154

🌿             ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪             🌿

🍂   🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌  🍂
🍃   🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*    🕌 🍃

✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦

🌾🔅     🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 154* 🕋🛐      🔅🌾

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 69* 🇸🇦🇸🇦🇸🇦

───────────┄┅━═══✦═══━┅┄───────────

 *"హజ్రత్ ఖదీజా (రజి)" మరణం తర్వాత : -* 

"హజ్రత్ ఖదీజా (రజి)" దైవసందేశహరుని ద్వారా జీవితసత్యాన్ని గ్రహించి "ఇస్లాం"ను విశ్వసించిన తొలి మహిళా మాత్రమే కాదు; తొలి మానవమూర్తి కుడా. బంధువులు రాబందుల్లా పొడుచుకు తింటున్నా ఖాతరు చేయకుండా సత్య ధర్మం కోసం తన సర్వ సంపదను వెచ్చించి, అంతులేని కష్టాలలో సైతం అనురాగసుధ చిలికించిన అమృతమూర్తి. కడగండ్ల మండుటెండల్లో స్వాంతన శీతలం అందించిన ఆ నీడను కూడా కోల్పోయారు దైవప్రవక్త (సల్లం).

   *"హజ్రత్ సౌదా (రజి)", "హజ్రత్ ఆయిషా (రజి)"లతో వివాహం* 

దైవప్రవక్త (సల్లం)కు అవిశ్వాసుల వేధింపులతో పాటు, మరోవైపు ఒంటరిజీవితం కూడా ఆయన (సల్లం) అంతరంగంలో అనిర్వచనీయమైన ఆవేదనకు తావిచ్చింది. అమితంగా అభిమానించే అనుచరులు నిత్యం ఆయన (సల్లం) చుట్టూ పరిభ్రమిస్తున్నా, కన్నకొడుకు కన్నా మిన్నగా చూసుకున్న పెత్తండ్రి లేని వెలితి తీరుతుందా? కష్టసుఖాలలో చేదోడు వాదోడుగా ఉండి ఇస్లామీయ ఉద్యమంలో పాలుపంచుకుంటూ వచ్చిన అర్థాంగి కూడా పోయినప్పుడు మిత్రుల ఊరడింపు తన హృదయానికి ఏ మేరకు చల్లదనం ఇస్తుంది?

అయితే దైవప్రవక్త (సల్లం)కు ఆ చల్లదనం కోసం ప్రయత్నించేవారు లేకపోలేదు. ఆయన (సల్లం) పరిస్థితి చూసి "హజ్రత్ ఖౌలా (రజి) బిన్తే హకీం" కరిగిపోయేవారు. ఆమె (రజి) ఓ రోజు దైవప్రవక్త (సల్లం) వద్దకు వచ్చి ఇలా అన్నారు....; ↓

 *ఖౌలా (రజి) : -* దైవప్రవక్తా! ఇలా ఎన్నాళ్ళు ఈ ఒంటరిజీవితం? మళ్ళీ పెళ్ళి చేసుకోరా? "హజ్రత్ ఖదీజా (రజి)" లాంటి స్త్రీ దొరక్కపోవచ్చు. కాని దాంపత్య జీవితంలో కొంతైనా శాంతి లభిస్తుంది కదా!

 *ముహమ్మద్ (సల్లం) : -* ఖౌలా (రజి)! ఏ స్త్రీ గురించి అంటున్నావు?

 *ఖౌలా (రజి) : -* ఏ స్త్రీ ఏముంది, కన్య కూడా దొరుకుతుంది. కావాలంటే వితంతువు కూడా దొరుకుతుంది.

 *ముహమ్మద్ (సల్లం) : -* కన్య ఎవరు?

 *ఖౌలా (రజి) : -* ఇంకెవరు! "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" కూతురు "ఆయిషా (రజి)". మిమ్మల్ని భర్తగా పొందే హక్కు ఆమెకే ఎక్కువగా ఉంది.

 *ముహమ్మద్ (సల్లం) : -* మరి వితంతువు ఎవరు?

 *ఖౌలా (రజి) : -* "జమ్ఆ" కూతురు "సౌదా (రజి)". ఆమె "ఇస్లాం" స్వీకరించింది. దైవాజ్ఞలన్నిటినీ పాటిస్తోంది. అబీసీనియా వలసపోయిన ముస్లింలలో ఆమె భర్త "సక్రాన్ బిన్ అమ్రూ" కూడా ఉన్నాడు. కాని అబీసీనియా నుండి తిరిగొచ్చిన తర్వాత, ఆయన జబ్బు (బారిన) పడి చనిపోయారు.

 *ముహమ్మద్ (సల్లం) : -* సరే! ఆ ఇద్దరినీ చేసుకుంటాను. పోయి మాట్లాడిరా.

"సౌదా (రజి)" లాంటి వయసు మళ్ళిన వితంతు మహిళ, "ఖదీజా (రజి)" వదిలిపోయిన నలుగురు పిల్లల ఆలనా పాలనా చూడగలుగుతుందని ఆశించి దైవప్రవక్త (సల్లం) ఆమెను వివాహమాడటానికి అంగీకరించారు.

 *శుభవార్త మోసుకొని "సౌదా (రజి)" ఇంటికి వెళ్ళిన "హజ్రత్ ఖౌలా (రజి)" : -* 

"హజ్రత్ ఖౌలా (రజి)" మొదట "సౌదా (రజి)" ఇంటికి వెళ్ళారు. (అపుడు ఖౌలా (రజి), సౌదా (రజి)తో...., ↓)

 *ఖౌలా (రజి) : -* సౌదా (రజి)! శుభం, శుభం!! అదృష్టమంటే నీదే. మోడువారిన నీ జీవితం కొంగ్రొత్త ఆశలతో చిగురించే శుభతరుణం వచ్చింది. సౌదా! సంతోషించు. (అన్నారు చిరునవ్వుతో అభినందిస్తూ)

 *సౌదా (రజి) : -* ఏమంటున్నావు (ఖౌలా)! నాకేమి అర్థం కాలేదు. కాస్త వివరంగా చెప్పు. (ఆశ్చర్యంతో తికమక పడుతూ అడిగారు)

 *ఖౌలా (రజి) : -* దైవప్రవక్త (సల్లం) నిన్ను వివాహమాడదలిచారు. ఆ సంగతి మాట్లాడటానికే వచ్చాను.

ఈ శుభవార్త వినగానే "హజ్రత్ సౌదా (రజి)" ముఖపద్మం ఒక్కసారిగా వికసించింది.

 *సౌదా (రజి) : -* సుబ్'హానల్లాహ్! ఎంత తియ్యటి కబురు వినిపించావు. ఈ శుభవార్త మా నాన్నగారి చెవిలో కూడా పడేయి. ఆయన సలహా కూడా తీసుకోవాలిగా.

"హజ్రత్ ఖౌలా (రజి)" సరేనంటూ అక్కడినుంచి బయలుదేరి "సౌదా (రజి)" నాన్నగారి (జమ్ఆ) దగ్గరకు వెళ్ళారు. ఆయనకు దైవప్రవక్త (సల్లం) ఉద్దేశ్యం, సౌదా (రజి) అంగీకారం తెలియజేశారు. ఈ శుభవార్త విని ఆయన కూడా సంతోషించారు.

"అంతకంటే మహాభాగ్యం ఇంకేం కావాలమ్మా! ఇక దంపతుల్ని గురించి చెప్పేదేముంది, అదృష్టమే అదృష్టం." అన్నారు ఆయన (సౌదా (రజి) నాన్నగారు "జమ్ఆ").

 *శుభవార్త మోసుకొని "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" ఇంటికి వెళ్ళిన "హజ్రత్ ఖౌలా (రజి)" : -* 

ఆ తరువాత "హజ్రత్ ఖౌలా (రజి)", "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" గారి ఇంటికెళ్ళి, ఆయన భార్య "ఉమ్మెరూమాన్ (రజి)"ని కలుసుకున్నారు. (అపుడు ఖౌలా (రజి), ఉమ్మెరూమాన్ (రజి)తో...., ↓)

 *ఖౌలా (రజి) : -* మీ ఇంట శుభాల పంట! దైవప్రవక్త (సల్లం) మీ అమ్మాయి "ఆయిషా (రజి)"ను వివాహం చేసుకోవాలనుకుంటున్నారు.

 *ఉమ్మెరూమాన్ (రజి) : -* నిజమా! ఎంత మంచివార్త! కొంచెం (సేపు) ఆగు ఖౌలా! అబూ బక్ర్ గారు వచ్చే వేళయింది. (అన్నారు పట్టరాని సంతోషంతో)

అంతలో "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" గారు వచ్చారు. "ఖౌలా (రజి)" ఈ వార్త ఆయనకు వినిపించారు. "అబూ బక్ర్ (రజి)" గారు ఎంతో సంతోషించారు. వెంటనే ఆయన ఈ సంబంధం ఒప్పుకున్నారు.

 *ఆ తర్వాత కొన్నాళ్ళకే దైవప్రవక్త "ముహమ్మద్ (సల్లం)" వివాహం "హజ్రత్ సౌదా (రజి)", "హజ్రత్ ఆయిషా (రజి)"లతో జరిగిపోయింది.* 

"హజ్రత్ సౌదా (రజి)" నూతన వధువుగా ప్రవక్త (సల్లం) ఇంటికి వచ్చారు. "ఆయిషా (రజి)" ఇంకా లేతవయస్సులో ఉండటంతో తల్లిదండ్రుల నీడలోనే కొన్నాళ్ళు ఉండవలసి వచ్చింది.

ఈ రెండు వివాహాలు దైవప్రవక్త (సల్లం)కు, ఆయన అనుచరుల్ని మరింత సన్నిహితం చేసి ఇస్లామీయ ఉద్యమ పురోగమనానికి దోహదపడ్డాయి.

అయతే ఇస్లామీయ ఉద్యమం విస్తరిస్తున్నకొద్దీ దైవప్రవక్త (సల్లం)పై, ఆయన అనుచరులపై అవిశ్వాసుల ఆగడాలు కూడా అధికం కాసాగాయి. "ఇస్లాం" ప్రచారం మానే వరకు ముహమ్మద్ (సల్లం)ను, సాంప్రదాయక మతంలోకి తిరిగొచ్చేవరకు ఆయన (సల్లం)అనుచరుల్ని బాధిస్తూనే ఉంటామని వారు ఘోరంగా ప్రతిజ్ఞ కూడా చేశారు.

 *మిగిలినది In Shaa Allah రేపటి భాగములో....;* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment