🌿 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🌿
🍂 🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌 🍂
🍃 🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌 🍃
✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦
🌾🔅 🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 155* 🕋🛐 🔅🌾
🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 70* 🇸🇦🇸🇦🇸🇦
───────────┄┅━═══✦═══━┅┄───────────
*ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారి సహన సంయమనాలను పురిగొల్పిన కారణాలు : - 1*
లోతైన ఆలోచన, దృఢమైన బుద్ధి వివేచనలు గల వ్యక్తి ఎవరైనా గాని, *"ప్రప్రథమంగా "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించిన ఈ ముస్లిముల సహనాన్ని, సంయమనాన్ని, ధైర్యసాహసాలను ఎలా ప్రదర్శించగలిగారు? ఏ కారణాలు వారిని స్థిరంగా ఉంచడానికి దోహదపడ్డాయి?"* అనే విషయాల్ని ఆలోచించినప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనుకాకమానడు. విన్నంతనే *"రోమాలు నిక్కబొడుచుకునేటటువంటి హింసాదౌర్జన్యాలను ఎలా సహించగలిగారు?"* అనే ఆలోచనలో పడిపోవడం సహజం. మాటిమాటికీ ఉత్పన్నమయ్యే ఈ ప్రశ్నల నేపథ్యంలో ఆ కారణాలను, ఆ పరిస్థితులను గురించి టూకీగా చెప్పడం ఇక్కడ సమంజసంగా తోస్తోంది.
*1. అల్లాహ్ ఎడల విశ్వాసం : -*
వీటన్నిటిలో మొట్టమొదటి ముఖ్య కారణం, వారిలో ఏకేశ్వరుడు అయిన "అల్లాహ్" ఎడల విశ్వాసం దృఢంగా నాటుకొనిపోవడం మరియు వారిలో దైవానికి సంబంధించిన పూర్తి అవగాహన కలగడం. ఎందుకంటే, మనిషి హృదయంలో దేవునిపై విశ్వాసం దృఢంగా నాటుకుపోతే అతను పర్వతాన్నయినా ఢీ కొనడానికి సిద్ధపడతాడు. అందులో అతనే నెగ్గి రాగలడు. ఎవరైతే ఈ ధృడమైన విశ్వాసాన్ని, తిరుగులేని నమ్మకాన్ని పొందగలడో అతను ప్రాపంచికమైన వ్యధలను (అవి ఎంత అధికమైనవైనా , ఎంత కఠినమైనవైనా, మరెంత ప్రమాదకరమైనవైనా) విశ్వాసం ముందు అల్పమైనవిగా తలుస్తాడు. అందుకని ఓ మోమిన్ (విశ్వాసి) తన విశ్వాస మాధుర్యం కంటే, నమ్మకపు బలం కంటే ఆ కష్టాలకు విలువే ఇవ్వడు.
*"నురుగంతా ఎగిరిపోతుంది. మానవులకు లాభం కలిగించే వస్తువు భూమిలో ఉండిపోతుంది."* (ఖుర్ఆన్ 13:17)
ఈ కారణం చేతనే సహనానికీ, స్థయిర్యానికీ ఊతమిచ్చే పరిస్థితులు ఏర్పడతాయి.
*2. మనస్సును అలరింపజేసే నాయకత్వం : -*
దైవప్రవక్త (సల్లం) ఇస్లామీయ సమాజాన్నే కాకుండా మానవాళి అంతటినీ నడిపించే మహోన్నత నాయకత్వపు లక్షణాలుగల నాయకుడు అన్న విషయం మనకు తెలిసిందే. ఆయన (సల్లం) మనస్సును ఇట్టే ఆకర్షించగల శారీరక అందచందాలు, మనోనైర్మల్యం, కారుణ్యదాయకమైన నైతికత, మహోన్నతమైన నడవడిక మరియు గౌరవవంతమైన అలవాట్లు గల మహామనిషి. ఆయన (సల్లం)ను చూడగానే మనసు ఆయన (సల్లం) వైపునకు అనుకోకుండానే మొగ్గిపోయేది. ప్రజలు మరే వ్యక్తి వైపు మొగ్గుజూపలేనంత సుగుణాల రాశి ఆయన. దైవప్రవక్త (సల్లం) గౌరవంలోనూ, నీతి నిజాయితీలలోను అందరికంటే మిన్నగా ఉండేవారు. సౌశీల్యం, విశ్వసనీయత, సత్యసంధత లాంటి విషయాలన్నిటిలోనూ ఆయన (సల్లం)కు ఓ ప్రత్యేక స్థానం ఉండింది. ఈ కారణంచేత, మిత్రులకే కాకుండా శత్రువులకు సైతం ఆయన (సల్లం)గారి వ్యక్తిత్వంపై ఇసుమంత అనుమానం కూడా కలుగలేదు. *"ఆయన (సల్లం) నోట వెలువడ్డ ఏ మాట అయినా, అది సత్యమే అన్నది"* ఆయన (సల్లం) శత్రువులు కూడా ధృవపరిచేవారు, అది అయి తీరుతుంది అని నమ్మేవారు. (ఈ క్రింది) సంఘటనలు దీన్ని ధృవపరుస్తున్నాయి కూడా. ↓
■ ఓ మారు ఖురైష్ తెగకు చెందిన ముగ్గురు వ్యక్తులు పరస్పర ఒకరికి తెలియకుండా మరొకరు దాగి "దివ్యఖుర్ఆన్" పారాయణాన్ని విన్నారు. ఆ తరువాత ఆ రహస్యం కాస్తా బయటపడిపోయింది ఆ ముగ్గురిలో "అబూ జహల్" ఒకడు. ముగ్గురు కలిసినప్పుడు (వారిలో) ఒకడు "అబూ జహల్"తో, *"అబూ జహల్, రాత్రి నీవు ముహమ్మద్ (సల్లం) నోట విన్న ఆ పలుకులను గురించి మీ అభిప్రాయం ఏమిటి?"* అని అడిగాడు.
"అబూ జహల్" జవాబుగా, *"నేనేం విన్నాను? విను! అసలు విషయం ఏమిటి అంటే, మనమూ "అబ్దె మునాఫ్" ఉభయ తెగలకు చెందినవారం. గౌరవంలో ఒకరికి ఒకరం పోటీపడిన విషయం నీవెరిగినదే. వారు (నిరుపేదలకు) అన్నం పెడితే మనమూ పెట్టాము. వారు కానుకలుగా, బహుమతులుగా వస్తువాహనాలను పంచిపెడితే మనమూ పంచిపెట్టాము. వారు ప్రజలకు దానమిస్తే మనమూ ఇచ్చినవాళ్ళమే. అలా వారు, మనం ఆ విషయంలో సమానమైపోయినవాళ్ళమే. వారి పరిస్థితి, మన పరిస్థితి రేసుగుర్రాల్లగుండేది. ఇప్పుడేమో "అబ్దె మునాఫ్" వారి తెగలో ఓ ప్రవక్త వచ్చాడని, ఆయన వద్దకు ఆకాశం నుండి వహీ (దివ్యావిష్కృతి) వస్తోందని అంటున్నారు. అయితే ఈ విషయంలో వారిని అందుకునేదెలా? దైవసాక్షి! మనం ఆ వ్యక్తి దైవదౌత్యాన్ని ఎన్నటికీ విశ్వసించేదిలేదు. మనం దాన్ని అసలు ధృవపరిచేదేలేదు."* అని అన్నాడు.
అదే దృష్టిలో పెట్టుకుని "అబూ జహల్" తరచూ, *"ఓ ముహమ్మద్ (సల్లం), నిన్ను మేము అసత్యవాది అని ఎప్పుడూ అనలేదు, అనం కూడా. అయితే నీవు తెచ్చిన దాన్ని మాత్రమే తిరస్కరిస్తున్నాం."* అని అంటూ ఉండేవాడు. ఈ విషయం గురించి "అల్లాహ్" దివ్యగ్రంథంలో ఈ ఆయత్ ను అవతరింపజేశాడు.
*"వీరు నిన్ను నిరాకరించడం లేదు. ఈ దుష్టులు అల్లాహ్ ఆయత్ లను (సూచనలను) తిరస్కరిస్తున్నారు."*
■ మరో సంఘటన ఇదివరకే చెప్పుకున్నాం. దాని ప్రకారం, ఓ రోజు దైవ తిరస్కారులు మహాప్రవక్త (సల్లం)ను మూడుమార్లు తూలనాడగా ఆయన (సల్లం) మూడో మారు నిలబడి, *"ఓ ఖురైష్ వర్గమా! నేను మీ వద్దకు బలి తీసుకొని వచ్చాను."* అని చెప్పారు. ఆ మాటలు వినగానే శత్రుత్వం వహించడంలో ఎవరు ముందడుగులో ఉన్నారో వారు నిలబడి, ఏ ఉత్తమ పదాన్నుపయోగించి ప్రాధేయపడాలో దాన్ని ఉపయోగించి ప్రాధేయపడసాగారు.
■ అలాంటి మరో సంఘటనా వివరాలు కూడా మనం ఎరిగినవే. అవేమిటంటే, మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) సజ్దాలోకి వెళ్ళినప్పుడు, ఆయన (సల్లం)పై ఒంటె పొట్టపేగులు పడవేయడం జరిగింది. ఆయన (సల్లం) సజ్దా నుండి తల పైకెత్తి, అలా చేసిన వారిని శపించగా వారి వికటాట్టహాసాలు ఒక్కసారే మటుమాయమైపోయాయి. వారి ముఖాలపై భయం తాండవించింది. ఇక ఆ శాపం నుండి తప్పించుకోలేమనే నమ్మకం వారి వాలకం ద్వారా వ్యక్తమైంది.
■ అదేకాదు మరో సంఘటన కూడా మనకు గుర్తుంది. దైవప్రవక్త (సల్లం), "అబూ లహబ్" కుమారుడు "ఉతైబా"ను శపించారు. ఆ శాపం వల్ల అతనికి ఇక తాను బ్రతికిబట్టకట్టలేననే నమ్మకం ఏర్పడింది. అతను సిరియా దేశానికి వెళ్ళినప్పుడు పెద్దపులిని చూడగానే, *"దైవసాక్షి! ముహమ్మద్ (సల్లం) మక్కాలో ఉంటూనే నన్ను చంపేస్తున్నాడు."* అని అరిచాడు.
■ "ఉబై బిన్ అబీ ఖల్ఫ్"కు సంభవించిన సంఘటన ఒకటుంది. అతను మాటిమాటికి మహాప్రవక్త (సల్లం)ను బెదిరించేవాడు. ఓ మారు ఆయన (సల్లం) అతనితో, *"(నీవు కాదు) దైవం తలిస్తే నేనే నిన్ను చంపేస్తాను."* అని అన్నారు. ఆ తరువాత ఉహద్ యుద్ధం జరిగిన రోజు, ఆయన (సల్లం) "ఉబై" మెడపై బరిశెతో పొడిచారు. అది ఏమంత పెద్ద గాయం కాదు. కేవలం బరిశె మొన గుచ్చుకొని మెడపై గీటు మాత్రమే పడింది. అయితే "ఉబై" మాత్రం, "ముహమ్మద్ (సల్లం) నాతో మక్కాలో, *"నిన్ను నేను సంహరించగలను"* అని అన్నాడనే పలుకులు వల్లిస్తూ, *"ఆయన (సల్లం) నాపై ఉమ్మి వేసి ఉండినా నా ప్రాణం ఎగిరిపోయేది."* అని అనసాగాడు. (ఇందులోని వివరాలు ముందు రాబోతున్నాయి)
■ ఇలాగే ఓసారి "సఅద్ బిన్ ముఅజ్" అనే వ్యక్తి మక్కాలో "ఉమయ్యా బిన్ ఖల్ఫ్"తో, *"దైవప్రవక్త (సల్లం), ముస్లిములు నిన్ను హతమారుస్తారని అనగా విన్నాను."* అని అన్నాడు. దానికి "ఉమయ్యా"ను భయం అలుముకుంది. ఆ భయం వీడనందున అతడు మక్కా వదిలి బయటకు వెళ్ళనని తీర్మానించుకున్నాడు. "బద్ర్" యుద్ధం జరిగినప్పుడు "అబూ జహల్" బలవంతపెట్టగా అతను మక్కా వదిలి వెళ్లాల్సివచ్చింది. దానికోసం అతను ప్రమాదాన్ని శంకించగానే పారిపోయి రావడానికిగాను వేగంగా పరిగెత్తే ఓ ఒంటెను కొన్నాడు. యుద్ధానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న "ఉబై"ను చూసి అతని భార్య వారిస్తూ, *"అబూ సఫ్'వాన్, నీ యస్రబీ సోదరుడు చెప్పింది మరచిపోయావా?"* అని అడిగింది. దానికి జవాబిస్తూ "అబూ సఫ్'వాన్ (ఉమయ్యా బిన్ ఖల్ఫ్)", *"లేదు! దైవసాక్షి, నేను కొంతదూరం వరకే వెళ్ళి తిరిగి వచ్చేస్తానుగా"* అని అన్నాడు.
ఇదీ ఆయన (సల్లం) గారి శత్రువుల పరిస్థితి.
ఇకపోతే మహాప్రవక్త (సల్లం) మిత్రులు మరియు ఆయన అనుచరుల విషయానికొస్తే, ఆయన వారి పాలిట పంచప్రాణాలు అనే చెప్పాలి. ఆయన (సల్లం) కోసం వారి హృదయాంతరాలల్లో నుండి పెల్లుబుకే భావోద్రేకాలు, పల్లం వైపునకు పారే నీటి చందంగా ఉండేవి. వారి హృదయాలు, వారి పంచప్రాణాలు ఆయన (సల్లం) వైపునకు, ఇనుము సూదంటురాయి వైపునకు ఆకర్షింపబడినట్లుగా ఆకర్షించబడేవి.
ఆయన (సల్లం) యెడల సహాబా (రజి)ల ఈ ప్రేమానురాగాలు, సమర్పణాభావం, ప్రాణాలనైనా అర్పించే త్యాగనిరతి ఫలితంగానే దైవప్రవక్త (సల్లం)కు కాలిలో ముల్లు గ్రుచ్చుకున్నా లేదా ఆయన (సల్లం) కొనగోటికి దెబ్బతగిలినా వారు సహించేవారు కారు. అవసరమైతే తమ ప్రాణాలనయినా సమర్పించి ఆయన (సల్లం)ను రక్షించే ప్రయత్నం చేసేవారు.
*↑ ఇందులోని వివరణను In Shaa Allah రేపటి భాగములో....;*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment