143

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  143* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 58* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

        *హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రజి) గారి ఇస్లాం స్వీకరణ : - 2* 

 _(నిన్నటి భాగము కొనసాగింపు)_ 

ఖబ్బాబ్ (రజి) : - ఉమర్ (రజి)! సంబరపడు! దైవప్రవక్త (సల్లం) గురువారం రాత్రి నీ గురించి ఇలా "దుఆ" చేశారు. *(ఓ అల్లాహ్! "ఉమర్ బిన్ ఖత్తాబ్" లేదా "అబూ జహల్ బిన్ హష్షామ్" వీరిద్దరిలో నీకు ఎవరు ప్రియులో వారి ద్వారా ఇస్లాంను శక్తివంతం చెయ్యి).* ఆయన (సల్లం) చేసిన "దుఆ" ప్రభావమే ఇది. విశ్వప్రభువు అయిన "అల్లాహ్" నీ విషయంలోనే ఈ "దుఆ" అంగీకరించి ఉండవచ్చు. ఇక ఈ సత్యధర్మాన్ని వదిలిపెట్టకు.

ఉమర్ (రజి) : - నేను "ఇస్లాం" స్వీకరించదలచాను. ముహమ్మద్ (సల్లం) ఎక్కడున్నారో తెలుపండి. నేను వెంటనే వెళ్ళి ఆయన (సల్లం)ను కలవాలి.

హఠాత్తుగా ఉమర్ (రజి)లో వచ్చిన ఈ మార్పు చూసి, ఖబ్బాబ్ (రజి) పరమానందం భరితులయ్యారు. ఇక ఫాతిమా (రజి), సయీద్ (రజి) ల ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి.

ఖబ్బాబ్ (రజి) : - దైవప్రవక్త (సల్లం) ఇప్పుడు సఫా కొండపై ఉన్న గృహంలో ఉన్నారు.

ఇది విన్న హజ్రత్ ఉమర్ (రజి) ఖడ్గాన్ని చేతబూని, అక్కడికి బయలుదేరారు. సఫా కొండపై ఉన్న "హజ్రత్ అర్'ఖమ్ (రజి)" ఇంట్లో దైవప్రవక్త (సల్లం) ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ప్రవక్త (సల్లం)తో పాటు, హజ్రత్ హమ్'జా (రజి), హజ్రత్ అబూ బక్ర్ (రజి), హజ్రత్ బిలాల్ (రజి), హజ్రత్ అలీ (రజి) మరికొంతమంది ప్రవక్త (సల్లం) అనుచరులు సమావేశమై ఉన్నారు.

ఉమర్ (రజి) ఆ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి తలుపు తట్టారు. అపుడు వారిలో నుంచి ఒక వ్యక్తి (బిలాల్ - రజి) లేచి తలుపు సందులో నుండి బయటకు తొంగిచూడగా, అక్కడ "హజ్రత్ ఉమర్ (రజి)" ఖడ్గాన్ని పట్టుకొని నిలబడి ఉన్నారు.

వెంటనే ఆయన వెనక్కు వెళ్ళి దైవప్రవక్త (సల్లం)తో తాను చూసింది చెప్పాడు. అందరూ ఒకే చోట గుమిగూడారు. "హజ్రత్ హమ్'జా (రజి)" ఏమిటి అని అడగ్గా, "బయట ఉమర్ (రజి) నిలబడి ఉన్నాడు." అని చెప్పారు.

దానికి హజ్రత్ హమ్'జా (రజి), "చాలు! ఉమరా! తలుపు తెరవండి. ఒకవేళ ఆయన సదుద్దేశ్యంతో వచ్చి ఉంటే ఆయనకు మేలు జరుగుతుంది. చెడు ఉద్దేశ్యంతో వస్తే మాత్రం మేము ఆ ఖడ్గంతోనే అతన్ని అంతమొందిద్దాం." అని అన్నారు.

ఆ తర్వాత బిలాల్ (రజి), వెళ్ళి తలుపు తెరిచారు. ఉమర్ (రజి) లోపలికి అడుగుపెట్టగానే, ఆయన చూపులు దైవప్రవక్త (సల్లం)ను శోధించాయి.

ఇటు దైవప్రవక్త (సల్లం) లోపల కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ఆయన (సల్లం)పై దైవవాణి అవతరిస్తూ ఉంది. దివ్యవాణి అవతరణ ఆగిపోగానే ఆయన (సల్లం), ఉమర్ (రజి) దగ్గరకు వచ్చి తాను కూర్చున్న ప్రదేశానికి తీసుకుని వెళ్లారు.

దైవప్రవక్త (సల్లం), ఉమర్ (రజి) చొక్కాను మరియు ఖడ్గం పిడిని ఒడిసిపట్టుకొని ఊపుతూ, "ఉమర్ (రజి)! అల్లాహ్, వలీద్ బిన్ ముగైరా పై అవతరింపజేసిన శిక్షలాంటిది నీపై అవతరింపజేయనంతవరకు నీవు నీ వైఖరిని మార్చుకోవా? ఓ అల్లాహ్! ఇతను ఉమర్ బిన్ ఖత్తాబ్! ఓ ప్రభూ! ఇస్లాం ధర్మాన్ని ఉమర్ బిన్ ఖత్తాబ్ ద్వారా శక్తివంతం చెయ్యి, గౌరవం ఒసగు" అని ప్రార్థించారు.

దైవప్రవక్త (సల్లం) గారి ఈ మాటలకు "హజ్రత్ ఉమర్ (రజి)", "ఇస్లాం" ఛత్రఛాయాల్లోనికి ప్రవేశిస్తూ...., *"అష్'హదుఅల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ ఇన్నక రసూలుల్లాహ్"* *(అల్లాహ్ తప్ప వేరే పూజ్యుడెవడూ లేడని, మీరు అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం ఇస్తున్నాను)* అనే కలిమా చదివారు.

అక్కడ గుమిగూడిన వారు ఈ వచనాలు విన్నంతనే *"అల్లాహు అక్బర్"* అనే తక్బీర్ ను, మస్జిదె హరాం లో కూర్చుని ఉన్న వారందరికి వినిపించేటంత బిగ్గరగా పలికారు. ఈ నినాదంతో "హజ్రత్ అర్'ఖమ్ (రజి)" ఇళ్ళు ప్రతిధ్వనించింది.

దైవప్రవక్త (సల్లం), "అల్లాహ్"కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ...., "ఓ అల్లాహ్! ఉమర్ (రజి)కు సన్మార్గం అనుగ్రహించు. అతనికి స్థయిర్యం ప్రసాదించు." అని వేడుకున్నారు.

"హజ్రత్ ఉమర్ (రజి)" గారి శక్తికి ఎదురు వచ్చే ధైర్యం ఎవరూ చేయలేరన్న విషయం మనకు తెలిసిందే. ఆయన (రజి) ముస్లిం అయిపోయారన్న వార్త తెలియగానే బహుదైవారాధకుల్లో గుబులుపుట్టింది. తలవంపు అయినట్లు భావించారు. మరోప్రక్క ఆయన (రజి) "ఇస్లాం" స్వీకారం వలన ముస్లిములకు గొప్ప గౌరవం, శక్తి లభించాయి. చెప్పలేని ఆనందం కలిగింది. *ఇబ్నె ఇస్'హాక్, హజ్రత్ ఉమర్ (రజి) గారి ఉల్లేఖనాన్ని ఉల్లేఖిస్తూ ఇలా రాస్తున్నారు...., ↓* 

నేను ముస్లిం కాగానే, మక్కాలో దైవప్రవక్త (సల్లం)ను విరోధించడంలో ఎవరు ముందడుగులో ఉన్నారు? అని ఆలోచించాను. అతను "అబూ జహల్" ఒక్కడే అని తలచి అతని ఇంటి గుమ్మంలోనికి వెళ్ళి తలుపు తట్టాను. అతను బయటకు వచ్చి నన్ను చూసి, "స్వాగతం, సుస్వాగతం. ఏమిటి ఇలా వచ్చారు?" అని అడిగాడు. నేను అతనితో, "నేను "ఇస్లాం" స్వీకరించాను. దాన్ని సత్య ధర్మమని ధృవీకరిస్తున్నాను." అని చెప్పగానే, (అది విన్న అతడు) నేను అక్కడ నిలబడి ఉండగానే తలుపులు మూసేసుకుంటూ, "అల్లాహ్ నిన్ను నాశనం చేయా! నీవు నా వద్దకు తెచ్చిన వార్త కూడా నాశనం కానూ!" అన్నాడు.

 *ఇమామ్ ఇబ్నె జూజీ, హజ్రత్ ఉమర్ (రజి) ఉల్లేఖనాన్ని ఇలా ఉల్లేఖిస్తున్నారు. ↓* 

"ఎవరైనా ముస్లింగా మారిపోతే వీరు అతని వెంటపడి హింసించేవారు. నేనూ వారిని బాదేవాణ్ణి. నేను ముస్లింగా మారిపోయిన తరువాత నా మేనమామ "ఆసీ బిన్ హాషిం" ఇంటికి వెళ్ళి, "నేను ముస్లింగా మారాను" అని చెప్పాను. అతను కూడా ఇంటిలోనికి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. ఆ తరువాత ఖురైష్ కు చెందిన పెద్దమనిషి వద్దకు వెళ్ళాను (బహుషా ఇతను అబూ జహల్ కావచ్చు). అతనికి ఈ విషయం చెప్పగానే అతను ఇంటిలోనికి వెళ్ళిపోయాడు.

 *ఇబ్నె హష్షామ్ మరియు ఇబ్నె జూజీల కథనం ప్రకారం...., ↓* 

హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించగానే "జమీల్ బిన్ మోమర్ హమ్జీ" ఇంటికి వెళ్ళారు. ఇతను వార్తల్ని ప్రజల్లో వ్యాపింపజేయడంలో ఖురైష్ (తెగ) మొత్తంలో అగ్రగణ్యుడు.

హజ్రత్ ఉమర్ (రజి) అతని వద్దకు వెళ్ళి, "నేను ముస్లింగా మారిపోయాను" అనే వార్తను వినిపించారు. ఇది విన్న "జమీల్" పెద్దపెట్టున అరుస్తూ, ""ఖత్తాబ్" కుమారుడు మార్గభ్రష్టుడయ్యాడొహో!" అని అరిచాడు. "హజ్రత్ ఉమర్ (రజి)", "జమీల్" వెనకాలే నిలబడి, "ఇతను అసత్యమాడుతున్నాడు, నేను ముస్లింనైపోయాను." అని పలికారు.

(అంతే, ఇది విని ఆగ్రహించిన) ప్రజలు, ఉమర్ (రజి)పై విరుచుకుపడ్డారు. దొమ్మి ప్రారంభం అయింది. ప్రజలు "హజ్రత్ ఉమర్ (రజి)"ను బాదుతూ ఉంటే, ఆయన వారిని బాదుతున్నారు. ఈ క్రమం సూర్యుడు నెత్తిమీదికి వచ్చినంతసేపు సాగింది. "హజ్రత్ ఉమర్ (రజి)" అలసిపోయి ఓ చోట కూర్చున్నారు. ఖురైష్ ప్రజలు ఆయనను కొడుతూనే ఉన్నారు. "మీకు చేతనైనది చేసుకోండి! దైవసాక్షి మా సంఖ్య మూడొందలుంటే, మక్కాలో మీరైనా ఉండేవారు లేదా మేమైనా ఉండేవారం." అని అన్నారు.

ఆ తరువాత బహుదైవారాధకులు, "ఉమర్ (రజి)"ను చంపేసి ఉద్దేశ్యంతో ఆయన (రజి) ఇంటి మీదికి వచ్చారు. *సహీబుఖారీలో "హజ్రత్ ఉమర్ (రజి)" గారి ఉల్లేఖనం ఇలా ఉంది...., ↓* 

◆●"నేను భయం చేత నా ఇంటిలో కూర్చుని ఉండగా, "అబూ అమ్రూ బిన్ ఆస్ బిన్ వాయిల్" అక్కడికి వచ్చాడు. అంచులు గల యమనీ దుప్పటితో తయారుచేసిన అంగవస్త్రం, పట్టు అంచు కలిగిన చొక్కా తొడుక్కుని ఉన్నాడు. అతను "సహం" తెగకు చెందినవాడు. ఈ తెగ అజ్ఞాన కాలంలో (అంటే నేను ఇస్లాం స్వీకరించక మునుపు) మాకు మిత్రపక్షంగా ఉండేది. అతను నన్ను చూసి, "ఏమైంది?" అని అడిగాడు. దానికి సమాధానంగా, "నేను ముస్లింనైపోయాను. ఆ కారణం చేత మీ జాతి నన్ను చంపేయాలని చూస్తోంది." అని అన్నాను. "ఇది అసాధ్యం" అని అతను నాకు భరోసా ఇచ్చాడు.

ఆ భరోసాతో నాకు స్వాంతన చేకూరింది. "ఆస్" అక్కడ నుండి బయటకు వచ్చాడు. అప్పుడు ఆ లోయంతా ప్రజలతో కిటకిటలాడుతోంది. "ఆస్" వారిని ఉద్దేశించి, "మీ ఉద్దేశ్యం ఏమిటి?" అని అడిగాడు. దానికి వారు, "ఈ ఖత్తాబ్ కుమారుడే మాకు కావాలి. ఇతను ధర్మభ్రష్టుడైపోయాడు." అని అన్నారు. "లేదు! మీరు ఆయన (రజి) దగ్గరకు పోయే మార్గం లేదు." అని పలకగా ప్రజలంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.●

●"దైవసాక్షి! అది ఓ వస్త్రం. దాన్ని పై నుండి క్రిందికి పారవేసేటట్లుంది ఆ పరిస్థితి" అని ఉంది."●◆

"హజ్రత్ ఉమర్ (రజి)" ఇస్లాం స్వీకరించినప్పుడు బహుదైవారాధకుల పరిస్థితి అది. ఇక మిగిలింది ముస్లింల పరిస్థితి, "ఇబ్నె అబ్బాస్ (రజి)" "ముజాహిద్"తో చెప్పిన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. *"ఇబ్నె అబ్బాస్ (రజి)" ఉల్లేఖనం ఇలా ఉంది...., ↓* 

నేను ఉమర్ (రజి)ను అడిగాను. "మీకు "ఫారూఖ్" అనే బిరుదు ఎలా వచ్చింది అని.

ఆయన నాతో, "నాకు మూడు రోజుల ముందే "హజ్రత్ హమ్'జా (రజి)" ముస్లింగా మారిన సంగతి తెలిసింది." అని అన్నారు. ఆ తరువాత ఆయన (రజి) తన ఇస్లాం స్వీకార సంఘటన గురించి ఏకరువు పెడుతూ చివరన ఇలా అన్నారు...., ↓

"నేను ముస్లింగా మారిపోయిన తరువాత దైవప్రవక్త (సల్లం)ను అడిగాను, "ఓ దైవప్రవక్తా! మనం చనిపోయినా, బ్రతికినా సత్యం పై లేమా?" అని. దానికి ప్రవక్త (సల్లం), "ఎందుకు లేము! ఎవరి పిడికిటనయితే నా ప్రాణాలు ఉన్నాయో ఆ అల్లాహ్ సాక్షి! మీరు మరణించి ఉన్నా, జీవించి ఉన్నా సత్యంపైనే ఉన్నారు." అని అన్నారు. (అందుకు నేను) "అయితే మనం ఇలా దాగి ఉండటం దేనికి? ఎవరయితే మిమ్ములను సత్యం ఇచ్చి పంపించాడో ఆ దైవం సాక్షి! మనం తప్పకుండా బయటకు వెడదాము." అన్నాను.

ఆ తరువాత మేము రెండు వరసలుగా తీరి ఆయన (సల్లం)ను వెంటబెట్టుకొని బయటకు వచ్చాము. ఓ వరుసలో "హజ్రత్ హమ్'జా (రజి), మరో వరుసలో నేను ఉన్నాము. మేము నడుస్తూ ఉండగా లేచిన తేలికపాటి దుమ్ము తిరుగలి తిరిగినప్పుడు లేచే పిండిలా ఉంది. అలాగే మేము "మస్జిదె హరాం"లో ప్రవేశించాం. ఖురైష్ నన్నూ, హమ్'జా (రజి)ను చూడగానే, వారికి ఇప్పటి వరకు కలగనంత బాధ కలిగింది. ఆనాడే దైవప్రవక్త (సల్లం) నాకు "ఫారూఖ్" అనే బిరుదును ఓసిగారు."

 _(↑ ఇదే విషయం మరొక "సీరతున్నబి" ప్రకారం ↓)_ 

 *Insha Allah రేపటి భాగములో....,* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment