162

🌿             ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪             🌿

🍂   🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌  🍂
🍃   🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*    🕌 🍃

✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦

🌾🔅     🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 162* 🕋🛐      🔅🌾

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 77* 🇸🇦🇸🇦🇸🇦

───────────┄┅━═══✦═══━┅┄───────────

 *మక్కాకు వెలుపల విస్తరించిన విశ్వాస కిరణాలు : -* 

తెగలకు, వర్గాలకు "ఇస్లాం" గురించి ప్రబోధించినట్లే మహాప్రవక్త (సల్లం) వేరు వేరు ప్రముఖ వ్యక్తుల్ని కలిసి "ఇస్లాం" సందేశాన్నిచ్చారు. వారిలో కొందరు సకారాత్మకంగా స్పందించారు. "హజ్" కాలం గడిచిన తరువాత కొందరు "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించారు కూడా.

 *1. సువైద్ బిన్ సామత్ : -* 

ఈయన ఓ కవి. లోతుగా ఆలోచించే మనస్తత్వం గలవారు. యస్రిబ్ (మదీనా) నివాసి. ఈయన ధృఢసంకల్పం, కవన వ్యాసంగం మరియు గౌరవోన్నతుల రీత్యా ఆయన జాతి ఆయనకు కామిల్ (సంపూర్ణుడు) అనే బిరుదు కూడా ఇచ్చింది. ఈయన "హజ్" లేదా "ఉమ్రా" చేయడానికి మక్కా వచ్చినప్పుడు మహాప్రవక్త (సల్లం) ఆయన్ను కలసి "ఇస్లాం" ధర్మం వైపునకు రమ్మని ఆహ్వానించారు.

ఆయనతో మాట్లాడేటపుడు దైవప్రవక్త (సల్లం), *"నీ దగ్గర ఉన్నదేమిటి?"* అని అడిగారు. దానికి సువైద్, *"నా దగ్గర లుక్మాన్ జ్ఞానముంది"* అని బదులిచ్చారు. *"అయితే విను, నా దగ్గర ఉన్నది, దాని కంటే మేలైన జ్ఞానం. అది "ఖుర్ఆన్". దాన్ని "అల్లాహ్", నాపై అవతరింపజేశాడు. అది మార్గదర్శకమైన జ్యోతి"* అంటూ మహాప్రవక్త (సల్లం) "దివ్యఖుర్ఆన్" ఆయత్ లను పారాయణం చేసి వినిపించారు. "ఇస్లాం" వైపునకు ఆహ్వానించారు.

వెంటనే ఆయన "ఇస్లాం"ను స్వీకరిస్తూ, *"ఇది ఎంతో మేలైనది"* అన్నారు. ఆ తరువాత ఆయన మదీనా తిరిగి వచ్చినప్పుడు "బుఆస్" యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలోనే ఆయన చంపి వేయబడ్డారు. ఆయన దైవదౌత్యశకం 11 ప్రారంభదశలో "ఇస్లాం" స్వీకరించినట్లు ఆధారాలున్నాయి.

 *2. అయాజ్ బిన్ ముఆజ్ : -* 

ఈయన కూడా యస్రిబ్ (మదీనా) నివాసియే. నవయువకుడూను. దైవదౌత్య శకం 11వ సంవత్సరంలో, “బుఆస్” యుద్ధానికి కొన్ని రోజులకు ముందు, ఓ అవస్ ప్రతినిధి వర్గం, ఖజ్రజ్ తెగకు విరుద్ధంగా ఖురైష్ సహాయాన్ని అర్థించడానికి మక్కా వచ్చింది. ఆ ప్రతినిధి వర్గం వెంట వచ్చారాయన. "అవస్" మరియు "ఖజ్రజ్" అనే రెండు తెగల నడుమ విద్వేషం పతాకస్థాయికి చేరిన రోజులవి. "అవస్" ప్రజల సంఖ్య "ఖజ్రజ్" ప్రజల సంఖ్య కంటే తక్కువ. దైవప్రవక్త (సల్లం)కు ఈ ప్రతినిధి వర్గం వచ్చిన విషయం తెలియగానే ఆయన (సల్లం) వారి దగ్గరకు వెళ్ళారు. వారి నడుమ కూర్చుని ఇలా సంబోధించారు.

 *"మీరు ఏ ధ్యేయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడికి వచ్చారో ఆ ధ్యేయం కంటే మేలైన విషయాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా?"* అన్నారు. 

 *"అంతకు మించి మేలైన విషయం మరేముంది?"* అని ప్రశ్నించారు వారు. 

 *"నేను అల్లాహ్ ప్రవక్తను. అల్లాహ్ నన్ను తన దాసుల వద్దకు, వారు అల్లాహ్ నే ఆరాధించాలనీ, ఆయనకు సహవర్తులుగా మరెవ్వరిని నిలబెట్టవద్దని పిలునివ్వడానికి పంపించాడు. ఆయన నాపై గ్రంథాన్ని కూడా అవతరింపజేశాడు"* అంటూ "ఇస్లాం" ధర్మం గురించి విడమర్చి చెబుతూ, "దివ్యఖుర్ఆన్"ను కూడా పఠించి వినిపించారు. అది విన్న "అయాస్ బిన్ ముఆజ్"...., *"ఓ నా జాతి ప్రజలారా! దైవసాక్షి! మీరు ఇక్కడికి దేనికోసమయితే వచ్చారో, దానికంటే ఇది మేలైన విషయం."* అని అన్నారు.

కాని ఆ ప్రతినిధి వర్గంలోని ఓ వ్యక్తి "అబుల్ హైసర్ అనస్ బిన్ రాఫే" ఓ పిడికెడు కంకరరాళ్ళను ఎత్తి "అయాస్" ముఖంపై విసిరి కొడుతూ, *"దీన్ని వదిలేయండి! నా వయస్సు సాక్షిగా చెబుతున్నాను! మనం మరో పనిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడకు వచ్చినవాళ్ళం."* అని అయాస్ మాటను ఖండించాడు. "అయాస్" అప్పుడు మాట్లాడకుండా ఊరుకుండిపోయారు. 

మహాప్రవక్త (సల్లం) కూడా లేచి నిలబడ్డారు. వచ్చిన ప్రతినిధి వర్గం ఖురైష్ ఒడంబడిక చేసుకోవడంలో, వారి సహాయం పొందడంలో విజయం సాధించలేకపోయింది. వచ్చిన కార్యంలో విఫలమై మదీనాకు తిరిగి వెళ్ళిపోయింది.

మదీనా వెళ్ళిన కొన్ని రోజుల తరువాత "అయాస్" పరమపదించారు. మరణించేటప్పుడు ఆయన నోట దైవస్తోత్రం వెలువడినట్లు ప్రజలు చూశారు, అందుకని ఆయన "ఇస్లాం" ధర్మం పైనే తన ప్రాణాలు వదిలారన్నది ప్రజలకు నమ్మకమున్నట్లు ఆధారాలున్నాయి.

3. అబూజర్ గఫ్ఫారి : -

ఈయన యస్రిబ్ దాపులోనే ఉండే ఓ ప్రదేశంలో నివసించే వ్యక్తి. "సువైద్ బిన్ సామత్" మరియు "అయాస్ బిన్ ముఆజ్"ల ద్వారా దైవప్రవక్త (సల్లం) గారి దైవదౌత్యం గురించిన వార్త యస్రిబ్ కు చేరగా అది కాస్తా ఆయన చెవిన కూడా పడింది. ఈ వార్తే ఈయన "ఇస్లాం" స్వీకారానికి దోహదపడింది.

 *ఆయన "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించిన వివరాలు "సహీ బుఖారీ"లో ఉన్నాయి.* *↓* 

"అబూజర్ (రజి)" ఇలా చెప్పారని "హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రజి)" ఉల్లేఖిస్తున్నారు.

"నేను గిఫ్ఫార్ తెగకు చెందిన వాణ్ణి. మక్కాలో ఓ వ్యక్తి తనను దైవప్రవక్తగా ప్రకటించుకున్నాడని నాకు తెలిసింది. నేను నా సోదరునితో, *"నీవు మక్కాకు వెళ్ళి ఆయన (సల్లం)తో మాట్లాడి వచ్చి విషయం ఏమిటో నాతో చెప్పు."* అని చెప్పాను. ఆయన వెళ్ళి ఆయన (సల్లం)ను కలిసి మాట్లాడాడు, తిరిగి వచ్చిన తరువాత *"ఏం వార్త తెచ్చావు."* అని అడిగాను.

 *"దైవసాక్షి! నేనిప్పటి వరకు అలాంటి వ్యక్తిని చూడలేదు. మేలు చేయమని ఆదేశిస్తూ, దుర్మార్గాల నుండి ప్రజల్ని వారిస్తున్నాడు."* అని చెప్పాడు.

అతను తెచ్చిన వార్త నాకు తృప్తినివ్వలేదు. నేనే స్వయంగా అక్కడకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. చద్దిమూటను కట్టుకొని, చేతికర్ర తీసుకుని బయలుదేరి మక్కా చేరుకున్నాను....

మిగిలినది In Shaa Allah రేపటి భాగములో....;

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment