139

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  139* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 54* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

 _(నిన్నటి భాగము కొనసాగింపు)_ 

అబూ జహల్ చేసిన మరో దుష్కృతం, "హజ్రత్ ఉమర్ (రజి)"ను మరియు "హజ్రత్ హమ్'జా (రజి)"ను ఇస్లాం స్వీకరించేటట్లు చేసింది. వివరణ ముందు రాబోతోంది.

 *"అబూ జహల్"కు మరో హెచ్చరిక : -* 

ఓ రోజు ఖురైష్ నాయకులు "అబూ జహల్" ఇంట్లో సమావేశమై ఉన్నారు. కాస్సేపటికి ఓ పిల్లవాడు అక్కడికి వచ్చాడు. చినిగిన దుస్తులతో, చిందరవందరగా ఉన్న జుట్టుతో, బక్కచిక్కిన శరీరంతో ఉన్న ఆ అబ్బాయి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆ అబ్బాయి, పరమ కర్కోటకుడు అయిన "అబూ జహల్" సంరక్షణలో పెరుగుతున్న అనాథబాలుడు. అతను "అబూ జహల్" దగ్గరకొచ్చి తన తండ్రి వదిలిపోయిన ఆస్తిలో కొంత తనకివ్వమని ప్రాధేయపడ్డాడు.

కాని ఆ దుర్మార్గుడు ఆ పిల్లవాడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పిల్లవాడు చాలాసేపు నిలబడి నిరాశానిస్పృహలతో అక్కడనుంచి వెనుతిరిగాడు. అప్పుడా సమావేశంలో కూర్చున్న ఖురైష్ నాయకుల్లో కొందరు, “నీవు ముహమ్మద్ (సల్లం) దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చెయ్యి, ఆయన (సల్లం) సిఫారసు చేసి "అబూ జహల్" నుంచి నీ ధనం ఇప్పిస్తాడు.” అని చెప్పారు ఆ బాలుడితో.

ఈ మాటలు విని ఆ అబ్బాయి అక్కడనుంచి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి అలా బయటకి వెళ్ళగానే సమావేశంలో కూర్చున్న ఖురైష్ నాయకులు పకపక నవ్వుకుంటూ, "ఇక చూడండి తమాషా!" అని చెప్పుకున్నారు పరస్పరం.

ఆ పిల్లవాడు నేరుగా దైవప్రవక్త (సల్లం) దగ్గరికెళ్ళి తన గోడు చెప్పుకుని, సహాయం చేయమని బ్రతిమాలాడు. దైవప్రవక్త (సల్లం) అప్పటికప్పుడు లేచి ఆ బాలుడ్ని వెంటబెట్టుకుని "అబూ జహల్" ఇంటికి వెళ్ళారు. 

దైవప్రవక్త (సల్లం) వెళ్ళి తలుపు తట్టగానే "అబూ జహల్" లేచి తలుపు తీశాడు. కాని గుమ్మం ముందు దైవప్రవక్త (సల్లం)ను చూడగానే క్షణం పాటు నివ్వెరపోయాడు.

“అబూల్ హకం! ఈ అబ్బాయికి రావలసిన హక్కు తక్షణమే ఇచ్చెయ్యి.” అన్నారు దైవప్రవక్త (సల్లం) గంభీర స్వరంతో.

"అబూ జహల్" కిక్కురుమనకుండా, వెంటనే మంత్ర ముగ్ధుడిలా లోపలికెళ్ళి ఆ బాలుడి పైకం తీసుకొచ్చి అతనికి ఇచ్చివేశాడు.

ఏదో పెద్ద రభస జరుగుతుందనుకున్న ఖురైష్ నాయకులు ఈ విచిత్ర వ్యవహారం చూసి ఆశ్చర్యపోయారు.

“చివరికి నువ్వు కూడా నీ ధర్మాన్ని వదిలిపెట్టావన్న మాట!” అని అన్నారు వారు "అబూ జహల్"ని ఎత్తిపొడుస్తూ.

"దైవసాక్షి! నేను నా ధర్మం వదిలిపెట్టలేదు. కాని ముహమ్మద్ (సల్లం)ని చూడగానే, ఆయన కుడిఎడమల వైపు ఏవో రెండు భయంకరమైన ఆయుధాలు ఉన్నట్లు, నేనతని అభిమతానికి వ్యతిరేకంగా ఏమాత్రం ప్రవర్తించినా అవి నా దేహంలో దిగబడిపోతాయన్నట్లు అన్పించింది నాకప్పుడు." అని అన్నాడు అబూ జహల్ చెమట తుడుచుకుంటూ.

 *ఖురైష్ కు చెందిన ఇతర దుర్మార్గుల విషయానికొస్తే, వారి మనస్సుల్లోనూ మహాప్రవక్త (సల్లం)ను అంతమొందించే ఆలోచన సతతం కెలకవేస్తూనే ఉంది. ← దీని గురించి మరింత సంక్షిప్తంగా తెలుసుకుందాం....,* 

ఓసారి బహుదైవారాధకులు “హాతీమ్”లో సమావేశమై ఉన్నారు. అక్కడ "అమ్రూ బిన్ ఆస్ (రజి)" కూడా ఉన్నారు. ఆ సమయంలో బహుదైవారాధకులు, ప్రవక్త (సల్లం) గారి గురించి ఇలా మాట్లాడుకోసాగారు....,

“ముహమ్మద్ (సల్లం) విషయంలో మనం వహించిన సహనానికి ఓ హద్దంటూ లేదు. అతని వ్యవహారంలో ఇప్పటిదాకా మనం ఎంతో సహనం వహించాము. అతడు, మన హెచ్చరికల్ని లెక్కచేయలేదు. మన తాతముత్తాతల్ని సైతం కించపరుస్తున్నాడు. మన మతాన్ని, మన దేవతల్ని చీటికీమాటికి విమర్శిస్తున్నాడు. నిజంగా మనం అతని విషయంలో చాలా సహనాన్ని వహించాము.” అని అనుకుంటూ ఉన్నారు.

అంతలో, ప్రవక్త (సల్లం) అక్కడ ప్రత్యక్షమయ్యారు.

ఆయన (సల్లం) కాబా గృహం దగ్గరకు వచ్చి ముందు "హజ్రె అస్వద్"ను ముద్దాడారు. ఆ తరువాత కాబా ప్రదక్షిణ చేస్తూ బహుదైవారాధకుల ప్రక్క నుండి వెళ్ళగా, వారు ఆయన (సల్లం)ను తూలనాడారు. ఆ మాటల ప్రభావ ఛాయలు ఆయన (సల్లం) ముఖారవిందంపై గోచరించాయి. ఆ తరువాత ప్రవక్త (సల్లం) రెండోమారు ప్రదక్షిణలో మునుపటిలాగే బహుదైవారాధకుల ప్రక్క నుంచి వెళ్ళగా, తిరిగి వారు ఆయన (సల్లం)ను దుర్భాషలాడారు. ఈసారి కూడా ఆయన (సల్లం) ముఖంపై అసహనం కనిపించింది. ఆ తరువాత మూడోసారి వారి ప్రక్క నుండి వెళుతూ ఉండగా, తిరిగి బహుదైవారాధకులు ఆయన (సల్లం)ను చూసి తిట్టారు. ఈసారి ఆయన (సల్లం) ముందుకు కదలకుండా నిలబడి...., “ఖురైష్ ప్రజలారా! వింటున్నారా? ఏ దైవం చేతిలోనైతే నా ప్రాణం ఉందో, ఆ దైవం సాక్షి! నేను మీ వద్దకు బలిని గొనిచ్చాను” అని అన్నారు.

ఇంకేముంది! ఆయన (సల్లం) ఈ వచనాలు ప్రజలను భయకంపితుల్ని చేశాయి. తమ తలలపై పక్షి కూర్చున్నట్లుగా నిశ్చేష్టులై అలానే ఉండిపోయారు. చివరికి ఆయన (సల్లం)కు బద్ధశత్రువు అయినవాడు కూడా, తాను బ్రతిమాలడానికి ఎంత మంచి పదాన్ని ఎంచుకుని బ్రతిమాలగలడో ఆ పదాలను పలికి క్షమాపణ కోరుకో నారంభించాడు. “అబుల్ ఖాసిం వెనక్కు వెళ్ళిపోండి. దైవసాక్షి మీరు ఎన్నడూ అమాయకులుగా ఉండలేదు.” అని ప్రాధేయపడనారంభించారు.

 *తరువాతి రోజు : -* 

మరుసటి దినం ఖురైషీయులు, కాబా దగ్గర గుమిగూడారు. ఆ సమయంలో దైవప్రవక్త (సల్లం) అక్కడికి వచ్చారు.

ఆయన (సల్లం) కాబా ప్రదక్షిణ చేసిన పిదప విగ్రహారాధన, బహుదైవారాధన లోని చెడుల్ని ఎత్తిచూపుతూ, ఏకదైవారాధన గురించి అక్కడున్న ప్రజలకి వివరించడం ప్రారంభించారు.

దీనిని చూసి, అక్కడున్న ఖురైషీయులు ఓర్వలేకపోయారు. వెంటనే వారందరు, ఆయన (సల్లం)పై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఆయన (సల్లం)ను చుట్టుముట్టారు. "అమ్రూ బిన్ ఆస్ (రజి)" చూస్తూ ఉండగానే, ఓ వ్యక్తి ఆయన (సల్లం) మెడకు ఆయన అంగవస్త్రాన్ని చుట్టి దానిని మెలివేయనారంభించాడు.

అంతలో "అబూ బక్ర్ (రజి)" వచ్చి ప్రవక్త (సల్లం)ని రక్షించడంలో నిమగ్నులయ్యారు. ఆయన (రజి) రోదిస్తూ...., "మీరు ఓ వ్యక్తిని కేవలం, ఆయన "అల్లాహ్" తన పోషకుడు అని అంటున్నందుకు చంపేస్తున్నారా?" అని పలుకనారంభించారు. ఆ తరువాత బహుదైవారాధకులు ఆయన్ను వదిలేసి వెళ్ళిపోయారు.

"అబ్దుల్లా బిన్ అమ్రూ బిన్ ఆస్ (రజి)", “దైవప్రవక్త (సల్లం)పై జరిగిన ఆ దాడి, హింసించిన ఆ తీరు నేను ఎన్నడూ చూడలేదు” అని అంటారు. 

దీనికి సంబంధించిన, "సహీ బుఖారి"లో "హజ్రత్ ఉర్వా బిన్ జుబైర్ (రజి)" గారి ఉల్లేఖనం ఇలా ఉంది. ↓

"నేను, "అబ్దుల్లా బిన్ అమ్రూ బిన్ ఆస్ (రజి)"ను, బహుదైవారాధకులు ప్రవక్త (సల్లం) ఎడల ప్రవర్తించిన తీవ్రమైన తీరు ఎలాంటిదో వివరించండి. అని అడిగాను.

దానికి ఆయన (రజి) ఇలా చెప్పారు....., దైవప్రవక్త (సల్లం) కాబా గృహాన్ని ఆనుకుని ఉన్న "హాతీమ్" అనే స్థలంలో నమాజు చేస్తున్నారు. అంతలోనే "ఉక్బా బిన్ ముఅయిత్" అక్కడకు వచ్చి తన అంగవస్త్రాన్ని, ఆయన (సల్లం) మెడకు చుట్టి మెలిత్రిప్పి గొంతు నులిపే ప్రయత్నం చేస్తున్నాడు. అంతలో "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" అక్కడికి పరుగున వచ్చి అతని రెండు గూడలను పట్టుకుని దూరంగా త్రోస్తూ...., “మీరు ఓ వ్యక్తిని, ఆయన "అల్లాహ్"యే తన పోషకుడు అని అంటున్నందుకు చంపేస్తున్నారా?” అని అడిగారు."

 *హజ్రత్ అస్మా (రజి) గారి ఉల్లేఖనంలో ఇంకొంత వివరణ ఉంది. అదేమిటంటే...., ↓* 

“నేను "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" వద్దకు, “నీ మిత్రుణ్ణి రక్షించు” అని అరుస్తూ వెళ్ళాను. ఆయన (రజి) వెంటనే మా దగ్గర నుండి లేచి అక్కడికి పరుగు తీశారు. ఆయన అప్పుడు తన తలను నాల్గుపాయలుగా దువ్వుకుని ఉన్నారు. “మీరు ఓ వ్యక్తిని, అతను "అల్లాహ్"యే తన పోషకుడు అంటున్నందుకు హత్య చేస్తున్నారా?” అంటూ అరిచారు. తిరిగి వచ్చిన తరువాత ఆయన పరిస్థితి, తల వెంట్రుకల్ని వ్రేళ్ళతో పట్టుకోగా అవి ఊడివచ్చేటంత గంభీరంగా మారిపోయింది."

 *మరొక ఉల్లేఖనంలో : -↓* 

అదే సమయంలో "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" యాదృచ్చికంగా అక్కడికి వచ్చారు. ఆయన (రజి), ఈ దృశ్యం చూసి మెరుపువేగంతో "ఉఖ్బా" మీద లంఘించారు. అతడ్ని ఒక్క తోపుతో పక్కకు నెట్టివేశారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) మెడలోని తుండుగుడ్డను తీసివేస్తూ...., "ఏమిటి ఈ అన్యాయం? మీరు, నా ప్రభువు "అల్లాహ్" అన్నంత మాత్రానికే ఒక మనిషిని చంపడానికి ఒడిగట్టారా?" అని అన్నారు ఎంతో బాధాతప్త హృదయంతో.

అప్పుడు ఖురైషీయులు పళ్ళు పటపట నూరుతూ ఒక్కసారిగా "అబూ బక్ర్ (రజి)" మీద విరుచుకుపడ్డారు. ఈ రభస చూసి కాబాలోని ఇతరులు కూడా గుమికూడారు. "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" అంతమంది ఖురైషీయుల్ని ఎలా ఎదుర్కోగలరు? ఆయన (రజి) కాస్సేపు పెనుగులాడారు. అంతలో జనసమూహంలోని కొందరు పుణ్యాత్ములు కలగజేసుకొని ఎలాగో ఆయన్ని విడిపించారు.

 *"హజ్రత్ హమ్'జా (రజి)" గారి "ఇస్లాం" స్వీకారం : -* 

మక్కా వాతావరణం హింసాదౌర్జన్యాల కారుమేఘాలతో గంభీరంగా ఉంది. అంతలోనే ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపుకు పీడితుల మార్గంలో వెలుగు విరజిమ్మినట్లయింది. అదే! ఆ మెరుపు "హజ్రత్ హమ్'జా (రజి) గారి ఇస్లాం ధర్మ స్వీకారం. ఆయన (రజి) ఇస్లాం స్వీకరించిన సంఘటన దైవదౌత్యపు ఆరవ శకపు చివరి సంఘటన. అంటే, ఆయన (రజి) జిల్'హజ్జా మాసంలో ఇస్లాం స్వీకరించారు.

 *↑ ఈ విషయంలోని మరింత వివరణను Insha Allah రేపటి భాగములో....,* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment