152

🌿             ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪             🌿

🍂   🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌  🍂
🍃   🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*    🕌 🍃

✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦

🌾🔅     🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 152* 🕋🛐      🔅🌾

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 67* 🇸🇦🇸🇦🇸🇦

───────────┄┅━═══✦═══━┅┄───────────

                  *శోక సంవత్సరం* 

 *దైవప్రవక్త (సల్లం)గారి పెదనాన్న "అబూ తాలిబ్" గారి మరణం : -* 

"అబూ తాలిబ్" వ్యాధి ముదురుతూ చివరికి ఆయన మరణం సంభవించింది. ఆయన మరణం, "షిఅబె అబీతాలిబ్" దిగ్బంధం అంతమైన ఆరు నెలలకు "రజబ్" మాసం దైవదౌత్యపు పదవ సంవత్సరాన సంభవించింది.

 _(సీరత్ ఆధారాల్లో, "అబూ తాలిబ్" ఏ నెలలో చనిపోయారన్న విషయంలో తేడాలు కనబడుతున్నాయి. మేము "రజబ్" మాసాన్ని ఎందుకు ప్రాధాన్యత ఇచ్చామంటే అనేక ఆధారాలు, ఆయన "షిఅబె అబీతాలిబ్" నుండి బయటకు వచ్చిన ఆరు నెలల తరువాత మరణించారని ధృవ పరుస్తున్నాయి. దిగ్బంధం దైవ దౌత్యాశకం 7, ముహర్రం నెలలో ప్రారంభమైంది. ఆ లెక్కన "అబూ తాలిబ్" మరణించిన నెల "రజబ్" నెలే అవుతుంది గనక.)_ 

 *●"సహీ బుఖారి" గ్రంథంలో "హజ్రత్ ముసయ్యిద్ (రజి)" గారి ఉల్లేఖనం ప్రకారం....; ↓* 

"అబూ తాలిబ్" మరణకాలం దాపురించగానే, దైవప్రవక్త (సల్లం) ఆయన వద్దకు వెళ్లారు. అక్కడ "అబూ జహల్" కూడా ఉన్నాడు.

అపుడు దైవప్రవక్త (సల్లం), "అబూ తాలిబ్"నుద్దేశించి...., *"పెదనాన్న! మీరు "లా ఇలాహ ఇల్లల్లాహ్" అనండి. కేవలం ఒకే వాక్యం. ఈ వాక్యం మాధ్యమంగా నేను అల్లాహ్ కు సిఫార్సు చేయగలను."* అని అన్నారు. 

అంతలోనే "అబూ జహల్" మరియు "అబ్దుల్లా బిన్ ఉమయ్యా" అందుకొని...., *"అబూ తాలిబ్! అబ్దుల్ ముత్తలిబ్ ధర్మం నుండి ముఖం తిప్పుకుంటావా?"* అంటూ ఆయనను ఎత్తిపొడిచారు.

చివరికి "అబూ తాలిబ్" ప్రజలనుద్దేశించి చెప్పిన చిట్టచివరి పలుకులు...., *"అబ్దుల్ ముత్తలిబ్ ధర్మం పైన్నే"* అన్నది. *●* 

 *◆మరొక ఉల్లేఖనంలో....; ↓* 

*ముహమ్మద్ (సల్లం) : -* పెదనాన్నా! మీరు ఈ ఒక్క మాట అనండి. అంతిమదినాన మీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పడానికి నాకు అవకాశముంటుంది. నా మాట కాదనకండి. చెప్పండి *"లా ఇలాహ ఇల్లల్లాహ్"* ఒక్క మాట చాలు.

"అబూ తాలిబ్" ఏదో చెప్పాలనుకున్నారు. కాని, ఆయన నోట సమాధానం వెలువడకముందే "అబూ జహల్" అందుకున్నాడు.

 *అబూ జహల్ : -* నాయకా! మీరు మీ తమ్ముడి కొడుకు మాటలు విని, పూర్వం నుంచి వస్తున్న మన తాతముత్తాతల మతాన్ని వదిలిపెడతారా?

 *ముహమ్మద్ (సల్లం) : -* పెదనాన్నా! మీరు ఈ సద్వచనం ఒక్కసారి పఠించండి, చాలు. (అని అన్నారు, తన పెదనాన్న వైపు మరోసారి ఆశగా చూస్తూ....,)

"అబూ తాలిబ్" మళ్ళీ ఏదో చెప్పబోయారు. కాని, "అబ్దుల్లా బిన్ ఉమయ్యా", ఆయన మాటలకు అడ్డుతగులుతూ....;

 *అబ్దుల్లా : -* నాయకా! తొందరపడి తరతరాల నుంచి వస్తున్న మతాన్ని వదిలిపెట్టకండి.

 *ముహమ్మద్ (సల్లం) : -* పెదనాన్నా! సద్వచనం పఠించండి. పరలోకంలో మీ గురించి సిఫార్సు చేసే అవకాశం ఇవ్వండి నాకు. (అన్నారు మరోసారి)

 *అబూ తాలిబ్ : -* నాయనా ముహమ్మద్ (సల్లం)! నీవు కోరినట్లు అనడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కాని అబూ తాలిబ్ చావుకు భయపడి, ముహమ్మద్ (సల్లం)కు లొంగిపోయాడని జనం నన్ను ఎత్తిపొడుస్తారు. అంచేత నన్ను, మన తాతముత్తాతల మతంలోనే ఉండనీ.◆

ఇది విన్న దైవప్రవక్త (సల్లం), *"నన్ను "అల్లాహ్" ఆపనంత వరకు మీ మన్నింపు కోసం ప్రార్థిస్తూనే ఉంటాను."* అని అన్నారు. అంతలోనే ఈ దివ్యవాణి అవతరించింది....; ↓

 *ముష్రిక్కులు బంధువులైనాసరే, వారు నరకవాసులని స్పష్టమైపోయిన తరువాత వారి మన్నింపు కోసం దైవాన్ని వేడుకోవటం ప్రవక్తకు గానీ, విశ్వాసులకు గానీ ఎంత మాత్రం తగదు.* (ఖుర్ఆన్ 9:113).

ఆ తరువాత ఈ ఆయత్ కూడా అవతరించింది....; ↓

 *(ఓ ప్రవక్తా!) నువ్వు కోరిన వారినల్లా సన్మార్గానికి తేలేవు. అయితే అల్లాహ్ తాను కోరిన వారిని సన్మార్గానికి తీసుకువస్తాడు. సన్మార్గానికి రాగలిగేవారెవరో ఆయనకు బాగా తెలుసు.* (ఖుర్ఆన్ 28:56).

ఈ విధంగా, "అబూ తాలిబ్" ఖురైష్ శ్రీమంతులు ఒత్తిడి మూలంగా  "కలిమా" పఠించకుండానే, అవిశ్వాసిగానే తనువు చాలించారు. ఈ పరిణామానికి మహాప్రవక్త (సల్లం) అమితంగా దుఃఖించారు. అపుడు "అల్లాహ్", ఈ ఆయత్ లను అవతరింపజేసి...., *"ఓ ప్రవక్తా! సందేశాన్ని జనులకు చేరవేయటం వరకే నీ పని. సన్మార్గాన నడిపింపజేయటం నా పని. మేము సన్మార్గం చూపదలిచిన వారికే సన్మార్గ భాగ్యం లభిస్తుంది. అంతేగాని నువ్వు కోరిన వారందరికీ ఆ భాగ్యం లభించదు."* అని స్పష్టం చేశాడు.

"అబూ తాలిబ్", దైవప్రవక్త (సల్లం)కు ఎలాంటి రక్షణను చేకూర్చారో, ఆయన (సల్లం)ను ఎలా ఆదుకున్నారో ఇక్కడ చెప్పనవసరం లేదు. నిజానికి మక్కాకు చెందిన ఇద్దరు ఉన్మాదుల దాడుల నుండి ఇస్లామీయ సందేశ ప్రచారాన్ని రక్షించడానికి ఓ కోటలా పనిజేసిన వారాయన. కాని స్వయంగా తన తాతముత్తాతల ధర్మంపైన్నే నిలకడగా ఉండిపోయారు. అందుకే ఆయన సంపూర్ణ సాఫల్యం పొందలేకపోయారు.

 *"సహీ బుఖారీ"లో "హజ్రత్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రజి)" ఉల్లేఖనం ఇలా ఉంది....; ↓* 

నేను దైవప్రవక్త (సల్లం)తో, *"ఓ ప్రవక్తా! మీ పినతండ్రి మీ కోసం ఇంత కష్టపడ్డారు కదా! ఆయన మిమ్మల్ని రక్షించడానికి ఇతరులను కోపగించుకునే వారు. వారితో జగడపడేవారు కూడాను. ఆయన కోసం తమరు ఏం చేయగలిగారు?"* అని.

దానికి మహాప్రవక్త (సల్లం), *"ఆయన నరకంలో ఓ తేలికపాటి శిక్ష కలిగే స్థలంలో ఉన్నారు. నేనే లేకపోతే ఆయన నరకంలోని లోతైన గోతిలో పడిపోయేవారు."* అని సెలవిచ్చారు.

 *"అబూ సయీద్ ఖుద్రీ (రజి)" కథనం ప్రకారం....; ↓* 

ఓమారు, దైవప్రవక్త (సల్లం) దగ్గర "అబూ సయీద్ ఖుద్రీ (రజి)" కూర్చుని ఉండగా, "అబూ తాలిబ్" గారి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన (సల్లం) ఇలా సెలవిచ్చారు. ↓

 *"బహుశా ప్రళయదినం నాడు ఆయనకు నా సిఫారసు ప్రయోజనం చేకూర్చవచ్చు. ఆయనను నరకంలోని ఓ తేలికపాటి స్థలంలో ఉంచడం జరగవచ్చు. నరకశిక్ష ఆయన రెండు చీలమండల వరకే పరిమితం గావచ్చు."* 

"అబూ తాలిబ్", "ఇస్లాం" స్వీకార భాగ్యానికి నోచుకోలేదు. ఆయన విశ్వప్రభువు అనుగ్రహానికి దూరమైపోయారు. చిన్ననాటి నుంచి ఎంతో గారాబంగా పెంచి పెద్దచేసి, శత్రువుల నీడ సైతం తనపై పడనీయకుండా కంటికి రెప్పలా కాపాడిన పెద్దనాన్న, ఈ రోజు అవిశ్వాస స్థితిలోనే అంతిమయాత్ర చేయవలసి వస్తున్నందుకు మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఎంతగానో బాధ పడ్డారు.

కాని మనిషి హృదయాన్ని మార్చడం ఎవరితరం? పరాత్పరుడు మాత్రమే తాను కోరిన పై తన కారుణ్య సుధను చిలికిస్తాడు.

"అబూ తాలిబ్",  దైవప్రవక్త (సల్లం)ను ఏకాకిగా చేసి, శాశ్వతంగా ఇహలోకం నుండి వెళ్ళిపోయారు. సత్యధర్మ వైతాళికుడ్ని, శత్రువుల రాతిగుండెలకు అప్పగించి మరీ వెళ్ళిపోయారు.

దైవప్రవక్త (సల్లం) హృదయానికి కలిగిన ఈ గాయం పూర్తిగా మాననయినాలేదు, దానిపై మరో గాయం. *కష్టసుఖాలలో, ఎగుడు దిగుళ్ళలో తోడుగా నీడగా నిలిచిన అర్థాంగి హఠాన్మరణం! పతిసేవే పరమానందంగా భావించిన "హజ్రత్ ఖదీజా (రజి)" కూడా దైవప్రవక్త (సల్లం)ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు.* 

 *In Shaa Allah రేపటి భాగములో, దైవప్రవక్త (సల్లం)గారి మొదటి భార్య "హజ్రత్ ఖదీజా (రజి)" గారి మరణం గురించి....;* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment