159

🌿             ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪             🌿

🍂   🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌  🍂
🍃   🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*    🕌 🍃

✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦

🌾🔅     🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 159* 🕋🛐      🔅🌾

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 74* 🇸🇦🇸🇦🇸🇦

───────────┄┅━═══✦═══━┅┄───────────

దైవసందేశ ప్రచారంలో భాగంగా దైవప్రవక్త (సల్లం) "తాయెఫ్" పట్టణానికి ప్రయాణమై వెళ్ళారు. ఆయన (సల్లం)కు జతగా "హజ్రత్ జైద్ (రజి)" కూడా ఉన్నారు.

దైవప్రవక్త (సల్లం), "తాయెఫ్" వాసులకు దైవసందేశాన్ని వినిపించగా, వారు విముఖత చూపారు. నిరాశ, నిస్పృహలతో ప్రవక్త (సల్లం), అక్కడ్నుంచి బయలుదేరారు. "తాయెఫ్" ప్రజలు సత్యాన్ని విశ్వసించలేదు కదా, దైవప్రవక్త (సల్లం) పై దాడి చేయసాగారు. చివరికి, ఆయన (సల్లం) మరియు జైద్ (రజి) ఓ ద్రాక్ష పండ్ల తోటలోకి వెళ్ళి తలదాచుకోవలసి వచ్చింది.

ఆ తర్వాత జరిగినది నిన్నటి భాగములో తెలుసుకున్నాము.

అక్కడ కాసేపు సేదతీరిన తర్వాత, తిరిగి మక్కాకు ప్రయాణమయ్యారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు....; ↓

                      *జిన్నుల రాక* 

దైవప్రవక్త (సల్లం) అక్కడి నుంచి "జైద్ (రజి)"ను తీసుకొని మక్కా పట్టణం తిరుగు ప్రయాణమయ్యారు. కాలినడకన ప్రయాణమైనందున చాలా అలసిపోయారు. విశ్రాంతి కోసం ఆ రాత్రి "నఖ్లా" అనే ప్రదేశంలో ఆగారు.

 _(నక్లా లోయలో కొన్ని రోజులు బస చేసినప్పుడు "అల్లాహ్", ఆయన (సల్లం) వద్దకు "జిన్నుల" ఓ వర్గాన్ని పంపించడం జరిగింది. ఈ ప్రస్తావన "దివ్యఖుర్ఆన్"లో రెండు చోట్ల వచ్చింది. ఒకటి "జిన్" సూరాలో, మరొకటి "అహ్కాఫ్" సూరాలో._ 

 _"జిన్నులు" అనేవి ఒక రకపు అగోచర ప్రాణులు. మానవుల మాదిరిగా వీరు కూడా బుద్ధీజ్ఞానాలు కలిగిన జీవులు. "అల్లాహ్", మానవులతోపాటు జిన్నులను కూడా తన ఆరాధన కోసమే పుట్టించాడు.)_ 

"నఖ్లా" లోయకు చేరుకున్న తర్వాత వారు విశ్రాంతికి ఉపక్రమించారు. "ఫజ్ర్" నమాజు సమయం కాగానే, దైవప్రవక్త (సల్లం) నమాజు చేయడానికి సంకల్పించారు.

ప్రశాంత వాతావరణం, నిశ్శబ్ద పరిసరాలు, దైవప్రవక్త (సల్లం) నమాజు చేయడం ప్రారంభించారు. మధురమైన కంఠంతో "ఖుర్ఆన్" పఠించసాగారు. అప్పుడు జిన్నుల సమూహం ఒకటి అటుగా పోవడం జరిగింది. "ఖుర్ఆన్" పఠనం వారి చెవిన పడింది. ఆ మధురవాణి వారి చెవులకింపుగా, వింతగా తోచింది.

దాంతో వారు ఠక్కున ఆగి ఆ దివ్యవాణిని శ్రద్ధగా ఆలకించసాగారు. క్రమంగా అది వారి మనోఫలకాలపై ముద్రించుకుపోయింది.

 _↑ ఈ సంఘటనను "దివ్యఖుర్ఆన్" ఇలా వర్ణించింది. ↓_ 

 *(ఓ ప్రవక్తా!) జిన్నుల సమూహం ఒకదానిని మేము ఖుర్ఆన్ వినేందుకు నీ వైపునకు పంపిన సంగతిని కాస్త మననం చేసుకో. వారు ప్రవక్త దగ్గరకు చేరుకున్నప్పుడు, "నిశ్శబ్దంగా వినండి" అని (పరస్పరం) చెప్పుకున్నారు. మరి ఆ పారాయణం ముగియగానే, తమ వర్గం వారిని హెచ్చరించటానికి వాళ్ళ వద్దకు తిరిగి వచ్చారు. వారిలా అన్నారు : "ఓ మా జాతి వారలారా! మూసా తరువాత అవతరింపజేయబడిన గ్రంథాన్ని మేము విన్నాము. అది తనకు పూర్వం ఉన్న దైవగ్రంథాలన్నింటినీ ధృవీకరిస్తోంది. ఇంకా - అది సత్యధర్మం వైపునకు, తిన్నని దారి వైపునకూ దర్శకత్వం వహిస్తోంది." "ఓ మా జాతి వారలారా! అల్లాహ్ వైపునకు పిలిచేవాని మాట వినండి. అతన్ని విశ్వసించండి. అల్లాహ్ మీ పాపాలను మన్నిస్తాడు. బాధాకరమైన శిక్ష నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. అల్లాహ్ వైపు పిలిచేవాని మాట వినని వాడు భూమిలో ఎక్కడా (పారిపోయి అల్లాహ్ ను) అలుపుకు గురిచేయలేడు. అల్లాహ్ తప్ప అతనికి సాయపడేవారు కూడా ఎవరూ ఉండరు. ఇలాంటి వారు స్పష్టమైన మార్గభ్రష్టతకు లోనై ఉన్నారు. (ఖుర్ఆన్ 46:29-31).* 

 _(సహీహ్ ముస్లిం ఉల్లేఖనం ప్రకారం తెలిసేదేమిటంటే, ఈ సంఘటన మక్కాకు సమీపంలో ఉన్న "నఖ్లా" లోయ వద్ద దైవప్రవక్త (సల్లం), "ఫజ్ర్" నమాజు చేయిస్తుండగా జరిగింది._ 

 _ఒకానొక రోజు తెల్లవారుజామున ఒక జిన్నుల సమూహం, దైవప్రవక్త (సల్లం) నోట "ఖుర్ఆన్" వాణిని విన్నది. "దివ్యఖుర్ఆన్"ను వినగానే ఆ జిన్నుల సమూహం దైవప్రవక్త (సల్లం)ను విశ్వసించింది. అది తన జన సమూహంలోకి వెళ్ళి జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించింది. "ఇస్లాం"ను స్వీకరించమని తమ వాళ్ళను కోరింది.)_ 

 _"జిన్ను" సూరా ఆయత్ లు ఇలా ఉన్నాయి. ↓_ 

 *(ఓ ముహమ్మద్ - సల్లం) వారికి చెప్పు : నాకు దివ్యవాణి (వహీ) ద్వారా ఇలా తెలియజేయబడింది. జిన్నుల సమూహం ఒకటి (ఖుర్ఆన్)ను విన్నది (1). వారు (తమ వాళ్ళతో) ఇలా అన్నారు : "మేమొక అద్భుతమైన ఖుర్ఆన్ ను విన్నాము (2)." "అది సన్మార్గం వైపు దర్శకత్వం వహిస్తోంది (3). అందుకే మేము దానిని విశ్వసించాము (4). ఇక నుంచి మేము ఎవరినీ - ఎన్నటికీ - మా ప్రభువుకు సహవర్తుల్ని కల్పించము (5)." "ఇంకా - మా ప్రభువు మహిమ అత్యున్నతమైనది. ఆయన తన కోసం (ఎవరినీ) భార్యగాగానీ, కొడుకుగాగానీ చేసుకోలేదు (6)." "ఇంకా - మనలోని మూర్ఖుడు అల్లాహ్ గురించి సత్యవిరుద్ధమైన మాటలు పలికేవాడు (7)." "మనుషులైనా, జిన్నులైనా అల్లాహ్ కు అబద్ధాలు అంటగట్టడం అనేది అసంభవమని మనం అనుకున్నాం (8)." "అసలు విషయమేమిటంటే కొందరు మనుషులు కొందరు జిన్నాతుల శరణు వేడేవారు (9). ఈ కారణంగా జిన్నాతుల పొగరు మరింత పెరిగిపోయింది (10)." "అల్లాహ్ ఎవరినీ పంపడని (లేక ఎవరినీ తిరిగి బ్రతికించడని) మీరు తలపోసినట్లుగానే మనుషులు కూడా తలపోశారు." "మేము ఆకాశంలో బాగా వెదికాము. అది అప్రమత్తులైన పహరాదారులతో, అగ్ని జ్వాలలతో నిండి ఉండటం చూశాము (11)." "లోగడ మనం విషయాలు వినటానికి ఆకాశంలో పలుచోట్ల (మాటేసి) కూర్చునే వాళ్ళం (12). ఇప్పుడు ఎవరయినా చెవి యొగ్గి వినదలిస్తే, తన కోసం కాచుకుని ఉన్న అగ్నిజ్వాలను అతను పొందుతున్నాడు (13)." "ఇంకా - భూమిలో ఉన్న వారికోసం ఏదైనా కీడు తలపెట్టబడినదో లేక వారి ప్రభువు వారికి సన్మార్గ భాగ్యం ప్రసాదించగోరుతున్నాడో మాకు తెలియదు (14)." "ఇంకా ఏమిటంటే - మనలో కొందరు సజ్జనులుంటే మరికొందరు తద్భిన్నంగా ఉన్నారు. మన దారులు వేర్వేరుగా ఉన్నాయి (15)." "మనం భూమిలో అల్లాహ్ ను అశక్తుణ్ణి చేయటంగానీ, పారిపోయి (ఊర్థ్వలోకాల్లో) ఆయన్ని ఓడించటంగానీ మనవల్ల కాని పని అని మాకర్ధమైపోయింది." "మేము మాత్రం సన్మార్గబోధను వినగానే దానిని విశ్వసించాం. ఇక ఎవడు తన ప్రభువును విశ్వసించినా అతనికి ఎలాంటి నష్టంగానీ, అన్యాయంగానీ జరుగుతుందన్న భయం ఉండదు (16)." "ఇంకా - మనలో కొందరు ముస్లింలై (దైవ విధేయులై) ఉంటే, మరికొందరు సన్మార్గం నుండి తొలగి ఉన్నారు (17). కనుక విధేయతా వైఖరిని అవలంబించిన వారు సన్మార్గాన్ని అన్వేషించుకున్నారు." "సన్మార్గం నుండి తొలగిపోయి, అపవాదానికి లోనైనవారు - నరకానికి ఇంధనం అవుతారు (18)." (ఖుర్ఆన్ 72:1-15).* 

 _(1 → ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని వివరాలు ఇంతకు ముందు అహ్'ఖాఫ్ సూరా - 29 వ వచనానికి వివరణగా వచ్చాయి. "నఖ్లా" అనే ఒక లోయలో దైవప్రవక్త (సల్లం) "ఫజ్ర్" నమాజు చేయిస్తూ ఉండగా, జిన్నుల సమూహం ఒకటి అటువైపుగా వెళుతూ మహాప్రవక్త (సల్లం) నోటా "ఖుర్ఆన్" పారాయణం విన్నది. దానికి వారెంతో ప్రభావితులయ్యారు. వారు "ఖుర్ఆన్" విన్న సంగతి దైవప్రవక్త (సల్లం)కు కూడా తెలియదు. దైవవాణి (వహీ) ద్వారా ఆయన (సల్లం)కు ఈ విషయం తెలియజేయబడింది.)_ 

 _(2 → మేము విన్న ఆ ఖుర్ఆన్ చాలా గొప్పది. అరబీ భాష రీత్యా, తేటదనం దృష్ట్యా అద్భుతమైనది. బోధనాతీరు దృష్ట్యా అది అమోఘం. శుభాల రీత్యా ఎంతో విచిత్రమైనది.)_ 

 _(3 → ఈ ఖుర్ఆన్ లోని మరో సుగుణం ఏమిటంటే, అది సన్మార్గం చూపిస్తుంది. సత్యాన్ని చాలా చక్కగా విశ్లేషించి చెబుతుంది. నిజదైవాన్ని కనుగొనే జిజ్ఞాసను రేకెత్తిస్తుంది.)_ 

 _(4 → అంటే - మేము ఈ "ఖుర్ఆన్"ను విన్నంతనే ఖచ్చితంగా దైవవాక్కు అని, అది మానవ కల్పితం కాదని తెలుసుకున్నాము. ఈ ఆయతులో అవిశ్వాసులకు హెచ్చరిక ఉంది. ముఖ్యంగా మక్కావాసులకు! జిన్నులు ఒకసారి వినగానే ఈ వాణిని విశ్వసించారు. కొన్ని వాక్యాలు వినేసరికే వారి జీవితాలు మారిపోయాయి. ఈ వాక్కు మానవవాక్కు కాదన్న సత్యాన్ని కూడా వారు గ్రహించారు. కాని మానవులకు, ముఖ్యంగా వారి నాయకమన్యులకు ఈ గ్రంథం బుర్రకెక్కలేదు. మరి చూడబోతే వారు దైవప్రవక్త (సల్లం) నోట ఎన్నోసార్లు "ఖుర్ఆన్" పారాయణం విన్నారు. మరి ఆ ప్రవక్త కూడా బయట నుంచి వచ్చినవాడు కాదు. స్వయంగా వారిలో నుంచి ప్రభవింపజేయబడిన వాడే. మరి "ఖుర్ఆన్" కూడా పరభాషలో కాకుండా, వారి మాతృభాష అయిన అరబీలోనే వచ్చింది. అయినప్పటికీ వారు దీనిని విశ్వసించడానికి ఎందుకు తటపటాయిస్తున్నారు?)_ 

 _(5 → ఆయన సృష్టితాల్లో నుంచిగానీ, ఇతరత్రా చిల్లరదేముళ్ళనుగానీ మేము అల్లాహ్ కు సాటిగా నిలబెట్టబోము. ఎందుకంటే ఆయన తన గుణగణాల రీత్యా, అధికారాల దృష్ట్యా విలక్షణమైనవాడు. ఆయనను సరిపోలిన వారెవరూ లేరు.)_ 

 _(6 → అంటే ప్రాణులు కల్పించే భాగస్వామ్యాలను మన ప్రభువు అతీతుడు, ఉన్నతుడు. అటువంటి మహోన్నతునికి భార్యను, సంతానాన్ని ఆపాదించటం మహాపాతకం. ఈ విధంగా జిన్నులు ముష్రిక్కుల (బహుదైవారాధకుల) మూఢనమ్మకాన్ని ఎండగట్టారు.)_ 

 _(7 → మనలోని మూర్ఖుడు అంటే వాడు "షైతాన్" అని కొందరు భావిస్తున్నారు. జిన్నాతుల సహచరులు అని మరికొందరు అభిప్రాయపడ్డారు. అల్లాహ్ కు సంతానం కలదని, ఆ మూర్ఖులు తలపోసేవారు. అల్లాహ్ కు సంతానం కలదన్న మాట సమత్వం, సమతూకం నుండి తొలగిపోయినమాట. ఇలాంటి మాటల్ని మూర్ఖులు మాత్రమే పలుకుతారు. పైగా ఇది బరితెగించిన పోకడ! అబద్ధరాయుళ్లు మాత్రమే ఇలాంటి కల్లిబొల్లి మాటల్ని నిజదైవానికి ఆపాదిస్తారు.)_ 

 _(8 → అందుకే అల్లాహ్ గురించి వారు ఏం చెప్పినా నిజమని నమ్మేవాళ్ళం. కాని ఖుర్ఆన్ వాణిని విన్న తరువాత నిజానిజాలు మాకు తెలిశాయి.)_ 

 _(9 → ముఖ్యంగా అజ్ఞానంలో వారు సుదీర్ఘ ప్రయాణాలు చేస్తున్నప్పుడు, మార్గ మధ్యలో ఏ లోయలోనైనా విడిది చేసినప్పుడు, ఆ ప్రదేశంలోని పెద్దల శరణు కోరినట్లే, జిన్నాతుల రక్షణ కోరేవారు. "ఇస్లాం" ఈ సంప్రదాయాన్ని నిర్మూలించి, ఒక్కడైనా "అల్లాహ్" శరణు మాత్రమే కోరాలని తాకీదు చేసింది.)_ 

 _(10 → మానవుల్లో కొందరు తమ శరణు వేడడం చూసి జిన్నాతులు మరింత రెచ్చిపోయారు. తామేం చేసినా సమ్మతమేనన్న మొండి ధైర్యం జిన్నులలో కలగసాగింది.)_ 

 _(11 → అంటే - నిత్యం దైవదూతలు ఆకాశంలో పహరా కాస్తున్నారు. ఆకాశంలోని విషయాలు షైతానుల శక్తుల చెవిన పడకుండా వారు చూస్తూ ఉంటారు. ఒకవేళ ఏ షైతాను అయినా చాటుమాటుగా ఏదైనా వినదలిస్తే, నక్షత్రాలు జ్వాలలై వారిపై విరుచుకుపడతాయి.)_ 

 _(12 → గతంలో మనం చాటుమాటుగా ఆకాశ విశేషాలు కొన్నింటిని విని, జ్యోతిష్యులకు మరియు మంత్రగాళ్ళకు చేరవేసేవాళ్ళం. వాళ్ళేమో తమ తరఫున మరికొన్ని అబద్ధాలు కల్పించి తమ పబ్బం గడుపుకునేవాళ్లు.)_ 

 _(13 → కాని ముహమ్మద్ (సల్లం) ప్రభవనం తరువాత మన ఆటలు సాగడం లేదు. ఇప్పుడు మనలో, ఆకాశం వైపుకి ఎవరు తొంగిచూసినా, ఒక అగ్నిజ్వాల అతడ్ని వెంటాడుతుంది.)_ 

 _(14 → అంటే - ఆకాశంలో కట్టుదిట్టమైన ఈ భద్రతా ఏర్పాట్ల ద్వారా దేవుడు, భూలోకంలో ఏదైనా పథకానికి కార్యరూపం ఇవ్వదలిచాడో లేక భూలోక వాసులను శిక్షించదలిచాడో లేక ప్రవక్త ద్వారా ఏదైనా మహోపకారం మానవాళికి చేయదలిచాడో మాకు తెలియదు.)_ 

 _(15 → అంటే - మన అభిమతాలు, సిద్ధాంతాలు విభిన్నంగా ఉన్నాయి. మనం వివిధ సమూహాలుగా వేర్పడి, వివిధ జీవన దృక్పథాలను అవలంబిస్తున్నాము. - దీని భావం ఏమిటంటే జిన్నులలో కూడా ముస్లిములు, యూదులు, క్రైస్తవులు, జోరాస్ట్రియన్లు, ముష్రిక్కులు, నాస్తికులు తదితరులు ఉంటారు. మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం, జిన్నులలోని ముస్లింలలో కూడా అనేక రకాల వర్గాలు ఉంటాయి.)_ 

 _(16 → అంటే - అతను చేసిన సత్కార్యాల పుణ్యఫలం తగ్గించబడుతుందేమోనన్న భయం అతనికి ఉండనవసరం లేదు. అలాగే అతని వల్ల జరిగిన దుష్కార్యాలు, ఎక్కువచేసి చూపబడతాయన్న ఆందోళన కూడా అతనికి అక్కరలేదు.)_ 

 _(17 → అంటే - ముహమ్మద్ (సల్లం)ను అంతిమ దైవప్రవక్తగా నమ్మినవారు సిసలైన దైవవిధేయులు. ఆయన (సల్లం) దైవదౌత్యాన్ని తిరస్కరించినవారు అవిధేయులు, అన్యాయపరులు, సత్యమార్గం నుండి తొలగిపోయినవారుగా పరిగణింపబడతారు.)_ 

 _(18 → దీన్నిబట్టి అవగతమయ్యేదేమిటంటే మనుషుల మాదిరిగానే జిన్నాతులు కూడా స్వర్గంలోకి, నరకంలోకి ప్రవేశిస్తారు. వారిలోని అవిశ్వాసులు మరియు దుర్మార్గులు నరకానికి ఆహుతి అవగా, ముస్లిములు మరియు మంచివారు స్వర్గానికి పోతారు.)_ 

 *ఈ వాక్యంతో జిన్నాతుల సంభాషణ ముగిసింది.* 

ఈ ఆయత్ లు అవతరించిన సందర్భాన్నిబట్టి చూస్తే, మొదట జిన్నుల బృందం "ఖుర్ఆన్" పఠనం విన్న దాని గురించి దైవప్రవక్త (సల్లం)కు తెలియదు అనేది. ఆ తరువాత ఈ ఆయత్ ల ద్వారా అల్లాహ్, ఆయన (సల్లం)కు తెలియజేస్తే తప్ప తెలియలేదు. అదే కాదు, మరో విషయం ఏమిటంటే, ఈ ఖుర్ఆన్ మొదటినుంచే అన్నది. హాదీసుల ద్వారా ఈ జిన్నుల రాకపోకలు ఆ తరువాత కొనసాగాయని తెలుస్తుంది.

 *మిగిలి ఉన్న జిన్నుల కథ మరియు తాయెఫ్ ప్రయాణాన్ని ముగించుకొని, ముత్'యిమ్ రక్షణలో ప్రవక్త (సల్లం) మక్కాకు పునరాగమనం → In Shaa Allah రేపటి భాగములో....;* 

 ✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment