నువ్వు చనిపోయేలోగా చదివి అర్థం చేసుకోవలసిన పుస్తకము
బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్
బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్
🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపారా కృపాశీలుడు అయిన *అల్లాహ్* పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐
---------------------------------------------------
*ఇస్లాం చరిత్ర*
భాగము - 1
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సృష్టి ప్రారంభం నుంచి *ఇస్లాం* ప్రారంభమైంది . యావత్తు విశ్వం సమస్త సృష్టి రాశులు సృష్టికర్త , సర్వశక్తిమంతుడు అయినా *అల్లాహ్* కు బద్ధులయి తమ తమ విధులు నిర్వర్తిస్తున్నాయి.
అంటే భూమి , ఆకాశాలు , సూర్య చంద్రులు , గ్రహాలు , నక్షత్రాలు అని ఇస్లాం పరిధిలో ఉండి *అల్లాహ్* కు విధేయత చూపుతున్నాయన్న మాట. *ఇస్లాం* అంటే శాంతి , సమర్పణ, విధేయత, ఆజ్ఞాపాలన అని అర్థాలున్నాయి.
*అల్లాహ్* ఆకాశం వైపు దృష్టి సారించారు. అప్పుడు ఆకాశం పూర్తిగా పొగ రూపంలో ఉంది ( ఆ పొగను కూడా *అల్లాహ్* నే సృష్టించారు). అప్పుడు *అల్లాహ్* భూమి , ఆకాశాలను లను ఉద్దేశించి ఇలా అన్నారు " మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఉనికిలోకి రండి " అని దానికి అవి ఇలా సమాధానమిచ్చాయి " మేము వినమ్రులై వచ్చేశామని ". ( *ఖురాన్* 41 : 11).
అప్పుడు *అల్లాహ్* రెండు రోజుల్లో ఏడు ఆకాశాలను నిర్మించాడు. ప్రతీ ఆకాశానికి తత్సంబంధిత నియమావళిని నిర్దేశించాడు . *అల్లాహ్* భూలోకాన సమీపాన ఉన్న ఆకాశాన్ని దీపాలతో ( నక్షత్రాలు ) అలంకరించాడు. దాన్ని అన్ని విధాలా సురక్షితంగా ఉంచాడు. ఇదంతా మహా శక్తిమంతుడు, అపార వివేకవంతుడైన *అల్లాహ్* రూపొందించిన పథకం. ( *ఖురాన్* 41:12 ).
ఈ విధంగా *అల్లాహ్* భూమి, ఆకాశాలను 6 రోజుల్లో సృష్టించాడని *ఖురాన్* చెబుతోంది. ఈ దినాలు మనం ప్రమానంగా తీసుకునే దినాలు కానవసరం లేదు. ఎందుకంటే మీరు లెక్కించే ఒకరోజు *ఖురాన్లో* వెయ్యేళ్లకు సమానమని మరొకచోట ఒకరోజు 50 వేల ఏళ్లకు సమానమని ఉంది . *ఖురాన్* సైన్స్ గురించి చెప్పే గ్రంథం కాదు. తన అవతరణ కాలంనాటి మానవులకు అర్థమయ్యేలా సంక్షిప్తంగా *అల్లాహ్* అసాధారణ శక్తి సామర్థ్యాల ప్రస్తావనల ద్వారా ఆయన ఏకత్వాన్ని చాటిచెప్పే దైవగ్రంథం . ఆ దృష్టి తోనే *ఖురాన్* ను అధ్యాయనం చేస్తే విషయం అర్ధం అవుతుంది.
ఆయనే భూమి, ఆకాశాలను ఆరు రోజుల్లో సృష్టించాడు. తద్వారా ఆయన అధికార సింహాసనమును అధిష్టించి యావత్తు విశ్వ వ్యవస్థను నిర్వహిస్తున్నాడు . ( *ఖురాన్* 10:3 ).
*అల్లాహ్* ఆరు రోజుల్లో భూమి , ఆకాశాలను సృష్టించాడని తద్వారా ఆయన అధికార సింహాసనం అధిష్టించాడు అంటే , నిర్వహణ కార్యక్రమాలను వదిలి విశ్రాంతి తీసుకుంటున్నాడని అర్థం కాదు , సృష్టి నిర్మాణం తర్వాత ఆయన విశ్వంలోని యావత్తు చరచరాలను , సృష్టి రాశులను పర్యవేక్షిస్తున్నారని , పాలిస్తున్నారని , పోషిస్తున్నాడని అర్థం.
_*మానవ సృష్టి*_
నీ ప్రభువు దైవ దూతలతో " భూలోకంలో నేను ఖలీఫా ( దైవ ప్రతినిధి )" ను నియమించ బోతున్నాను అని చెప్పినప్పుడు దైవదూతలు ఏమన్నారో తెలుసా ? " ఏమిటి మీరు ప్రపంచ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, రక్తం వడగట్టే వాడిని భూలోకంలో నియమించబోతున్నారా ? మేము మిమ్మల్ని అనుక్షణం స్తుతిస్తూ మీ పవిత్రతను స్తుతిస్తూనే ఉన్నాం కదా " అని దైవదూతలు అన్నారు. దానికి *అల్లాహ్* " మీకు తెలియని విషయాలెన్నో నాకు తెలుసు " అని అన్నారు. ( *ఖురాన్* 2:30)
ఆ తర్వాత ఆయన ( *అల్లాహ్* ) ఆదం అలైహిస్సలాం కు సమస్త వస్తువుల పేర్లు తెలియచేశాడు. ఆపై ఆ వస్తువులను దైవదూతల ముందు ప్రవేశ పెట్టి *అల్లాహ్* దైవదూతలతో ఇలా అన్నాడు " మీ అభిప్రాయం సరి అయినది అయితే కాస్త ఈ వస్తువుల పేర్లు ఏమిటో తెలియజేయండి " అని *అల్లాహ్* దైవదూతల తో అన్నాడు. దానికి వారు " మీరు పరిశుద్ధులు, మీరు మాకు తెలియ చేసినంత మేరకే మాకు తెలుసు అంతకు మించి ఒక్క విషయం కూడా మాకు తెలియదు. వాస్తవానికి మీరే అన్నీ తెలిసినవారు, వివేకవంతులు " అని అన్నారు దైవదూతలు. ( *ఖురాన్* 2:31,32)
ఆ తర్వాత *అల్లాహ్* ఆదం అలైహిస్సలాం తో " ఈ వస్తువుల పేర్లు ఏమిటో చెప్పు " అని అన్నారు, ఆదం అలైహిస్సలాం వాటి పేర్లన్నీ చెప్పారు , అప్పుడు *అల్లాహ్* దైవదూతల తో ఇలా అన్నారు " భూమి, ఆకాశాలతో గుప్తంగా ఉన్న విషయాలు నాకు తెలుసు అని నేను అన్నాను కదా ! మీరు పైకి వెలిబుచ్చే విషయాలు , లోపల దాచుకునే విషయాలు కూడా మాకు తెలుసు ". ఆ తర్వాత *అల్లాహ్* ఆదం అలైహిస్సలాం కు గౌరవ సూచకంగా అభివాదం (సజ్దా ) చెయ్యండని ఆదేశించారు. అప్పుడు *ఇబ్లీసు* తప్ప అందరూ అభివాదం చేశారు . *ఇబ్లీసు* తనేదో గొప్ప వాడినన్న అహంకారంతో విర్రవీగుతూ, తిరస్కరించి అవిధేయుడై అయిపోయాడు . ( *ఖురాన్* 2:33,34) .
అప్పుడు *అల్లాహ్* ఇబ్లీసు తో ఇలా అన్నారు " ఇబ్లీస్ ! ఏమైంది నీకు ? నేను స్వహస్తాలతో సృజించిన మానవునికి అభివాదం ( సజ్ దా ) చేయకుండా నిన్ను ఏ విషయం నిరోధించింది ? నువ్వు గొప్పవాడివి అయిపోయావా ? లేక నువ్వు ఏదైనా అగ్రస్థాయి ప్రముఖుల కోవకు చెందిన వాడివి అనుకుంటున్నావా ? " అని అడిగారు . దానికి ఇబ్లీసు *అల్లాహ్* తో ఇలా అన్నారు " నేను అతని కన్నా ( ఆదం కన్నా ) , శ్రేష్ఠుడ్ని , మీరు నన్ను అగ్నితో సృజించారు , ఆదం అలైహిస్సలాం ను మట్టితో సృజించారు " అని *అల్లాహ్* తో అన్నారు . ( *ఖురాన్* 38:75,76 ) .
*అల్లాహ్* :- అలాగనా ! అయితే నువ్వు ఇక్కడినుంచి దిగిపో. ఇక్కడ గర్వంతో విర్రవీగడానికి నీకు ఎలాంటి హక్కు లేదు , వెళ్ళిపో ఇక్కడినుంచి , నీవు ( మా ఆదేశాన్ని దిక్కరించి ) పరమ నీచుడిని అయిపోయావు.
ఇబ్లీసు :- అయితే అల్లాహ్ మానవులు మళ్లీ బ్రతికించబడేంత వరకు ( ప్రళయదినం వరకు ) నాకు గడువు ఇవ్వు .
*అల్లాహ్* :- అలాగే ఇస్తున్నాం వెళ్ళు. ( *ఖురాన్* 7:13-15 ).
ఇబ్లీసు :- *అల్లాహ్* నీవు నన్ను ఏ విధంగా దారి తప్పించావో , అదేవిధంగా నేను కూడా భూలోకంలో ఉన్న మానవుల్ని ఎన్నో మనోహరమైన వస్తువులను చూపించి వారిని దారితప్పిస్తాను. ( *ఖురాన్* 15-39 ).
*అల్లాహ్* :- ఓరీ నీచుడా ! శాపగ్రస్తుడై ఇక్కడి నుంచి వెళ్ళిపో , నీతో సహా నిన్ను అనుసరించే వారందరిని నరకంలో విసిరేస్తాను. ( *ఖురాన్* 7:18 ).
నా దగ్గరకు చేరుకోవడానికి ఇదే రుజుమార్గం ( *నమాజు చదవడం , దీన్ లో నడవడం )* . ఈ మార్గంలో నడిచే నా ప్రియ దాసులపై ని అధికారం చెల్లదు. నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టుల పైనే చెల్లుతుంది . వారందరికీ నరకమే గతి ఇది మా వాగ్దానం . ( *ఖురాన్* 15:41-43 ).
*దివి నుంచి భువి పైకి*
ఆ తర్వాత మేము ( *అల్లాహ్* ) ఆదం అలైహిస్సలాం తో ఇలా అన్నాము " నీవు , నీ భార్య ( హవ్వా అలైహిస్సలామ్ ) స్వర్గంలో నివసించండి , ఇక్కడ మీరు కోరుకుందల్లా తింటూ హాయిగా ఉండండి . అయితే ! అదిగో ఆ చెట్టు దరిదాపులకు మాత్రం వెళ్లకండి . వెళితే మీరు కూడా దుర్మార్గులు అయిపోతారు . ( *ఖురాన్* 2:35 ).
ఆదం ఇతను ( ఇబ్లీసు ) నీకు , నీ భార్యకు బద్ధ విరోధి , ఇతను ( ఇబ్లీసు ) మీ ఇద్దరిని స్వర్గం నుంచి బయటకు తీయడం , దాని వల్ల మీరు కష్టాల్లో పడడం జరగకూడదు ! ఇక్కడ మీకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి , ఇక్కడ ఆకలి గానీ , కట్టుబట్టలు కొరతగానీ ఉండదు , అలాగే ఇక్కడ దప్పిక గాని , ఎలాంటి ఎండ బాధ కూడా ఉండదు . ( *ఖురాన్* 20:117-119 ).
కానీ షైతాన్ అతన్ని మభ్యపెట్టాడు , షైతాన్ అతని దగ్గరకు వెళ్లి " ఆదం నేను నీకు శాశ్వత జీవితాన్ని , ఎన్నడూ పతనం కానీ రాజ్యాధికారాన్ని అందించే కల్పవృక్షాన్ని చూపనా అన్నాడు , చివరకు వారిద్దరూ ( ఆదం మరియు హవ్వా ) షైతాన్ యొక్క టక్కరి మాటలకు మోసపోయి ఆ చెట్టు యొక్క పండ్లు తిన్నారు , దాంతో వారి మర్మావయవాలు ఒకరి ముందు ఒకరివి బహిర్గతమైపోయాయి , అప్పుడు వారిద్దరూ స్వర్గవృక్షాల ఆకులతో తమ శరీరాలను కప్పుకోసాగారు , ఆదం ఇలా తన ప్రభువు ( *అల్లాహ్* ) మాట జవదాటి సన్మార్గం తప్పిపోయారు . ( *ఖురాన్* 20:120-121 ) .
షైతాన్ ( వారుభయుల్ని నిషేధిత వృక్షం గురించి లేని పోనీ ఆశలు కల్పించి) వారిని పూర్వస్థితి నుంచి దిగజార్చి స్వర్గ సౌఖ్యాలకు దూరం చేశాడు , అపుడు *అల్లాహ్* వారితో " మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి , మీరు ఒకరికొకరు శత్రువులు , ఒక నిర్ణీత కాలం వరకు భూలోకంలో జీవితం గడపవలసి వస్తుంది " అని అన్నారు . ( *ఖురాన్* 2:36 ) .
తద్వారా ఆదం తన ప్రభువు ద్వారా కొన్ని మాటలు గ్రహించి , పశ్చాత్తాపం తో *అల్లాహ్* ని వేడుకున్నాడు , దాన్ని *అల్లాహ్* స్వీకరించాడు . *అల్లాహ్* గొప్ప క్షమాశీలి , అమిత దయామయుడు .
*అల్లాహ్* వారితో ఇలా అన్నారు " మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి , నా దగ్గర నుంచి మీ దగ్గరకు ఏదైనా మార్గదర్శకత్వం ( *నమాజు చదవడం , దీన్ లో నడవడం* ) వస్తే దాన్ని అనుసరించాలి . దాన్ని ( *నమాజు చదవడం , దీన్ లో నడవడం* ) అనుసరించేవారికి ఎలాంటి భయం కానీ , దుఃఖము కానీ ఉండదు . నా మార్గదర్శకత్వాన్ని నిరాకరించి , నా సూక్తుల్ని ధిక్కరించేవారు నరకానికి పోతారు . అక్కడే వారు నానా యాతలు అనుభవిస్తూ ఎల్లకాలం పడిఉంటారు . " ( *ఖురాన్* 2:37-39 ) .
అలా శాపగ్రస్తులైన ఆదం , హవ్వా లను *అల్లాహ్* భూమి పైకి పంపించాడు. ఆదమ్, *అల్లాహ్* యొక్క ప్రథమ మానవ సృష్టి. ప్రథమ ప్రవక్త కూడానూ. ఇతడి ధర్మపత్ని హవ్వా. వీరిరువురూ ధరణి పై తొలి మానవులు మరియు ఆది దంపతులు. వీరి సంతతి అభివృధ్ధిచెందుతూ నేటికి 235 దేశాలలో 710 కోట్లకు చేరింది.
వీరి ప్రథమ మరియు ద్వితీయ కుమారులు ప్రపంచంలో మొదటి అన్నదమ్ములు ఖాబీల్(బైబిల్ లో పేరు - కయీను) మరియు హాబీల్ (బైబిల్ లో పేరు - హేబేలు), హాబీల్ ఖాబీల్ను చంపేస్తాడు. అంటే ఇది మొదటి హత్య. దీనితో ఆదమ్, హవ్వలు తమ సొంత కొడుకే ఇంకో కొడుకును హత్య చేస్తే పుత్రశోకాన్ని అనుభవిస్తారు. షైతాన్ చేసిన మోసం వల్ల ఆది దంపతులైన ఆదం , హవ్వా దివి నుండి భువి కి దిగవలసి వచ్చింది , ఆనాటి నుంచి నేటి వరకు పుట్టిన మానవులంతా వారి సంతతే.
In Sha Allah మిగతాది రేపటి భాగము - 2 లో.