131

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  131* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 46* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

 *విశ్వాసులపై అవిశ్వాసులు అకృత్యాలు* 

దైవప్రవక్త (సల్లం)గారి ఎడల ప్రజల్లో ఉన్న మర్యాద, గౌరవం, అందరిలోకెల్లా ఆయన (సల్లం) ప్రత్యేక వ్యక్తిత్వం, ఔన్నత్యం విషయంలో ఎంతమాత్రం సందేశం లేదు. అయినప్పటికి ఆయన (సల్లం)పై ఈ హింసాదౌర్జన్యాలు, ఆగడాలు జరుగుతూనే ఉన్నాయి. మక్కాలో ఆయన అందరికంటే గౌరవనీయుడు. దానికితోడు అబూ తాలిబ్ ఆయన (సల్లం)ను రక్షణ కవచంగా కాపాడుతూనే ఉన్నా అంత కఠినంగా హింసించడం జరుగుతూనే ఉంది. ఇక సాధారణ ముస్లిములపై జరుగుతున్న ఆగడాలు సరేసరి. ముఖ్యంగా వారిలోని బలహీన వర్గాలకు చెందినవారిపై జరుపుతున్న అత్యాచారాలకు ఇక అడ్డేముంటుంది. అవి మరింత దారుణంగా, భయంకరంగా ఉండేవి. ప్రతి తెగ, ముస్లిములుగా మారిన తనవారిని రకరకాలుగా శిక్షించేది. ఇక తెగ, వంశం ఏదీ లేని అనామకులపై అక్కడి అల్లరిమూకల్ని ఉసిగొల్పి ఖురైష్ సర్దారులు ఆనందించేవారు, ఆ ఆగడాలను విని ఎంత కఠిన హృదయుడైన చలించిపోతాడు.

"హజ్రత్ ముస్ అబ్ బిన్ ఉమైర్" ముస్లిమ్ అయ్యాడని తెలియగానే ఆయన తల్లి ఆయనకు అన్నపానీయాలు పెట్టకుండా ఇంటి నుండి వెల్లగొట్టింది. ఈయన ఎంతో సుకుమారంగా పెరిగిన వ్యక్తి. వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన దేహంపై చర్మం అంతా ఊడిపోయి కుబుసం విడిచిన పాములా తయారయ్యారు.

అబూ జహల్, ఎవరైనా ఘరానా వ్యక్తి మరియు పలుకుబడిగలవాడు ముస్లిముగా మారాడు అన్న వార్త వినగానే అతణ్ణి తిట్టిపోసేవాడు, అగౌరవ పరిచేవాడు. ఆస్తిపాస్తులు, డబ్బు హోదాలను మంటకలుపుతానని బెదిరించేవాడు.

ఇక బలహీనుడెవరైనా ఇస్లామ్ ధర్మం స్వీకరించాడని తెలిస్తే, అతణ్ణి చితకబాదేవాడు. ఇతరుల్ని బాదమని, హింసించమని పురిగొలిపేవాడు. "హజ్రత్ ఉస్మాన్ బిన్ అప్ఫాన్ (రజి)" గారి పినతండ్రి, ఆయన్ను (హజ్రత్ ఉస్మాన్ బిన్ అప్ఫాన్ ను) ఖర్జూరపు ఆకుల చాపలో చుట్టి, క్రింది నుండి పొగ వేసేవాడు.

అవిశ్వాసుల హింసాదౌర్జన్యాల నుండి రక్షింపబడాలంటే, దైవప్రవక్త (సల్లం) ముస్లిములను మాటలచేత, చేతల రూపంగా, ఇస్లామ్ ధర్మం స్వీకరించారనే విషయం ఖురైష్ కు తెలియకుండా ఉండేందుకు వారిని రహస్యంగా ఓ చోట చేరాలని ఆదేశించాల్సి ఉంటుంది. కారణం ఏమిటంటే, వారు బాహాటంగా ఓ చోట చేరితే బహుదైవారాధకులు ఆయన (సల్లం) బోధించే బోధనలను, ఆత్మా ప్రక్షాళనను అడ్డుకునే ప్రమాదం ఉంది. ఫలితంగా ఉభయ వర్గాల్లో ఘర్షణ తలెత్తవచ్చు. ఇలాంటి పరిస్థితి దైవదౌత్యం వచ్చిన నాలుగవ సంవత్సరం కూడా ఎదురైంది. దాని వివరణ ఏమిటంటే, సహాబా (రజి) కొండ లోయల్లో కూడి నమాజు చేసేవారు. దైవతిరస్కారులు కొంతమంది దీన్ని చూసి దుర్భాషలకు, దొమ్మీకీ దిగారు. జవాబుగా హజ్రత్ సఅద్ బిన్ అబీవికాస్ (రజి) ఒక్కడిని రక్తం ప్రవహించేటట్లు కొట్టడం కూడా జరిగింది. ఇది ఇస్లామ్ చేత ప్రప్రథమంగా ప్రవహించిన రక్తం.

 *బహుదైవారాధకులను మరోసారి సన్మార్గం వైపునకు పిలుపు : -* 

ఓ సారి బహుదైవారాధకులు కాబాలో విగ్రహాల ముందు సాష్టాంగపడుతూ వేడుకున్నారు. అదే సమయంలో దైవప్రవక్త (సల్లం) అటువైపుగా రావడం జరిగింది. ఆయన (సల్లం) ఈ దృశ్యం చూసి సహించలేకపోయారు. ఆ బహుదైవారాధకులను చూస్తుంటే, ఆయన (సల్లం)కు జాలి కూడా కలిగింది. అమాయకులైన ఈ బహుదైవారాధకులను ఎలాగైనా విగ్రహపూజ నుండి కాపాడాలని, అవమానకరమైన ఈ చేష్టల నుండి వారిని రక్షించాలని అనుకున్నారు. ఆ తర్వాత ఆయన (సల్లం) ఆవేదనాపూరిత కంఠంతో హృదయాల్ని కదిలించేలా ఇలా ఉపదేశించారు....,

“ఖురైష్ ప్రజలారా! మీరు మన తాత ఇబ్రాహీం (అలైహి) ధర్మాన్ని వదిలేసి ఎందుకు పనికిరాని, ఎలాంటి సహాయం చేయలేని ఈ విగ్రహాలను పూజిస్తున్నారా? ఎంత శోచనీయం! యావత్తు సృష్టిలోనే మహోత్కృష్టుడయిన మానవుడికి ఈ సృష్టి పూజ ఎంత అవమానకరం!! సృష్టికర్త, సర్వేశ్వరుడైన "అల్లాహ్"కు ఈ చేష్టలు ఎంత అయిష్టమో ఆలోచించండి."

సత్యశీలుడు, నిజాయితీపరుడయిన ముహమ్మద్ (సల్లం) బోధించిన హితవాక్యాలు ఆ బహుదైవారాధకులకు ఏమాత్రం చెవికెక్కలేదు. పైగావారు తమ కాల్పనిక పూజాపురస్కారాలకు, కల్పిత మతాచారాలకు హేతువులు చూపసాగారు.

బహుదైవారాధకులు : - మేము విగ్రహాలను లాంఛనప్రాయంగా మాత్రమే పూజిస్తున్నాం. నిజానికి మా ఆరాధన, అభిమానాల కేంద్రం "అల్లాహ్" మాత్రమే. ఈ విగ్రహాలు ఆయన ప్రసన్నత సాన్నిధ్యాలు పొందడానికి ఏర్పాటు చేసుకున్న సాధనాలు మాత్రమే.

ముహమ్మద్ (సల్లం) : - మీకు నిజంగా సర్వేశ్వరుడైన "అల్లాహ్" మీద భక్తి ప్రేమలుంటే నా మాట విని నన్ను అనుసరించండి, నేను మీకు సన్మార్గం చూపుతాను. "అల్లాహ్" కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు. (అంటూ మరోసారి వాళ్ళను ఇస్లాం వైపు పిలిచారు)

కాని ఆయన (సల్లం) పలుకులు విని బహుదైవారాధకులు ఈసడించుకున్నారు. పైగా వారు మరింత రెచ్చిపోయి విరోధులు అయిపోయారు. అపుడు ఆ బహుదైవారాధకులు వారిలో వారే ఇలా మాట్లాడుకున్నారు.

“ముహమ్మద్ (సల్లం) మాటలు వినీ వినీ చెవులు దిమ్మెక్కిపోయాయి. ఇలా ఎన్నాళ్ళు మనం ఇతని చర్యల్ని సహించి ఊరుకుంటాం? ఇంతకాలం ఉపేక్షించడం వల్లే ముహమ్మద్ (సల్లం) కథ ఇంతవరకు వచ్చింది. ఇప్పుడతను మన బుర్రలనే మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం సన్మార్గం తప్పామట! మన తాతముత్తాతలు కూడా సన్మార్గం తప్పినవాళ్ళేనని అంటున్నాడు. ఇక ఎంతమాత్రం మనం ఊరుకోకూడదు." అని అనుకున్నారు.

 *దైవమార్గంలో తొలి ప్రాణ త్యాగం : -* 

సత్యసందేశాన్ని ప్రజలకు అందజేయాలన్న దైవాజ్ఞ ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఓ రోజు కాబాలో నిలబడి “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు” అని బహిరంగంగా ప్రకటించారు. దానితో బహుదైవారాధకులు ఆగ్రహోదగ్రులై పోయారు. “అపచారం! అపచారం” అంటూ పెద్ద రభస చేస్తో ఆయన (సల్లం)ని చుట్టుముట్టారు.

అంతలో హజ్రత్ ఖదీజా (రజి)కు, మాజీభర్త "అబూ హాలా" ద్వారా జన్మించిన హారిస్ (రజి) ఈ గొడవ విని పరుగెత్తుకొచ్చారు. హారిస్ (రజి), జనసమూహాన్ని చీల్చుకుంటూ దైవప్రవక్త (సల్లం)ను రక్షించడానికి వచ్చారు. దానితో బహుదైవారాధకులు మరింత రెచ్చిపోయి దైవప్రవక్త (సల్లం)ను వదలి, హారీస్ (రజి) మీద విరుచుకుపడ్డారు. చూస్తుండగానే నలువైపులా నుంచి ఖడ్గాలు, హారిస్ (రజి) మీద పడి రక్తసిక్తం చేశాయి. కాస్సేపటికే హజ్రత్ హారిస్ (రజి) రక్తపు మడుగులో పడి శాశ్వతంగా కన్నుమూశారు.

 *ధర్మరక్షణ కోసం జరిగిన కృషిలో ఇది మొట్టమొదటి ప్రాణత్యాగం. దైవమార్గంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల్లో హజ్రత్ "హారిస్ బిన్ అబూ హాల (రజి)" తొట్టతొలి అమరవీరునిగా చరిత్రలో నిలిచారు.* 

విశ్వాసులపై మితిమీరిన అవిశ్వాసుల ఆగడాలు Insha Allah రేపటి భాగములో....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment