157

🌿             ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪             🌿

🍂   🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌  🍂
🍃   🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*    🕌 🍃

✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦

🌾🔅     🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 157* 🕋🛐      🔅🌾

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 72* 🇸🇦🇸🇦🇸🇦

───────────┄┅━═══✦═══━┅┄───────────

 *ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారి సహన సంయమనాలను పురిగొల్పిన కారణాలు : - 3* 

 _(నిన్నటి భాగము కొనసాగింపు)_ 

 *6. విజయం శుభవార్త : -* 

అదంతా ఒక ఎత్తు. పోతే, "ఇస్లాం" ధర్మ స్వీకారం అంటే శాశ్వత కష్టాలను కొనితెచ్చుకోవడం కానేకాదని, ఆ సందేశ ప్రచారం మొదలైన నాటి నుండే అజ్ఞానాన్ని, అజ్ఞానుల్ని, వారి దమనకాండను అంతమొందించడమని ఇది ప్రారంభం నుండే - ఇంకా చెప్పాలంటే, అంతకు పూర్వం నుండే - జరిగే కృషి అని ముస్లిములకు బాగా తెలిసిన విషయం. ఈ సందేశ ప్రచారానికి సంబంధించిన మరో కోణం, మరో లక్ష్యం ఏమిటంటే, ఈ భూమండలంలో తమ ప్రభావాన్ని విస్తరింపచేస్తూ, మానవాళిని, ప్రపంచ జాతుల్ని దైవాభీష్టం వైపునకు నడిచేటట్లుగా మానవాళిని మానవమాత్రుల దాస్య శృంఖలాల నుండి బయటకు లాగి, కేవలం "అల్లాహ్" దాస్యాన్నే అవలంబించేటట్లుగా ప్రపంచ రాజకీయ వ్యవస్థపై ప్రాబల్యం సంపాదించడం.

"దివ్యఖుర్ఆన్"లో ఈ శుభవార్తలు - అప్పుడప్పుడు సూచనప్రాయంగా, మరొకప్పుడు వివరంగా, అవతరించబడేవి. ఓ వైపు, ముస్లిములపై ప్రపంచం అంతా, ఇక వారి మనుగడ ఏ మాత్రం సాధ్యంకాదన్నట్లు, వారిని తుడిచిపారేసేటట్లు కుంచించుకుని వస్తున్నట్లుగా అగుపించేది. కాని మరో ప్రక్క ఈ నిరుత్సాహపరిచే పరిస్థితుల్లోనే, గత ప్రవక్తల చరిత్రల్ని వివరిస్తూ వారి అనుయాయుల్ని ఎలా తిరస్కరించడం జరిగిందో తెలిపే ఆయత్ లు కూడా అవతరించనారంభించాయి. ఈ ఆయత్ లలో, ప్రస్తుతం మక్కా ముస్లిములు, దైవతిరస్కారుల నడుమ జరిగే సంఘర్షణల్లాంటివే జరిగాయని, దైవమార్గాన్ని అవలంబించిన సత్పురుషుల్నే "అల్లాహ్" భూమండలానికి వారసులుగా చేశాడని, "అల్లాహ్" మార్గాన్ని తిరస్కరించిన తిరస్కారులను, ముష్కరులను "అల్లాహ్" నామరూపాల్లేకుండా చేసిన తీరును తెలిపే సూచనలు కానవస్తాయి. వీరు ముస్లిముల ఎడల ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే మక్కావాసులు ఒకనాటికి నామరూపాల్లేకుండా పోతారని, ముస్లిములు, ముస్లిముల సందేశ ప్రచారం విజయం సాధిస్తుందనే శుభవార్త కూడా ఆయత్ లలో ఉండేది. అదే కాదు, ఈ పరిస్థితుల్లోనే, ముస్లిములు విజయం పొందుతారు అనే శుభవార్త వివరాలు గలిగిన "ఖుర్ఆన్" ఆయత్ లు అవతరించేవి. ఉదాహరణకు ఆ ఆయత్ లు ఇలా ఉన్నాయి.

 *"మా ప్రియతమ దాసులైన ప్రవక్తలకు మేమిచ్చిన మాట ఇంతకుముందే నెరవేరింది (1). నిశ్చయంగా వారు మాత్రమే విజయం సాధిస్తారు (2). మరియు మా సైన్యాలే గెలుపొందుతాయి (3). కనుక (ఓ ప్రవక్తా!) కొంతకాలం పాటు వాళ్ళను పట్టించుకోకు (4). మరి వాళ్ళను గమనిస్తూ ఉండు. మున్ముందు (తమకు పట్టే దుర్గతిని) వాళ్ళూ చూసుకుంటారు (5). ఏమిటి? వాళ్ళు మా శిక్ష కోసం ఆత్రం చేస్తున్నారా? (6). మరి (వినండి!) మా శిక్ష వారి మైదానంలో వచ్చి వాలినప్పుడు, హెచ్చరించబడిన వారి పాలిట ఆ ఉదయం దారుణంగా ఉంటుంది (7)." (ఖుర్ఆన్ 37:171-177).* 

 *"(బాగా తెలుసుకోండి) త్వరలోనే ఆ వర్గం ఒడిపోతుంది. వారు వెన్ను చూపి పారిపోతారు." (ఖుర్ఆన్ 54:45).* 

 *"ఇది కూడా (పెద్ద పెద్ద) సైనిక కూటములలో ఓడిపోయిన ఒక (చిన్న) సైనిక దళమే సుమా!" (ఖుర్ఆన్ 38:11).* 

అబీసీనియాకు వలస వెళ్ళిన వారి గురించి ఇలా సెలవియ్యబడింది. ↓

 *"దౌర్జన్యాన్ని అనుభవించిన తరువాత దైవమార్గంలో (ఇల్లూ వాకిలిని వదలి) వలసపోయిన వారికి మేము ప్రపంచంలోనూ ఉత్తమ నివాసాన్ని కల్పిస్తాము. ఇక పరలోకంలో లభించే పుణ్యఫలమైతే మరింత గొప్పది. ఈ విషయాన్ని జనులు తెలుసుకుంటే ఎంత బావుండు!" (ఖుర్ఆన్ 16:41).* 

ఇలాగే దైవతిరస్కారులు దైవప్రవక్త (సల్లం)ను, "హజ్రత్ యూసుఫ్ (అలైహి)" గారి గాధ ఏమిటో చెప్పమని అడగగా, సమాధానంగా ఈ ఆయత్ అవతరించింది.

 *"నిశ్చయంగా యూసుఫ్ మరియు అతని సోదరుల గాథలో ఆడిగేవారి కోసం (గొప్ప) సూచనలున్నాయి." (ఖుర్ఆన్ 12:7).* 

 _(చదవండి "దివ్య ఖుర్ఆన్", "సూరతుల్ యూసుఫ్")_ 

నేడు "యూసుఫ్ (అలైహి)" గాధను గురించి అడిగే ఈ మక్కావాసులు, "యూసుఫ్ (అలైహి)" సోదరులు అపజయం పాలైనట్లుగానే అపజయానికి గురికాగలరని, వీరి ఎత్తుగడలు కూడా "యూసుఫ్ (అలైహి)" గారి సోదరుల ఎత్తుగడలు విఫలమైనట్లే విఫలం కాగలవు అని, వీరు "యూసుఫ్ (అలైహి)" మరియు ఆయన సోదరుల గాధ ద్వారా గుణపాఠం నేర్చుకోవలసి ఉంది అని వివరిస్తూ జులుము, చేసేవారికి పట్టే గతి ఎలాగుంటుందో ఆ గాధలో విడమర్చి చెప్పడం జరిగింది. ఓ చోట ప్రవక్తల ప్రస్తావన తెస్తూ "దివ్యగ్రంథం" ఇలా సెలవిస్తోంది. ↓

 *"తిరస్కారులు తమ ప్రవక్తల నుద్దేశించి, "మేము మిమ్మల్ని దేశం నుంచి వెళ్ళగొడ్తాము. లేదంటారా, మీరు మా మతంలోకి తిరిగి వచ్చేయండి" అని బెదిరించారు. అపుడు వారి ప్రభువు వారి వద్దకు 'వహీ' (సందేశం) పంపిస్తూ, "మేము ఈ దుర్మార్గులను నాశనం చేస్తాము. వారి తరువాత మేము మిమ్మల్ని ఈ ధరణిపై వసింపజేస్తాము. నా సమక్షంలో నిలబడే విషయమై భయపడేవారికి, నా హెచ్చరికపై భీతిల్లేవారికి లభించే బహుమానం ఇది" (అని అభయమిచ్చాడు)." (ఖుర్ఆన్ 14:13,14).* 

ఇలాగే, పర్షియాలో యుద్ధజ్వాలలు చెలరేగే సమయంలో, దైవతిరస్కారులు పర్షియనులు నెగ్గాలని కోరుకునేవారు. ఎందుకంటే, పర్షియనులు బహుదైవారాధకులు. ముస్లిములేమో రోమనులు గెలవాలని కోరుకునేవారు. కారణం, రోమనులు ఓ విధంగా దైవప్రవక్తల్ని, దివ్యావిష్కృతిని, ఆకాశ గ్రంథాలను, పరలోకాన్ని విశ్వసించేవారమని వాదించేవారు గనక.

కాని, పర్షియనులే నెగ్గుకు వస్తూ విజయపరంపరలు సాధిస్తూ ఉన్న తరుణంలోనే "అల్లాహ్" ముస్లిములకు, రోమనులే కొన్ని సంవత్సరాల తరువాత విజయం సాధిస్తారు అని "దివ్యఖుర్ఆన్"లో శుభవార్త అవతరింపజేశాడు. కేవలం ఈ శుభవార్త అందించడం మట్టుకే సరిపెట్టలేదు. ఈ విషయంలో, రోమనులు విజయం పొందినప్పుడు ముస్లిములకు కూడా ప్రత్యేక సహాయం అందించి ఆదుకుంటాను. వారు సంబరపడాలి అనే శుభవార్త కూడా ఇవ్వడం జరిగింది. ఈ శుభవార్త ఇలా ఉంది. ↓

 *"కొన్నేండ్లలోనే (తొమ్మిదేండ్లలోపే!) దానికి ముందైనా, తరువాతైన నిర్ణయాధికారం అల్లాహ్ దే. ఆ రోజు ముస్లిములు సంతోషిస్తారు - అల్లాహ్ అండదండల వల్ల. ఆయన తాను కోరిన వారికి సహాయం చేస్తాడు. ఆయన మాత్రమే సర్వాధికుడు, దయాశీలి." (ఖుర్ఆన్ 30:4,5).* 

(భవిష్యత్తులో "అల్లాహ్" అందించిన ఈ సహాయం "బద్ర్" యుద్ధంలో లభించిన మహోన్నత విజయం రూపంలో అవతరించిన సహాయం.)

"దివ్యఖుర్ఆన్" మట్టుకే కాదు, మహాప్రవక్త (సల్లం) స్వయంగా ముస్లిములకు సందర్భానుసారంగా ఇలాంటి శుభవార్తలనే వినిపించేవారు.

"హజ్" కాలంలో ఉక్కాజ్, మజిన్నా, జుల్'మజాజ్ సంతల్లో ప్రజలకు దైవదౌత్యం గురించి బోధించడానికి వెళ్ళినప్పుడు, స్వర్గం లభిస్తుందనే శుభవార్తను మాత్రమే అందించడం కాకుండా నిక్కచ్చిగా ఇలా ప్రకటించేవారు. ↓

 *"ప్రజలారా! _"లా ఇలాహ ఇల్లల్లాహ్"_ అనండి. సాఫల్యం పొందగలరు. ఫలితంగా మీరు అరేబియాకే రాజులైపోతారు. అరబ్బేతర రాజ్యాలు మీకు ఆధీనమైపోతాయి. (అదే కాదు!) మీరు మరణించిన తర్వాత స్వర్గంలో మహారాజుల్లా నివసిస్తారు."* 

"ఉత్బా బిన్ రబీయా" దైవప్రవక్త (సల్లం)ను లోబరుచుకోవడానికి ధనసంపదలను ఎరగా చూపి బేరసారాలు చేసినప్పుడు కూడా ఆయన (సల్లం), "హామీమ్ అస్సజ్దా" సురాలోని ఆయత్ లను పఠించి వినిపించినప్పుడు "ఉత్బా"కు, చిట్టచివరకు ఆయనే విజయం సాధిస్తారనే నమ్మకం కుదిరిన విషయం ఇది వరకే చదువుకున్నాం.

అలాగే, "అబూ తాలిబ్" వద్దకు వచ్చిన ఖురైష్ చివరి ప్రతినిధి బృందంతో దైవప్రవక్త (సల్లం) మాట్లాడిన మాటలు కూడా మనకు తెలిసినవే. ఈ సందర్భంలో ఆయన (సల్లం) ఎంతో వివరంగా, ఒకే ఒక మాటను ఒప్పుకొమ్మని, దాన్ని ఒప్పుకుంటే అరేబియాకే చక్రవర్తులైపోతారని, అరబ్బేతర రాజ్యాలు వారికి ఆధీనమైపోతాయని చెప్పినట్లు మనకు గుర్తుంది.

 *"హజ్రత్ ఖబ్బాబ్ (రజి) బిన్ అరత్" గారి ఉల్లేఖనం ప్రకారం....; ↓* 

"ఓ సారి నేను దైవప్రవక్త (సల్లం) గారి సన్నిధికి చేరాను. ఆయన (సల్లం) అప్పుడు "కాబా" గోడకు ఆనుకొని కూర్చుని ఉన్నారు. ఆ కాలంలోనే బహుదైవారాధకులు పెట్టే హింసలు భరించలేకపోతున్నాం మేము. నేను, ప్రవక్త (సల్లం)ను...., *"ప్రవక్తా! మనమెందుకు "అల్లాహ్"ను ప్రార్థించకూడదు?"* అని అన్నాను. ఇది విన్నంతనే మహాప్రవక్త (సల్లం) దిగ్గున లేచి కూర్చున్నారు. ఆయన ముఖం (కోపంతో) ఎరుపెక్కింది. నన్ను చూసి, *"నీ కంటే ముందు గతించిన వారి ఎముకల నుండి మాంసం వేరుచేయడానికి ఇనుప దువ్వెనలను పెట్టి దువ్వడం జరిగింది. ఈ హింస కూడా వారి ధర్మాన్ని వదిలేటట్లు చేయలేదు. "అల్లాహ్" ఈ ధర్మాన్ని పరిపూర్ణం చేస్తాడు. చివరికి ఓ ప్రయాణీకుడు ఒంటరిగా "సన్ఆ" నుండి "హజర్ మౌత్" వరకు వెళ్ళగలడు. అతనికి "అల్లాహ్" భయం తప్ప మరెవ్వరి భయమూ ఉండదు. అయితే మేకకు మాత్రం తోడేలు భయం ఒకటే ఉంటుంది.* (అని అన్నారు)"

మరో ఉల్లేఖనంలో...., *"అయితే మీరు తొందరపడుతున్నారు"* అనే పదాలు కూడా ఉన్నాయి.

ఇవి అందరికీ తెలియని ఏవో శుభవార్తలు కావు. అందరికీ తెలిసిన, ప్రాచుర్యం పొందిన శుభవార్తలే. ముస్లిములకు మల్లే దైవతిరస్కారులు కూడా ఈ శుభవార్తలను గూర్చి బాగా ఎరుగుదురు. కాబట్టి "అస్వద్ బిన్ ముత్తలిబ్", అతని మిత్రబృందం సహాబా (రజి)ను చూడగానే ఎగతాళిచేస్తూ తమలో తాము, *"చూశారా! మన దగ్గరికి భూలోక చక్రవర్తులు వస్తున్నారు, వీరు త్వరలోనే పర్షియా, రోమను సామ్రాజ్యాలను జయిస్తారట."* అని గేలిచేస్తూ చప్పట్లు చరిచేవారు, ఈలలు వేసే వారు.

ఏదిఏమైనా, సహాబా (రజి)లపై విరుచుకుపడే హింసాదౌర్జన్యాల ఈ తుఫాను, స్వర్గాన్ని పొందేవారి దృఢవిశ్వాసం, ఉజ్వల భవిష్యత్తు గురించిన శుభవార్తల ముందు పిల్లగాలికి తేలిపోయే ఓ పీచు మబ్బులాంటిదే.

ఇదే కాకుండా, మహాప్రవక్త (సల్లం), విశ్వసించిన వారి విశ్వాసానికి విశ్వాస మాధుర్యం ద్వారా సతతం ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చేవారు. గ్రంథ బోధనల ద్వారా వారి ఆత్మప్రక్షాళన జరుపడం జరిగేది. ఎంతో లోతయిన పటిష్ఠమైన శిక్షణ కూడా ఇచ్చేవారు. ఆత్మౌన్యత్యం, హృదయ ప్రక్షాళన, నైతికతా నైర్మల్యం పొందడానికీ; భౌతిక పాశల్లో చిక్కుకోకుండా, కామవాంఛలకు బలికాకుండా వారిని కాపాడుతూ, భూమ్యాకాశాల ప్రభువు వైపు మొగ్గుజూపేందుకు సతతం కృషి చేసేవారు. ఆయన (సల్లం) వారి హృదయాల్లో ఆగిపోబోతున్న అగ్గి రవ్వను, ప్రజ్వలించే అగ్నికీలగా మార్చివేసేవారు. వారిని అంధకారం నుండి బయటకు తీసి సన్మార్గవెలుగులో పయనింపజేశారు  హింసలను భరించమని ఉద్బోధ చేసేవారు. దీని ఫలితంగానే వారి ధార్మిక దృఢత్వం రోజురోజుకు బలపడిపోసాగింది. కామవాంఛలకు దూరంగా ఉండే నిర్ణయం, దైవప్రసన్నతను పొందే కోరిక, స్వర్గాన్ని పొందే ఆకాంక్ష, జ్ఞాన సముపార్జనావేశము, ధర్మావగాహన, జవాబుదారీతనం; ఉద్రేకాలను అణచివేసే ఆలోచనల్ని, సన్మార్గం వైపునకు మరల్చే శక్తి, మనస్సులో పెల్లుబుకుతున్న శంకల తరంగాలను నియంత్రించే సామర్థ్యం, శాంత స్వభావం మరియు గౌరవోన్నతుల్లాంటి సద్గుణ సంపదల్ని పొంది, మానవీయ విలువల సాటిలేని మేటి సమాజంగా రూపొందారు ఆయన (సల్లం) అనుచరగణం (రజిఅల్లాహు అన్'హు).

 *In Shaa Allah రేపటి భాగములో, ఇస్లాం సందేశ ప్రచారంలోని తృతీయ దశ గురించి....;* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment