169

🌿             ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪             🌿

🍂   🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌  🍂
🍃   🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*    🕌 🍃

✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦

🌾🔅     🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 169* 🕋🛐      🔅🌾

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 84* 🇸🇦🇸🇦🇸🇦

───────────┄┅━═══✦═══━┅┄───────────

               *ఇస్రా మరియు మేరాజ్ : - 5* 

 *"ఇస్రా" ప్రయాణం అసత్యమని కొట్టిపారేసిన ఖురైషీయులు : -* 

 *"ప్రవక్తా! మీరు చెప్పేది నిజమే అయితే మాకు ఋజువులు చూపించండి."* అన్నాడు ఒకతను.

ప్రవక్త (సల్లం) జవాబిస్తూ...., *"నేను చెప్పిన దానికి ఋజువు లేమంటే, నేను వెళుతున్నప్పుడు దారిలో ఒక తెగవారి ఒంటెల బిడారును చూశాను. నేను స్వారీ చేస్తున్న వాహనం వారిని దాటినప్పుడు ఆ ఒంటెలు బెదిరి పారిపోయాయి. నేను ఆ తెగవారికి ఆ ఒంటెలు ఎక్కడ దొరుకుతాయో చెప్పాను.* 
       *ఆ తరువాత సిరియా నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు మక్కా కొండల దగ్గర నేను మరో బిడారును దాటాను. ఆ బిడారులోని వాళ్ళందరూ గాఢనిద్రలో ఉన్నారు. వారి వద్ద నీళ్ళ కుండ ఒకటి కనబడింది. దానిపై మూత వేసి ఉంది. నేను మూత తీసి నీళ్ళు తాగి, తర్వాత మూత మళ్ళీ యథాతథంగా పెట్టేసాను. ఆ బిడారు ఇప్పుడు "తన్'యీమ్" ప్రదేశానికి చేరుకుని ఉంటుంది. ఆ బిడారుకు అగ్రభాగాన ఒక మచ్చల ఒంటె ఉంది. దానిపై రెండు పెద్ద పెద్ద కూజాలు ఉన్నాయి. ఒకటి నల్లనిది, రెండవది తెల్లనిది."* అన్నారు.

కాని, అప్పటికి అవిశ్వాసులు నమ్మలేదు. ఎలా నమ్ముతారు? వారి ఆత్మాభిమానం దెబ్బతినదూ! దైవప్రవక్త (సల్లం) ఔన్నత్యం ముందు వారి పెద్దరికం అడుగంటిపోదూ!! అందువల్ల ఈ సారి వారు మరో సాకు చెప్పారు. 

 *ఖురైషీయులు : -* ఈ వివరాలు చెప్పినంత మాత్రాన నిన్ను అప్పుడే ఎలా నమ్మాలి? నువ్వు చెప్పే ఆ వర్తకుల్ని రానివ్వు రాత్రి వారెక్కడున్నారో, వారు నిన్ను కళ్ళారా చూశారో లేదో వారినే అడిగి తెలుసుకుంటాం. నీవు వర్ణించిన వర్తక సామాగ్రిని, ఒంటెల్ని కూడా మా కంటితో చూసుకుంటేగాని మేము తృప్తిచెందము.

అప్పటిదాకా దైవప్రవక్త (సల్లం) మాటలు అత్యంతాసక్తితో విన్న "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" ఆనందం పట్టలేక, *"ప్రవక్తా మీరు చెప్పినదంతా నిజం. మీరు నిస్సందేహంగా సత్యసంథులు."* అని అన్నారు.

అప్పుడు దైవప్రవక్త (సల్లం) తలవంచుకొని కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారు. తరువాత తల పైకెత్తి, *"అబూ బక్ర్ (రజి)"! అల్లాహ్ నీకు "సిద్ధీఖ్ (సత్యసంథుడు)" అనే బిరుదు ప్రదానం చేశాడు."* అని చెప్పారు.

నిత్యశంకితులు ఏది చెప్పినా, ఎలా చెప్పినా ఓ పట్టాన నమ్మరు. వాళ్ళను ఎల్లప్పుడూ అనుమాన భూతం పట్టి పీడిస్తుంది. ఈ అనుమాన భూతానికి అహంకారం కూడా తోడయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. తమకు చిన్నప్పటి నుంచి సత్యసంథుడని, నిజాయితీపరుడని తెలిసిన మనిషి కళ్ళారా చూసివచ్చిన విషయాల్నే వీరు నమ్మకపోతే, ఇక వాణిజ్య బృందాలు చెప్పే సాక్ష్యాన్ని ఒప్పుకుంటారని ఎలా చెప్పగలం?

 *దైవప్రవక్త (సల్లం) గారు చెప్పిన వర్తక బిడరాల రాక : -* 

కొన్నాళ్ళ తరువాత దైవప్రవక్త (సల్లం) చెప్పిన వర్తక బిడారాలు వచ్చాయి. పట్నంలో అందరికీ తెలిసిపోయింది. అవిశ్వాసులు వర్తక బిడారాల దగ్గరికి పరుగు పరుగున వచ్చారు. చూస్తే, దైవప్రవక్త (సల్లం) చెప్పిన సామగ్రే ఉంది. ఒంటెల రూపు రేఖలు కూడా ఆయన (సల్లం) వర్ణించినట్లే ఉన్నాయి. వర్తకులు కూడా ఆయన (సల్లం) చెప్పినవారే. అవిశ్వాసులు నిశ్చేష్టులయి కొన్ని క్షణాలు తికమకపడ్డారు.

పట్నం తిరిగొచ్చిన ఆ వర్తకులు కూడా, ప్రవక్త అనుచరుల నోట మేరాజ్ సంఘటన గురించి విన్నారు. వారిలో కొందరు తాము ఫలానా రోజు అర్థరాత్రి ప్రయాణం చేస్తుంటే, తమ మీదుగా ఆకాశంలో బర్ బర్ అని శబ్దం చేస్తూ ఓ వింతవాహనం మెరుపులా దూసుకుపోయిందని, దాని తాము కళ్ళారా చూశామని చెప్పారు. కానీ ఈ అనుమాన రోగిష్టులు, తోటి అవిశ్వాసులు చెప్పిన ఈ సాక్ష్యాన్ని కూడా నమ్మడానికి సిద్ధపడలేదు.

 *"అంతా మాయ. ముహమ్మద్ (సల్లం) పెద్ద మాంత్రికుడు. అతను తన మంత్రబలంతో జనాన్ని పెడదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు, పదండి."* అంటూ విసవిసలాడుతూ వెళ్ళిపోయారు వారు.

దైవప్రవక్త (సల్లం) అవిశ్వాసుల మొండితనానికి చింతిస్తూ గృహోన్ముఖులయ్యారు.

"మేరాజ్" వార మక్కా పట్టణంలో కార్చిచ్చులా ప్రాకిపోయింది. ప్రజలు దాన్ని ఎంతో చోద్యంగా చెప్పుకోసాగారు. వారిలో చాలా మంది విచక్షణా జ్ఞానం కూడా కోల్పోయారు. వారి హృదయాలపై చీకటితెరలు పడిపోయాయి. అందువల్ల, సత్యసంథుడయిన మనిషి చెప్పిన మాటల్ని అసత్య విషయాలుగా పరిగణించి త్రోసిపుచ్చారు. అంతేకాకుండా సత్యధర్మానికి వ్యతిరేకంగా వారు మరింత పెచ్చరిల్లి పోయారు. "మేరాజ్" ఉదంతాన్ని అసాధ్య విషయంగా, పరమ వ్యంగ్యంగా చిత్రించి జనసామాన్యంలో అపార్థాలు, అనుమానాలు రేకెత్తించడం మొదలెట్టారు. ఈ విషయాన్ని వాడుకుంటూ దైవప్రవక్త (సల్లం)పై, ఆయన అనుచరులపై మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టారు.

అప్పుడు సత్యధర్మ వైతాళికుడు నిర్వహించవలసిన పాత్రను గురించి దైవసందేశం అవతరించింది. దైవాదేశం ప్రకారం దైవప్రవక్త (సల్లం), తనపై వస్తున్న కష్టాలను సహిస్తూ, విమర్శలను భరిస్తూ "ఇస్లాం" ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

 *మిగిలినది In Shaa Allah రేపటి భాగములో....;* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment