153

🌿             ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪             🌿

🍂   🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌  🍂
🍃   🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*    🕌 🍃

✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦

🌾🔅     🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 153* 🕋🛐      🔅🌾

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 68* 🇸🇦🇸🇦🇸🇦

───────────┄┅━═══✦═══━┅┄───────────

         *శోక సంవత్సరం* 

 *"హజ్రత్ ఖదీజా (రజి)" గారి కాలధర్మం : -* 

"అబూ తాలిబ్" మరణించిన రెండు నెలల తరువాత లేదా మూడు రోజుల తరువాత (ఉల్లేఖనాల్లోని తేడా ప్రకారం) ముస్లిముల మాతృమూర్తి ఉమ్ముల్ మోమినీన్ "హజ్రత్ ఖదీజతుల్ కుబ్రా (రజి)" పరమపదించారు. ఆమె మరణం దైవదౌత్య శకం పదవ సంవత్సరం "రమజాన్" మాసంలో సంభవించింది. అప్పటికి ఆమె (రజి) వయస్సు అరవై ఐదు సంవత్సరాలు. అప్పటికి మహాప్రవక్త (సల్లం) వయస్సు యాభై సంవత్సరాలు.

"హజ్రత్ ఖదీజతుల్ కుబ్రా (రజి)", దైవప్రవక్త (సల్లం) పాలిట ఎనలేని వరం అని చెప్పాలి. దాదాపు పాతిక సంవత్సరాలు ఆయన (సల్లం) భార్యగా ఉండి, ఆయన (సల్లం) పడే బాధల్లో భాగం పంచుకున్నారు. ఆయన (సల్లం) కోసం పరితపించి పోయేవారు. తీవ్రమైన గడ్డు పరిస్థితుల్లో ఆయన (సల్లం)కు చేదోడు వాదోడుగా నిలిచి శక్తినిచ్చేవారు. దైవసందేశ ప్రచారంలో, దైవదౌత్య బృహత్తర బాధ్యతల్లో ఆయన (సల్లం)కు సహాయపడేవారు. తన ధన ప్రాణాలతో ఆయన (సల్లం) కష్టాలను తీర్చే ప్రయత్నం చేసేవారు. 

 *మహాప్రవక్త (సల్లం) ప్రవచనం ఇలా ఉంది....; ↓* 

ప్రజలు నన్ను తిరస్కరించినప్పుడు ఆమె (రజి) నన్ను విశ్వసించారు. ప్రజలు నా మాటలను నమ్మనప్పుడు ఆమె (రజి) నా పలుకులను బలపరిచారు. ప్రజలు నాకు ఏదీ కాకుండా చేసినప్పుడు ఆమె (రజి) తన ధనంలో నన్ను భాగస్వామిగా చేశారు. "అల్లాహ్" నాకు ఆమె ద్వారానే సంతానం ఒసిగాడు. ఇతర భార్యల ద్వారా కాదు.

 *"సహీ బుఖారీ" గ్రంథంలో "అబూ హురైరా (రజి)" ఉల్లేఖనం ఇలా ఉంది....; ↓* 

"హజ్రత్ జిబ్రీల్ (అలైహి)" దైవప్రవక్త (సల్లం) వద్దకు అరుదెంచి, *"ఓ దైవప్రవక్తా! అదిగో "హజ్రత్ ఖదీజా (రజి)" వస్తున్నారు. ఆమె (రజి) చేతిలో ఓ పాత్ర ఉంది. అందు కూర లేదా భోజనం లేదా త్రాగే పానీయం ఉంది. ఆమె మీ దగ్గరకు వచ్చిన తరువాత ఆమెకు "అల్లాహ్" తరఫున సలాం అందించండి. స్వర్గంలో ముత్యాల ఓ మహలు గురించి శుభవార్త అందించండి. అందులో ఎలాంటి గోలగాని, దారిద్ర్యంగాని, అలుపుగాని ఉండవని చెప్పండి."* అన్నారు

 *శోకంలో వచ్చిపడ్డ మరో శోకం : -* 

ఈ రెండు శోకతప్తమైన సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి కొన్ని రోజుల తేడాల్లోనే వచ్చిపడ్డాయి. దీనివల్ల మహాప్రవక్త (సల్లం) గారి హృదయం శోక సంతప్తసాగరంలో మునిగిపోయింది. అదేకాదు, ఆ తరువాత తమ జాతి వారి తరఫు నుండి ఆయన (సల్లం)పై అనేక కష్టాలు వచ్చిపడ్డాయి. ఎందుకంటే, "అబూ తాలిబ్" మరణం తరువాత వారి ధైర్యం మరింత పెరిగిపోయింది. బాహాటంగా ఆయన (సల్లం)ను బాధించనారంభించారు. ఈ పరిస్థితి ఆయన (సల్లం) హృదయ వేదనను మరింత పెంచేసింది. దీనికి విసిగి వేసారి ఆయన (సల్లం) "తాయెఫ్" (తాయెఫ్ అనేది ఒక ఊరు) కు బయలుదేరి వెళ్ళారు. "బహుశా అక్కడి వారైనా తన పిలుపును ఆలకిస్తారని, తనకు సంరక్షణ కలగజేస్తారనే ఆశతో, తన జాతికి వ్యతిరేకంగా "తాయెఫ్" వారు తనకు సహాయపడతారేమో అని" ఆ ఊరికి బయలుదేరి వెళ్ళారు.

కాని, అక్కడ ఆయన (సల్లం)కు శరణిచ్చేవాడుగాని, సహాయకుడుగాని లభించలేదు. పైపెచ్చు వారంతా కలిసి ప్రవక్త (సల్లం)ను బాధించారు. తన జాతి కూడా బాధించని విధంగా బాధించారు. (వివరాలు ముందు రాబోతున్నాయి)

 *మక్కా వదిలి, వెళ్ళిపోవాలనుకున్న "అబూ బక్ర్ సిద్దీఖ్ (రజి)" : -* 

మక్కా ప్రజలు దైవప్రవక్త (సల్లం) విషయంలో ఎలా దౌర్జన్యాలకు హింసలకు పాల్పడ్డారో, ఆయన (సల్లం) అనుచరగణాన్ని ఎలా సతాయించారో మనకు తెలిసిందే. ఈ జులుము ఇలానే కొనసాగుతుండగా, దైవప్రవక్త (సల్లం) గారి ప్రియమిత్రుడు ''హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రజి)" వాటిని భరించలేక "మక్కా"ను వదలడానికి కూడా సిద్ధపడ్డారు. ఆయన (రజి) అబీసీనియాకు వెళ్లిపోవడానికి బయలుదేరగా, దారిలో "బర్కెగమ్మాద్ (ఇబ్నె దుగన్న)" అనే వ్యక్తి తారసపడిన, ఆయన (రజి)ను తన రక్షణలో తీసుకొని మక్కాకు తిరిగివచ్చాడు.

 _(↑ ఈ విషయంలో మరింత వివరణ ↓)_ 

''హజ్రత్ అబూ బక్ర్ (రజి)" అవిశ్వాసుల హింసాదౌర్జన్యాలు భరించలేక "హజ్రత్ బిలాల్ (రజి)"ని వెంటబెట్టుకొని అబీసీనియా ప్రయాణమయ్యారు. దారిలో మక్కా పరిసర ప్రాంతంలో ఉండే ఒక తెగ నాయకుడు "ఇబ్నె దుగన్న" తారసపడ్డాడు. (అపుడు "ఇబ్నె దుగన్న", ''హజ్రత్ అబూ బక్ర్ (రజి)"తో...., ↓)

 *ఇబ్నె దుగన్న : -* మిత్రమా అబూ బక్ర్ (రజి)! ఎక్కడికీ ప్రయాణం? ఏమిటి ఈ వేషం, యోగిలా తయారయ్యావు?

 *అబూ బక్ర్ (రజి) : -* నా తెగ వాళ్లు నన్ను ప్రశాంతంగా దైవారాధన చేయనీయకుండా వేధిస్తున్నారు. వారి వేధింపులు పడలేక నేను అబీసీనియాకు వెళ్ళిపోతున్నాను.

 *ఇబ్నె దుగన్న : -* వారు అలా ఎందుకు చేస్తున్నారు? నీవు నీ తెగలో ఎంతో మంచివాడివి. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవాడివి. ఎంతో నిజాయితీపరుడివి. పద, మక్కా వెళ్దాం. నేను నీకు ఆశ్రయమిస్తున్నాను. నా రక్షణలో వారు నిన్నేమి చేయలేరు.

ఈ మాట చెప్పి అతను, "అబూ బక్ర్ (రజి)"ని వెనక్కి మక్కాకు పిలుచుకొచ్చాడు. మక్కాలో ఖురేష్ నాయకులను ఉద్దేశించి....,

 *ఇబ్నె దుగన్న : -* ఖురైషీయులారా! నేను "అబూ బక్ర్ (రజి)"కు రక్షణ హామీ ఇచ్చాను. కనుక మీరెవరూ ఈరోజు నుండి ఇతడిని ఏమాత్రం వేధించకూడదు.

 *ఖురైషీయులు : -* సరే! మేము ఇతడ్ని వేధించము. అయితే ఇతను తన ఇంట్లోనే "ఖుర్ఆన్" పఠిస్తూ దైవారాధన చేయాలి. ఈ మాట ఒప్పుకుంటే మేము ఇతని జోలికి రాము.

"ఇబ్నె దుగన్న", "అబూ బక్ర్ (రజి)"తో మాట్లాడి ఈ షరతు అంగీకరించామని ఖురైషీయులకు తెలియజేశాడు. ఆ రోజు నుండి "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" తన ఇంట్లోనే దైవారాధన చేయసాగారు.

 *ఇటు ముహమ్మద్ (సల్లం)పై అవిశ్వాసుల ఆగడాలు మితిమీరి పోతున్నాయి.* 

 *"ఇబ్నె ఇస్'హాక్" కథనం ప్రకారం....; ↓* 

"అబూ తాలిబ్" మరణించినప్పుడు ఖురైష్ ప్రజలు, దైవప్రవక్త (సల్లం)కు పెట్టిన హింసలు "అబూ తాలిబ్" బ్రతికుండగా పెట్టలేదు. వారు తమ మనోభీష్టాన్ని ఇష్టమొచ్చినట్లు తీర్చుకున్నారు. చివరికి ఖురైష్ కు చెందిన ఓ ఉన్మాది, ఆయన (సల్లం)కు ఎదురొచ్చి ఆయన (సల్లం) తలపై మట్టిని కూడా గుమ్మరించాడు.

దైవప్రవక్త (సల్లం) అదే స్థితిలో ఇంటికి వెళ్లారు. ఆయన (సల్లం) కుమార్తె (ఫాతిమా (రజి)) లేచి ఆ మట్టినంతా కడుగుతూ రోదిస్తూ ఉంటే, మహాప్రవక్త (సల్లం) ఆమెను ఓదారుస్తూ...., *"బిడ్డా! ఏడవకు, అల్లాహ్ నీ తండ్రిని తప్పకుండా రక్షిస్తాడు."* అన్నారు. మట్టిని కడిగేటప్పుడు మహాప్రవక్త (సల్లం)...., *""అబూ తాలిబ్" పెదనాన్న బ్రతికి ఉండగా, ఖురైష్ నాకు ఇంత బాధ కలిగించేటంత దుస్సాహసానికి దిగలేదు."* అని కూడా అన్నారు.

ఇలా ఒకదానిపై మరొకటి వచ్చిపడే కష్టాల కారణంగా, దైవప్రవక్త (సల్లం) ఆ సంవత్సరానికి "ఆమ్ముల్ హజ్న్ (శోక సంవత్సరం)" అని పేరు పెట్టారు. ఆ తరువాత ఆ సంవత్సరం, ఆ పేరునే ప్రఖ్యాగాంచింది.

 *"హజ్రత్ సౌదా (రజి)"తో వివాహం : -* 

అదే సంవత్సరం "షవ్వాల్" మాసం (దైవదౌత్య శకపు 10వ సంవత్సరం)లో దైవప్రవక్త (సల్లం) "హజ్రత్ సౌదా (రజి) బిన్తే జమ్ఆ"ను వివాహమాడారు.

ఈమె (రజి) ప్రారంభంలోనే ముస్లిమైన మహిళ. రెండవ అబీసీనియా వలసప్పుడు వలస వెళ్ళిన వారు. ఆమె (రజి) భర్త పేరు "సక్రాన్ బిన్ అమ్రూ". ఆయన కూడా ప్రారంభకాలంలోనే "ఇస్లాం" స్వీకరించిన వ్యక్తి. "హజ్రత్ సౌదా (రజి)"తో పాటు అబీసీనియాకు వెళ్ళిన వ్యక్తి. అబీసీనియాలోనో లేదా మక్కాకు వచ్చిన తరువాతనో చనిపోయాడు. ఆయన మరణం తరువాత ఇద్దత్ కాలం పూర్తి అవగానే దైవప్రవక్త (సల్లం), ఆమె (రజి) వద్దకు వివాహ సంబంధం పంపించారు. ఆ తరువాత పెళ్ళి జరిగిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత తన వంతును "హజ్రత్ ఆయిషా (రజి)" గారికి "హిబా (సమర్పించారు)" చేశారు.

 *మిగిలినది In Shaa Allah రేపటి భాగములో....;* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment