ఓ పరిశోధన గురించి రాశారు. ఇందు కళ్ళారా చూడడం గురించి ఎలాంటి ఆధారాలుగానీ, ఏ సహాబీ (అనుచరుడు) ఆ విషయాన్ని ధృవీకరించడంగానీ జరగలేదు అనేది దాని సారాంశం.

ఇక "ఇబ్నె అబ్బాస్ (రజి)" గారి ఉల్లేఖనంలో కంటితో చూడడం మరియు ఊహించడం గురించిన విషయాలు రెండూ ఉన్నాయి. వాటిలో మొదటిది రెండో దానికి విరుద్ధంగా లేదు కాబట్టి "ఇబ్నెఖైమ్" ఇలా రాస్తున్నారు. *"ఆయన అతని ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆ తరువాత మరింత దగ్గరకు వచ్చి పైన ఆగిపోయాడు. (ఖుర్ఆన్ 53:8).* ఇది "నజ్మ్" సూరాలోని ఓ ఆయత్.

ఇది మేరాజ్ సంఘటన జరిగినప్పుడు లభించిన సామీప్యం గురించినది కాదు. ఆ సామీప్యత వేరు. "నజ్మ్" సూరాలో చెప్పబడిన ఈ సామీప్యత "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)"కు సంబంధించిన సామీప్యత. "హజ్రత్ ఆయిషా (రజి)" మరియు "హజ్రత్ మస్ఊద్ (రజి)"లు సెలవిచ్చినట్లు, దీని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇదే సరైనది.

దీనికి భిన్నంగా మేరాజ్ సంఘటనకు సంబంధించిన హదీసులో ఏ సామీప్యత గురించి అయితే చెప్పడం జరిగిందో, అది అల్లాహుతఆలా సామీప్యం గురించి చెప్పిన విషయం. "నజ్మ్" సూరాలో ఈ విషయాన్ని అసలే లేవనెత్తడం జరగలేదు. కాగా, "నజ్మ్" సూరాలో దైవప్రవక్త (సల్లం), ఆయన్ను "సిద్రతుల్ మున్తహా" వద్ద రెండు మార్లు చూడడం జరిగింది అని ఉంది. ఆయన "జిబ్రీల్ (అలైహి)" మాత్రమే.  "హజ్రత్ ముహమ్మద్ (సల్లం)", "జిబ్రీల్ (అలైహి)"ను అసలు రూపంలో రెండు మార్లు చూశారు అని. ఒకటి భూమిపై, మరొకటి "సిద్రతుల్ మున్తహా" వద్ద.

దైవప్రవక్త (సల్లం) స్వర్గంలో నాలుగు సెలయేళ్ళను చూశారు. రెండు అగుపడేవి, మరి రెండు అగుపడనివి. కనబడే సెలయేళ్ళు నైలు, ఫరాత్ నదులు. (బహుశా దీని అర్థం, మీ దైవదౌత్యం నైలు, ఫరాత్ లోని సస్యశ్యామల మైదానాల వరకు వ్యాపిస్తుంది. అంటే అక్కడి ప్రజలు వంశానుక్రమణంగా ముస్లిములైపోతారని, ఈ రెండు నదుల జన్మస్థలం స్వర్గం అని చెప్పడమేమో! వల్లాహు ఆలమ్).

మహాప్రవక్త (సల్లం), నరకం "దారూగా" (కాపలాదారు) అయినటువంటి "మాలిక్"ను సయితం చూశారు. అతను నవ్వడంగాని, నవ్వినప్పుడు ఆయన ముఖం వికసించడంగాని చూడలేదాయన. ఆయన (సల్లం) నరకాన్నీ, స్వర్గాన్నీ రెండిటిని కూడా వీక్షించారు.

అక్కడ దైవప్రవక్త (సల్లం), అనాధల సొమ్మును బలవంతంగా కాజేసే వారిని సయితం చూశారు. వారి పెదాలు ఒంటె పెదాల్లా ఉన్నాయి. నోట్లో నిప్పు కణికలు పెట్టి కుక్కుకుంటున్నారు. ఆ నిప్పు కణికలు రెండో వైపు నుండి మలద్వారం ద్వారా బయటకు వస్తున్నాయి.

మహాప్రవక్త (సల్లం) వడ్డీ వ్యాపారుల్ని కూడా చూడడం జరిగింది. వారి పరిస్థితి ఎలాగుందంటే పెద్ద పెద్ద పొట్టలు కలిగి, వారు కదలలేని స్థితిలో ఉన్నారు. "ఫిర్ఔన్" జాతివారిని అగ్ని చూయించడానికి తీసుకుని వెడుతూ ఈ వడ్డీ వ్యాపారుల్ని త్రొక్కుకుంటూ వెళ్ళడం చూశారు. 

వ్యభిచారుల్నీ చూశారక్కడ ఆయన (సల్లం). వారి ముందు శుభ్రమైన తాజా బలసిన మాంసాన్ని, దానికి తోడు బాగా చీకిపోయి కంపుకొడుతున్న మాంసాన్ని కూడా ఉంచడం జరిగింది. వారు ఆ తాజా మాంసాన్ని వదలి కంపుకొడుతున్న మాంసాన్నే భుజిస్తున్నారు.

భర్తలకు ఇతరుల సంతానాన్ని అంటగట్టే స్త్రీలను కూడా చూశారాయన (అంటే వ్యభిచారం చేసి గర్భవతులై పిల్లలుగన్న స్త్రీలు. తెలియని వారికి ఆ పిల్లవాడు ఆమె భర్తకే పుట్టాడని అనుకుంటారు). వారి స్తనాలలో పెద్ద పెద్ద వంకర తిరిగిన గాలాలు గ్రుచ్చి వారిని భూమ్యాకాశాలకు నడుమ వ్రేలాడదీయడం చూశారు.

మేరాజ్ ప్రయోజనాన్ని గూర్చి తెలుపుతూ టూకీగానే అయినా మహోన్నతమైన పదాలు అవతరింపజేయబడ్డాయి.

 *"మేము ఆయన (సల్లం)కు కొన్ని నిదర్శనాలను చూపడానికే" అన్నవే ఆ పదాలు. (ఖుర్ఆన్ 17:1).* 

దైవప్రవక్తల విషయంలోనూ ఇలాగే అల్లాహ్ సూచనలు చూపడం జరిగింది. "ఖుర్ఆన్" వాక్యాలు ఇలా ఉన్నాయి.

 *"ఇదే విధంగా మేము ఇబ్రాహీముకు భూమ్యాకాశాల పాలనా వ్యవస్థను చూపించేవారము. ఎందుకు చూపేవారమంటే, అతను దృఢంగా విశ్వసించే వారిలో ఒకడు కావాలనే." (ఖుర్ఆన్ 6:75).* 

 *మూసా (అలైహి)తో, "మేము నీకు మా పెద్ద సూచనలను చూపబోతున్నాం" అని సెలవిచ్చాడు. (ఖుర్ఆన్ 20:23).* 

ఈ సూచనలను ప్రవక్తలకు చూపడానికి గల కారణాలను వివరిస్తూ అల్లాహ్, *"వారు విశ్వసించే వారిలో చేరిపోవాలనే"* అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు.

కాబట్టి దైవప్రవక్తల జ్ఞానానికి ఇలాంటి సూచనలు కనబడితే ఆ జ్ఞానం మరింత బలపడి, పదాల్లో వ్యక్తపరచడం అలవికానటువంటి దృశ్యజ్ఞానం వారికి లభిస్తుంది. ఈ కారణంగానే దైవప్రవక్తలు (అలైహి) అల్లాహ్ మార్గంలో మరెవ్వరూ భరింపజాలని కష్టాలను సయితం భరించగలిగారు. యదార్థానికి ఈ ఇహలోకం వారి దృష్టిలో దోమ రెక్కంత కూడా విలువ చేసేది కాదు. అందుకనే వారు తమపై విరుచుకుపడే దుష్టశక్తులను, వారు పెట్టే హింసలను లెక్కచేయకుండా "అల్లాహ్" మార్గంపై నడువగలిగారు.

ఈ మేరాజ్ సంఘటన వెనుక దాగి ఉన్న రహస్యాలను గురించి "షరీఅత్" గ్రంథాలే విపులంగా చర్చించగలవు. కాని ఈ ప్రయాణం ద్వారా ఒసగూడిన ప్రయోజనాలను ఇక్కడ కొన్నింటిని తెలియజేయడం జరుగుతుంది. 

"సూరయె ఇస్రా" లేదా "బనీ ఇస్రాయీల్"లో "అల్లాహ్" ఈ సంఘటన కేవలం ఒక్క ఆయత్ లోనే ఉటంకించినప్పటికీ, అందులో యూదుల దురాగతాలను, నేరాలను ఒక్కొక్కటిగా లెక్కించడం జరిగింది. ఆ తరువాత, ఈ "ఖుర్ఆన్" అన్నిటికంటే రుజమార్గం వైపునకు వారిని ఆహ్వానిస్తుందని హెచ్చరించాడు. "దివ్యఖుర్ఆన్"కు చెందిన ఈ అధ్యాయాన్ని (సూరాను) పఠించే వారికి ఈ విషయం పొంతన లేనట్లుగా కనిపిస్తుంది. కాని నిజం మాత్రం అది కాదు. "అల్లాహ్" ఈ శైలి ద్వారా, ఇక యూదులు మానవాళి నాయకత్వానికి అర్హులు కారని, వారు ఆ హోదాకు తగినట్లుగా ప్రవర్తించడం లేదని, ఆ నాయకత్వం వారి వద్ద ఇక ఏ మాత్రం ఉండడానికి వీల్లేదని తెలియజేయడం జరిగింది.

కాబట్టి ఈ అమానతును, ఈ బాధ్యతను "అల్లాహ్" తన ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లం)కే అప్పగిస్తాడనే సూచన ఉంది. "ఇబ్రాహీమ్ (అలైహి)" ధర్మ ప్రచారానికి కేంద్రాలుగా ఉన్న రెండు ప్రదేశాలు ఇక ఆయన (సల్లం)కే అప్పజెప్పడం జరుగుతుందని చెప్పడం జరిగింది.

మరో విధంగా చెప్పాలంటే, సమాజ అధ్యాత్మిక నాయకత్వ బాధ్యతను ఒక ఉమ్మత్ (సమాజం) నుండి లాగి మరో ఉమ్మత్ కు అప్పగించే తరుణం ఆసన్నమైంది అన్నదే. అంటే, జులుము, అత్యాచారాలు, వ్యభిచారం, మార్పులు చేర్పుల చరిత్రగల ఓ చెడ్డ సమాజం నుండి ఆ బాధ్యతను లాగి, "ఖుర్ఆన్" అనే దైవవాణితో అలరారే, సరైన మార్గం చూపే ఓ ప్రవక్తను అనుసరిస్తూ, సత్కార్యాలు సదాచారాలు ఆచరించే మరో సమాజానికి అది అప్పజెప్పడం జరుగుతుందన్నమాట.

అయితే ఈ నాయకత్వం ఎలా మార్చడం జరుగుతుంది? మరి ఈ ఉమ్మత్ కు చెందిన ప్రవక్త నిస్సహాయస్థితిలో మక్కా కొండల్లో ప్రజల నడుమ హింసా దౌర్జన్యాలను భరిస్తూ తిరుగుతున్నాడాయే! అప్పుడు అవతరించిన ఈ "బనీ ఇస్రాయీల్" సూరా వాక్యాలు ఈ ప్రశ్నకే జవాబు ఇస్తున్నాయి. ఇవి మరో యదార్థాన్ని కూడా తేటతెల్లం చేస్తూ, ఇస్లామీయ సందేశ ప్రచారం తన చివరి ఘట్టంలో, సంపూర్ణతను పొందే స్థితికి చేరిందని, ఇక మరో శకం ఆరంభం కాబోతోందని దాని చరిత్ర మరో లాగుంటుందనీ విడమర్చి చెబుతున్నాయి. ఆ ఆయత్ లలో బహుదైవారాధకులకు గట్టి హెచ్చరిక కూడా చేయడం జరిగింది.

 *"మేము ఒక పట్టణాన్ని నాశనం చెయ్యదలచుకున్నప్పుడు, అందలి స్థితిమంతులకు మొదట ఓ ఆజ్ఞను పంపుతాము. వారు ఆ ఆజ్ఞ విషయంలో అవిధేయతకు పాల్పడతారు. అప్పుడు శిక్షా నిర్ణయానికి ఆ పట్టణం అర్హమవుతుంది. మేము దాన్ని సర్వనాశనం చేస్తాము." (ఖుర్ఆన్ 17:16).* 

 *"చూడూ! నూహ్ తరువాత మా ఆజ్ఞ ప్రకారం నాశనమైన జాతులు ఎన్ని ఉన్నాయో. నీ ప్రభువుకు తన దాసుల పాపాలను గురించి పూర్తిగా తెలుసు. ఆయన సర్వాన్నీ చూస్తూ ఉన్నాడు." (ఖుర్ఆన్ 17:17).* 

అదే కాదు, ఈ ఆయత్ లకు తోడు వేరే ఆయత్ లలో, ముస్లిములు భవిష్యత్తులో ఇస్లామీయ సమాజ స్థాపన ఎలా చేయాలో చెబుతూ, దానికి సంబంధించిన సామాజిక చట్రాల్ని, సూత్రాలను కూడా తెలుపడం జరిగింది. అంటే, వీరు, అన్ని కోణాల నుంచి వ్యవహారమంతా తమ చేతిలోనే ఉంచుకొని పకడ్బందీగా దాన్ని నడపడానికి ఓ ప్రదేశాన్ని కూడా పొందారని చెప్పడం అన్నమాట. కాబట్టి ఈ ఆదేశాల్లో, దైవప్రవక్త (సల్లం) త్వరలోనే ఒక శాంతి నిలయాన్ని రక్షణ పొందే స్థలాన్ని తన ధర్మ రక్షణకు ఓ దుర్గాన్ని పొందగలరని అర్థమవుతోంది.

ఈ "ఇస్రా మరియు మేరాజ్" శుభ సంఘటన అడుగుల్లో దాగి వున్న ఔచిత్యాలు మరియు రహస్యాలల్లో ఓ రహస్యం, ఓ వివేచన కూడా ఉంది. అది మన ఈ చర్చకు ఎంతో అవసరమైనది గనుక దాన్ని విడమర్చి చెప్పడం కూడా అవసరమనిపిస్తోంది. "ప్రథమ బైతె అఖబా (అఖబా ప్రమాణం)" మరియు "ద్వితీయ బైతె అఖబా"లను దృష్టిలో ఉంచుకుని చూస్తే, ఈ సంఘటన జరగడానికి గల ఔచిత్యాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. "ఇస్రా మరియు మేరాజ్" సంఘటన "ప్రథమ బైతె అఖబా" జరగడానికి కొంత ముందు కాలానికో లేదా "ప్రథమ బైతె అఖబా" మరియు "ద్వితీయ బైతె అఖబా"ల మధ్యకాలనికో సంబంధించినదై ఉండవచ్చు. (వల్లాహు ఆలమ్).

 *In Shaa Allah రేపటి భాగములో "ప్రథమ బైతె అఖబా" గురించి....;* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment