141

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  141* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 56* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

 *మెరిసిన మరో మెరుపు : - - : మరో యోధుడి ఇస్లాం స్వీకరణ : - - : ఓ గొప్ప యోధుడ్ని కోల్పోయిన అవిశ్వాసులు* 

జులుం, హింసాదౌర్జన్యాల కారుమేఘాల ఈ భయానక వాతావరణంలో మరో మెరుపు మెరిసింది. దీని వెలుగు మునుపటి వెలుగు కన్నా కళ్లు మిరుమిట్లు గొలిపేదిగా ఉంది. అదే, ఓ మహా సాహసవంతుడి "ఇస్లాం" స్వీకరణ.

ఆయన (రజి) గారి "ఇస్లాం" స్వీకారానికి సంబంధించిన మొత్తం ఉల్లేఖనాలను అధ్యయనం చేసిన తరువాత, ఆయన (రజి) మనస్సులో "ఇస్లాం" ధర్మ ఔన్నత్యం క్రమక్రమంగా వేళ్ళూనుకుందని తెలుస్తోంది. ఈ ఉల్లేఖనాలన్నిటిని వివరించే ముందు, ఆయన (రజి) గారి భావోద్రేకాలు, ఆయన ప్రవృత్తి, ఆయన వ్యక్తిత్వాలను గురించి కూడా తెలుసుకోవడం అవసరం.

అతను (రజి), తన దుడుకుతనంలో, కాఠిన్యంలో బాగా పేరు మోసినవారు. ముస్లిములు, ఓ సుదీర్ఘ కాలం వరకు ఆయన (రజి) పెట్టిన హింసలకు గురై ఉన్నారు. ఆయన (రజి) వ్యక్తిత్వంలో రెండు విభిన్న రకాల భావోద్రేకాలు సంఘర్షించుకుంటున్నాయా అన్నట్లు అగుపడేది. ఆయన (రజి) ఓ వైపు తాతముత్తాతలు ప్రవేశపెట్టిన ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ ఉండడం, రక్తపాతం ఉంటే ఉత్సాహం చూపడానికి ఇష్టపడేవారు. కాని మరో ప్రక్క విశ్వాస మార్గంలో ముస్లిములపై జరుగుతున్న దమనకాండను వారు ఎంతో ధృఢచిత్తంతో సహించడాన్ని కూడా ఆశ్చర్యచకితులై వారి ధైర్యానికి జోహార్లు అర్పించే దృష్టితో చూసేవారు. అదే కాకుండా, ఓ బుద్ధిమంతునికి ఉండవలసిన లక్షణాల్లో వలె ఆయన (రజి) మనస్సులో ఆ విషయం గురించి అనుమానాలు కూడా పొడసూపుతూ ఉండేవి. "ఇస్లాం" దేని వైపునకయితే పిలుస్తోందో, బహుశా అదే సరి అయిన, మేలైన మార్గమేమోననే ఆలోచన కూడా అప్పుడప్పుడు ఆయన (రజి) మెదడులో మెదలుతూ ఉండేది. కాబట్టి ఆయన (రజి) పరిస్థితి ఒక్కసారే మండి చల్లారిపోయే అగ్నిలా ఉండేది.

 *ఆ గొప్ప పరాక్రమశాలి "ఇస్లాం" స్వీకార సంఘటణా వివరాలు దాదాపు అన్ని ఉల్లేఖనాల ప్రకారం ఇలా ఉన్నాయి....,* 

ఓసారి ఆయన (రజి) ఇంటికి వెలుపల రాత్రి గడుపవలసి వచ్చింది. ఆయన (రజి), మస్జిదె హరాం కు వచ్చి కాబాలోని పరదాలోకి దూరిపోయారు. అప్పుడు మహాప్రవక్త (సల్లం) నమాజు చేస్తూ "అల్ హఖ్ఖా" సూర పఠిస్తూ ఉన్నారు. ఆయన (రజి), ఆ "దివ్యఖుర్ఆన్" పారాయణాన్ని వింటూ దాని శైలికి ఆశ్చర్య చకితులయ్యారు.

 *ఆయన (రజి) కథనం ప్రకారం...., ↓* 

“నేను నా మనస్సులో, "దైవసాక్షి! ఖురైష్ ప్రజలు అనుకుంటున్నట్లుగానే ఆయన (సల్లం) “ఓ కవే” అని అనుకున్నాను.” అంతలోనే దైవప్రవక్త (సల్లం) ఈ ఆయత్ పఠించారు."

 *ఇన్నహూ లఖౌలు రసూలిన్ కరీమ్. వమా హువ బిఖౌలి షాఇర్ ఖలీలమ్ మా తుఅ్'మినూన్. (ఖుర్ఆన్ 69:40,41).* 

 *అర్థం : నిశ్చయంగా ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన (దైవ) వాక్కు. ఏ కవి పుంగవుడో పలికిన మాట కానేకాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ. (ఖుర్ఆన్ 69:40,41).* 

"నేను తిరిగి నా మనసులో ఓహో! అయితే ఈయన (సల్లం) ఓ జ్యోతిష్యుడు అని అనుకున్నాను. అంతలోనే దైవప్రవక్త (సల్లం) ఈ "ఖుర్ఆన్" వాక్యాన్ని పఠించారు."

 *వలా బిఖౌలి కాహిన్ ఖలీలమ్ మా తజక్కరూన్ తన్'జీలుమ్ మిర్ రబ్బిల్ ఆలమీన్. (ఖుర్ఆన్ 69:42,43).* 

 *అర్థం : - ఇంకా ఇది ఏ జ్యోతిష్యుని వాక్కు కూడా కాదు. మీరు ఆలోచించడం అనేది చాలా తక్కువ. ఇదసలు సకల లోకాల ప్రభువు తరపు నుండి అవతరించింది. (ఖుర్ఆన్ 69:42,43).* 

"అప్పుడే నా హృదయంలో "ఇస్లాం" ధర్మ ఔన్నత్యం జాగృతమైంది." అని చెప్పారు.

ఇదే, ఆ సమరవీరుడి హృదయఫలకంపై "ఇస్లాం" ముద్రింపబడిన ప్రప్రథమ సందర్భం అది.

అయితే ఆయన (రజి)లో, అజ్ఞానపు భావోద్రేకాలు, అంధానుకరణ, తాతముత్తాతల ఆచార సంప్రదాయాల గొప్పదనపు ఛాయలు మాత్రం తొలగిపోలేదు. హృదయాంతరంగంలో మెదిలే యదార్థం బయటకు రాలేకపోయింది. అందుకని ఆయన, తనలో దాగివున్న అంతరాత్మ ఘోషను లెక్క చేయకుండా "ఇస్లాం" విద్వేషంలో నిమగ్నమయ్యే ఉన్నారు.

ఆయనే హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రజి)గారు.

ఆ మహావీరుడి గురించి Insha Allah తరువాతి భాగములో....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment