160

🌿             ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪             🌿

🍂   🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌  🍂
🍃   🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*    🕌 🍃

✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦

🌾🔅     🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 160* 🕋🛐      🔅🌾

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 75* 🇸🇦🇸🇦🇸🇦

───────────┄┅━═══✦═══━┅┄───────────

 _(జిన్నుల కథ కొనసాగింపు)_ 

 *(ఖుర్ఆన్ 46:29-31 మరియు ఖుర్ఆన్ 72:1-15)* 

ఈ ఆయత్ లు అవతరించిన సందర్భాన్నిబట్టి చూస్తే, మొదట జిన్నుల బృందం "ఖుర్ఆన్" పఠనం విన్న దాని గురించి దైవప్రవక్త (సల్లం)కు తెలియదు అనేది. ఆ తరువాత ఈ ఆయత్ ల ద్వారా అల్లాహ్, ఆయన (సల్లం)కు తెలియజేస్తే తప్ప తెలియలేదు. అదే కాదు, మరో విషయం ఏమిటంటే, ఈ ఖుర్ఆన్ మొదటినుంచే అన్నది. హాదీసుల ద్వారా ఈ జిన్నుల రాకపోకలు ఆ తరువాత కొనసాగాయని తెలుస్తుంది.

జిన్నుల రాక, వారి "ఇస్లాం" స్వీకార సంఘటన నిజానికి "అల్లాహ్" తరఫున మరో సహాయమే అనాలి. అది ఆయన పరోక్షంగా చేసిన సహాయం. ఇది "అల్లాహ్"కు తప్ప ఎవరికీ తెలియదు. అదే కాకుండా, ఆ సంఘటనకు సంబంధించి అవతరించిన ఆయత్ లలో దైవప్రవక్త (సల్లం)కు శుభవార్తలు కూడా ఉన్నాయి. ఆ శుభవార్తలు ఏమిటంటే, విశ్వంలోని ఏ శక్తి కూడా సందేశ ప్రచార విషయంలో అడ్డంకి కాజాలన్నది. కాబట్టి "దివ్యఖుర్ఆన్"లో ఇలా సెలవీయడం జరిగింది. ↓

 *"అల్లాహ్ వైపు పిలిచేవాని మాట విననివాడు భూమిలో ఎక్కడా (పారిపోయి అల్లాహ్ ను) అలుపుకు గురిచేయలేడు. అల్లాహ్ తప్ప అతనికి సాయపడేవారు కూడా ఎవరూ ఉండరు. ఇలాంటి వారు స్పష్టమైన మార్గభ్రష్టతకు లోనై ఉన్నారు." (ఖుర్ఆన్ 46:32).* 

 *"మనం భూమిలో అల్లాహ్ ను అశక్తుణ్ణి చేయటంగానీ, పారిపోయి (ఊర్థ్వలోకాల్లో) ఆయన్ని ఓడించటంగానీ మనవల్ల కాని పని అని మాకర్ధమైపోయింది." (ఖుర్ఆన్ 72:12).* 

ఈ దైవసహాయం, ఈ శుభవార్తలు అందడం మూలంగా, తాయెఫ్ నుండి బయలు వెడలేటప్పుడు దైవప్రవక్త (సల్లం)ను పరివేష్టించి ఉన్న ఆ నిరాశనిస్పృహ కారుమేఘాలన్నీ తొలగిపోయాయి. ఆయన (సల్లం) అనుభవించిన బాధలు, తిన్న తిట్లూ, ఆయన (సల్లం)కు కలిగిన మనస్తాపం అంతా మటుమాయమైపోయాయి.

ఇక ఆయన (సల్లం) "మక్కా"కే తిరిగి వెళ్ళాలని, తిరిగి దైవసందేశ ప్రచారంలో, దైవదౌత్య కార్యకలాపాల్లో నిమగ్నమైపోవాలని ఓ దృఢ నిశ్చయానికి వచ్చారు.

ఈ సందర్భంలొనే "హజ్రత్ జైద్ (రజి) బిన్ హారిసా", దైవప్రవక్త (సల్లం)ను ఉద్దేశించి...., *"ఓ ప్రవక్తా! మక్కా వాసులు (అంటే ఖురైష్) తమరిని అక్కడ నుండి వెళ్ళగొట్టారు కదా! తిరిగి మనం అక్కడికి ఎలా వెళ్ళగలం?"* అని ప్రశ్నించడం జరిగింది. సమాధానంగా మహాప్రవక్త (సల్లం)...., *"ఓ జైద్ (రజి)! పరిస్థితి నీకు తెలిసిందే కదా! అల్లాహ్, ముక్తి మార్గాన్ని మనకు ఏదో ఒక విధంగా చూపించకపోడు. తప్పకుండా అల్లాహ్ తన ధర్మాన్ని రక్షిస్తాడు. తన ప్రవక్తకు విజయం చేకూరుస్తాడు."* అని సెలవిచ్చారు.

(ఇటు మరో ప్రక్క....) మక్కా వారికి "తాయెఫ్" వృత్తాంతం తెలిసిపోయింది. ముహమ్మద్ (సల్లం) ప్రయత్నాలు విఫలమయ్యాయని, "సఖీఫ్" అల్లరిమూక ఆయన (సల్లం)ని బాగా ఇబ్బంది పెట్టిందని విని వారు తెగ సంబరపడిపోయారు. ముహమ్మద్ (సల్లం) తిరిగివస్తే, ఈసారి ఆయన (సల్లం)ని శాశ్వతంగా కడతేర్చిగాని కునుకుతీయమని ప్రతిన బూనారు. ఇప్పుడు ఆయన (సల్లం) ధైర్యం సన్నగిల్లి ఉంటుందని, అంచేత ఈసారి ఆయన (సల్లం)ను లొంగదీసుకొని మట్టుబెట్టడం తేలికని భావిస్తున్నారు వారు.

ఖురైషీయుల ఈ దూరాలోచనలు, కుతంత్రాలు దైవప్రవక్త (సల్లం)కు ఏం తెలుసు? ఆయన (సల్లం) మక్కాకే తిరిగివస్తున్నారు. "హిరా" గుహకు చేరుకునేటప్పటికి, మక్కా నుంచి వస్తున్న కొందరు బాటసారులు కలిశారు. వారిద్వారా ఖురైషీయుల దుష్టపథకాలు (దైవప్రవక్త (సల్లం)కు) తెలిశాయి.

అప్పుడు దైవప్రవక్త (సల్లం) వారిలో (ఖుజాఅ తెగకు చెందిన) ఒకతనితో, *"ఖురైషీయుల దగ్గరకు పోయి, వారికి నా సందేశం ఒకటి వినిపిస్తావా?"* అని అడిగారు.

దానికి ఆ బాటసారి సంతోషంతో, *"తప్పకుండా వినిపిస్తాను. చెప్పండి"* అని అన్నాడు.

 *"అయితే "అఖ్నస్ బిన్ ఖురైష్" దగ్గరకి వెళ్ళిరా. దైవసందేశ ప్రచారం చేసుకోవడానికి, ఆయన నాకు ఆశ్రయం ఇవ్వగలడేమో అడుగు."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

అతను, "అఖ్నస్" దగ్గరికి వెళ్లి, దైవప్రవక్త (సల్లం) కోరికను తెలియజేశాడు.

దానికి అఖ్నస్, *"నేను ఖురైషీయుల పక్షానికి చెందిన వాడిని. వాళ్ళతో నేను సంధి చేసుకుని ఉన్నాను. అలాంటి వాళ్లకు వ్యతిరేకంగా నేను ముహమ్మద్ (సల్లం)కు ఎలా ఆశ్రయం ఇవ్వగలుగుతాను?"* అని అన్నాడు.

ఆ మనిషి తిరిగొచ్చి, అఖ్నస్ చెప్పిన మాటలను దైవప్రవక్త (సల్లం)కు వినిపించాడు.

 *"సరే, మరొకసారి పోయి రాగలవా?"* అని అడిగారు దైవప్రవక్త (సల్లం).

దానికి అతను, *"వెళ్ళొస్తాను."* అని అన్నాడు.

 *"ఈ సారి "సుహైల్ బిన్ అమ్ర్" దగ్గరకు పోయి, అతను నాకు స్వేచ్ఛగా దైవసందేశ ప్రచారం చేయడానికి రక్షణ కల్పించగలడేమో అడుగు."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

అతను సుహైల్ దగ్గరికి పోతే మళ్ళీ నిరాశే ఎదురయింది.

 *"మేము "అమ్ర్ బిన్ లువయ్యా" తెగకు చెందిన వాళ్ళం. అంచేత మేము "కఅబ్" సంతతికి వ్యతిరేకంగా ముహమ్మద్ (సల్లం)కు రక్షణ కల్పించలేము."* అన్నాడు సుహైల్ తన అసహాయత వ్యక్తపరుస్తూ.

ఆ వ్యక్తి దైవప్రవక్త (సల్లం) వద్దకు తిరిగొచ్చి సుహైల్ అన్న మాటలను వినిపించాడు.

 *"సరే పోనీ, ఏమీ అనుకోకపోతే బాధపడకుండా మరొక్కసారి వెళ్ళివస్తావా?"* అన్నారు దైవప్రవక్త (సల్లం).

 *"అలాగే వెళ్ళొస్తాలెండి."* అన్నాడు బాటసారి విసుక్కోకుండా.

 *"అయితే ఈసారి "ముత్'యిమ్ బిన్ అద్దీ" దగ్గరకి వెళ్ళిరా. "ముత్'యిమ్"కు కూడా ఈ విషయమే చెప్పి, అతని అభిప్రాయం కనుక్కొనిరా."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

అతను "ముత్'యిమ్" దగ్గరికి వెళ్లి, విషయం చెప్పి *"మీరు ముహమ్మద్ (సల్లం)కు ఆశ్రయం ఇవ్వగలరా?"* అని అడిగాడు.

 *"తప్పకుండా ఇస్తాను."* అన్ని అన్నాడు "ముత్'యిమ్" ఏమాత్రం తటపటాయించకుండా.

అనడమేమిటి, మరునాడు తెల్లవారగానే తన కొడుకుల్ని, కొందరు బంధువుల్ని వెంటబెట్టుకుని దైవప్రవక్త (సల్లం)ను పిలుచుకు రావడానికి బయలుదేరాడు. ఖురైషీయులతో ఏదైనా ఘర్షణ జరిగితే, ఎదుర్కోవడానికి అందరూ సైనిక దుస్తులు ధరించి, నడుములకు ఖడ్గాలు వ్రేలాడదీశారు. చేతుల్లో చురకత్తులు కూడా తీసుకున్నారు.

"హిరా" ప్రాంతంలో ఎదురుచూస్తున్న దైవప్రవక్త (సల్లం), వీళ్ళను చూసి చాలా సంతోషించారు. "ముత్'యిమ్" దైవప్రవక్త (సల్లం)ను తీసుకొని మక్కా (వైపునకు) దారితీశాడు. పట్టణం వెలుపల కొందరు ఖురైషీయులు కనిపించారు. వారిలో "అబూ జహల్" కూడా ఉన్నాడు.

 *""ముత్'యిమ్!" ముహమ్మద్ (సల్లం)కు ఆశ్రయమిచ్చావా లేక ఆయన(సల్లం)ని విశ్వసించావా?" అని అడిగాడు "అబూ జహల్" ముందుకెళ్ళి.* 

 *"ఆశ్రయమిచ్చాను"* అన్నాడు "ముత్'యిమ్" ముక్తసరిగా.

ఈ సమాధానం విని "అబూ జహల్" మరేమీ మాట్లాడలేదు. తరువాత "ముత్'యిమ్" వెంట దైవప్రవక్త (సల్లం) పట్టణంలోకి ప్రశాంతంగా ప్రవేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. ఆయన (సల్లం) సరాసరి కాబా గృహానికి వెళ్లారు. ఆ సమయంలో కాబాలో కొందరు ఖురైషీయులు కూర్చుని ఉన్నారు. వారిలో "హాషిమ్" సంతతి వాళ్లు కూడా ఉన్నారు. అంతలో "అబూ జహల్" కూడా అక్కడికి చేరుకున్నాడు.

 *"మునాఫ్ సంతతి సోదరులారా! ఇదిగో చూడండి, మీ ప్రవక్తగారు వేంచేస్తున్నారు!"* అన్నాడు "అబూ జహల్" వెటకారంగా.

"హాషిమ్" సంతతికి చెందిన "ఉత్బా" వెంటనే, *"మనలో ఎవరైనా ప్రవక్తయితే లేదా ఎవరికైనా రాచరికం లభిస్తే అందులో అసూయపడాల్సిన విషయం ఏముంది?"* అని అన్నాడు.

ఇదంతా గమనిస్తున్న దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి, *"ఉత్బా! వింతగా ఉన్నాయి నీ మాటలు. దేవుడు, దైవప్రవక్త అంటే చీమ కుట్టినట్లైనా లేదుగాని "హాషిమ్" సంతతి అంటే మాత్రం నీకు ఎక్కడలేని రోషం వచ్చిందన్నమాట!"* అని అన్నారు.

తరువాత ఆయన (సల్లం) "అబూ జహల్", తదితర ఖురైష్ నాయకుల వైపు చూస్తూ ఇలా అన్నారు....; ↓

 *""అబూ జహల్!" గుర్తుంచుకో ఆ సమయం ఎంతో దూరంలో లేదు. అప్పుడు నీ నవ్వంతా పటాపంచలైపోతుంది. నీవు రక్తకన్నీటితో తీవ్రంగా పశ్చాత్తాప పడతాడు. అయినా నీకు నిష్కృతి ఉండదు. ఖురైషీయులారా! మీరు కూడా చెవియొగ్గి వినండి. మీ కోసం ఘోరమైన ఒక దుర్దినం త్వరలోనే రానున్నది. అప్పుడు మీరు ఎలాంటి భయంకరమైన పరిణామాలకు గురికావలసి వస్తుందో ఆలోచించుకోండి."* 

ఖురైషీయులు, దైవప్రవక్త (సల్లం) చెప్పిన ఈ మాటలను విని కుతకుతలాడిపోతారు. కాని ఏం చేయగలరు? "ముత్'యిమ్" ఆయన (సల్లం)కు ఆశ్రయమిచ్చాడు కదా. అంచేత కోపాన్ని బలవంతంగా దిగమింగి గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు.

ఆరోజు దైవప్రవక్త (సల్లం), ఖురైషీయులు నుండి దృష్టి మళ్ళించి ఇతర తెగలలో ధర్మప్రచారం ప్రారంభించారు. "మక్కా" చుట్టుప్రక్కల ప్రాంతాలలో నివసిస్తున్న ఆయా తెగల దగ్గరకి పోయి, వారికి దైవసందేశం అందజేయసాగారు.

 *మరో ఉల్లేఖనంలో....; ↓* 

దైవప్రవక్త (సల్లం), "ఖుజాఅ" తెగకు చెందిన వ్యక్తి ద్వారా "ముత్'యిమ్ బిన్ అద్దీ" దగ్గరకు సందేశం పంపగా, ఆయన *"సరేనని"* ఒప్పుకున్నాడు.

"ముత్'యిమ్ బిన్ అద్దీ" ఆయుధధారుడై తన కుమారుల్ని, తన తెగ వారిని పిలిపించాడు. *"మీరందరు ఆయుధాలు ధరించి కాబా గృహం నాలుగు మూలలా నిలబడి ఉండండి. నేను ముహమ్మద్ (సల్లం)కు శరణిచ్చాను."* అని చెప్పి, దైవప్రవక్త (సల్లం) వద్దకు, *"మక్కాకు వచ్చేయండి"* అని కబురు పంపాడు. ఈ వార్త అందగానే "జైద్ (రజి) బిన్ హారిసా"ను వెంటబెట్టుకొని దైవప్రవక్త (సల్లం) మక్కాలో అడుగిడి, మొదట "మస్జిదె హరామ్"లో ప్రవేశించారు.

"ముత్'యిమ్ బిన్ అద్దీ" తన వాహనం పై నిలబడి, *"ఖురైష్ ప్రజలారా! నేను ముహమ్మద్ (సల్లం)కు శరణు ఇచ్చాను. ఇప్పుడు ఆయన (సల్లం)ను ఎవరూ ఏమీ అనడానికి వీల్లేదు."* అని ప్రకటించాడు.

ఇటు మహాప్రవక్త (సల్లం) నేరుగా "హజ్రె అస్వద్" వద్దకు వెళ్ళి దానిని ముద్దుపెట్టుకున్నారు. ఆ తరువాత రెండు రకాతుల నమాజు చేసి ఇంటికి తిరిగి వచ్చేశారు. ఆ సమయంలో "ముత్'యిమ్ బిన్ అద్దీ", ఆయన కుమారులు ఆయుధధారులై ప్రవక్త (సల్లం) చుట్టూ నడుస్తున్నారు.

ఈ సందర్భంగా అబూ జహల్, ముత్'యిమ్ తో...., *"(ముత్'యిమ్!) నీవు ఆయన (సల్లం)కు రక్షణ కల్పించడం మట్టుకేనా! లేదా ఆయన (సల్లం)కు అనుచరుడివి (అంటే, ముస్లిమువి కూడా) అయ్యావా?"* అని అడిగాడు. సమాధానంగా ముత్'యిమ్, *"లేదు"* అని అనగా, *"నీవు రక్షణ ఇచ్చిన వానికి మేమూ రక్షణ ఇస్తాము."* అని అన్నట్లు చెప్పడం జరుగుతుంది.

మహాప్రవక్త (సల్లం), "ముత్'యిమ్ బిన్ అద్దీ" చేసిన సహాయాన్ని ఎన్నడూ మరువలేదు. "బద్ర్" యుద్ధంలో మక్కా దైవతిరస్కారులు పెద్ద సంఖ్యలో ఖైదీలుగా పట్టుబడినప్పుడు కొందరు ఖైదీలను విడిపించడానికి "ముత్'యిమ్" కుమారుడు "జుబైర్", ప్రవక్త (సల్లం) సన్నిధిలో హాజరు అయ్యాడు. అప్పుడు ఆయన (సల్లం) అతనిని ఉద్దేశించి....; ↓

 *""ముత్'యిమ్" జీవించి ఉండి, "బద్ర్" యుద్ధంలో పట్టుబడ్డ ఈ తుఛ్ఛులను విడిచి పెట్టమని అడిగి ఉంటే, అతని కోసం నేనందరినీ విడిచి పెట్టేవాణ్ణి." అని అన్నారు.* 

వివిధ తెగల్లో "ఇస్లాం" ధర్మ ప్రచారం In Shaa Allah రేపటి భాగములో....;

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment