147

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●
*ఇస్లాం చరిత్ర*. *147 వ*
    *భాగానికి బదులుగా*
    *ఈ క్రింది 126 భాగానికి వివరణ చదువుకో గలరు.*
                    💎 *ఇస్లాం చరిత్ర* *-  126 ( a )* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 41 ( a )* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

 *[ [ [ Note : - ఈ రోజు భాగములోని "దివ్యఖుర్ఆన్" ఆయత్ లు అవతరించిన సందర్భం దృష్ట్యా, నేటి భాగము 126వ భాగములోని, బహుదైవారాధకులు అవలంభించిన మూడవ రకం ఎత్తుగడలో రావలసి ఉన్నది. అవగాహన లోపం వల్ల ఈ చిన్న పొరపాటు జరిగినది.* 

 *ఈ విషయంలోని వివరణ...., "ఖుర్ఆన్" అనువాదాలలో (74:31-37) ఈ ఆయత్ లు, "బహిరంగ ప్రచారం ప్రారంభించిన తరువాత అవతరించాయి." అని ఉన్నది.* 

 *మనం ఇప్పుడు "బహిరంగ ప్రచారాన్ని" దాటుకొని చాలా దూరం వచ్చేశాము. కావున, నేటి భాగము 126 - 127వ భాగాల మధ్యలో వచ్చి ఉండాల్సింది. సోదరులు గమనించగలరు. ] ] ]*
__________________________________

                 *నజ్ర్ బిన్ హారీస్* 

"నజ్ర్ బిన్ హారీస్"కు సలహా ఇస్తున్న మిత్రులు : -

ఓ సారి "నజ్ర్ బిన్ హారీస్"కు తన మిత్రులు, ""ఉఖ్బా బిన్ అబూముఐత్"ను తీసుకొని మదీనా వెళ్ళు. అక్కడ యూదపండితుల్ని కలుసుకో. వారికి ముహమ్మద్ (సల్లం) సంగతి తెలిపి, అతని గురించి వారి అభిప్రాయం అడిగి తెలుసుకో. గ్రంథ ప్రజలకు దైవప్రవక్తల్ని గురించి బాగా తెలుసు.” అని సలహా ఇచ్చారు.

"నజ్ర్" మిత్రుల సలహా ప్రకారం "ఉఖ్బా"ను వెంటబెట్టుకుని మదీనా వెళ్ళాడు. అక్కడ యూదపండితుల్ని కలుసుకొని మాట్లాడాడు. ఆ యూద పండితులు విషయం విని ఇలా చెప్పారు....,

"పూర్వ కాలంలో కొందరు యువకులు ఉండేవారు. వారి కథ చాలా విచిత్రంగా ఉంటుంది. అంచేత వారిని గురించి ముహమ్మద్ (సల్లం)ని అడుగు. అలాగే పూర్వం అసాధారణ శక్తి గల ఓ రాజు ఉండేవాడు. అతను ప్రపంచం నలుమూలలా పాలించాడు. ఆయన్ని గురించి కూడా వివరాలు అడుగు. ఇంకా "ఖిజర్" అనే ఓ విచిత్ర వ్యక్తి ఉండేవాడు. అతడ్ని గురించి కూడా ముహమ్మద్ (సల్లం)ని అడుగు. ఈ మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే ఆయన (సల్లం) నిజంగా దైవప్రవక్తే. చెప్పలేకపోతే ఆయన (సల్లం) అసత్య ప్రవక్తని భావించండి. అప్పుడు మీరు అతనిపట్ల ఇష్టమొచ్చినట్లు వ్యవహరించవచ్చు."

"నజ్ర్ బిన్ హారీస్" ఈ మూడు ప్రశ్నలు తీసుకుని మక్కా తిరిగొచ్చాడు. "నజ్ర్" రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న ఖురైషీయులు అతను వచ్చిరాగానే, “ఏమయింది మిత్రమా పోయిన పని?” అని అడిగారు ఎంతో కుతూహలంగా.

"నజ్ర్" తాను విన్న విషయాలన్నీ చెప్పాడు. "ఉఖ్బా" వాటిని ధృవీకరించాడు. తక్షణమే ఖురైషీయులు కొంతమందిని దైవప్రవక్త (సల్లం) దగ్గరకు పంపించారు. ఖురైషీయులు, ఈ మూడు ప్రశ్నలు దైవప్రవక్త (సల్లం)ను అడిగారు. ఆ మూడు ప్రశ్నలకు సమాధానం కోసం, దైవప్రవక్త (సల్లం) కొంత వ్యవధి అడిగారు.

ఆ తరువాత "అల్లాహ్", దివ్యావిషృతి ద్వారా తన ప్రవక్త (సల్లం)కు అవిశ్వాసులు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశాడు. 

----» యువకుల్ని గురించిన విచిత్ర గాధ "దివ్యఖుర్ఆన్"లోని "కహాఫ్ (మహాబిలం)" అనే అధ్యాయంలో వివరంగా ఉంది.

----» ప్రపంచం నలుమూలలా పర్యటించిన సాహస యాత్రికుడు "జుల్ఖర్'నైన్" చరిత్ర, విచిత్ర వ్యక్తి ఖిజర్ వృత్తాంతం కూడా అదే అధ్యాయంలో ఉన్నాయి.

దైవప్రవక్త (సల్లం) ఈ విషయాలు తీసుకుని బహుదైవారాధకుల దగ్గరకు వెళ్ళారు. వారు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానాలిస్తే ఈసారయినా తన దౌత్యాన్ని విశ్వసిస్తారేమోనన్న ఆశతో వాటిని వినిపించారు.

కాని వారి పాషాణ హృదయాలు దైవసూక్తులు విని ఏమాత్రం ద్రవించలేదు. పై పెచ్చు వారు మరింత మంకుతనం వహించారు. ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన దైవప్రవక్త (సల్లం) వారి మొండివైఖరి, తలబిరుసుతనాలు చూసి విచారిస్తూ అక్కడనుంచి వెళ్ళిపోయారు. అవిశ్వాసులు దైవసూక్తుల్ని తిరస్కరించడమే గాకుండా వాటిని కించపరచడానికి కూడా ప్రయత్నించారు.

“అసలు ఈ "ఖుర్ఆన్"ని మనం విననే వినకూడదు. ఇవి వట్టి పైత్యపు మాటలు. సాధ్యమైనంత వరకు మనం ముహమ్మద్ (సల్లం)ను ఎగతాళి చేసి ఆడిద్దాం. ఆ విధంగానైనా అతను మన దారికి రావచ్చు” అన్నాడు వారిలో ఒకడు.

“మీరు విన్నారా? మనం నరకానికి పోతామాట! అక్కడ పంతొమ్మిది మంది దైవదూతలు పకడ్బంధీగా కాపలాకాస్తూ మనల్ని బయటకి పోనివ్వరంట!! అంత పెద్ద నరకానికి పంతొమ్మిది మంది దైవదూతలేనా! మనం వేల సంఖ్యలో ఉన్నాం. ఈ పంతొమ్మిది మంది మనల్నేం చేస్తారు? మనలో పదేసిమంది ఒక్కొక్క దైవదూతను అవలీలగా ఎదుర్కొంటారు." అన్నాడు "అబూ జహల్".

"నేనొక్కడినే పదిహేడు మంది దైవదూతల్ని మట్టి కరిపిస్తాను. మిగతా ఇద్దరిని మీరంతా కలిసి చూసుకోండి." అని అన్నాడు వారిలో "కిల్దా" అనే మల్లయోధుడు గుండెలు విరుచుకుంటూ.

 _(కొన్ని కథనాల ప్రకారం ఇతగాడు అనేకసార్లు దైవప్రవక్త (సల్లం)పై కుస్తీ కోసం సవాలు విసిరాడు. ప్రతిసారీ చిత్తయ్యాడు. కానీ దైవప్రవక్త (సల్లం) సందేశాన్ని మాత్రం విశ్వసించలేదు. "రుకానా బిన్ అబ్దె యజీద్"తో కూడా ఆయన (సల్లం) కుస్తీ పట్టారు. అయితే "రుకానా" కుస్తీలో ఓడిపోగానే "ఇస్లాం" స్వీకరించారు. (ఇబ్నె కసీర్).)_ 

 _(ఈ సందర్భాన్ని "దివ్య ఖుర్ఆన్" ↓ ఈ విధంగా వర్ణించింది)_ 

 *(31) మేము నరకపాలకులుగా దైవదూతలను మాత్రమే ఉంచాము. ఇంకా మేము వారి (19) సంఖ్యను అవిశ్వాసులను పరీక్షించటానికి మాత్రమే నిర్ధారించాము. గ్రంథవహులకు నమ్మకం కుదరటానికి [1], విశ్వాసులు తమ విశ్వాసంలో మరింత ముందంజ వేయటానికి [2], గ్రంథవహులు, విశ్వసించినవారు సందేహానికి గురికాకుండా ఉండటానికి మేమిలా చేశాము. ఇంకా - హృదయాలలో రోగమున్నవారు, అవిశ్వాసులు, "ఇంతకీ ఈ (19) దృష్టాంతం ద్వారా అల్లాహ్ ఏం చెప్పదలిచాడు? [3]" అని చెప్పటానికి కూడా (మేము ఈ విధంగా చేశాము). ఈ విధంగా అల్లాహ్ తాను కోరినవారిని పెడదారి పట్టిస్తాడు, తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు [4]. నీ ప్రభువు సైన్యాలను స్వయంగా ఆయన తప్ప మరెవరూ ఎరుగరు [5]. ఈ (నరక) వృత్తాంతం మానవమాత్రుల బోధనార్థం ప్రస్తావించబడింది [6].* 

 *(32) నిజం చెబుతున్నాను [7]. చంద్రుని సాక్షిగా!* 

 *(33) తి(త)రిగి పోతున్న రాత్రి సాక్షిగా!* 

 *(34) ప్రకాశమానమైన ఉదయం సాక్షిగా!* 

 *(35) నిశ్చయంగా అది (ఆ నరకం) చాలా పెద్ద విషయం [8].* 

 *(36) మానవులకు ఒక హెచ్చరిక! [9]* 

 *(37) మీలో ముందంజ వేయదలిచే ప్రతి ఒక్కరికీ, వెనుక ఉండిపోదలిచే ప్రతి ఒక్కరికీ [10].* 

 *(ఖుర్ఆన్ 74:31-37)* 

 _[1] → అంటే - ఈ ప్రవక్త (సల్లం) సత్యవంతుడనీ, పూర్వపు గ్రంథాలలో ఉన్న యదార్థాన్నే ఈయన పలికాడన్న దానిపై వారికి ధృడ నమ్మకం కలగడానికి మేము ఇలా చేశాము._ 

 _[2] → గ్రంథ వహులు కూడా తమ ప్రవక్త (సల్లం) చెప్పినదాన్ని సత్యమని ధ్రువీకరించటం ద్వారా వారి విశ్వాసం మరింతగా పెరగాలని...._ 

 _[3] → హృదయాలలో రోగమున్నవారంటే కపటులు. లేదా మనసులలో అనుమానాలు ఉన్నవారు. ఎందుకంటే మక్కాలో “కపటులు” లేరు. దేవుడు దైవదూతల సంఖ్యను ప్రత్యేకంగా ప్రస్తావించటంలోని మర్మం ఏమిటి? అని వారు ప్రశ్నించాలనే మేమిలా చేశాము._ 

 _[4] → తాను కోరిన వారిని అపమార్గానికి లోనుచేసి, తాను కోరిన వారికి సన్మార్గం చూపటంలోని యుక్తి, పరమార్థం ఏమిటో అల్లాహ్ కే తెలుసు._ 

 _[5] → నరకంలో ఉన్నది 19 మంది దైవదూతలే కదా! వాళ్ళను అదుపులోకి తీసుకోవడం ఏమంత కష్టమైన పనికాదు అని అవిశ్వాసులు, ముష్రిక్కులు తలపోసేవారు. కాని ప్రభువు సైనికుల సంఖ్య అగణ్యమన్న సంగతి ఈ అవివేకులకు తెలీదు. ఆ సైనికులు నిజానికి ఎంతమందో దైవానికి మాత్రమే తెలుసు._ *"అల్లాహ్ ఆరాధన నిమిత్తము "బైతుల్ మామూర్"లో అనుదినం ప్రవేశించే దైవదూతల సంఖ్యే 70 వేలు. అలా ఒకసారి ప్రవేశించిన వారికి ప్రళయదినం వరకు మళ్ళీ ఆ అవకాశం దొరకదు." (సహీహ్ బుఖారీ, ముస్లిం)* 

 _[6] → అంటే - ఈ నరకం, నరక పాలకుల సంగతి ప్రజలకు హితబోధగా చెప్పబడింది. తద్వారా వారు అవిధేయతను మానుకుని సన్మార్గానికి వస్తారని!_ 

 _[7] → మక్కా వాసుల ఆలోచనలు ఇక్కడ ఖండించబడ్డాయి - ఓ మక్కా వాసులారా! దైవదూతలను ఓడించగలమన్న మీ ధీమా పస లేనిది. మీ ఆటలు ఏమాత్రం సాగవు. చంద్రుని సాక్షిగా! రేయి సాక్షిగా! ఉదయం సాక్షిగా! నేను చెప్పేది నిజం. మీ పథకాలు పారవు._ 

 _[8] → మూడు ముఖ్యమైన వస్తువులపై ప్రమాణం చేసిన తరువాత దేవుడు నరకం ఉగ్రరూపం గురించి చెప్పాడు. దీన్నిబట్టి అదొక గొప్ప విషయం అనటంలో సందేహానికి ఆస్కారం లేదు._ 

 _[9] → మానవులను హెచ్చరించేది ఏది? అంటే అది నరకమూ కావచ్చు. "ఖుర్ఆన్" కూడా కావచ్చు. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) నేపథ్యంలో కూడా ఈ వాక్యం వచ్చి ఉండవచ్చు._ 

 _[10] → విశ్వాసంలో, విధేయతలో పురోగమించేవారికి ఇది హెచ్చరికే. విముఖత చూపే వారికి కూడా ఇది హెచ్చరిక వంటిదే. హెచ్చరిక అందరికి వర్తిస్తుంది. మనిషి విశ్వాసి అయినా, అవిశ్వాసి అయినా - తరచూ హెచ్చరించే, సావధానపరిచే విషయం అతని ముందుకు రానంతవరకు అతను జాగ్రత్తపడడు._ 

 *రేపటి భాగము పంపించగలమో లేదో అని కొంచెం సందేహం ఉంది.* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment