🌿 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🌿
🍂 🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌 🍂
🍃 🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌 🍃
✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦
🌾🔅 🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 168* 🕋🛐 🔅🌾
🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 83* 🇸🇦🇸🇦🇸🇦
───────────┄┅━═══✦═══━┅┄───────────
*ఇస్రా మరియు మేరాజ్ : - 4*
*"ఇస్రా" యాత్ర గురించి, ఖురైషీయులకు చెప్పవలసిన అవసరం ఉందని "కాబా" గృహం వద్దకు వెళ్ళిన దైవప్రవక్త (సల్లం) : -*
తెల్లవారింది, పురజనులు తమ దైనందిన కార్యకలాపాల్లో లీనమైపోయారు. దైవప్రవక్త (సల్లం) సరాసరి కాబాలయానికి వెళ్ళి అక్కడ ఓ చోట కూర్చున్నారు. ఆయన (సల్లం)కు కొంచెం దూరంలో కొందరు ఖురైషీయులు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు.
మహాప్రవక్త (సల్లం) హృదయం పరిపరి విధాల పోతుంది. ఆలోచనా కెరటాలు ఎగసిపడుతున్నాయి. రాత్రి తాను చూసిన సంఘటన ఖురైషీయులకు చెబుతాను అనుకున్నారు. కాని అంతలోనే ఎదో సందేహం. *"ఈ సంఘటన గురించి చెబుతాను. అయితే దీని పర్యవసానం ఏమిటి? ప్రజలు నా మాటలు నమ్ముతారా లేక తిరస్కరిస్తారా? రాత్రి "బైతుల్ మఖ్దిస్"కు పోయానని, అక్కడనుంచి దివ్యలోకాలన్నీ పర్యటించి వచ్చానని జరిగిన వృత్తాంతమంతా చెప్పనా లేక "ఉమ్మెహాని"కి తెలియజేసినంత వరకే చెప్పనా?"* ఏమయినాసరే జరిగింది జరిగినట్లు అంతా చెప్పడానికే నిశ్చయించుకున్నారు దైవప్రవక్త (సల్లం).
దూరంగా కూర్చున్న ఖురైషీయులు ఆయన (సల్లం)ని ఓ కంట గమనిస్తున్నారు. వాళ్ళలో "అబూ జహల్" కూడా ఉన్నాడు. ఇది వరకెన్నడూలేనిది ఈ రోజు మౌనంగా కూర్చున్న దైవప్రవక్త (సల్లం)ను చూసి అతను ఆశ్చర్యపోయాడు. (అపుడు "అబూ జహల్", దైవప్రవక్త (సల్లం) వద్దకు వచ్చి....; ↓)
*అబూ జహల్ : -* ముహమ్మద్ (సల్లం)! ఏమిటీ ఇలా మౌనంగా కూర్చున్నావు? ఈ రోజు ఏమైనా కొత్త విషయం ఉందా?
*ముహమ్మద్ (సల్లం) : -* ఆ.... కొత్త విశేషమే. రాత్రి నేను "బైతుల్ మఖ్దిస్"కు వెళ్ళొచ్చాను.
*అబూ జహల్ : -* ఏమిటీ, ఒక్క రాత్రిలోనే నీవు "బైతుల్ మఖ్దిస్"కు పోయ్యోచ్చావా! కొంపతీసి ఈ సంగతి ఇంకెవరి ముందయినా చెప్పేవు. (అన్నాడు పగలబడి నవ్వుతూ)
*ముహమ్మద్ (సల్లం) : -* చెబుతాను, అందరికీ చెబుతాను.
*అబూ జహల్ : -* ఖురైషీయులారా! రండి, రండి. ఈ వింత వినండి. (అంటూ కేక వేసి అందరినీ పిలిచాడు)
మరుక్షణమే ఖురైషీయులంతా వచ్చి దైవప్రవక్త (సల్లం) చుట్టూ మూగారు.
*అబూ జహల్ : -* ఇదిగో ఈయన చెప్పేది కాస్త వినండి. ముహమ్మద్ (సల్లం)! ఇప్పుడు నాకు వినిపించిన సంగతి వీళ్ళక్కూడా వినిపించు.
*ముహమ్మద్ (సల్లం) : -* రాత్రి నేను ఓ విచిత్ర జంతువు ఎక్కి రెప్పపాటులో "బైతుల్ మఖ్దిస్"కు వెళ్ళాను. అక్కడ ఆదం (అలైహి) నుండి ఈసా (అలైహి) వరకు ప్రభవించిన ప్రవక్తలంతా బారులు తీరి నిల్చున్నారు. నేను వారికి నాయకత్వం వహించి నమాజు చేయించాను.
ఖురైషీయులు ఈ మాటలు విని పెద్ద పెట్టున విరగబడి నవ్వారు.
*అబూ జహల్ : -* ఆగండి, ఆగండి. కొంచెం మీ నవ్వులు ఆపండి.... ముహమ్మద్ (సల్లం)! ఇంతకూ, దైవప్రవక్తలంతా మళ్ళీ బ్రతికించబడి నీ దగ్గరకు వచ్చారంటావు, అంతేగా! అయితే వాళ్ళ వివరాలేమిటో చెప్పు?
*ముహమ్మద్ (సల్లం) : -* ప్రవక్త ఈసా (అలైహి) మరీ అంత పొట్టి కాదు, మరీ అంత పొడుగరి కాదు. మధ్య రకంగా ఉన్నారు. విశాలమైన వక్షస్థలం, అందమైన ఎర్రటి శిరోజాలతో గంభీరంగా ఉన్నారు. ప్రవక్త మూసా (అలైహి) చామన ఛాయగా, ధృఢమైన దేహంతో నిండుగా ఉన్నారు. అందరికంటే "ప్రవక్త ఇబ్రాహీం (అలైహి)" అన్ని విధాల నన్ను పోలి ఉన్నారు. (అని వివరించారు)
ఈ విషయాలు విని చాలామంది హృదయాలలో దైవప్రవక్త (సల్లం) పట్ల ఒకింత గౌరవభావం చోటు చేసుకుంది. కొందరు సంభ్రమాశ్చర్యాలతో మ్రాన్పడిపోయారు. మరికొందరు అనుమాన రోగానికి గురయ్యారు. మిగిలినవారంతా ఆయన (సల్లం) మాటల్ని తిరస్కరించి హేళన చేశారు.
*"అబూ బక్ర్ (రజి)! విన్నావా నీ ప్రియమిత్రుడు ఏమంటున్నాడో? రాత్రి ఆయన (సల్లం) "బైతుల్ మఖ్దిస్"కు పోయి ఆ రాత్రికే అంతదూరం నుంచి తిరిగి వచ్చాడట!"* అన్నారు కొందరు కాబా మందిరం వెలుపల మేరాజ్ వార్తను గురించి వింతగా చెబుతూ.
*అబూ బక్ర్ (రజి) : -* ఏమిటీ! ఆయన (సల్లం) అలా అన్నారా? నిజంగానా??
*ఖురైషీయులు : -* ఔనయ్యా బాబు! సాక్షాత్తు నీ ప్రాణ స్నేహితుడు ముహమ్మద్ (సల్లం) ఈ సంగతి మా అందరి ముందు బహిరంగంగా ప్రకటించాడు.
*అబూ బక్ర్ (రజి) : -* అయితే ఆయన (సల్లం) చెప్పింది ముమ్మాటికి నిజమే. అందులో నాకెలాంటి అనుమానం లేదు.
*ఖురైషీయులు : -* నీకేమయిన మతిపోయిందా ఏమిటి? ఒకే ఒక రాత్రి వేలమైళ్ళ దూరంలో ఉన్న "బైతుల్ మఖ్దిస్"కు పోవడం, అదే రాత్రి తెల్లారక ముందే తిరిగిరావడమా! ఇది నమ్మదగిన విషయమేనా?
*అబూ బక్ర్ (రజి) : -* నిస్సందేహంగా నమ్మదగినదే. ఇదే కాదు, ఆయన (సల్లం) ఇంతకంటే అద్భుత విషయాలు చెప్పినా నేను నమ్ముతాను. ఎలాంటి సమయంలోనయినా ఆకాశం నుంచి తన దగ్గరకు తృటిలో వార్తలు వస్తుంటాయని ఆయన (సల్లం) తరచుగా అంటుంటారు. నాకు మాత్రం అందులో ఎలాంటి వింతా, విడ్డూరం కన్పించదు. (అన్నారు ధృఢ విశ్వాసంతో)
"కాబా" గృహంలో ఖురైషీయులు దైవసందేశహరుని (సల్లం) చుట్టూ చేరి, ఆయన (సల్లం)ని వింతగా చూడసాగారు. పైగా వారి తలబిరుసు, మంకుతనాలు మరింత పెచ్చరిల్లి ఆ సత్యసంథునిపై దుష్ప్రచారానికి దిగారు.
*"ముహమ్మద్ (సల్లం) రాత్రి "బైతుల్ మఖ్దిస్"కు పోయి, తెల్లారాక ముందే అంత దూరం నుంచి తిరిగొచ్చాడట? హవ్వా....! ఎక్కడైనా ఉందా ఈ చోద్యం?"* అన్నారు కొందరు.
*"ముహమ్మద్ (సల్లం)! నిన్నటిదాకా నీ మాటల్లో మాకు కాస్తో కూస్తో నమ్మకం ఉండేది. ఇప్పుడా కాస్త నమ్మకం కూడా లేకుండా పోయింది. ఈ రోజు నీ బండారం బయటపడింది. నువ్వట్టి మోసగాడవని, పచ్చి అబద్దాలరాయుడవని తెల్సిపోయింది."* అన్నాడు ఒక అవిశ్వాసి.
*"నిజం, నిజం. నువ్వు చెప్పేవన్నీ కట్టుకథలని, వట్టి బూటకాలని ఇప్పుడు ఋజువైపోయింది.* " అన్నాడు మరొకతను.
*"కాకపోతే మరేమిటయ్యా! "బైతిల్ మఖ్దిస్"కు పోవాలంటే చలాకి ఒంటెల మీద ప్రయాణం చేస్తేనే ఒక నెల పడుతుంది. అలాంటిది నువ్వు ఒక్క రాత్రిలో అంత దూరం వెళ్ళి వచ్చావంటే, నీ కల్లిబొల్లి మాటలు నమ్మడానికి మేమంత మూర్ఖులమనుకున్నావా?"* అన్నాడు వేరొక అవిశ్వాసి.
*"లాత్, ఉజ్జాల సాక్షి! నీ మాటల్ని మేము ఎన్నటికి నమ్మలేం. ఇదంతా అబద్దం, పచ్చి అబద్దం."* అంటూ అవిశ్వాసులంతా అరిచారు.
అపుడు "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" లోపలికి ప్రవేశిస్తూ....; ↓
*అబూ బక్ర్ (రజి) : -* కాదు, ఇది నిజం. ముహమ్మద్ (సల్లం) ఎప్పుడూ అబద్దమాడలేదు. ఆయన (సల్లం) చెప్పేది ముమ్మాటికి నిజం.
*ఖురైషీయులు : -* అయితే నిరూపించమను. (అంటూ సవాలు విసిరారు)
"హజ్రత్ అబూ బక్ర్ (రజి)" దైవప్రవక్త (సల్లం) వైపు చూశారు సమాధానం కోసం. అంతలో "ముత్'యిమ్" అనే అవిశ్వాసి ఒకతను అందుకున్నాడు....; ↓
*ముత్'యిమ్ : -* ముహమ్మద్ (సల్లం)! ఏదీ, కొంచెం "బైతిల్ మఖ్దిస్"ని గురించి వివరాలు చెప్పు విందాం.
*అబూ బక్ర్ (రజి) : -* దైవప్రవక్తా! చెప్పండి, సందేహించకండి. నేను స్వయంగా "బైతిల్ మఖ్దిస్" చూశాను. దాని వివరాలన్నీ నాకు తెలుసు. మీరు చెప్పేది వీరు కాదనడానికి ఆస్కారం ఉండదు.
దైవప్రవక్త (సల్లం) "బైతిల్ మఖ్దిస్"ని గురించి చెప్పడం ప్రారంభించారు. ఆయన (సల్లం) ఇది వరకెప్పుడూ దాన్ని చూడలేదు. ఈ సంగతి అవిశ్వాసులకు కూడా తెలుసు. అంచేత దైవప్రవక్త (సల్లం) అక్కడున్న ఒక్కొక్క స్వరూపం, పరిమాణం, రంగు గురించి పూస గుచ్చినట్లు చెబుతుంటే అంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు.
కాని, మహాప్రవక్త (సల్లం) చెబుతున్న విషయం పూర్తికాక ముందే ఖురైష్ నాయకుల్లో మంకుతనం మళ్ళీ విజృంభించింది. వారు దిగ్గునలేచి తల అడ్డంగా తిప్పుతూ....; ↓
*ఖురైషీయులు : -* కాదు కాదు. ఈ విషయాలు నీకు ముందుగానే ఎవరో చెప్పారు. ఇదంతా నువ్వు నీ సహచరులు కలసి పన్నిన పన్నాగం. ఈ నాటకం మా దగ్గర సాగదు. స్పష్టమైన సాక్ష్యం ద్వారా నిరూపిస్తే తప్ప నీ మాటలు నమ్మం.
దైవప్రవక్త (సల్లం) వారి మొండివైఖరికి చలించలేదు. విసుగుచెందనూ లేదు. సహనంతో, సంయమనంతో ఈ సారి ఆయన (సల్లం) మరింత వివరంగా చెప్పారు. దారిలో తాను ఏమేమి చూసింది, ఏ ఏ ఊళ్లు దాటింది. ఏ ఏ వర్తక బృందాలు తారస పడింది, ఏ ఏ బిడారాల మీద ఏ ఏ సామగ్రి ఉంది. అవి మక్కా పట్నానికి ఇంకెంత దూరంలో ఉన్నాయో వివరంగా చెప్పారు. చివరికి వారి ఒంటెల రూపు రేఖలు గురించి కూడా వర్ణించారు.
*●వేరొక ఉల్లేఖనం ప్రకారం : - ↓*
*"ప్రవక్తా! మీరు చెప్పేది నిజమే అయితే మాకు ఋజువులు చూపించండి."* అన్నాడు ఒకతను.
ప్రవక్త (సల్లం) జవాబిస్తూ...., *"నేను చెప్పిన దానికి ఋజువు లేమంటే, నేను వెళుతున్నప్పుడు దారిలో ఒక తెగవారి ఒంటెల బిడారును చూశాను. నేను స్వారీ చేస్తున్న వాహనం వారిని దాటినప్పుడు ఆ ఒంటెలు బెదిరి పారిపోయాయి. నేను ఆ తెగవారికి ఆ ఒంటెలు ఎక్కడ దొరుకుతాయో చెప్పాను.*
*ఆ తరువాత సిరియా నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు మక్కా కొండల దగ్గర నేను మరో బిడారును దాటాను. ఆ బిడారులోని వాళ్ళందరూ గాఢనిద్రలో ఉన్నారు. వారి వద్ద నీళ్ళ కుండ ఒకటి కనబడింది. దానిపై మూత వేసి ఉంది. నేను మూత తీసి నీళ్ళు తాగి, తర్వాత మూత మళ్ళీ యథాతథంగా పెట్టేసాను. ఆ బిడారు ఇప్పుడు "తన్'యీమ్" ప్రదేశానికి చేరుకుని ఉంటుంది. ఆ బిడారుకు అగ్రభాగాన ఒక మచ్చల ఒంటె ఉంది. దానిపై రెండు పెద్ద పెద్ద కూజాలు ఉన్నాయి. ఒకటి నల్లనిది, రెండవది తెల్లనిది."* అన్నారు. *●*
కాని, అప్పటికి అవిశ్వాసులు నమ్మలేదు. ఎలా నమ్ముతారు? వారి ఆత్మాభిమానం దెబ్బతినదూ! దైవప్రవక్త (సల్లం) ఔన్నత్యం ముందు వారి పెద్దరికం అడుగంటిపోదూ!! అందువల్ల ఈ సారి వారు మరో సాకు చెప్పారు.
*ఖురైషీయులు : -* ఈ వివరాలు చెప్పినంత మాత్రాన నిన్ను అప్పుడే ఎలా నమ్మాలి? నువ్వు చెప్పే ఆ వర్తకుల్ని రానివ్వు రాత్రి వారెక్కడున్నారో, వారు నిన్ను కళ్ళారా చూశారో లేదో వారినే అడిగి తెలుసుకుంటాం. నీవు వర్ణించిన వర్తక సామాగ్రిని, ఒంటెల్ని కూడా మా కంటితో చూసుకుంటేగాని మేము తృప్తిచెందము.
అప్పటిదాకా దైవప్రవక్త (సల్లం) మాటలు అత్యంతాసక్తితో విన్న "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" ఆనందం పట్టలేక, *"ప్రవక్తా మీరు చెప్పినదంతా నిజం. మీరు నిస్సందేహంగా సత్యసంథులు."* అని అన్నారు.
అప్పుడు దైవప్రవక్త (సల్లం) తలవంచుకొని కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారు. తరువాత తల పైకెత్తి, *"అబూ బక్ర్ (రజి)"! అల్లాహ్ నీకు "సిద్ధీఖ్ (సత్యసంథుడు)" అనే బిరుదు ప్రదానం చేశాడు."* అని చెప్పారు.
*దైవప్రవక్త (సల్లం) గారు చెప్పిన, గుర్తులు గల ఒంటెలు, బిడరాలు వచ్చాయా, రాలేదా అన్న విషయంలోని వివరణను In Shaa Allah రేపటి భాగములో....;*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment