🌿 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🌿
🍂 🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌 🍂
🍃 🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌 🍃
✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦
🌾🔅 🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 163* 🕋🛐 🔅🌾
🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 78* 🇸🇦🇸🇦🇸🇦
───────────┄┅━═══✦═══━┅┄───────────
*ప్రముఖ వ్యక్తుల్లో "ఇస్లాం" ధర్మప్రచారం*
*3. అబూజర్ గఫ్ఫారి : -*
ఈయన యస్రిబ్ దాపులోనే ఉండే ఓ ప్రదేశంలో నివసించే వ్యక్తి. "సువైద్ బిన్ సామత్" మరియు "అయాస్ బిన్ ముఆజ్"ల ద్వారా దైవప్రవక్త (సల్లం) గారి దైవదౌత్యం గురించిన వార్త యస్రిబ్ కు చేరగా అది కాస్తా ఆయన చెవిన కూడా పడింది. ఈ వార్తే ఈయన "ఇస్లాం" స్వీకారానికి దోహదపడింది.
*ఆయన "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించిన వివరాలు "సహీ బుఖారీ"లో ఉన్నాయి. ↓*
*"అబూజర్ (రజి)" ఇలా చెప్పారని "హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రజి)" ఉల్లేఖిస్తున్నారు.*
"నేను గిఫ్ఫార్ తెగకు చెందిన వాణ్ణి. మక్కాలో ఓ వ్యక్తి తనను దైవప్రవక్తగా ప్రకటించుకున్నాడని నాకు తెలిసింది. నేను నా సోదరునితో, *"నీవు మక్కాకు వెళ్ళి ఆయన (సల్లం)తో మాట్లాడి వచ్చి విషయం ఏమిటో నాతో చెప్పు."* అని చెప్పాను. ఆయన వెళ్ళి ఆయన (సల్లం)ను కలిసి మాట్లాడాడు, తిరిగి వచ్చిన తరువాత *"ఏం వార్త తెచ్చావు."* అని అడిగాను.
*"దైవసాక్షి! నేనిప్పటి వరకు అలాంటి వ్యక్తిని చూడలేదు. మేలు చేయమని ఆదేశిస్తూ, దుర్మార్గాల నుండి ప్రజల్ని వారిస్తున్నాడు."* అని చెప్పాడు.
అతను తెచ్చిన వార్త నాకు తృప్తినివ్వలేదు. నేనే స్వయంగా అక్కడకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. చద్దిమూటను కట్టుకొని, చేతికర్ర తీసుకుని బయలుదేరి మక్కా చేరుకున్నాను.
నేను దైవప్రవక్త (సల్లం)ను గుర్తు పట్టేదెలా? ఇతరుల్ని అడిగి తెలుసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను "జమ్ జమ్" నీరు త్రాగుతూ "మస్జిదె హరాం"లో పడి ఉన్నాను. చివరికి నన్ను "హజ్రత్ అలీ (రజి)" చూసి, *"ఈ వ్యక్తి కొత్తవానిలా అగుపడుతున్నాడే.!"* అని అన్నారు. నేను సమాధానంగా *"అవును"* అని అన్నాను. అయితే ఇంటికి వెడదాం పద అని, ఆయన (రజి) నన్ను ఆయన ఇంటికి తోడ్కొని వెళ్ళారు. వెడుతూ ఆయన (రజి) నన్ను ఏదైనా విషయం అడగడంగాని, నేనాయనకు బదులు ఇవ్వడం కాని ఏదీ జరుగలేదు.
తెల్లవారగానే ఎవరినైనా అడిగి తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే "మస్జిదె హరాం"కు వెళ్ళాను. కాని ప్రవక్త (సల్లం) గురించి తెలపడానికి ఏ ఒక్కడూ నాకు దొరకలేదు. చివరికి "హజ్రత్ అలీ (రజి)"యే తిరిగి నా దగ్గరకు వచ్చారు.
*"నీకు ఇంకా నీ గమ్యం ఏదో లభించలేనట్లుందే!"* అని అన్నారు.
*"అవును"* అని అన్నాను నేను.
*"అయితే నా వెంటరా, అసలు నీ వ్యవహారం ఏమిటో బోధపడడం లేదు. నీవు ఈ నగరానికి ఎందుకు వచ్చినట్లు?"* అని అడిగారు అలీ (రజి).
*"మీరు రహస్యంగా ఉంచుతానంటే చెబుతాను"* అన్నాను నేను.
*"సరే! అలాగే"* అని హామీనిచ్చారాయన.
*"ఇక్కడ ఒకాయన తాను ప్రవక్తనంటూ చెప్పుకుంటున్నాడట. నేను నా సోదరుణ్ణి అతనితో మాట్లాడి రమ్మని పంపించాను. అతను తిరిగి వచ్చి చెప్పిన మాటలు నాకు తృప్తినివ్వలేదు. నేనే స్వయంగా వెళ్ళి ఆయన (సల్లం)ను కలుద్దామనే తలంపుతో ఇక్కడికి వచ్చాను."* అని అన్నాను నేను.
*"సోదరా! నీవు సరైన చోటికే వచ్చావు. చూడు! నేనాయన (సల్లం) వద్దకే వెడుతున్నాను. నేను ఏ ఇంట జొరబడితే నీవు కూడా నా వెంట ఆ ఇంట్లో ప్రవేశించు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ఏదైనా ప్రమాదం కలిగిందే వ్యక్తిని చూడగానే గోడవైపు తిరిగి నా చెప్పుల్ని సరిచేస్తూ నిలబడతాను. నీవు నా వెంటే దారిని నడుస్తూ ఉండు"* అంటూ "హజ్రత్ అలీ (రజి)" నడకనారంభించారు. నేనూ ఆయన (రజి)ను అనుసరిస్తూ పోతున్నాను. చివరికి ఆయన (రజి) ఓ గుమ్మంలో ప్రవేశించారు. నేనూ, "హజ్రత్ అలీ (రజి)" వెంట దైవప్రవక్త (సల్లం) గారి సన్నిధికి చేరుకున్నాను.
అపుడు నేను దైవప్రవక్త (సల్లం)ను ఉద్దేశించి...., *"మీరు నాకు ఇస్లాం ధర్మం ఏమిటో బోధిస్తారా?"* అని అడిగాను.
ఆయన (సల్లం) నాకు "ఇస్లాం" ధర్మం గురించి విడమర్చి చెప్పారు. నేను వెంటనే ఆ ధర్మాన్ని స్వీకరించి ముస్లిమునైపోయాను. ఆ తరువాత మహాప్రవక్త (సల్లం) నన్ను ఉద్దేశించి, *"అబూజర్! ఈ వ్యవహారాన్ని గోప్యంగానే ఉంచండి. మీ ప్రాంతానికి వెళ్ళిపొండి. మేము బయటకు వచ్చి బాహాటంగా ప్రచారం చేస్తున్నట్లు వార్త అందగానే ఇక్కడికి వచ్చేయండి."* అని అన్నారు.
*"ఏ దైవమయితే మీకు సత్యమిచ్చి పంపించాడో, ఆ దైవం సాక్షి! నేను వారి మధ్యకు వెళ్ళి బహిరంగంగా ప్రకటిస్తాను"* అని చెప్పి "మస్జిదె హరాం"కు వచ్చాను. అక్కడ ఖురైష్ కూర్చునే ఉన్నారు.
అపుడు నేను వారినుద్దేశించి...., *"ఓ ఖురైష్ ప్రజలారా! ఇది వినండి అంటూ, _"అష్'హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్'హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ."_ (అల్లాహ్ తప్ప వేరే పూజ్యుడులేడని, ముహమ్మద్ (సల్లం) అల్లాహ్ ప్రవక్త మరియు ఆయన దాసుడని నేను సాక్ష్యమిస్తున్నాను)* అని ప్రకటించాను.
అక్కడ కూర్చోని ఉన్నవారు, *"చూస్తారేం, లేవండి! లేచి, ఆ ధర్మభ్రష్టుడి పని పట్టండి."* అని అరిచారు.
(ఉన్నపళంగా) వారంతా లేచి నాపైబడ్డారు. ప్రాణం పోయేంతవరకు నన్ను బాదనారంభించారు. కాని "ఇబ్నె అబ్బాస్ (రజి)" వచ్చి నన్ను రక్షిస్తూ, వంగి నా ముఖాన్ని చూశారు. ఆ తరువాత ఖురైష్ వైపు తిరిగి, *"మీరు నాశనం గాను! మీరు గిఫ్ఫార్ తెగకు చెందిన ఈ వ్యక్తిని చంపేస్తున్నారా? వ్యాపారార్థం ఈ గిఫ్ఫార్ తెగ ఉండే ప్రదేశం నుండే కదా మీరు వెళ్ళేది!"* అని అన్నారు. అది విని వారందరూ నన్ను వదిలేసి ప్రక్కకు తప్పుకున్నారు.
మరుసటి రోజు ఉదయమే నేను తిరిగి అక్కడికి వెళ్ళాను. ఈ రోజు చెప్పినట్లే తిరిగి ఎలుగెత్తి చెప్పాను. తిరిగి వారు *"ఈ ధర్మభ్రష్టుని పని పట్టండి"* అని నాపై విరుచుకుపడ్డారు. నిన్న జరిగినట్లే ఈ రోజు కూడా జరిగింది. "హజ్రత్ అబ్బాస్ (రజి)" వచ్చి నన్ను రక్షించారు. నాపై వంగి నిన్న చెప్పినట్లుగానే చెప్పారు.
*4. తుఫైల్ బిన్ ఉమర్ దౌసీ : -*
ఈ బుద్ధిమంతుడు కవి, ఆలోచనాపరుడు. దౌస్ తెగకు సర్దారు.
*మిగిలినది In Shaa Allah రేపటి భాగములో....;*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment