🌿 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🌿
🍂 🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌 🍂
🍃 🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌 🍃
✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦
🌾🔅 🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 166* 🕋🛐 🔅🌾
🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 81* 🇸🇦🇸🇦🇸🇦
───────────┄┅━═══✦═══━┅┄───────────
*ఇస్రా మరియు మేరాజ్ : - 2*
_(నిన్నటి భాగము కొనసాగింపు)_
ఉపన్యాసం ముగిసిన తర్వాత అంతిమ దైవప్రవక్త (సల్లం) ముందు మూడు గిన్నెలు ఉంచబడ్డాయి. ఒక గిన్నెలో నీరు, మరొక గిన్నెలో పాలు, వేరొక గిన్నెలో సారా ఉన్నాయి. దైవప్రవక్త (సల్లం) ఆ మూడింటిలో పాలగిన్నె మాత్రమే తీసుకొని పాలు తాగారు.అది చూసి జిబ్రీల్ (అలైహి) ఆయన (సల్లం)ను అభినందిస్తూ *"శుభం! మీరు ప్రకృతి మార్గాన్ని ఎన్నుకున్నారు"* అని అన్నారు.
*పరమపద సోపానం : -*
ఆ తరువాత ఆయన, దైవప్రవక్త (సల్లం) దగ్గరకి ఒక దివ్య సోపానం (మేరాజ్) తెచ్చి పెట్టారు. అది నెల నుండి నింగి దాగా ఉన్న పరమపద సోపానం. "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)" దాని వైపు చూపిస్తూ, *"దీన్ని అధిరోహించండి"* అన్నారు. దైవప్రవక్త (సల్లం) దాన్ని ఎక్కి పైకి పోసాగారు. ఆయన (సల్లం)తో పాటు "జిబ్రీల్ (అలైహి)" కూడా ఎక్కి బయలుదేరారు.
ఆ విధంగా వారిద్దరూ ఆ సోపానం ఎక్కి మొదటి ఆకాశపు ప్రధానద్వారం దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)" తలుపు తట్టారు.
*"ఎవరు నీవు?"* లోపల నుంచి ద్వారా పాలకుడు ప్రశ్నించాడు.
*"నేను జిబ్రీల్ (అలైహి)ని, నాతోపాటు అంతిమ దైవ సందేశహరుడు ముహమ్మద్ (సల్లం) కూడా ఉన్నారు."* అన్నారు జిబ్రీల్ (అలైహి).
ద్వారపాలకుడు తలుపు తెరిచాడు. జిబ్రీల్ (అలైహి), ముహమ్మద్ (సల్లం) లోపలి ప్రవేశించారు. వారలా లోపల అడుగు పెట్టారో లేదో వారి కోసమే అన్నట్లు అసంఖ్యాకమైన దైవదూతలు బారులు తీరి నిలబడి ఉన్నారు. వారు పట్టరాని సంతోషంతో జయ జయ నినాదాలు చేస్తూ దైవప్రవక్త (సల్లం)కు స్వాగతం పలికారు.
జిబ్రీల్ (అలైహి), దైవప్రవక్త (సల్లం)ను తీసుకుని అక్కడనుంచి ముందుకు సాగారు. కొంత దూరం పోయాక ఓ విచిత్ర దృశ్యం కన్పించింది. ఒక మనిషి కూర్చొని తన కుడివైపు చూసుకొని సంతోషంతో పొంగిపోతూ గలగల నవ్వుతున్నాడు. అంతలోనే ఎడమవైపు చూసుకుని అమిత దుఃఖంతో రోదిస్తున్నాడు. అతడ్ని చూసి దైవప్రవక్త (సల్లం) ఆశ్చర్యపోయారు.
*"ఎవరీ వ్యక్తి? ఈ విచిత్ర పరిస్థితికి కారణం ఏమిటీ?"* అడిగారు ఆయన (సల్లం).
*"ఈయన మీ పితామహుడు. (ప్రప్రథమ దైవప్రవక్త) ఆదం (అలైహి). తన సంతానమైన మానవులకు ఎదురయ్యే అసాధారణ పరిణామాల గురించిన తలంపే ఈయనగారి ఈ పరిస్థితికి కారణం, కుడివైపు పుణ్యాత్ముల సత్కర్మలు ఉండటం చూసి ఈయన సంతోషిస్తున్నారు. ఎడమవైపు పాపాత్ముల దుష్కర్మలు చూసి దుఃఖిస్తున్నారు."* (అని) వివరించారు "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)".
"హజ్రత్ ఆదం (అలైహి)", అంతిమ దైవప్రవక్త (సల్లం)ను చూసి *"ప్రియకుమారా! స్వాగతం! సుస్వాగతం!!"* అన్నారు అమిత వాత్సల్యంతో, తర్వాత ఆయన (సల్లం)ని కౌగలించుకున్నారు.
( _వేరొక ఉల్లేఖనంలో....;_ → మొదటి ఆకాశంలో దైవప్రవక్త (సల్లం), మానవాళికి తండ్రి అయిన "హజ్రత్ ఆదం (అలైహి)"ను చూశారు. దైవప్రవక్త (సల్లం), ఆయనకు *"సలాం"* చేయగా, ఆయన *"మర్'హబా"* అంటూ సలాముకు *"ప్రతిసలాము"* చేశారు. ఆయన (సల్లం) గారి దైవదౌత్యాన్ని ధృవీకరించారు. ఆదం (అలైహి)కు కుడి ప్రక్కన అదృష్టవంతుల ఆత్మలూ, ఎడమ ప్రక్కన దురదృష్టవంతుల ఆత్మలు ఉన్నట్లు అల్లాహ్, ప్రవక్త (సల్లం)కు చూయించారు.)
హజ్రత్ జిబ్రీల్ (అలైహి), దైవప్రవక్త (సల్లం)ను తీసుకుని ముందుకు సాగారు. ఒకచోట, కొందరు పొలంలో పైరు కోస్తున్నారు. అయితే కోసిన వెంటనే ఆ పైరు మళ్ళీ పెరుగుతోంది. దైవప్రవక్త (సల్లం) అది చూసి, *"ఎవరీ మనుషులు?"* అని అడిగారు. దానికి జిబ్రీల్ (అలైహి), *"వీరు దైవమార్గంలో పోరాడేవారు"* అని చెప్పారు.
మరోచోట కొందరు మనుషుల తలలు పగలగొట్టడం జరుగుతోంది. జిబ్రీల్ (అలైహి) వాళ్ళను గురించి తెలుపుతూ, *"వీరు నమాజు చేయడానికి బద్ధకించేవారు."* అన్నారు.
మరోచోట, కొందరు చింపిరి బట్టలు తొడుక్కొని పశువుల్లా గడ్డి మేస్తున్నారు. వారు జకాత్, ఇతర దానధర్మాలు చేయనివారని చెప్పారు "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)".
వేరొకచోట, ఒక అతను కట్టెలు పోగుచేసి ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని పైకెత్తుకోలేక పోతాడు. అప్పుడతను మోపులో కట్టెలు తగ్గించడానికి బదులు, మరికొన్ని కట్టెలు చేర్చి ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)" ఈ మనిషిని గురించి తెలుపుతూ, *"ఇతను మోయలేనన్ని బరువు బాధ్యతలు ఉన్నప్పటికీ, వాటిని తగ్గించుకోవడానికి బదులు మరిన్ని బాధ్యతలు మీదేసుకుంటాడు."* అని చెప్పారు.
ఇంకొక చోట, దైవదూతలు కొందరు మనుషుల నాలుకలు, పెదవులను కత్తెరలతో కత్తిరిస్తున్నారు. "జిబ్రీల్ (అలైహి)" వాళ్ళను గురించి చెబుతూ, *"వీళ్ళు విశృంఖలంగా ప్రసంగిస్తూ అల్లర్లు, అలజడులు సృష్టించే బాధ్యతారహితులైన ఉపన్యాసకులు."* అన్నారు.
ఒకచోట, ఓ చట్టుబండలో పగులు ఏర్పడి, అందులో నుంచి బాగాబలిసిన ఒక ఆంబోతు ఎద్దు బయటకి వచ్చింది. తర్వాత అది మళ్ళీ ఆ నెర్రలోకి పోవడానికి ప్రయత్నించింది. కాని ఆ చిన్నరంధ్రంలోకి దూరలేకపోతోంది. "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)" ఆ ఎద్దును గురించి చెబుతూ, *"ఒకతను బాధ్యతారహితంగా సమస్యలు, సంక్షోభాలకు కారణమయ్యే ఓ మాట చెప్పి, తరువాత పశ్చాత్తాపంతో దాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. కాని అతని ప్రయత్నాలేవీ ఫలించవు. ఈ ఎద్దు అలాంటి బాపతుకు చెందినవదే"* అన్నారు.
వేరొకచోట, కొందరు తమకు కావాల్సిన మాంసాన్ని తమ దేహాల నుండే కోసుకొని తింటున్నారు. వారు ఇతరుల్ని ఎగతాళి, ఎకసక్కెం చేసేవారని "జిబ్రీల్ (అలైహి)" తెలిపారు. వారికి కొంచెం దూరంలో మరికొందరున్నారు. వారు తమ వాడిఅయిన రాగిగోళ్ళతో తమ ముఖాలను, రొమ్ములను రక్కుకుంటున్నారు. దైవప్రవక్త (సల్లం) వీరెవరని అడిగారు, *"వీరు ప్రజలను పరోక్షంగా నిందిస్తూ, వాళ్ళలో చెడుల్ని తీసి చూపిస్తూ వారి గౌరవప్రతిష్ఠలను దిగజార్చేవారు."* అని తెలిపారు "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)".
మరొకచోట, బానకడుపులు కలిగినవారు కొందరున్నారు. వారి పొట్టలు, పాములతో నిండిపోయి ఉన్నాయి. వారు వడ్డీ తినేవాళ్ళని చెప్పారు "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)".
వేరొకచోట, కొందరు స్త్రీలు, పురుషులు ఉన్నారు. వారికి ఒక వైపున రుచికరమైన ఘుమఘుమలాడే మంచి మాంసం ఉంది. మరో వైపున కుళ్ళిపోయి కంపుకొడుతున్న మాంసం ఉంది. అయితే ఆ మనుషులు మంచి మాంసం వదలి కంపుకొడుతున్న మాంసాన్ని తింటున్నారు. వీళ్ళెవరని అడిగితే, *"వీళ్ళు ధర్మసమ్మతమైన భార్యలను, భర్తలను వదలి నిషేధితాలతో తమ కోరికలు తీర్చుకునే స్త్రీ పురుషులు"* అని చెప్పారు "జిబ్రీల్ (అలైహి)".
అక్కడనుంచి కొంచెం ముందుకు పోయిన తరువాత ధుమధుమలాడే ముఖంతో ఉన్న ఒక భయంకరుడు కనిపించాడు. దైవప్రవక్త (సల్లం)కు స్వాగతం చెప్పి కరచాలనం చేసినా, అతని ముఖం ధుమధుమలాడుతూనే ఉంది. ఆ వ్యక్తి ఎవరని అడిగితే, ఆయన నరకపాలకుడని చెప్పారు "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)".
ఈ విధంగా ఆయన, దైవప్రవక్త (సల్లం)ను తీసుకొని దారిలో అనేక వింతలు, విశేషాలు చూసుకుంటూ రెండవ ఆకాశానికి చేరుకున్నారు. అక్కడ దైవప్రవక్త (సల్లం)కు అనేక మంది దైవదూతలు స్వాగతం చెప్పారు. ఈసా (అలైహి), యహ్యా (అలైహి)లు తారసపడ్డారు. ఆ ప్రవక్తలిద్దరూ అంతిమ దైవసందేశహరుని (సల్లం)కి చిరునవ్వుతో స్వాగతం చెప్పారు.
( _వేరొక ఉల్లేఖనంలో....;_ → ఆ తరువాత మహాప్రవక్త (సల్లం)ను రెండో ఆకాశం పైకి తీసుకొనిపోవడం జరిగింది. అక్కడ ఆకాశ ద్వారాన్ని తెరిపించడం జరిగింది. రెండవ ఆకాశంపై ఆయన (సల్లం), "హజ్రత్ యహ్యా (అలైహి) బిన్ జకరియ్యా (అలైహి)"ను మరియు "ఈసా (అలైహి) బిన్ మరియమ్ (అలైహి)"ను చూశారు. వారిద్దరిని కలసి వారికి *"సలామ్"* అందించగా, ఇద్దరూ *"ప్రతిసలాము"* చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన (సల్లం) గారి దైవదౌత్యాన్ని ధృవీకరించారు.)
ఆ తరువాత వారిద్దరూ మూడవ ఆకాశానికి చేరుకున్నారు. అక్కడ "హజ్రత్ ప్రవక్త యూసుఫ్ (అలైహి)" కనిపించారు. ఆయన అసాధారణ సౌందర్యం చూసి ముహమ్మద్ (సల్లం) అబ్బురపడ్డారు. "హజ్రత్ యూసుఫ్ (అలైహి)" చిరునవ్వుతో అంతిమ దైవప్రవక్త (సల్లం)ను స్వాగతించి కౌగలించుకున్నారు.
( _వేరొక ఉల్లేఖనంలో....;_ → ఆ పిదప మూడో ఆకాశం పైకి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన (సల్లం), "హజ్రత్ యూసుఫ్ (అలైహి)"ను చూసి *"సలామ్"* చేశారు. ఆయన (సల్లం)కు జవాబుగా *"ప్రతిసలాము"* చేస్తూ, ఆయన (సల్లం)కు శుభాకాంక్షలు తెలిపి, ఆయన (సల్లం) గారి దైవదౌత్యాన్ని ధృవీకరించారు.)
అక్కడనుంచి దైవదూత "జిబ్రీల్ (అలైహి)", దైవప్రవక్త (సల్లం)ను తీసుకొని నాల్గవ ఆకాశంలోకి ప్రవేశించారు. అక్కడ దైవప్రవక్త "హజ్రత్ ఇద్రీస్ (అలైహి)", మహనీయ ముహమ్మద్ (సల్లం)ని చూసి సంతోషిస్తూ స్వాగతం చెప్పారు.
( _వేరొక ఉల్లేఖనంలో....;_ → ఆ తరువాత ఆయన (సల్లం)ను నాల్గో ఆకాశం పైకి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ దైవప్రవక్త (సల్లం), "హజ్రత్ ఇద్రీస్ (అలైహి)"ను చూసి *"సలామ్"* పలికారు. జవాబుగా "ఇద్రీస్ (అలైహి)", *"ప్రతిసలాము"* చేస్తూ, ఆయన (సల్లం)కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన (సల్లం) గారి దైవదౌత్యాన్ని ధృవీకరించారు.)
ఆపై అయిదో ఆకాశానికి వెళ్ళగా, అక్కడ ఆయన (సల్లం), "హజ్రత్ హారూన్ (అలైహి) బిన్ ఇమ్రాన్"ను చూశారు. ఆయనకు *"సలామ్"* అందించారు. జవాబుగా "హారూన్ (అలైహి)", *"ప్రతిసలాము"* చేస్తూ, శుభాకాంక్షల్ని అందజేస్తూ, ఆయన (సల్లం) దైవదౌత్యాన్ని ధృవపరిచారు.)
దైవప్రవక్త (సల్లం)ను ఆరవ ఆకాశం పైకి గోనిపోగా, అక్కడ ఆయన (సల్లం) "హజ్రత్ మూసా (అలైహి) బిన్ ఇమ్రాన్"ను చూడడం జరిగింది. ఆయనకు *"సలామ్"* అందించగా *"ప్రతిసలాము"* చేస్తూ *"మర్'హబా"* అని శుభాకాంక్షల్ని అందించారు. మహాప్రవక్త (సల్లం) గారి దైవదౌత్యాన్ని ధృవపర్చడం జరిగింది.
ఆ తర్వాత, దైవప్రవక్త (సల్లం) ముందుకు నడువగా "మూసా (అలైహి)" ఏడ్వనారంభించారు. *"మీరెందుకు ఏడుస్తున్నారు?"* అని ప్రవక్త (సల్లం) అడిగారు. అందుకు మూసా (అలైహి), *"నా తరువాత ఓ యువకుడు ప్రభవింపజేయబడ్డాడు. అతని సమాజం, నా సమాజం కంటే సంఖ్యలో అధికంగా ఉండి స్వర్గప్రవేశం చేస్తుంది. ఆ కారణంగా నాకు ఏడుపు ఆగలేదు."* అని అన్నారు.
ఈ పర్యటనలో మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) అనూహ్యమైన అనేక దృశ్యాలు తిలకించారు. "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)" దైవాజ్ఞతో ఆయన (సల్లం)కు స్వర్గ నరకాలు కూడా చూపారు. అక్కడ మానవమేధస్సుకు కూడా అంతుపట్టని అసాధారణమైన దృశ్యాలను చూసి దైవప్రవక్త (సల్లం) విభ్రాంతిచెందారు.
మానవుడు ఆ భీకరనరకాగ్ని ఒక్కసారి చూస్తే, ఇహలోకంలోని సమస్త సౌఖ్యాలు వదలి అమిత దైవభీతితో నరకశిక్ష నుంచి తప్పించుకోవడానికి జీవితాంతం దైవధ్యానంలోనే లీనమై ఉంటాడు. అలాగే స్వర్గంలోని భోగభాగ్యాలు, మనోహరదృశ్యాల్ని ఒక్కసారి చూస్తే, ఇక ఆ సౌఖ్యాలు పొందడానికి లోకంలో ఎదురయ్యే అతిభయంకర కష్టనష్టాలను సైతం మనిషి పరమసంతోషంగా భరించి, నిరంతరం దైవారాధనలోనే జీవితం గడుపుతాడు.
ఈ విధంగా జరిగితే ప్రపంచ వ్యవహారమే మారిపోతుంది. సమాజం మరోలా తయారవుతుంది. అలాంటప్పుడు ప్రపంచం, పరీక్షా వేదిక అనే విషయం అర్థరహితమవుతుంది. అంచేతనే అల్లాహ్, వీటన్నిటినీ మరుగున ఉంచి మానవులకు వారి భాధ్యతల్ని బోధించాడు. బాధ్యతల నిర్వహణను బట్టి పరలోకంలో ఫలితం దక్కుతుందన్నాడు.
మహాప్రవక్త (సల్లం) దైవమహిమల్ని మననం చేసుకుంటూ "జిబ్రీల్ (అలైహి)" వెంట ముందుకు సాగారు. కాస్సేపటికి వారు ఓ విశిష్ఠ వృక్షం సమీపానికి చేరుకొని ఆగిపోయారు. అదే *"సిద్రతుల్ మున్తహా"* అనే మహావృక్షం! చిత్ర విచిత్ర కాంతులు వెదజల్లుతున్న బ్రహ్మాండమైన వృక్షరాజం అది. దైవప్రవక్త (సల్లం) దాన్ని చూసి, తనకు ఇవన్నీ చూసే భాగ్యం లభించినందుకు దైవానికి కృతజ్ఞలు తెలుపుకున్నారు.
ఈ విశ్వవృక్షమే భౌతికపరమైన విశ్వమండలానికి సరిహద్దు. ఈ సరిహద్దు దాటితే కండ్లు మిరుమిట్లు గొలిపే కాంతి పుంజాలతో కూడిన రాజమార్గం కనిపిస్తుంది. దైవ సాన్నిధ్యానికి గోనిపోయే దివ్యమార్గం అది.
అయితే, "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)" ఆ హద్దు సమీపానికి చేరుకోగానే ఠక్కున ఆగిపోయి, *"ఇక మీరు వెళ్ళండి, నేను రాలేను"* అన్నారు.
దైవప్రవక్త (సల్లం)కు ఆశ్చర్యం వేసింది. *"జిబ్రీల్ (అలైహి)! ఏమిటి సందేహిస్తున్నారు? ఇంత దూరం నాతో వచ్చి, ఇప్పుడు నన్ను ఒంటరిగా వదలిపోవడం మీకు భావ్యమేనా?"* అన్నారు ఆయన (సల్లం).
*"అల్లాహ్ కి అతి సన్నిహితులైన మీరే ఈ జ్యోతిర్మయమార్గంలో ప్రయాణం చేయడానికి యోగ్యులు, సమర్థులు. నాకా అర్హత లేదు. ఇక నేను ఒక అడుగు ముందుకు వేసినా, నా రెక్కలు కాలి బూడిదయిపోతాయి."* అన్నారు "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)"
ఈ మాటలు విన్న తరువాత దైవప్రవక్త (సల్లం)కు ధైర్యం వచ్చి ముందుకుసాగారు. రఫ్ రఫ్ అనే మాధ్యమం ద్వారా కాంతిని మించిన వేగంతో పురోగమించారు. కాస్సేపటికి అటునుంచి *"అస్సలాము అలైకుం; ముహమ్మద్! నేనే విశ్వప్రభువును"* అనే గంభీరమైన వాణి వినిపించింది.
దైవప్రవక్త (సల్లం) మనస్సు పరమానందంతో పరవశించిపోయింది. *"నా దైవం, నా ప్రభువు నాతో సంభాషిస్తున్నాడు. నా ప్రభువు సాన్నిధ్యం నేడు నాకు ప్రాప్తమవుతోంది. మహాప్రసాదం, ఓహ్, నేనెంత అదృష్టవంతుడ్ని!"* అనిర్వచనీయమయిన అనుభూతితో ఆయన (సల్లం) అప్రయత్నంగా సాష్టాంగప్రణామం చేశారు. అదే స్థితిలో విశ్వప్రభువును తనివితీరా స్తుతించారు.
*"ముహమ్మద్! మా కోసం ఏం కానుక తెచ్చావు?"* అటునుంచి మరోసారి గంభీరమైన వాణి వినిపించింది.
*తరువాత జరిగినది In Shaa Allah రేపటి భాగములో....;*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment