144

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  144* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 59* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

     *హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రజి) గారి ఇస్లాం స్వీకరణ : - 3* 

 _(నిన్నటి భాగము కొనసాగింపు)_ 

 *మరొక "సీరతున్నబి" ప్రకారం : - ↓* 

ఉమర్ (రజి) : - దైవప్రవక్తా!  చచ్చినా బ్రతికినా సత్యం మన పక్షానే ఉంది కదూ?

ముహమ్మద్ (సల్లం) : - ఎవరి ఆధీనంలో నా ప్రాణం ఉందో ఆ దైవసాక్షి! నిస్సందేహంగా సత్యం మన వైపే ఉంది. (అయినా) ఉమర్! చావు బ్రతుకులతో ఏమవుతుంది?

ఉమర్ (రజి) : - అయితే మనం ఇలా దాక్కోవడం ఎందుకు?

ముహమ్మద్ (సల్లం) : - మనం ఇప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్నాం. శత్రువులు అధిక సంఖ్యలో ఉన్నారు.

ఉమర్ (రజి) : - దైవారాధన దాక్కొని చేయడమా! వీల్లేదు. మిమ్మల్ని సత్యధర్మం ఇచ్చిపంపిన దేవుని సాక్షి! ఇప్పటిదాకా నేను ఎక్కడెక్కడ అవిశ్వాస గానాలు ఆలపించానో ఇక నుంచి అక్కడ "ఇస్లాం" నినాదాలు చేస్తాను. (అన్నారు దృఢ సంకల్పంతో)

దైవప్రవక్త (సల్లం), అనుచరుల్ని "ఉమర్ (రజి)", "హమ్'జా (రజి)"ల నాయకత్వంలో రెండు జట్లుగా విభజించి "కాబా" పంపించారు.  వీరంతా "కాబా" వెళ్ళి "నమాజ్" చేసి దిక్కులు పిక్కుటిల్లేలా *"లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలుల్లాహ్"* అని నినదించారు.

ఆ రోజు ముస్లింలలో వెల్లివెరిసిన ఆనందోత్సాహాలు వర్ణనాతీతం. ఇస్లామీయ ఉద్యమంలో అదొక మైలురాయి. ఆ రాత్రే "ఉమర్ (రజి)" మక్కా వీధులన్నీ తిరిగి తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ అనేకమందిని "ఇస్లాం" వైపు పిలిచారు. 

 *"ఫారూఖ్" బిరుదులోని మరింత వివరణ : -* 

"ఉమర్ (రజి)" ముస్లిం అయిన వార్త నగరంలో కార్చిచులా వ్యాపించింది. ఖురైష్ నేతలు వెంటనే కూడబలుక్కొని "ఇస్లాం" నినాదం చేస్తూ వస్తున్న "ఉమర్ (రజి)" మీదికి దాడి చేశారు. నాలుగు వైపులా చుట్టుముట్టి పరమనీచంగా దూషించారు. "ఉమర్ (రజి)" రెండు క్షణాలు పెనుగులాడి వర నుంచి కత్తి దూసి ఝళిపించారు.

"అల్లాహ్ తప్ప ఆరాధ్యదైవం లేడని, ముహమ్మద్ (సల్లం) ఆయన ప్రవక్తని నేను సాక్ష్యమిస్తున్నాను. ఎవరైనా సరే ముందుకు అడుగు వేశాడా, తల ఎగిరిపోతుంది." సింహంలా గర్జించారు "ఉమర్ (రజి)" కళ్ళల్లో నుంచి నిప్పులు చెరుగుతూ.

దాంతో ఖురైషీయులు భయపడి అక్కడ్నుంచి మెల్లిగా జారుకున్నారు.

"హజ్రత్ ఉమర్ (రజి)", దైవప్రవక్త (సల్లం) సన్నిధికి తిరిగొచ్చారు. దైవప్రవక్త (సల్లం) ఆయన్ని పరమ సంతోషంతో కౌగిలించుకున్నారు. అదీకాక, ఆయన చూపిన ధైర్యసాహాసాల్ని గురించి విని ఆయనకు "ఫారూఖ్" అనే బిరుదు కూడా ప్రదానం చేశారు.

ఖురైషీలందరిల్లో "ఉమర్ (రజి)" గొప్ప సాహసవీరుడు. ఆయన (రజి), ధైర్యానికి, పట్టుదలకు ప్రతీక; అనుకున్నది సాధించేవరకు విశ్రమించని ధీశాలి.

 *"ఇబ్నె సాద్ (రజి)" (ఉల్లేఖనం) ప్రకారం...., ↓* 

""ఉమర్ (రజి)" ముస్లింకాగానే "ఇస్లాం" బహిర్గతమయింది. మేము "కాబా" చుట్టు కూర్చోవడం, దాని ప్రదక్షిణ చేయడం, బహుదైవారాధకుల నుండి బదులు తీర్చుకోవడం, వారికి జవాబివ్వడం ప్రారంభించాం."

 *"ఇబ్నె అబ్బాస్ (రజి)" (ఉల్లేఖనం) ప్రకారం...., ↓* 

""ఉమర్ ఫారూఖ్ (రజి)" "ఇస్లాం" స్వీకరించిన రోజు అవిశ్వాసులు, "ముస్లింలు మన నుండి పూర్తి బదులు తీర్చుకున్నారు." అని అనేవారు."

 *"హజ్రత్ ఇబ్నె మస్ఊద్ (రజి)" ఇలా అంటారు...., ↓* 

"మాకు, "హజ్రత్ ఉమర్ (రజి)" ఇస్లాం స్వీకరించనంత వరకు కాబా గృహంలో నమాజు చేసే శక్తి లేకుండా ఉండింది."

 *"హజ్రత్ సుహైబ్ బిన్ సినాన్ రూమీ (రజి)" కథనం ప్రకారం...., ↓* 

""హజ్రత్ ఉమర్ (రజి)" ముస్లిం అయిన తరువాతే, ఇస్లాం తెరమరుగు నుండి బయటకు వచ్చింది. బాహాటంగా ప్రచారం మొదలయింది. మేము చిన్న చిన్న గుంపులుగా చేరి "కాబా" చుట్టూ కూర్చోగలిగాము. "కాబా" తవాఫ్ (ప్రదక్షిణ) చేశాము. మాపై దౌర్జన్యం చేసిన వారిపై పగతీర్చుకుంటూ కొన్ని హింసలకు సమాధానం కూడా చెప్పాము."

 *"హజ్రత్ ఇబ్నె మస్ఊద్ (రజి)" గారి ఉల్లేఖనంలో ఇలా ఉంది...., ↓* 

""హజ్రత్ ఉమర్ (రజి)" ఇస్లాం స్వీకరించిన్నప్పటి నుండి మేము శక్తిని పుంజుకుంటూ గౌరవంగా తిరగగలిగాము."
______________________________________

          *దైవప్రవక్త (సల్లం) సన్నిధికి ఖురైష్ దూత : - 1* 

ఆ రోజుల్లో, "హజ్రత్ హమ్'జా (రజి) బిన్ అబ్దుల్ ముత్తలిబ్" మరియు "హజ్రత్ ఉమర్ (రజి) బిన్ ఖత్తాబ్" లు ఇస్లాం స్వీకరించడం వల్ల ముస్లింలపై జరుగుతున్న ఆగడాలు కొంత తగ్గుముఖం పట్టాయి. ముస్లింలను హింసించే బహుదైవారాధకుల వైఖరి మారి, వివేకంతో కూడిన పంథాను అందుకుంది.

కాబట్టి బహుదైవారాధకులు ఇక హింసాదౌర్జన్యాలతో ముస్లింలను సందేశ ప్రచారం చేయకుండా అడ్డుకోలేము అని గ్రహించి, మహాప్రవక్త (సల్లం) గారితో ఆ ప్రచారాన్ని ఆపుజేయమని చెప్పడానికి బేరసారాలకు దిగవలసి వచ్చింది. అయితే ఈ అమాయకులను, సందేశ ప్రచారానికి బదులుగా ఈ విశ్వాన్నంతటిని ఇచ్చినా అది ఆగేది కాదు అన్న విషయం ఏం తెలుసు? కాబట్టి వారు తమ ఈ పథకంలో కూడా అపజయం పొందవలసివచ్చింది.

"ఇబ్నె ఇస్'హాక్", "యజీద్ బిన్ జయ్యాద్" మాధ్యమంగా, "ముహమ్మద్ బిన్ కఅబ్" ఉల్లేఖనాన్ని ఉటంకిస్తూ ఇలా చెప్పారు. "ముహమ్మద్ బిన్ కఅబ్" ఉల్లేఖనం ఇలా ఉంది....,

 *Insha Allah రేపటి భాగములో....,* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment