🌿 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🌿
🍂 🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌 🍂
🍃 🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌 🍃
✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦
🌾🔅 🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 156* 🕋🛐 🔅🌾
🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 71* 🇸🇦🇸🇦🇸🇦
───────────┄┅━═══✦═══━┅┄───────────
*ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారి సహన సంయమనాలను పురిగొల్పిన కారణాలు : - 2*
*దైవప్రవక్త (సల్లం)పై, సహాబా (రజి)ల ప్రేమానురాగాలు : -*
మహాప్రవక్త (సల్లం) మిత్రులు మరియు ఆయన అనుచరుల విషయానికొస్తే, ఆయన వారి పాలిట పంచప్రాణాలు అనే చెప్పాలి. ఆయన (సల్లం) కోసం వారి హృదయాంతరాలల్లో నుండి పెల్లుబుకే భావోద్రేకాలు, పల్లం వైపునకు పారే నీటి చందంగా ఉండేవి. వారి హృదయాలు, వారి పంచప్రాణాలు ఆయన (సల్లం) వైపునకు, ఇనుము సూదంటురాయి వైపునకు ఆకర్షింపబడినట్లుగా ఆకర్షించబడేవి.
ఆయన (సల్లం) యెడల సహాబా (రజి)ల ఈ ప్రేమానురాగాలు, సమర్పణాభావం, ప్రాణాలనైనా అర్పించే త్యాగనిరతి ఫలితంగానే దైవప్రవక్త (సల్లం)కు కాలిలో ముల్లు గ్రుచ్చుకున్నా లేదా ఆయన (సల్లం) కొనగోటికి దెబ్బతగిలినా వారు సహించేవారు కారు. అవసరమైతే తమ ప్రాణాలనయినా సమర్పించి ఆయన (సల్లం)ను రక్షించే ప్రయత్నం చేసేవారు.
ఓ రోజు "అబూ బక్ర్ సిద్దీఖ్ (రజి)"ను చెప్పలేనంతగా చితకబాదడం జరిగింది. "ఉత్బా బిన్ రబీయా", ఆయన (రజి) దగ్గరకు వచ్చి రెండు అతుకులు కలిగిన చెప్పులతో కొట్టనారంభించాడు. ప్రత్యేకంగా ముఖంపైనే కొడుతున్నాడు. వీపు పైకెక్కి కొట్టే దెబ్బలకు ముఖం ముక్కూ ఏదీ అగుపడడం లేదు. ఆ తరువాత ఆయన తెగ అయిన "బనూ తైమ్" వారు ఆయన (రజి)ను గుడ్డలో చుట్టుకొని ఇంటికి గొనివచ్చారు. ఈ దెబ్బలకు బ్రతికి బట్టకడతాడనే ఆశ వారికి లేదు. అయితే ప్రొద్దుక్రుంకే సమయానికి ఆయన (రజి) నోటి నుండి మాటలు వెలువడడం గమనించారు. నోటి నుండి మాట బయటకు రాగానే "అబూ బక్ర్ (రజి)" చెప్పిన మాటలు, *"దైవప్రవక్త (సల్లం) ఏమయ్యారు?"* అన్నవే. ఆ మాటలకు "బనూ తైమ్" వారు ఆయన (రజి)ను తిట్టారు. తిడుతూనే, "అబూ బక్ర్ (రజి)" తల్లి "ఉమ్ముల్ ఖైర్"ను ఉద్దేశించి, *"ఈయనకు ఏదైనా తినిపించండి, త్రాగించండి"* అని చెప్పి వెళ్ళిపోయారు.
వారు బయటకు వెళ్ళిన తర్వాత "ఉమ్ముల్ ఖైర్" ఒంటరిగా ఉండిపోయారు. ఏదైనా తినమని, త్రాగమని బలవంతపెట్టసాగారు. కాని "అబూ బక్ర్ (రజి)" మాత్రం, *"దైవప్రవక్త (సల్లం) ఏమైపోయారు?"* అనే అడుగుతున్నారు. చివరికి "ఉమ్ముల్ ఖైర్", "అబూ బక్ర్ (రజి)"ను ఉద్దేశించి....;
*ఉమ్ముల్ ఖైర్ : -* నీ మిత్రుని పరిస్థితి ఏమిటో నాకు తెలియదు.
*అబూ బక్ర్ (రజి) : -* (అయితే!) నీవు వెళ్ళి "ఉమ్మె జమీల్ బిన్తె ఖత్తాబ్"ను అడిగిరా.
(అపుడు "ఉమ్ముల్ ఖైర్", "ఉమ్మె జమీల్ బిన్తె ఖత్తాబ్"ను కలవడానికి వెళ్ళారు. ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత "ఉమ్ముల్ ఖైర్", "ఉమ్మె జమీల్ బిన్తె ఖత్తాబ్"ను ఉద్దేశించి....; ↓)
*ఉమ్ముల్ ఖైర్ : -* (ఉమ్మె జమీల్!) అబూ బక్ర్, "ముహమ్మద్ (సల్లం) బిన్ అబ్దుల్లాహ్" గురించి అడుగుతున్నాడు. (నీకేమైనా అతని (సల్లం) విషయం తెలుసా?)
*ఉమ్మె జమీల్ : -* నాకు "ముహమ్మద్ (సల్లం) బిన్ అబ్దుల్లాహ్" గురించిగాని, నీ కుమారుడు "అబూ బక్ర్ (రజి)" గురించిగాని ఏమీ తెలియదు. కావలసి వస్తే, నేను నీ వెంట నీ కుమారుని దగ్గరకు రాగలను.
*ఉమ్ముల్ ఖైర్ : -* సరే, పద పోదాం.
"ఉమ్ముల్ ఖైర్", "ఉమ్మె జమీల్ బిన్తె ఖత్తాబ్"ను తోడ్కొని "అబూ బక్ర్ (రజి)" దగ్గరకు వచ్చారు. "అబూ బక్ర్ (రజి)" పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. "ఉమ్మె జమీల్", ఆయన (రజి) దగ్గరకు వచ్చి....;
*ఉమ్మె జమీల్ : -* ఏ జాతి అయితే నిన్ను ఇలా కొట్టిందో ఆ జాతి తప్పకుండా దుష్టజాతి, దైవతిరస్కార జాతి. అల్లాహ్ నీ పరిస్థితికి పగతీర్చుకోక మానడు. (అని అరిచారు)
*అబూ బక్ర్ (రజి) : -* దైవప్రవక్త (సల్లం) ఏమయ్యారు?
*ఉమ్మె జమీల్ : -* ఇది మీ అమ్మగారు వింటోంది. (సంశయంగా అన్నారు)
*అబూ బక్ర్ (రజి) : -* ఫర్వాలేదు చెప్పండి.
*ఉమ్మె జమీల్ : -* క్షేమంగా ఉన్నారు.
*అబూ బక్ర్ (రజి) : -* ఎక్కడ ఉన్నారు?
*ఉమ్మె జమీల్ : -* ఇబ్నె అర్ఖమ్ ఇంట్లో.
*అబూ బక్ర్ (రజి) : -* అయితే, దైవప్రవక్త (సల్లం) గారి సన్నిధికి వెళ్ళనంతమట్టుకు నేను ఏదీ తినేది లేదు, త్రాగేది లేదు. ఇది అల్లాహ్ పై ఒట్టు వేసి చెబుతున్నాను.
ఉమ్ముల్ ఖైర్, ఉమ్మె జమీల్ అక్కడనే ఉండిపోయారు. రాకపోకలు సద్దుమణిగిపోయి బాగా చీకటి పడ్డ తరువాత వీరిద్దరు "అబూ బక్ర్ (రజి)"ను తోడ్కొని సన్నిధికి బయలుదేరారు. "అబూ బక్ర్ (రజి)"ను వారిద్దరు ఊతమిచ్చి మహాప్రవక్త (సల్లం) సన్నిధికి చేర్చగలిగారు.
దైవప్రవక్త (సల్లం)గారి ఎడల సహాబా (రజి)కున్న అనురాగం, ప్రాణత్యాగానికి సంబంధించిన అసాధారణ సంఘటనలు మేము ఇక్కడ, ముఖ్యంగా "ఉహద్" యుద్ధంలో జరిగిన సంఘటనలు, "హజ్రత్ ఖదీజా (రజి)" విషయంలో చోటు చేసుకున్న విషయాలు సందర్భాన్నిబట్టి తెలియజేయగలం.
*3. బాధ్యతా భావన : -*
మానవుడిగా చెప్పబడే ఈ పిడికెడు మట్టిముద్దపై ఎన్ని బృహత్తరమైన బాధ్యతలు ఉన్నాయో, ఆ బాధ్యతలను ఏ పరిస్థితుల్లోనూ విస్మరించడానికి వీలుండదో అనే యదార్థాన్ని మహాప్రవక్త (సల్లం)గారి అనుచరగణం బాగా ఎరిగినవారు. ఎందుకంటే, బాధ్యతారాహిత్యం ఫలితంగా కలిగే దుష్పరిణామాలు ప్రస్తుత జులుం, అత్యాచారాల కంటే భయంకరమైనవి, వినాశనకరమూ అయినవీను. ఆ బాధ్యతల్ని విస్మరించిన తరువాత ఖుద్దు వారికీ, *"సర్వమానవాళికి సంభవించే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో, ప్రస్తుతం ఈ బాధ్యతలను నెత్తికేసుకోవడం వల్ల ఎదురయ్యే కడగండ్లు, నష్టాలు అంత పెద్దవేమి కావు."* అనే సత్యం వారెరుగుదురు.
*4. పరలోకమందు విశ్వాసం : -*
ఈ పరలోక భావన, పైన చెప్పిన బాధ్యతలకు బలం చేకూర్చే భావన. సృష్టికర్త పోషకుడూ అయిన "అల్లాహ్" ఎదుట ఓ రోజున నిలబడవలసి ఉంటుందని, చిన్నా పెద్ద మరియు సాధారణమైన అన్ని రకాల కర్మలకు లెక్కచూపవలసి ఉంటుందనీ, ఆ తరువాత అన్ని వరాలతో నిండి ఉన్న శాశ్వత స్వర్గమో లేదా యాతనలతో అట్టుడికిపోయే నరకమో ప్రాప్తమవుతుందనే అచంచల విశ్వాసం సహాబా హృదయాంతరాళాల్లో స్థిరపడిపోయి ఉంది. ఈ విశ్వాసం, ఈ నమ్మకం కారణంగానే సహాబా (రజి) తమ జీవితాన్ని ఆశనిరాశల స్థితిలో గడిపేవారు. అంటే వారి పోషకుడు అయిన "అల్లాహ్" కారుణ్యం ఎడల ఆశతోను, ఆయన శిక్ష ఎడల భయంతోనూ జీవించేవారు. వారి పరిస్థితి ఈ "ఖుర్ఆన్" ఆయత్ లో వివరించినట్లుగా ఉండేది.
*"ఇంకా (దైవమార్గంలో) ఇవ్వవలసిన దాన్ని ఇస్తూ కూడా, తమ ప్రభువు వద్దకు మరలిపోవలసి ఉందనే భావనతో ఎవరి హృదయాలు వణుకుతూ ఉంటాయో," (ఖుర్ఆన్ 23:60).*
_(వారు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తారు. అయినా సరే! అల్లాహ్ కు భయపడుతూ ఉంటారు. తమ దానధర్మాలలో సత్కార్యాలలో ఎక్కడ ఏ లోపం ఏర్పడిందో, దాని మూలంగా అల్లాహ్ తమను ఎక్కడ నిలదీసి అడుగుతాడోనన్న భావనే అందుకు కారణం._
_హాదీసులో ఈ విధంగా ఉంది....; ↓_
_*"భయపడుతూ ఉండేది ఎవరు? త్రాగుబోతులా? వ్యభిచారులా? దొంగలా?"* అని "హజ్రత్ ఆయిషా (రజి)" సందేహపడగా, *"కాదు, నమాజు చేసేవారు, ఉపవాసాలు పాటించేవారు, దానధర్మాలు చేసేవారు అల్లాహ్ కు భయపడుతూ ఉంటారు. (తమ వల్ల జరిగిన ఏ తప్పిదం మూలంగా) తమ సత్కార్యాలు స్వీకారయోగ్యం కాకుండాపోతాయోనన్న భయం వారిని పీడిస్తూ ఉంటుంది."* అని దైవప్రవక్త (సల్లం) వివరించారు. (తిర్మిజీ))_
ఈ ఇహలోకంలోని అన్ని రకాల హంగులు, ఆర్భాటాలు, వరాలు, కష్టాలు, కడగండ్లు అన్నీనూ, పరలోకంతో పోల్చినప్పుడు ఓ దోమ రెక్కంత విలువ కూడా చేయలేవనే యదార్థాన్ని వారు గట్టిగా నమ్మారు. ఈ విశ్వాసం, నమ్మకం ఎంత దృఢమైనదంటే, వారి దృష్టిలో ఈ లోకపు కష్టాలు, కడగండ్లు, బాధలు అన్నిటికి ఎలాంటి ప్రాధాన్యత ఉండకపోయేది. అందుకనే వారు తమపై జరిగే అత్యాచారాలకు, హింసలకు ఎలాంటి విలువా ఇవ్వలేదు.
*5. దివ్య ఖుర్ఆన్ ఆయత్ లు, సూరాల అవతరణ : -*
ఈ కష్టతరమైన, ప్రమాదకరమైన మరియు అంధకారబంధురమైన పరిస్థితుల్లోనే, గట్టి ఆధారాలు చూపుతూ "దివ్య ఖుర్ఆన్" ఆయత్ లు, సూరాలు అవతరించనారంభించాయి. అవి మనస్సును ఆకర్షించేవిగా ఉండి ఇస్లామీయ మౌలిక సూత్రాలను నెలకొల్పాయి. ఆ పరిస్థితుల్లో దైవ సందేశప్రచారం ఈ సూత్రాల చుట్టే పరిభ్రమిస్తూ ఉండేది. ఈ ఆయత్ లలో ముస్లిములకు, అల్లాహ్ మానవాళికి సంబంధించిన మహోన్నతమైన, బృహత్తరమైన సమాజం, అంటే ఇస్లామీయ సమాజ నిర్మాణానికి సంబంధించిన సూత్రాలను అవతరింపజేయడం జరిగింది. అదేకాదు, ఈ ఆయత్ లలో ముస్లిముల భావోద్రేకాలను తట్టి వారిని స్థిరంగా నిలబడేందుకు పురిగొల్పడం జరిగింది. దాని కోసం ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. అందు దాగిఉన్న మర్మమేదో తెలుపడం జరిగింది.
దైవతిరస్కారులకు, "ఇస్లాం" ధర్మం ఎడల విద్వేషాన్ని ప్రకటించే వారికి, వారి ఆగడాలను ఎత్తిచూపుతూ, సందర్భానుసారంగా ఇలాంటి ఆయత్ లే అవతరింపనారంభించడంలో ఏమి చేయాలో తోచేది కాదు. ఈ ఆయత్ లలో వీరే గనక ఆ మార్గభ్రష్టమైన విధానాన్ని మానుకోకపోతే దాని పరిణామం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించడమూ జరిగింది. ఇలా అవతరిస్తున్న దైవావిష్కృతిలో గతించిన జాతులకు సంబంధించిన సంఘటనలు, చారిత్రక సత్యాలు విడమరిచి చెప్పడం జరిగింది. అదేకాదు, తనను నమ్మిన వారి విషయంలో, తన ఎడల శత్రుత్వం వహించే వారి విషయంలోనూ అల్లాహ్, ఏ తీరుగా ప్రవర్తించాడో వివరించి చెప్పడం కూడా జరిగింది. దీనికి తోడు, నిజాన్ని గ్రహించి తమ ప్రవర్తనను మార్చుకుంటే వారికి ఒనగూడే శ్రేయాసౌఖ్యాలు ఎలాగుంటాయో అన్నది కూడా ఈ ఆయత్ లలో తెలియజేయడం జరిగింది.
యదార్థానికి, ఈ దైవావిష్కృతి (వహీ) ద్వారా "అల్లాహ్" ముస్లిములకు మరో ప్రపంచంలోనికి తొంగి చూసే భాగ్యాన్ని కలిగించాడు. వారికి విశ్వరహస్యాలను గురించిన అవగాహన కలిగిస్తూ తన దైవత్వపు అందచందాల్ని, తన ఏకత్వ మహత్మ్యాన్ని, తన కారుణ్య చతురతను, తన ప్రసన్నతకు సంబంధించిన సూచనలను చూపిస్తూపోతుంటే ఆ ఆకర్షణ ముందు మరే అడ్డంకి కూడా నిలువలేకపోయింది.
అదే కాదు, ఈ "ఖుర్ఆన్" ఆయత్ ల భావాల వెనుక, ముస్లిములకు దైవం తరఫున కారుణ్యం, ప్రసన్నతలు, వరాలతో నిండిన స్వర్గధామాల శుభవార్తలు దాగి ఉన్న సంబోధనలు కనిపిస్తే, మరోప్రక్క దైవధిక్కారులు, తలబిరుసుతనంగల దుష్టులకు, ఓ రోజున తాము దైవసన్నిధిలో నిలబడవలసి ఉంటుందని, వారు ఆచరించిన సత్కర్మలు, పుణ్యఫలాలు అన్నీ నిష్ప్రయోజనమైన వారిని బోర్లాపడవేసి నరకకూపంలో, అక్కడి శిక్షను అనుభవించడానికి పడవేయవలసి ఉంటుందనే హెచ్చరిక కూడా చేయడం జరిగింది.
*In Shaa Allah రేపటి భాగములో.... 6. విజయం శుభవార్త....;*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment