161

🌿             ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪             🌿

🍂   🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌  🍂
🍃   🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*    🕌 🍃

✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦

🌾🔅     🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 161* 🕋🛐      🔅🌾

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 76* 🇸🇦🇸🇦🇸🇦

───────────┄┅━═══✦═══━┅┄───────────

   *ప్రముఖ వ్యక్తుల్లో, వివిధ తెగల్లో ఇస్లాం ధర్మప్రచారం* 

దైవదౌత్య శకం 10, జీఖాదా మాసం (క్రీ.శ. 619 జూన్ చివరి భాగం లేదా జులై నెల ప్రారంభకాలం)లో మహాప్రవక్త (సల్లం) తాయెఫ్ కు వెళ్ళడం, అక్కడ పేరుమోసిన వారికి, తెగలకు "ఇస్లాం" సందేశాన్ని ఇవ్వడం ప్రారంభించారు. "హజ్" కాలం దగ్గరపడడం వలన, "హజ్" చేయడానికి సుదూర ప్రాంతాల నుండి, చుట్టుపట్ల నుండి ప్రజలు వాహనాలపై, కాలినడకన మక్కాకు రావడం ప్రారంభమైంది. మహాప్రవక్త (సల్లం) ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి తెగలోనికి వెళ్ళి వారికి "ఇస్లాం" ధర్మం గురించి బోధ చేయడం ప్రారంభించారు. దైవదౌత్యం నాలుగవ సంవత్సరం నుండే, "హజ్" కాలంలో బయటకు వెళ్ళి, "హజ్" యాత్రికులకు "ఇస్లాం"ను గురించి పరిచయం చేయడం ఆయన (సల్లం)కు పరిపాటే.

            *"ఇస్లాం" ధర్మం బోధించబడిన తెగలు* 

 *"ఇమామె జహ్రీ (రజి)" కథనం ప్రకారం...., ↓* 

"ఏయే తెగల్లోనయితే ఆయన (సల్లం) వెళ్ళి "ఇస్లాం" ధర్మం ప్రచారం చేశారో, ఆ తెగల పేర్లు ఈ విధంగా ఉన్నాయి.

బనూ ఆమిర్ బిన్ సఅసఅ, ముహారిబ్ బిన్ హఫ్సా, ఫజారా, గస్సాన్, ముర్రా, హనీఫా, సలీమ్, అబస్, బనూ నస్ర్, బనుల్ బకా, కల్బ్, హారీస్ బిన్ కఅబ్, అజ్రా, హజారిమా తెగలు. అయితే వాటిలో ఏ ఒక్క తెగ కూడా "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించలేదు.

"ఇమామె జహ్రీ (రజి)" లెక్కించిన ఈ తెగల్లో ఒకే సంవత్సరంగాని, ఒకే కాలంలో గాని, "ఇస్లాం" ధర్మ పరిచయం జరగలేదనేది గుర్తించాలి. దైవదౌత్యపు నాల్గవ సంవత్సరం మొదలు, హిజ్రత్ కంటే ముందు చివరి హజ్ వరకు గడిచిన పదేండ్ల కాలంలో జరిగింది ఈ ప్రయత్నం.

 *"ఇబ్నె ఇస్'హాక్", కొన్ని తెగల్లో "ఇస్లాం" సందేశ ప్రచారానికి జరిగిన ప్రతిక్రియ ఎలాగుందో కూడా వివరించారు. కొన్ని తెగల ప్రతిక్రియ ఎలాగుండిందో ఇక్కడ సంగ్రహంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాము. ↓* 

 *1. బనూ కల్బ్ : -* మహాప్రవక్త (సల్లం) ఈ తెగకు చెందిన ఓ శాఖ అయిన "బనూ అబ్దుల్లాహ్" వద్దకు వెళ్లి వారిని "అల్లాహ్" మార్గం వైపునకు పిలుపునిచ్చారు. మాటల సందర్భంలో, "ఓ బనూ అబ్దుల్లాహ్! అల్లాహ్ మీ ముత్తాత పేరు ఎంతో మేలైనదిగా పెట్టాడు." అని అన్నారు. కాని ఆ తెగవారు ఆయన (సల్లం) మాటలను లెక్కచేయలేదు. "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించలేదు.

 *2. బనూ హనీఫా : -* దైవప్రవక్త (సల్లం), వారి గుడారాల వద్దకు వెళ్ళి, "అల్లాహ్" ధర్మం వైపునకు పిలవడం జరిగింది. తాను దైవప్రవక్తనని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు దైవప్రవక్త (సల్లం). అయితే అరబ్బులు ఇదివరకు ఇవ్వనంత దురుసు సమాధానం ఇచ్చారు ఆ తెగవారు.

 *3. ఆమిర్ బిన్ సఅసఅ : -* వారిని కూడా మహాప్రవక్త (సల్లం), "అల్లాహ్" ధర్మమైన "ఇస్లాం" వైపునకు పిలుపునిచ్చారు. తాను దైవప్రవక్తనని చెప్పారు. దానికి సమాధానంగా "బుహీరా బిన్ ఫరాస్" అనేవాడు....,

 *బుహీరా : -* దైవసాక్షి! నేను ఖురైష్ కు చెందిన ఈ యువకుణ్ణి అందుకుంటే పూర్తి అరేబియానే మ్రింగేయగలను." అని చెబుతూ,  "చెప్పండి! ఒకవేళ మేము మీ ఈ ధర్మాన్ని స్వీకరిస్తే, ఆపై అల్లాహ్ మీకు మీ వ్యతిరేకులపై ఆధిపత్యం ఇస్తే, మీ తరువాత అధికారం మా చేతికి వస్తుందా? (అని అడిగాడు.)

దానికి దైవప్రవక్త (సల్లం) ఇలా సమాధానిచ్చారు.

 *ముహమ్మద్ (సల్లం) : -* అధికారం మొత్తం అల్లాహ్ దే. ఆయన ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు.

 *బుహీరా : -* ఓహో అలాగా! మీ సంరక్షణలో మా వక్షస్థలం అరబ్బు జాతికి ఎదురుగా పెట్టాలా? అల్లాహ్ మీకు విజయం చేకూరిస్తే అధికారం మరొకరి చేతిలో ఉంటుందా? మాకు మీ ధర్మం అవసరం ఎంతమాత్రం లేదు పొండి.

ఈ విధంగా తన తిరస్కార వైఖరిని అవలంబించాడు.

ఆ తరువాత "అబూ ఆమిర్" తెగవారు తన ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోయిన తరువాత, వృద్ధాప్యం కారణంగా "హజ్"కు వెళ్ళలేక, అక్కడే ఉండిపోయిన ఓ వృద్ధుణ్ణి కలిసి విషయమంతా చెబుతూ...., *"మా వద్దకు ఖురైష్ వంశానికి చెందిన "అబ్దుల్ ముత్తలిబ్" యువకుడొకడు వచ్చాడు, అతను తనను తాను ప్రవక్తగా ప్రకటించి తనను సంరక్షించమని అడిగాడు, తనకి సహాయపడవల్సిందిగా, తనని మన వెంట తోడ్కొని మన ప్రాంతానికి తీసుకపోవలసిందిగా కోరాడు."* అని దైవప్రవక్త (సల్లం) గురించి, ఆ వృద్ధుడికి వివరించారు.

ఇది విన్న ఆ వృద్ధుడు తన తలను రెండు చేతులతో పట్టుకొని బాధపడుతూ...., *"అయ్యో బనీ ఆమిర్! దీనికి పరిహారం మరేది? జరిగిపోయినదానికి దిద్దుబాటు ఎక్కడిది? ఆ దైవం సాక్షి! ఎవరి చేతిలోనయితే ఫలానా వ్యక్తి ప్రాణాలున్నాయో! ఏ ఇస్మాయీల్ సంతతివాడూ ఇప్పటి వరకు బూటకపు ప్రవక్త అని సవాలు విసరలేదు. ఆయన (సల్లం) తప్పక ప్రవక్తే! మీ బుద్ధీవివేచనలు ఎక్కడ అడుగంటిపోయాయి?"* అని తల బాదుకున్నాడు.

 *మక్కాకు వెలుపల విస్తరించిన విశ్వాస కిరణాలు : -* 

తెగలకు, వర్గాలకు "ఇస్లాం" గురించి ప్రబోధించినట్లే మహాప్రవక్త (సల్లం) వేరు వేరు ప్రముఖ వ్యక్తుల్ని కలిసి "ఇస్లాం" సందేశాన్నిచ్చారు. వారిలో కొందరు సకారాత్మకంగా స్పందించారు. "హజ్" కాలం గడిచిన తరువాత కొందరు "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించారు కూడా.

 *ఆ ప్రముఖ వ్యక్తుల "ఇస్లాం" స్వీకరణ గురించి, వారికి వినిపించిన దైవసందేశం గురించి In Shaa Allah రేపటి భాగములో....;* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment