146

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  146* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 61* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

 *(↓ ఈ విషయంలో మాకు కొంత సందేహం ఉన్నది ↓)* 

ప్రవక్త (సల్లం) ప్రచారోద్యమానికి ప్రభావితులవుతున్న వారిలో అత్యధిక మంది సాధారణ పౌరులే. ఉన్నత వంశానికి చెందిన ప్రముఖులు, మేధావులు ఎవరూ "ఇస్లాం" స్వీకరించడానికి ముందుకు రావడం లేదు. ఈ విషయం దైవప్రవక్త (సల్లం)ను భాదిస్తోంది. "అబు జహల్" పినతండ్రి "వలీద్" ముఖ్జూమ్ తెగ నాయకుడే గాక, ఖురైష్ అగ్రనాయకుల్లో గొప్ప నాయకుడు. అంచేత అతను "ఇస్లాం" స్వీకరిస్తే ఎంతో బాగుంటుంది అని తలచేవారు దైవప్రవక్త (సల్లం).

ఓ రోజు యాదృచ్ఛికంగా దైవప్రవక్త (సల్లం)కు, "వలీద్"ని కలుసుకొని మాట్లాడే అవకాశం లభించింది. "వలీద్"తో పాటు మరికొందరు ఖురైషీయులు కూడా ఉన్నారు. కాని అదే సమయంలో "ఇబ్నె ఉమ్మెమక్తూమ్ (రజి)" అనే ఓ అంధ నవముస్లిం వచ్చి తనకు "ఖుర్ఆన్" సూక్తులు ఏవైనా వినిపించమని మనవిచేశారు. దైవప్రవక్త (సల్లం) పురప్రముఖులతో చర్చలు జరుపడంలో నిమగ్నులయి ఉన్నందున కొంచెం ఆగమని చెప్పారు.

కాని "హజ్రత్ ఇబ్నె ఉమ్మెమక్తూమ్ (రజి)" మళ్ళీ అదే విధంగా విన్నవించుకున్నారు. ఈ వైఖరి దైవప్రవక్త (సల్లం)కు నచ్చలేదు. ఆయన (సల్లం) ముఖం చిట్లించుకుని "ఇబ్నె ఉమ్మెమక్తూమ్ (రజి)" నుండి ఖురైషీయుల వైపు దృష్టి మరల్చుకున్నారు.

దాంతో "హజ్రత్ ఇబ్నె ఉమ్మెమక్తూమ్ (రజి)" నిరాశ చెంది అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. అటు దైవప్రవక్త (సల్లం) ఖురైషీయులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కాగా అంధ నవముస్లిం పట్ల దైవప్రవక్త (సల్లం) వ్యక్తపరచిన తీరు గురించి దైవసందేశం అవతరించింది :

(ఈ ధోరణి "అల్లాహ్"కు నచ్చలేదు. అందువల్ల దైవప్రవక్త (సల్లం)కు మందలింపుగా ఈ ఆయత్ లు అవతరించాయి.)

 *(ప్రవక్త) నుదురు చిట్లించాడు, ముఖం త్రిప్పుకున్నాడు (1) - తన వద్దకు ఒక అంధుడు వచ్చినంత మాత్రానికే (2). (ఓ ప్రవక్తా!) నీకేం తెలుసు, బహుశా అతను తనను సంస్కరించుకుంటాడేమో!? (3) లేదా ఉపదేశం వింటాడేమో! ఉపదేశం అతనికి ప్రయోజనకరం అవుతుందేమో!! (4). ఎవడైతే నిర్లక్ష్యం చేస్తున్నాడో (5) అతనిపై నువ్వు ఎంతో శ్రద్ధ చూపుతున్నావు (6) వాడు గనక దిద్దుబాటు చేసుకోకపోతే, ఆ నింద నీపై లేదు కదా! (7). మరెవరైతే నీ దగ్గరకు (శ్రద్ధగా) పరుగెత్తుకుంటూ వస్తున్నాడో, (8) దైవభీతి (కూడా) కలిగి ఉన్నాడో, (9) అతని పట్లేమో నువ్వు అశ్రద్ధ వహిస్తున్నావు (10). ఇది సరైనది కాదు. ఈ ఖుర్ఆను మాత్రం హితబోధ నిమిత్తమే ఉన్నది (11). కాబట్టి, కోరినవారు దీని ద్వారా హితబోధను గ్రహించవచ్చు (12). అది గౌరవప్రదమైన సహీఫాల్లో (లిఖితమై) ఉన్నది (13). అవి మహోన్నతమైనవి, పవిత్రమైనవీను (14). అది లేఖకుల (దైవదూతల) చేతుల్లో ఉంది(15). (వారు) మహిమాన్వితులు, మంచి వారు కూడాను (16).* (ఖుర్ఆన్ 80:1-16).

 _(2 → "ఇబ్నె ఉమ్మె ముక్తూమ్" గారు అకస్మాత్తుగా వచ్చినందుకు దైవప్రవక్త (సల్లం) మోముపై వ్యక్తమైన చిరాకు సహజమే అయినా, అది ప్రవక్త స్థాయికి శోభించమని విషయం.)_ 

 _(3 → అంటే ఆ గుడ్డివాడు నీ ద్వారా ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకుని సదాచరణకు ఉపక్రమించవచ్చు. తత్ఫలితంగా అతని దిద్దుబాటు జరుగవచ్చు. అతని అంతరంగం పరిశుద్ధం కావచ్చు. నీ హితబోధ అతనికి లాభసాటి కావచ్చు. కనుక ముహమ్మద్ (సల్లం)! ఈ కులీనుల, భాగ్యవంతుల కోసం నువ్వు, నీ దగ్గరకు వచ్చిన అభాగ్య జీవులను నిర్లక్ష్యం చేయకు! అని దేవుడు తన ప్రవక్తకు బోధపరుస్తున్నాడు.)_ 

 _(4 → అంటే - విశ్వాసం (ఈమాన్) పట్ల, ప్రవక్త వద్దకు వచ్చిన ‘జ్ఞానం’ పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు. లేదా తన సిరిసంపదల్ని చూసుకుని మురిసిపోతూ ఇతరులను లక్ష్య పెట్టనివాడు.)_ 

 _(5 → ఓ ముహమ్మద్ (సల్లం)! చిత్తశుద్ధి గల ఈ అభిమానధనులను విస్మరించి, సత్యంపట్ల వైముఖ్య ధోరణిని కనబరిచే ఈ బడా ఆసాములపై దృష్టిని కేంద్రీకరించటం నీకు తగదు అని దేవుడు మరోసారి తన ప్రవక్తను మృదువుగా మందలించాడు.)_ 

 _(6 → ఓ ప్రవక్త (సల్లం)! సందేశాన్ని చేరవేయటం వరకే నీ కర్తవ్యం దాన్ని గ్రహించి బాగుపడేవారు లాభం పొందుతారు. ఒకవేళ ఎవరయినా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోక పోయినట్లయితే దానికి నీవు భాధ్యుడవు కావు. కాబట్టి ఈ "సోకాల్డ్ అరిష్ట్రోక్రాట్"ల కోసం నువ్వు మరీ అంతగా దిగులు చెందాల్సిన అవసరం లేదు సుమా!)_ 

 _(7 → అంటే - నీవు చూపే సన్మార్గం కోసం తహతహలాడేవాడు, నీ ఉపదేశాలను విని పవిత్ర జీవితం గడపాలని ఉవ్విళ్ళూరే పేదవాడు మరోవైపున ఉన్నాడు.)_ 

 _(8 → పైగా అతను అనుక్షణం దైవానికి భయపడుతూ, నీ సహచర్యం కోసం పరితపిస్తున్నాడు. అందువల్ల నీవు చేసే హితబోధ అతనికి లాభం చేకూరుస్తుందన్న ఆశ ఉంది. నీ ప్రభోధనలను అతను అక్షరాల పాటిస్తాడన్న నమ్మకం కూడా ఉంది. కనుక అలాంటి సఛ్ఛీలురను నువ్వు అశ్రద్ధ చేయకు.)_ 

 _(9 → అసలు నువ్వు శ్రద్ధ తీసుకోవలసింది ఇలాంటి త్యాగధనుల పట్లనేగాని, ధనమదాంధుల, అధికార మదాంధుల పట్లకాదు.)_ 

 _(10 → అంటే - పేదవారిపట్ల అనాసక్తతను కనబరచి, శ్రీమంతుల పట్ల అమితాసక్తి చూపే నీ ధోరణి సరైనది కాదు. ఇకమీదట ఇలాంటివి జరుగకుండా జాగ్రత్తపడు! అని చెప్పటం దీని అంతరార్థం.)_ 

 _(11 → అంటే - ఈ గ్రంథం పట్ల శ్రద్ధాభక్తులు ఉన్నవారు దీన్నుండి గుణపాఠం నేర్చుకోవాలి. ఇందలి ఉపదేశాలను ఆచరించాలి. ఈ గ్రంథాన్ని లక్ష్యపెట్టని వారిని పట్టించుకోవాల్సిన పనిలేదు. మక్కాకు చెందిన సర్దారులు, కులీనులు కూడా ఈ గ్రంథంపట్ల అనాసక్తతే చూపారు. దానివల్ల ధర్మానికి వాటిల్లిన నష్టం ఏమీ లేదు. కాబట్టి విముఖత చూపేవారిని గురించి చింతించాల్సిన పనిలేదు.)_ 

 _(12 - అంటే “లౌహె మహ్'ఫూజ్” లో అని భావం. ఎందుకంటే "దివ్యఖుర్ఆన్" అవతరించేది అక్కడి నుండే. మరో అర్థం ప్రకారం ఈ సహీఫాలు (పత్రాలు) దేవుని దగ్గర ఎంతో గౌరవప్రదమైనవి. ఎందుకంటే అవి జ్ఞానంతోను, యుక్తితోనూ నిండి ఉన్నవి.)_ 

 _(13 → “మర్'ఫూఅతిన్” అంటే అవి దైవసన్నిధిలో ఉన్నత స్థానం గలవి (లేదా) దోషాలకు అతీతమైనవి, మహోన్నతమైనవి. “ముతహ్హరతిన్” అంటే అవి ఆసాంతం పరిశుద్ధమైనవి. ఎందుకంటే వాటిని పవిత్రులు (దైవదూతలు) తప్ప ఎవరూ తాకరు. (లేదా) అవి హెచ్చుతగ్గులకు, మార్పులు చేర్పులకు అతీతమైనవి.)_ 

 _(14 → ‘లేఖకులు’ అంటే దైవదూతలు. వారు దైవవాణిని దైవప్రవక్తలకు చేరవేస్తారు. అంటే దైవానికి - దైవప్రవక్తలకు మధ్య “దౌత్యం” నిర్వహిస్తారు. అందుకే అరబీలో వారిని “సఫరతిన్” గా వ్యవహరించటం జరిగింది. సఫరతిన్ అంటే ‘దూతలు’ అని అర్థం. దైవదూతలు దైవదౌత్యాన్ని అందిస్తారు. రాయబారులుగా వ్యవహరిస్తారు. (రాయబార కార్యాలయం, దౌత్య సిబ్బంది, దూతవంటి పదాలు తెలుగువారికి సుపరిచితమే కదా!))_ 

 _(15 → అంటే - వారు పుట్టుక రీత్యా పునీతులు, ఆధారనీయులు. ఆచరణ రీత్యా సద్వార్తనులు పవిత్రులు. దీన్నిబట్టి బోధపడే ఒక ముఖ్య విషయం ఏమిటంటే "దివ్యఖుర్ఆన్"ని కంఠస్తం చేసినవారు. "దివ్యఖుర్ఆన్"లో పాండిత్యం సంపాదించినవారు నైతికంగా సద్గుణ సంపన్నులుగా, క్రియాత్మకంగా సజ్జనులుగా ఉండాలి. వారి జీవితమంతా ఈ “కిరామిన్ బరరహ్”కు ప్రతిరూపంగా ఉండాలి (ఇబ్నె కసీర్)._ 

 _ఒక హదీసు ప్రకారం మహనీయ ముహమ్మద్ (సల్లం) వారు ఇలా ప్రవచించారు: "ఎవరైతే "దివ్యఖుర్ఆన్"ను పఠిస్తాడో, "ఖుర్ఆన్"లో ప్రావీణ్యం సంపాదించాడో అతను మహిమాన్వితులైన, సజ్జనులైన దైవదూతల సరసన ఉంటాడు. మరెవరైతే "దివ్యఖుర్ఆన్"ను చాల కష్టపడుతూ పఠిస్తాడో (అంటే "ఖుర్ఆన్" పండితుల మాదిరిగా ధారాళంగా చదవలేడో) అతనికి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది." (సహీహ్ బుఖారీ - సూరయే అబస వ్యాఖానం; ముస్లిం - కితాబుస్సలాత్).)_ 

 *"బనీ హాషిమ్" మరియు "బనీ ముత్తలిబ్"లను సమావేశపరచిన "అబూ తాలిబ్" : -* 

పరిస్థితులు మారిపోతున్నాయి. చుట్టూ ఉన్న వాతావరణంలోను మార్పు వచ్చేసింది. అయినా, "అబూ తాలిబ్" మనస్సు మాత్రం ప్రమాదాన్ని శంకిస్తూనే ఉంది. బహుదైవారాధకుల వైపు నుండి తన సోదర కుమారునికి ప్రమాదం ఏర్పడగలదనే భయం మాత్రం ఆయనను వెంటాడటం మానలేదు. గతంలో జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా ఆయన కళ్ళెదుట ప్రత్యక్షమవుతున్నాయి. ఆయన కుమారుణ్ణి చంపడానికి ఆయనకు బదులుగా "అమ్మారా బిన్ వలీద్"ను ఇచ్చే బేరసారాలు చేశారు. "అబూ జహల్" భారమైన బండరాయిని ఎత్తుకుని ఆయన సోదర కుమారుని తలపై వేయడానికి ప్రయత్నం చేశాడు.

"ఉక్బా బిన్ అబీముఅయిత్" దుప్పటి మేడలో వేసి గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు. "ఖత్తాబ్" కుమారుడు ఖడ్గం చేతబూని ముహమ్మద్ (సల్లం)ను హతమార్చడానికి బయలుదేరాడు. ఈ సంఘటలన్నింటిని మననం చేసుకుంటూ ఈ పరిస్థితిలో ఏ బహుదైవారాధకుడైన ఆయన (సల్లం)పై విరుచుకుపడితే "హజ్రత్ హమ్'జా (రజి)" గాని, "హజ్రత్ ఉమర్ (రజి)" గాని మరెవరుగాని ఎలా ఆదుకోగలరు?

"అబూ తాలిబ్"కు ఇది సాధ్యమే అనిపించింది. మొత్తానికి ఇది యధార్థం కూడాను. ఎందుకంటే, బహుదైవారాధకులు బాహాటంగా దైవప్రవక్త (సల్లం)ను హతమార్చేందుకే కంకణం కట్టుకుని ఉన్నారు. వారి ఈ నిర్ణయానికి సంబంధించిన సంకేతం దైవవాణిలోనూ అవతరించి ఉంది. 

 *"ఏమిటి, వీళ్ళు (నీకు వ్యతిరేకంగా) ఏదన్నా విషయాన్ని గట్టిగా నిర్దారించారా? మరైతే మేము కూడా గట్టిగానే నిర్దారిస్తాము." (ఖుర్ఆన్ 43:79)* 

ఇప్పుడు "అబూ తాలిబ్" ఏం చేస్తారు అన్నదే ప్రశ్న. ఖురైష్ తన సోదరుని కుమారుణ్ణి అన్ని వైపుల నుండి వ్యతిరేకించటం చూసి, తన ముత్తాత "అబ్దె మునాఫ్" కుమారులు "హాషిమ్" మరియు "ముత్తలిబ్" ద్వారా ఉనికిలోనికి వచ్చిన వంశం వారందరిని ఓ చోట సమావేశపరిచారు. తాను ఇప్పటి వరకు ఒంటరిగా తన సోదరుని కుమారుణ్ణి కాపాడుతూ వచ్చానని, ఇక ముందు అందరు కలిసి ముహమ్మద్ (సల్లం)ను ఖురైష్ బారి నుండి కాపాడాలని పిలుపునిచ్చారు. "అబూ తాలిబ్" చేసిన ఈ అభ్యర్థనను అరబ్బులు పౌరుషం దృష్ట్యా, ఆ రెండు కుటుంబాలకు చెందిన వారంతా స్వీకరించారు. అయితే "అబూ తాలిబ్" సోదరుడు "అబూ లహబ్" ఒక్కడు మాత్రం దీన్ని ఒప్పుకోకుండా తన కుటుంబం నుండి వేరుపడి ఖురైష్ బహుదైవారాధకులతో కలసిపోయి వారికి అండగా నిలిచిపోయాడు.

 *మిగిలినది Insha Allah రేపటి భాగములో....,* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment