299

🤝🏻  *అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు*  🤝🏻

🕋🇸🇦🕋   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    🕋🇸🇦🕋

*❂―――•――•――•―○―•――•――•―――❂*

🛐🕌☪         *ఇస్లాం చరిత్ర* *- 299*         ☪🕌🛐

🇸🇦🕋  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 214*  🕋🇸🇦

*❂―――•――•――•―●―•――•――•―――❂*

*రాజులకు, సర్దారులకు పంపించిన లేఖలు : - 4*

*5. మున్జిర్ బిన్ సావీ పేరున రాసిన లేఖ : -*

మహాప్రవక్త (సల్లం), బహ్రైన్ పాలకుడైన 'మున్జిర్ బిన్ సావీ' వద్దకు ఓ లేఖను పంపుతూ, అతణ్ణి ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానించారు. ఇది 'అలా బిన్ హజ్రామీ (రజి)' చేతికిచ్చి పంపిన లేఖ. సమాధానంగా 'మున్జిర్ బిన్ సావీ', మహాప్రవక్త (సల్లం)కు ఇలా రాశాడు. ↓

*"ఓ దైవప్రవక్తా! నేను తమ ఉత్తరాన్ని బహ్రైన్ ప్రజలకు చదివి వినిపించాను. కొందరు ఇస్లాం ధర్మాన్ని పవిత్రమైనదిగా తలంచి ఇష్టపూర్వకంగా దాన్ని స్వీకరించారు. కొందరికి మీ ఆహ్వానం నచ్చలేదు. నా ఈ రాజ్యంలో యూదులు మరియు మజూస్ లు (అగ్ని ఆరాధకులు) కూడా ఉన్నారు. తమరు ఈ విషయంలో ఆదేశాలివ్వండి."*

ఈ ఉత్తరానికి సమాధానంగా దైవప్రవక్త (సల్లం) అతనికి ఈ లేఖను రాశారు.

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

  *దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) తరఫున మున్జిర్ బిన్ సావీకి,*

  *నీకు సలాములు, నేను నీ తరఫున అల్లాహ్ ను స్తుతిస్తున్నాను. ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులైన వారు లేరని, ముహమ్మద్ అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.*

  *తరువాతను - నేను నిన్ను అల్లాహ్ కు భయపడమని గుర్తుచేస్తున్నాను. చూడు! ఎవరైతే మేలును, పుణ్యాలను చేసుకుంటాడో, అతను తన కోసమే మేలు చేసుకున్నవాడవుతాడు. ఎవరైతే నా దూతల ఆదేశాలను పాటిస్తాడో అతను నా ఆదేశాలను పాటించినట్లే. ఎవరైనా వారితో సత్ప్రవర్తనగా మెలిగితే అతను నా ఎడల సత్ప్రవర్తనతో మెలిగినట్లే. నా దూతలు నిన్ను బాగా పొగిడారు. నేను నీ జాతి విషయంలో నీ సిఫార్సును స్వీకరిస్తున్నాను. కాబట్టి ముస్లిములు ఏ పరిస్థితిలోనైతే ఇస్లాం స్వీకరించారో, వారిని ఆ పరిస్థితిలోనే ఉండనివ్వు. తప్పు చేసిన వారిని నేను క్షమించేస్తున్నాను. కాబట్టి నీవు వారిని క్షమించు. ఇంకా ఎప్పటివరకైతే నీవు సంస్కరణ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటావో, అప్పటివరకు నిన్ను తొలగించేది లేదు. ఎవరైతే యూదత్వం మరియు అగ్ని ఆరాధనపైన్నే స్థిరంగా ఉంటారో, వారిపై "జిజ్'యా"ను విధిస్తున్నాను.*★

_(★→ జాదుల్ ముఆద్ - 3/61,62. ఈ లేఖ ఇటీవలే లభించింది. డాక్టర్ హమీదుల్లాహ్ దీని ఫోటోను ప్రచురించారు కూడా. జాదుల్ ముఆద్ మరియు ఈ ఫోటోలో రాసి ఉన్న అంశంలో కేవలం ఒకే ఒక పదం తేడా అగుపిస్తుంది. (అంటే ఫోటోలో) 'లా ఇలాహ ఇల్లల్లాహువ'కు బదులు 'లా ఇలాహ గైరహూ' అని ఉంది.)_

*6. యమామా పాలకుడు 'హౌజా బిన్ అలి' పేరున రాసిన ఉత్తరం : -*

దైవప్రవక్త (సల్లం), ఈ క్రింది ఉత్తరాన్ని యమామా పాలకుడు 'హౌజా బిన్ అలి' పేరున రాసి పంపించడం జరిగింది.

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

  *అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (సల్లం) తరఫున హౌజాకు వ్రాయునది.*

  *సద్బోధనలను అవలంబించే వ్యక్తికి సలాము కలుగుగాక. నా ధర్మం, గుర్రాలు, ఒంటెలు ఏ హద్దు వరకు వెళ్ళగలవో అక్కడి వరకు విస్తరిస్తుంది అన్న విషయం నీకు తెలిసి ఉండాలి. కాబట్టి నీవు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించు. క్షేమంగా ఉంటావు. నీ ఆధీనంలో ఉన్నదంతా నీ ఆధీనంలోనే ఉండగలదు.*

ఈ ఉత్తరాన్ని తీసుకువెళ్ళడానికి దూతగా 'హజ్రత్ సలీత్ బిన్ అమ్రూ ఆమిరీ (రజి)'ని ఎంపిక చేయడం జరిగింది. హజ్రత్ సలీత్ (రజి), ఈ సీలు వేసిన ఉత్తరాన్ని తీసుకొని హౌజా వద్దకు వెళ్ళగా, అతను సలీత్ (రజి)ని తన అతిథిగా చేసుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాడు. హజ్రత్ సలీత్ (రజి), ఆ ఉత్తరాన్ని అతనికి చదివి వినిపించగా, అతను అవునూ కాదు అనకుండా మధ్యేమార్గాన్ని అవలంబిస్తూ ఇలా జవాబు రాసి ఇచ్చాడు. ↓

*"తమరు దేని వైపునకైతే ఆహ్వానిస్తున్నారో, అంతకంటే మేలైనది మరింకేముంటుంది? అరబ్బులు నేనంటే గడగడలాడుతున్నారు. కాబట్టి మరేదైనా పనిని నాకు అప్పగించండి. నేను మిమ్మల్ని అనుసరిస్తాను."*

అతను, హజ్రత్ సలీత్ (రజి)కు కానుకలు కూడా సమర్పించుకున్నాడు. 'హిజ్ర్'లో తయారైన వస్త్రాలు కూడా బహూకరించాడు. హజ్రత్ సలీత్ (రజి) ఆ కానుకలను తీసుకొని దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వచ్చి వివరాలన్నీ వినిపించారు.

మహాప్రవక్త (సల్లం) అతని ఉత్తరాన్ని చదివి, *"అతను భూమికి సంబంధించిన ఓ చిన్న ముక్క అడిగినా నేను అతనికి ఇచ్చేవాణ్ణి కాదు. స్వయంగా అతను నాశనం కావడమేకాక అతని వద్ద ఉన్నదంతా నాశనమైపోతుంది."* అన్నారు.

మహాప్రవక్త (సల్లం) మక్కా జయించి తిరిగి వచ్చినప్పుడు హజ్రత్ జిబ్రీల్ (అలైహి) వచ్చి, హౌజా మరణించాడని వార్త అందించారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) తన అనుచరులతో ఇలా అన్నారు. ↓

*"వినండి! యమామాలో నా తరువాత ఓ అసత్య (ప్రవక్త) పుట్టబోతున్నాడు. అతను చంపివేయబడతాడు."*

*"ప్రవక్తా! అతణ్ణి ఎవరు చంపుతారు?"* అని వారిలో ఒకరు అడగగా, *"నీవు, నీ సహచరులు"* అని బదులిచ్చారు ఆయన (సల్లం). ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) చెప్పినట్లే జరిగింది.

*7. డెమాస్కస్ పాలకుడు 'హారిస్ బిన్ అబీ షమర్ గస్సానీ' పేరున రాసిన లేఖ : -*

దైవప్రవక్త (సల్లం) అతని వద్దకు ఈ క్రింది ఉత్తరాన్ని రాసి పంపించారు.

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

  *అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (సల్లం) తరఫున హారిస్ బిన్ అబీ షమర్ కు రాయునది.*

  *సన్మార్గాన్ని అవలంబిస్తూ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి దాన్ని ధృవీకరించే వ్యక్తికి సలాం (శుభాలు కలుగుగాక). నేను నిన్ను, ఎలాంటి భాగాస్వామ్యంలేని ఆ అల్లాహ్ ధర్మాన్ని విశ్వసించమని ఆహ్వానిస్తున్నాను. (ఇలా చేస్తే) నీ రాచరికం నీదే అవుతుంది.*

ఈ ఉత్తరాన్ని 'అసద్ బిన్ ఖుజైమా' తెగకు చెందిన ఓ సహాబీ 'హజ్రత్ షుజా బిన్ వహబ్ (రజి)' చేతికి ఇచ్చి పంపడం జరిగింది.

ఆయన (రజి) ఆ ఉత్తరాన్ని హారిస్ కు అందించగా అతను, *"నా నుండి నా రాచరికాన్ని ఎవరు లాక్కోగలరు? చూడు, అతనిపై దాడి చేయనున్నాను."* అని చెప్పి పంపించాడు.

అతను ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు.

*8. అమ్మాన్ రాజుకు రాసిన లేఖ : -*

దైవప్రవక్త (సల్లం) ఓ లేఖను అమ్మాన్ రాజు 'జైఫర్', అతని సోదరుడు 'అబ్ద్' పేరున రాసి పంపించారు. ఆ ఇరువురి తండ్రి పేరు జలందీ. ఆ లేఖ ఇలా ఉంది: ↓

*In Sha Allah రేపటి భాగంలో....; →*


No comments:

Post a Comment