148

🌿             ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪             🌿

🍂   🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌  🍂
🍃   🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*    🕌 🍃

✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦

🌾🔅     🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 148* 🕋🛐      🔅🌾

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 63* 🇸🇦🇸🇦🇸🇦

───────────┄┅━═══✦═══━┅┄───────────

              *సంపూర్ణ సంఘ బహిష్కరణ :-:-: 1* 

 *కాబా దగ్గర సమావేశమై, ముహమ్మద్ (సల్లం) గురించి చర్చించుకుంటున్న ఖురైషీయులు* 

ఖురైషీయులందరి ముందు, దుర్మార్గుడు "అబూ లహబ్" దైవప్రవక్త (సల్లం) గురించి ప్రస్తావిస్తున్న సందర్భం.

 *అబూ లహబ్ : -* ఖురైషీయులారా! ముహమ్మద్ (సల్లం) విషయంలో మనం వహించిన సహనం ఇక చాలు. ముహమ్మద్ (సల్లం) కేవలం కలలు కనేవాడో లేక కల్పనా చతురుడో కాదు, అతనో ప్రమాదకరమైన పిచ్చివాడు. అతను తరతరాలుగా వస్తున్న విశ్వాసాలను, నమ్మకాలను, కాలరాస్తున్నాడు. ఇదంతా ఎక్కడికి దారితీస్తుందో మీకేమన్నా అర్థమవుతుందా? ఒకవేళ అతను మక్కా ప్రజలను నమ్మించగలిగితే, ఉన్న ఈ విగ్రహాలను నాశనం చేయించగలిగితే, ఈ మక్కా తీర్థయాత్రలకు ఎవరు వస్తారు? యాత్రికులు లేకుండా మక్కా, బంగారం లేకుండా మన ఖజానాలు మిగిలిపోతాయి. మనమంతా కూడా పేదరికంతో ఉండిపోతాం. బాధాకరంగా మిగిలిపోతాం. ఒక పొగరుబోతు, మానసిక బలహీనుడి తప్పిదాల వలన మనం ఈ బాధలు అనుభవించవలసినదేనా?

ఇక అప్పుడు, పరమ కర్కోటకుడు "అబూ జహల్" జోక్యం చేసుకున్నాడు. కండ్లు చిట్లించి, చిన్నవిగా చేసి గొణుగుతూ అన్నాడు.

 *అబూ జహల్ : -* నా అభిప్రాయం అడిగితే, అతణ్ణి చంపేయాలని అంటాను. హుబల్ దేవుడి సాక్షిగా! ఆ పని చేయటం నాకెంతో సంతోషం.

ఇంకో పెద్దమనిషి తన చేతిని పైకి ఎత్తి తను మాట్లాడుతానని సంసిద్ధత ప్రకటించాడు. అతను ఎంతో తెలివిగా, జాగ్రత్తగా ఇలా మాట్లాడసాగాడు. ↓

"నా ప్రియ మిత్రుడా, అబూ జహల్! నాకు నీ హింసాత్మక చర్యల గురించి భయం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు అటువంటి చర్యలేవీ సత్ఫలితాలను ఇవ్వలేదు. మొన్నటికి మొన్న జనం మధ్యలో నువ్వు ముహమ్మద్ (సల్లం)కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే మన యోధుడు "హమ్'జా (రజి)"కు రోషం వచ్చింది. అతను ముహమ్మద్ (సల్లం) వైపు మాట్లాడేంత ఉద్వేగానికి లోనయ్యాడు. తర్వాత కొద్ది కాలానికే అతనూ ముహమ్మద్ (సల్లం) వర్గంలో చేరిపోయాడు. అసలు ఏమి జరుగుతున్నదో ఎవరికీ తెలియకముందే ఇది జరిగిపోయింది. “అల్లాహ్ ఒక్కడే” అనే విశ్వాసాన్ని నమ్మినవాడిగా ప్రకటించుకుని "హమ్'జా (రజి)" కూడా ముహమ్మద్ (సల్లం)కు అనుచరుడిగా మారిపోయాడు. అంతేకాదు అతనికి నమ్మకంగా, వినయంగా ఉంటానని ప్రతిజ్ఞ కూడా చేశాడు. నీ వలన మన ఖురైష్ తెగ నుంచి ఇంకో మనిషి ఆ మూర్ఖపు విశ్వాసాలలోకి వెళ్ళిపోయాడు."

 *ఆ పెద్దమనిషి తన మాటలను కొనసాగిస్తూ....,* "మరొక దిగ్భ్రాంతికరమైన విషయం. మన మిత్రుడు, మహా బలుడైన "ఉమర్ (రజి) బిన్ ఖత్తాబ్" తన ఇష్టంగా ముహమ్మద్ (సల్లం)తో కలిసిపోయాడు. అతను తిరుగుబాటు గుంపులో చేరాడు. తన సొంత చెల్లెలు, బావ రహస్యంగా ముహమ్మద్ (సల్లం)తో చేరిన విషయం తెలుసుకున్న "ఉమర్ (రజి)" కోపంతో ఊగిపోయాడు. వాళ్ళను తిట్టాలని, శిక్షించాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కాని అక్కడికి చేరాక అతను ముహమ్మద్ (సల్లం) సందేశాలను విన్నాడు. ఆ మాటలు విని మంత్రముగ్ధుడయ్యాడు. ఒకలాంటి మొహంలో నేరుగా "అల్ - అర్'ఖమ్" ఇంటికి బయలుదేరాడు. ముహమ్మద్ (సల్లం) అతని అనుచరులు అక్కడే సమావేశమావుతుంటారు. "ఉమర్ (రజి)"ను చూసి అక్కడి వాళ్ళంతా భయపడ్డారు. కాని ముహమ్మద్ (సల్లం) మాత్రం అతనిని అడిగాడు, "ఉమర్ (రజి)! ఎంత కాలం ఈ వేదన అనుభవిస్తావు? ఏదో ఒక ఉపద్రవం సంభవించవలసిందేనా?" అని. ఉమర్ (రజి) సమాధానం అందరిని ఆశ్చర్యచకితులను చేసింది, "అల్లాహ్ ఒక్కడే అనటానికి నేనే సాక్షి, మీరు అల్లాహ్ ప్రవక్త."

ఈ పరిణామం గురించి విన్న పెద్దలు తమలో తామే గుసగుసలాడుకున్నారు.

"మనం ఉమర్ (రజి) లాంటి బలమైన అనుచరుడిని కోల్పోయాం" అంటూ వారిలో ఒకతను నిరుత్సాహంగా అరిచాడు.

ఆ పెద్దమనిషి "అబూ లహబ్" వైపు చూసి, తిరిగి తన మాటలు కొనసాగించాడు. ↓

"మీరు చెప్పేది మేము బాగానే అర్థం చేసుకున్నాం. కాని ఈ సమస్యను పరిష్కరించే మార్గాలు వేరేవి ఉన్నాయి."

 *అబూ లహబ్ : -* ఏమిటా పద్ధతులు? దయచేసి చెప్పండి!

"అబూ లహబ్" మాటలకు సమాధానంగా ఆ పెద్దమనిషి ఇలా అన్నాడు...., ↓

"మనం ఇద్దరు బలమైన మనుషులను కోల్పోయాం అన్నది స్పష్టం. ఏది ఏమైనా "హింస" అనేది రక్తపాతానికే దారి తీస్తుంది. అంతే కాదు, చివరికి అది మన రక్తమే కావచ్చు. అందుకే నేను వేరే మార్గాలు ఉన్నాయని ఇదివరకే చెప్పాను. మీరు వింటానంటే నా దగ్గర దీనికి ఒక చక్కటి ఉపాయం ఉంది. అది, ముహమ్మద్ (సల్లం)కు, అతని అనుచరులకు ఆహారం అందకుండా చేయటం. ఖురైష్ తెగ పెద్ద మనుషులముగా, మక్కాను పరిపాలించే యంత్రాంగ సభ్యులముగా, ఆ తిరుగుబాటుదారులకు ఆహారాన్ని విక్రయించకూడదని మనం ఒక నిషేధాజ్ఞను జారీ చేద్దాం.

"అవును.... ఏమీ అమ్మకూడదు. బట్టలు కాని, సామాన్లు కాని ఇంకేమైనా కాని, అసలు ఏ సంబంధాలు, ఏ వ్యవహారాలూ వాళ్ళతో ఉండకూడదు. అన్ని విధాలుగా వారు మాడిపోవాలి. ఈ మోసగాడి పట్టు వారిమీద ఎంత బలంగా ఉన్నదో అప్పుడు బయటపడుతుంది. కడుపులు మాడితే అప్పుడు వాళ్ళే హుబల్, లాత్ దేవుళ్ళ కొరకు కేకలేస్తారు." అంటూ ఖురైషీయులు కూడా ఇందుకు తమ ఆమోదం తెలిపారు.

"నిజమే అద్బుతమైన ఆలోచన" అంటూ "అబూ లహబ్" తన సుముఖతను తెలిపాడు.

 _(↑ ఈ విషయంలో మరింత వివరణ ↓)_ 

            *సంపూర్ణ సంఘ బహిష్కరణ* 

కేవలం నాలుగు వారాలు లేదా అంతకు తక్కువ కాలంలోనే బహుదైవారాధకులకు నాలుగు పెద్ద విఘాతాలు కలిగాయి.

 *1. "హజ్రత్ హమ్'జా (రజి)" గారి "ఇస్లాం" స్వీకారం.* 

 *2. "హజ్రత్ ఉమర్ (రజి)" గారి "ఇస్లాం" స్వీకారం.* 

 *3. ముహమ్మద్ (సల్లం) వారి బేరసారాలను తిరస్కరించడం.* 

 *4. "బనీ హాషిమ్" మరియు "బనీ ముత్తలిబ్" కుటుంబాలకు చెందిన వారంతా ఒక్కటై దైవప్రవక్త (సల్లం)ను సంరక్షించే ప్రమాణం చేయడం.* 

ఈ విఘాతాల వల్ల బహుదైవారాధకులు తెల్లబోయారు. తెల్లబోక మరేం చేస్తారు? దైవప్రవక్త (సల్లం)ను హతమార్చడానికి ప్రయత్నిస్తే, ఆయన (సల్లం) సంరక్షణ కోసం మక్కా కొండలోయ అంతా బహుదైవారాధకుల రక్తంతో ఎరుపెక్కిపోతుంది మరి. అదే కాదు, బహుశా వారంతా తుడుచుకుపోయినా తుడుచుకుపోవచ్చు. అందుకని వారు ప్రవక్త (సల్లం) గారి హత్యా ప్రయత్నాన్ని మాని, దౌర్జన్యం చేసే మరో మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది వారు ఇప్పటి వరకు అవలంభించిన మార్గాల్లోకెల్లా అతి భయంకరమైన మార్గం.

            *హింసా దౌర్జన్యాల కోసం చేసిన ప్రమాణం* 

ఈ ప్రతిపాదనకు అనుగుణంగా బహుదైవారాధకులు “ముహస్సిబ్” అనే కొండలోయలోని, "ఖైఫె బనీ కనాన"లో సమావేశమయ్యారు. "బనీ హాషిమ్" మరియు "బనీ ముత్తలిబ్" కుటుంబాలకు వ్యతిరేకంగా ప్రమాణాలు చేశారు. ఆ ప్రమాణాలు ఏమనగా....,

 *"దైవప్రవక్త (సల్లం)ను చంపడానికి అప్పజెప్పనంతమట్టుకు, ఇక నుండి ఆ రెండు కుటుంబాలతో వివాహాది సంబంధాలు పెట్టుకోకూడదు. వారితో ఎలాంటి వ్యాపారం (కొనడం, అమ్మడం) సాగించకూడదు. వారితో కలిసుండడం చేయకూడదు. వారి ఇళ్ళకు వెళ్లడం గాని, వారితో మాట్లాడడం వగైరాలు జరుపకూడదు." అని ప్రమాణాలు చేశారు.*

 *బహుదైవారాధకులు ఈ బహిష్కరణకు (బైకాట్ కు) దస్తావేజుగా ఓ పత్రం రాసుకున్నారు. ఆ ప్రమాణ పత్రంలో, "దైవప్రవక్త (సల్లం)ను చంపేయడానికి మనకు అప్పజెప్పనంతమట్టుకు "బనీ హాషిమ్" వారితో, వారు ఎలాంటి సంధి సలహాలకు వచ్చినా సరే వినేదేలేదు." అని ప్రమాణం చేస్తూ సంతకాలు పెట్టారు.* 

"ఇబ్నె ఖైమ్" ప్రకారం, ఈ ప్రమాణ పత్రం "మన్సూర్ బిన్ అక్రమా బిన్ ఆమీర్ బిన్ హాషిమ్" రాశాడు. మరికొందరి ప్రకారం, "నజ్ర్ బిన్ హారీస్" రాశాడన్నట్లు ఉంది. అయితే ప్రామాణికమైన విషయం ఏమిటంటే, దాన్ని రాసినవాడు "బగీయన్ బిన్ ఆమిర్ బిన్ హాషిమ్". దైవప్రవక్త (సల్లం) శపించినందుకు అతని చేయి పనిచేయకుండా పోయింది.

 *మొత్తానికి ఆ ప్రమాణం జరిగి, ఉత్తర్వును గొర్రె తోలులో పెట్టి సీలు చేశారు. ఆ పత్రాన్ని కాబా గృహంలో వ్రేలాడదీయడం జరిగింది.* దాని ఫలితంగా "అబూ లహబ్" తప్ప "బనీ హాషిమ్" మరియు "బనీ ముత్తలిబ్"కు చెందిన వారంతా (వారు ముస్లిములైనా లేదా దైవతిరస్కారులైన) "షిఅబె అబీతాలిబ్" అనే లోయలో బంధించబడ్డారు.

 _(ఈ సంఘటన దైవదౌత్యం లభించిన పదవ ఏట ముహర్రం నెలపొడుపు నాటి రాత్రి జరిగిన సంఘటన.)_ 

 *ఆ తరువాత ఖురైష్ నాయకులు దైవప్రవక్త (సల్లం) గారి పెదనాన్న "అబూ తాలిబ్" దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు...., ↓* 

 *ఖురైషీయులు : -* అబూ తాలిబ్! మన మధ్య సయోధ్య కుదరాలంటే ఇక ఒకే ఒక మార్గం ఉంది. ముహమ్మద్ (సల్లం)ని మాకు అప్పగించండి. మేము అతనిని శాశ్వతంగా సమాప్తం చేస్తాం. దాంతో మన ఉభయులకూ మనశ్శాంతి లభిస్తుంది. కావాలంటే ముహమ్మద్ (సల్లం) హత్యకు మీరు కోరినంత రక్తపరిహారం ఇచ్చుకుంటాం. దీనికి మీరు అంగీకరిస్తే మన మధ్య ఉన్న స్నేహం, గౌరవం ఇక ముందు కూడా కొనసాగుతాయి. అంగీకరించకపోతే మిమ్మల్ని, మీ ముహమ్మద్ (సల్లం)ని సంఘం నుంచి వెలివేస్తాం. ఇకముందు మీతో ఎలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలు, వ్యాపార లావాదేవీలు జరగవు. దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోండి. ఒక్కొక్క మెతుక్కి మొగంవాచి మాడి చావలసి వస్తుంది. ఆలోచించి నిర్ణయించుకోండి.

"అబూ తాలిబ్"గాని, ఆయన తెగవాళ్ళు గాని దైవప్రవక్త (సల్లం)ను ఆ కిరాతకులకు అప్పగించడానికి ఏమాత్రం సహించలేదు. ముహమ్మద్ (సల్లం) వారి ఆశాజ్యోతి. రానున్న పరిణామాలను ఎదుర్కోవడానికైనా సిద్ధపడ్డారుగాని, వారి బెదిరింపుల్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా...., *"ఏ షరతులయినా ఒప్పుకుంటాంగాని, ముహమ్మద్ (సల్లం)ను వదులుకోవడానికి మాత్రం మేము సిద్ధంగా లేము."* అంటూ నిక్కచ్చిగా జవాబిచ్చారు.

 *ఖురైషీయులు : -* అలాగైతే ఈరోజు నుండి మీరు మాకు బద్ధశత్రువులు. ఇక చూడండి మీ గతి ఏమవుతుందో! (అంటూ చురచుర చూసి చరచరా వెళ్ళిపోయారు.)

 *సంపూర్ణ సంఘ బహిష్కరణకు గురైన విశ్వాసులు కష్టాలు In Shaa Allah రేపటి భాగములో....,* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment