150

🌿             ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪             🌿

🍂   🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌  🍂
🍃   🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*    🕌 🍃

✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦

🌾🔅     🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 150* 🕋🛐      🔅🌾

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 65* 🇸🇦🇸🇦🇸🇦

───────────┄┅━═══✦═══━┅┄───────────

             *సంపూర్ణ సంఘ బహిష్కరణ :-:-: 3* 

 _(నిన్నటి భాగము కొనసాగింపు)_ 

 *ప్రమాణ పత్రం చించివేత : - - : ప్రమాణ పత్రాన్ని చించివేయాలని పథకాన్ని రూపొందుతున్న "హష్షామ్"* 

 *"హష్షామ్", "జుహైర్ (జుబైర్)"తో మాట్లాడుతున్న సందర్భం....,* 

 *హష్షామ్ : -* జుహైర్! అక్కడ "షిఅబె అబీతాలిబ్"లో మీ మామయ్య తినడానికి తిండి కూడా సరిగా దొరక్క దుర్భర జీవితం గడుపుతుంటే, ఇక్కడ నీవు మంచి మంచి రుచికరమైన పదార్థాలు తింటూ, ఖరీదైన బట్టలు ధరిస్తే భోగభాగ్యాలు అనుభవిస్తున్నా! నీకు ఇది న్యాయం అనిపిస్తోందా? అదే "అబూ జహల్" గనుక కష్టాల్లో ఉంటే అతని మేనల్లుళ్ళు ఇలా చూస్తూ ఏమీ పట్టనట్లు ఉండేవారా?

 *జుహైర్ : -* అయ్యో! నేనేం చేయగలను చెప్పు. నాకు మరో మనిషి సహాయపడితే నేనా ప్రమాణ పత్రాన్ని చించిపారేయకపోదునా? (అని తన చేతకానితనాన్ని వెలిబుచ్చాడు)

 *హష్షామ్ : -* అయితే జుహైర్! ఇంకో మనిషి కూడా ఉన్నాడు.

 *జుహైర్ : -*  ఎవరాయన?

 *హష్షామ్ : -* నేనే!

 *జుహైర్ : -* సరే! మూడో వ్యక్తిని కూడా వెదుకు.

ఆ తర్వాత "హష్షామ్" నేరుగా "ముత్'యిమ్ బిన్ అద్దీ" ఇంటికి వెళ్ళాడు.(ముత్'యిమ్ కూడా "అబ్దె మునాఫ్" వంశానికి చెందినవాడు). "బనూ హాషిమ్" మరియు "బనూ ముత్తలిబ్" (కుటుంబాల)తో "ముత్'యిమ్"కు గల సంబంధబాంధవ్యాల గురించి గుర్తుచేస్తూ, ఖురైష్ తో కలిసి వారికి అన్యాయం చేస్తూ పెట్టే బాధల గురించి ఎత్తిపొడిచాడు. దానికి "ముత్'యిమ్"....,

 *ముత్'యిమ్ : -* అయ్యో! నేనొక్కణ్ణే ఏం చేయగలను? (అని తన నిస్సహాయ స్థితిని తెలుపాడు)

 *హష్షామ్ : -* ఈ పనిలో మనకు సహాయ పడటానికి తోడుగా మరొకరు కూడా ఉన్నారు.

 *ముత్'యిమ్ : -* ఎవరతను?

 *హష్షామ్ : -* నేనే!

 *ముత్'యిమ్ : -* అయితే మూడో మనిషిని కూడా తయారుచెయ్యి.

 *హష్షామ్ : -* ఆ పని కూడా అయిపోయింది.

 *ముత్'యిమ్ : -* అతనెవరు?

 *హష్షామ్ : -* జుహైర్ బిన్ అబీ ఉమయ్యా.

 *ముత్'యిమ్ : -* అయితే నాల్గో వ్యక్తి కూడా కావాలి!

ఆ తర్వాత నాలుగవ వ్యక్తి కోసం "హష్షామ్ బిన్ అమ్రూ" హుటాహుటినా "అబుల్ బక్తరీ బిన్ హష్షామ్" దగ్గరకు వెళ్ళాడు. "ముత్'యిమ్'కు చెప్పినట్లుగానే చెప్పాడక్కడ. అపుడు "అబుల్ బకర్తీ"....,

 *అబుల్ బకర్తీ : -* హష్షామ్! నీవు చెప్పేదాన్ని బలపరిచేవారు ఇంకెవరైనా ఉన్నారా?

 *హష్షామ్ : -* ఉన్నారు.

 *అబుల్ బకర్తీ : -* ఎవరెవరున్నారు.

 *హష్షామ్ : -* వారు "జుహైర్ బిన్ అబీ ఉమయ్యా", "ముత్'యిమ్ బిన్ అద్దీ" మరియు నేను.

దాని కోసమని "హష్షామ్", "జమ్ఆ బిన్ అస్వద్ బిన్ ముత్తలిబ్ బిన్ అసద్" అనే వ్యక్తి దగ్గరకి వెళ్ళాడు. "హష్షామ్" అతనితో మాట్లాడుతూ, "బనూ హాషిమ్"తో అతనికిగల బంధుత్వాన్ని, వారి హక్కుల్ని గుర్తుచేస్తూ విషయం బయటపెట్టాడు. "హష్షామ్" మాటలు విన్న "జమ్ఆ" ఇలా అన్నాడు.

 *జమ్ఆ : -* హష్షామ్! దీని కోసం నన్ను పిలుస్తున్నావా? మనకు తోడుగా ఇంకా ఎవరైనా ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారా?

"ఔను" అని తలూపుతూ అందరి పేర్లు చెప్పాడు "హష్షామ్".

ఆ తరువాత ఆ అయిదుగురు "హజూన్" అనే చోట సమావేశమై, "మనం ఆ ప్రమాణ పత్రాన్ని చించిపారేద్దాం" అనే వాగ్దానాలు చేసుకున్నారు. దానికి ఓ పథకం పన్నుతూ జుహైర్ "మొదట నేనే ప్రారంభిస్తాను. అంటే మొదట దాని గురించి నేనే మాట్లాడుతాను" అనుకొని, ఆ రోజు చర్చ ముగించుకొని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు.

 *తరువాతి రోజు : -* 

తెల్లవారగానే అందరూ మాములుగా (కాబా వద్ద) వారి వారి స్థానాల్లో వచ్చి కూర్చున్నారు. "జుహైర్" కూడా వస్త్రధారుడై అక్కడికి వచ్చాడు. కాబా గృహాన్ని ఏడుసార్లు ప్రదక్షిణ చేసి ప్రజలనుద్దేశించి ఇలా అనసాగాడు....,

 *జుహైర్ : -* ఓ మక్కా ప్రజలారా! మనం తినవచ్చు. వస్త్రాలను ధరించవచ్చు. అటు "బనూ హాషిమ్" సర్వనాశనమైపోతున్నారు. వారికి ఏదీ అమ్మడంగాని, కొనడంగాని జరగడం లేదు. దైవసాక్షి! నేను చూస్తూ ఊరుకోలేను. బంధుత్వాన్ని త్రెంచేది, దౌర్జన్యాన్ని పురికొలిపేది అయిన ఆ దుష్ట ప్రమాణ పత్రాన్ని చించి వేయనంతవరకు నేను ఊరుకోను. (అని బిగ్గరగా చాటిచెప్పాడు.)

 _(↑ ఇదే విషయం వేరొక ఉల్లేఖనం ప్రకారం →....,_ "మిత్రులారా! మనం ఇక్కడ కడుపారా తిని హాయిగా ఉంటున్నాం. కాని, "షిఅబె అబీతాలిబ్"లో హాషిమ్ సంతతివాళ్ళు ఎవరి సహాయానికి నోచుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇది భావ్యమేనా మనకు? మానవత్వం అంటే ఇదేనా? ఇదిగో నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. నిర్దాక్షిణ్యమైన ఈ ఒప్పందాన్ని తుదముట్టించే వరకు నేను విశ్రాంతి తీసుకోను. ఇదేనా నిర్ణయం." _)_ 

"మస్జిదె హరాం"లో ఓ మూలన కూర్చొని ఉన్న "అబూ జహల్", ఈ మాటలు విన్న వెంటనే లేచి...., *"నీవు చెప్పేదంతా బూటకం. దైవసాక్షి! ఆ ప్రమాణ పత్రాన్ని చించేయడం కుదరదు."* అని "జుహైర్" మాటలను అడ్డుకున్నాడు. 

దానికి "జమ్ఆ బిన్ అస్వద్" లేచి...., *"దైవసాక్షి! నీవే బొంకుతున్నావు. ఈ ప్రమాణ పత్రం మా ఇష్టానికి వ్యతిరేకంగా రాయబడింది. అందులో ఉన్న విషయాలను మేము ఒప్పుకోము."* అని "అబూ జహల్" మాటలకు అడ్డుతగిలాడు.

ఆ తరువాత "ముత్'యిమ్ బిన్ అద్దీ" నిలబడి...., *"మీరిద్దరు చెప్పిందే సబబు. దీనికి వ్యతిరేకంగా చెప్పేవాడు (అబూ జహల్) చెప్పేదే తప్పు. మేము ఈ పత్రాన్ని చించి దైవం ఎదుట మా కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటాం."* అని అన్నాడు.

ఆ తరువాత "హష్షామ్ బిన్ అమ్రూ" కూడా అలానే అన్నాడు.

ఇది గమనించిన "అబూ జహల్"...., *"ఓహో! ఇది రాత్రికిరాత్రే నిర్ణయించుకోబడిన విషయమా! ఇది ఇక్కడ కాకుండా మరెక్కడో జరిగిన కుట్రా?"* అని అన్నాడు.

"అబూ తాలిబ్" కూడా కాబా మస్జిద్ లో ఓ మూలలో కూర్చుని ఉన్నారు. ఆయన అక్కడకు రావడానికి కారణం ఏమనగా...., "అల్లాహ్, తన ప్రవక్త ముహమ్మద్ (సల్లం)కు రాత్రి ఈ ప్రమాణపత్రం గురించి తెలియజేయడం."

అల్లాహ్, తన ప్రవక్తకు తెలియజేసిన విషయం ఏమిటంటే...., *"ఆ ప్రమాణ పత్రం పై చెదలు పంపడం జరిగింది. ఆ చెదలు, ఆ దమన నీతి సూత్రాలను, బంధుత్వపు తెగతెంపుల వాక్యాలుగల ఆ ప్రమాణ పత్రాన్నీ తినివేశాయి. కేవలం "అల్లాహ్" నామం మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాయి."* అని తెలియజేయడం జరిగింది.

తనకు తెలియజేసిన ఈ సందేశాన్ని దైవప్రవక్త (సల్లం) తన పెదనాన్న "అబూ తాలిబ్"కు తెలియజేశారు. ఇదే విషయం, ఖురైషీయులతో చెప్పమని "అబూ తాలిబ్"కు చెప్పారు.

"అబూ తాలిబ్" ఖురైషీయుల వద్దకు వచ్చి, "అల్లాహ్, ప్రవక్త (సల్లం)కు తెలియజేసిన సందేశాన్ని వినిపించి", ఇంకా తన మాటలను ఇలా కొనసాగించాడు.

 *అబూ తాలిబ్ : -* నా సోదర కుమారుడు ఈ విషయం మీతో చెప్పమని, అదే గనక అసత్యమైతే మేము ఆయన (సల్లం)కు, మీకు మధ్యన అడ్డుగా నిలవం, మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి. ఆయన (సల్లం) చెప్పిందే గనక నిజమయితే మీరు మా బహిష్కరణను, మాపై చేసే దౌర్జన్యాన్ని మానుకోండి అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను.

 *అవిశ్వాసులు : -* ఔను! మీరు న్యాయమైన విషయాన్నే చెబుతున్నారు.

ఇటు "అబూ జహల్" మరియు ఇతరుల మధ్యన జరుగుతున్న వాగ్వివాదం సద్దుమణిగింది.

అంతలో "ముత్'యిమ్ బిన్ అద్దీ" ఆ పత్రాన్ని చించేయడానికి లేచాడు. ఇంకేముంది. దాన్ని చెదలు పట్టి పూర్తిగా తినివేసి ఉంది. కేవలం *"బిస్మికల్లాహుమ్మా (ఓ అల్లాహ్! నీ పేరుతో)"* అనే పదాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు గమనించారు. ఎక్కడయితే "అల్లాహ్" పేరు ఉందో చెదలు ఆ భాగాన్ని ముట్టుకోలేదు.

ఆ తరువాత ఆ పత్రం చించివేయబడింది. దైవప్రవక్త (సల్లం), ఇతరులందరూ "షిఅబె అబీతాలిబ్" నుండి బయటకు వచ్చేశారు. బహుదైవారాధకులు దైవదౌత్యపు ఓ గొప్ప సూచనను అక్కడ చూశారు. అయినా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. బహుదైవారాధకులు ఈ సూచనను చూసి కూడా ముఖాలు త్రిప్పుకున్నారు. తమ తిరస్కార మార్గంలో కొన్ని అడుగులు ఇంకా ముందుకు వేశారు.

---------------------------

వేరొక సీరతుల్ కితాబ్ ప్రకారం, ఈ సమయంలో అక్కడే ఉండి ఈ వ్యవహారమంతా గమనిస్తున్న "అబూ సుఫ్యాన్", ప్రమాణ పత్రాన్ని చించేయాలని చెబుతున్న "జుహైర్" మాటలకు ఇలా బదులిచ్చాడు. ↓

 *అబూ సుఫ్యాన్ : -* ఏమిటీ! నీవు ఒప్పందం ఉల్లంఘించి రక్తపాతానికి సిద్ధపడదలిచావా?

 *జుహైర్ : -* మీరు ఒప్పుకోకపోతే రక్తపాతం తప్పదు.

 *అబూ సుఫ్యాన్ : -* అంతవరకు వచ్చిందా నీ వ్యవహారం? అయితే నిన్ను మా దారి నుండి శాశ్వతంగా తప్పించవలసి వస్తుంది.

 *జుహైర్ : -* నీకంత ధైర్యం వచ్చిందా? అయితే ఖడ్గం తీసుకుని రంగంలోకి దిగు. (అన్నాడు వరలో నుంచి చుర్రున కరవాలం లాగి తీస్తూ) 

"అబూ సుఫ్యాన్" కూడా కత్తి దూసి ముందుకు వచ్చాడు. అంతలో...., "ఆగండి" అని అన్నారు కొందరు సహచరులతో అప్పుడే అక్కడికి వచ్చిన "అబూ తాలిబ్".

ఆయన వారిద్దరి మధ్యకు వచ్చి కత్తులు దించమని సైగచేస్తూ ఇలా అన్నారు....,

 *అబూ తాలిబ్ : -* నేను ఇక్కడకు ముహమ్మద్ (సల్లం) చెప్పిన మాటను ధృవపరచుకోవడానికి వచ్చాను. ఈ రోజు ముహమ్మద్ (సల్లం) ఒడంబడిక పత్రం చెదలు పట్టిపోయిందని తెలియజేశాడు. ఈ మాట నిజమయితే మీరు బహిష్కరణ ఆంక్షలు ఎత్తివేయాల్సి ఉంటుంది.

 *అబూ సుఫ్యాన్ : -* తప్పకుండా. ఒడంబడిక పత్రం చెదలు పడ్తే ఇక ఆంక్షల్ని కొనసాగించే ప్రశ్నే తలెత్తదు. కాని ముహమ్మద్ (సల్లం) మాట అసత్యమని రుజువైతే....?

 *అబూ తాలిబ్ : -* నా తమ్ముడి కొడుకు ముహమ్మద్ (సల్లం) ఎన్నటికీ అసత్యమాడడు. ఒకవేళ ఈ మాట అబద్దమని తేలితే నేను ముహమ్మద్ (సల్లం)ని మీకు అప్పగిస్తాను. మీ ఇష్టానుసారం అతని పట్ల మీరు ప్రవర్తించవచ్చు. నాకెలాంటి అభ్యంతరం లేదు.

 *అబూ సుఫ్యాన్ : -* సరే పదండి. లోపలికి వెళ్లి చూద్దాం ఈ తమాషా కూడా.

అందరూ కాబాలోకి ప్రవేశించారు. చూస్తే నిజంగానే ఒడంబడిక పత్రం చెదలు పట్టిపోయింది. *ఒక్క "అల్లాహ్" పేరు తప్ప మరేమీ లేదక్కడ.* ఖురైషీయులు ఆశ్చర్యచకితులై పోయారు. ఒడంబడిక దానంతటదే రద్దయిపోయింది. "అబూ జహల్", "అబూ సుఫ్యాన్"ల నోళ్ళల్లో పచ్చివెలక్కాయలు పడినట్లయింది.

 *దైవప్రవక్త (సల్లం), ఆయన అనుచరులు మూడు సంవత్సరాల తర్వాత స్వేఛ్ఛా జీవులై "షిఅబె అబీతాలిబ్" నుంచి బయటకు వచ్చారు. ధర్మప్రచారం మళ్ళీ ప్రారంభించారు. మునుపటికంటే ఇప్పుడు ఇస్లామీయ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు.* 

 *మిగిలినది In Shaa Allah రేపటి భాగములో....,* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment